Srini's EDU Podcast

Sathaka Madhurima 4 | శతక మధురిమ 4 | 10th Class Telugu | Season 4 | Episode 39 | Srini's EDU Podcast


Listen Later

Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Vaddadi Subbarayakavi "Thana Desambu Svabhasha Naijamathamun”
తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్ తన దేహాత్మల నెతైఱంగున సదా తానట్లు ప్రేమించి, త ద్ఘనతావాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయగా ననువౌ బుద్ది యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!
వడ్డాది సుబ్బరాయకవి
పదవిభాగం: తన, దేశంబున్, స్వభాషన్, నైజమతమున్, అస్మత్, సత్ + ఆచారముల్, తన, దేహ + ఆత్మలన్, ఏ + తెఱుంగున, సదా, తాను, అట్లు, ప్రేమించి, తత్, ఘనతా + అవాప్తికిన్, సాధనంబులు + అగు, సత్ + కార్యమ్ములన్, చేయగాన్, అనువౌ, బుద్దిన్, ఒసంగుమీ, ప్రజకున్, దేవా!, భక్త చింతామణీ!
ప్రతిపదార్ధము: భక్త చింతామణీ = భక్తులకు చింతామణి రత్నమువలే కోరికలు ఇచ్చేవాడా దేవా = ఓ దైవమా తన = తన యొక్క దేహ + ఆత్మలన్ = శరీరమును, మనసును ఏ + తెఱంగున = మనిషి ఏవిధంగా ప్రేమిస్తాడో అట్లు = అదేవిధంగా తన దేశంబున్ = తన యొక్క దేశమును స్వభాషన్ = తన యొక్క భాషను నైజమతమున్ = తన యొక్క మతమును అస్మత్ = తనయొక్క సత్ + ఆచారముల్ = మంచి సాంప్రదాయములను సదా = ఎల్లప్పుడూ తాను = తాను ప్రేమించి = అభిమానించి తత్ = అవి ఘనతా + అవాప్తికిన్ = గొప్పదనము కలిగించడానికి సాధనంబులు + అగు = సాధనాలైనటువంటి సత్ + కార్యమ్ములన్ = మంచిపనులను చేయగాన్ = చేయటానికి అనువౌ = తగినటువంటి బుద్దిన్ = మనసును ప్రజకున్ = దేశ ప్రజలకు ఒసంగుమీ = కలుగ జేయుమా
భావం: భక్తుల పాలిట చింతామణియైన ఓస్వామీ! ఎవరైనా తన శరీరాన్ని ఆత్మను ఎట్లా అభిమానిస్తాడో, అలాగే, తన దేశాన్ని, తన భాషను, మతాన్ని, ఆచారాన్ని కూడా అభిమానించేటట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులను చేసేటట్లు తగిన బుద్దిని ప్రజలకు ప్రసాదించు.
---
Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
...more
View all episodesView all episodes
Download on the App Store

Srini's EDU PodcastBy Srinivas Nissankula