
Sign up to save your podcasts
Or


Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima ("Neeramu Tapthalohamuna")
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Enugu Lakshmana Kavi "Neeramu Tapthalohamuna"
నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులి ట్లదము మధ్యము నుత్తము గొల్చువారికిన్.
ఏనుగు లక్ష్మణకవి.
పదవిభాగం:
నీరము, తప్తలోహమున, నిల్చి, అనామకమై, నశించున్,
ఆ నీరము, ముత్యము + అట్లు, నళినీదళ, సంస్థితము + ఐ, తనర్చున్,
ఆ నీరమె, శుక్తిలోన్ + పడి, మణిత్వము, కాంచున్, సమంచిత ప్రభన్,
పౌరుష వృత్తులు, ఇట్లు, అధమున్, మధ్యమున్, ఉత్తమున్, కొల్చువారికిన్.
ప్రతిపదార్ధము:
నీరము = నీరు
తప్తలోహమున = బాగా కాలిన ఇనుము నందు
నిల్చి = పడి (నిలబడి)
అనామకమై = ఆవిరైపోయి
నశించున్ = నశిస్తుంది
ఆ నీరము = ఆ నీరే
నళినీదళ = తామరాకు మీద
సంస్థితము + ఐ = కదలకుండా ఉన్నప్పుడు
ముత్యము + అట్లు = ముత్యము వలే
తనర్చున్ = ప్రకాశిస్తుంది
ఆ నీరమె = ఆ నీరే
శుక్తిలోన్ + పడి = ముత్యపుచిప్పలో పడితే
సమంచిత ప్రభన్ = చక్కని కాంతితో
మణిత్వము = మణి రూపమును
కాంచున్ = పొందుతుంది
అధమున్ = నీచుడుని
మధ్యమున్ = మధ్యముడుని
ఉత్తమున్ = ఉత్తముడుని
కొల్చువారికిన్ = సేవించేవారికి
పౌరుష వృత్తులు = మనుషుల యొక్క ప్రవర్తన కూడా
ఇట్లు (ఉండున్) = ఈ విధంగా ఉంటాయి
భావం: నీరు బాగా కాలిన ఇనుము నందు పడి ఆవిరైపోయి నశిస్తుంది. ఆ నీరే తామరాకు మీద కదలకుండా ఉన్నప్పుడు ముత్యము వలే ప్రకాశిస్తుంది. ఆ నీరే ముత్యపుచిప్పలో పడితే చక్కని కాంతితో మణి రూపమును పొందుతుంది. అలాగే మనిషి అధములను చేరితే అధముడౌతాడు. మధ్యములను చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములను చేరితే ఉత్తముడౌతాడు.
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Enugu Lakshmana Kavi "Karirajun Bisathanthu"
కరిరాజున్ బిసతంతు సంతతులచేగట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపదీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబు జిందు యత్నించు ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్
- ఏనుగు లక్ష్మణకవి
పదవిభాగం: కరిరాజున్, బిసతంతు, సంతతులచేన్, కట్టన్, విజృంభించున్, వాడు, ఉరు వజ్రంబు, శిరీష పుష్పములచేన్, ఊహించు, భేదింపన్, తీపురచింపన్, లవణ + అబ్దికిన్, మధుకణంబునఁ, చిందు, యత్నించున్, ఇద్దరిణిన్, మూర్ఖులన్, తెల్పును, ఎవ్వడు, సుధాధారా, అనుకార + ఉక్తులన్.
ఉద్దేశం: మూర్ఖుని మనసుని మెప్పించలేము
Purpose: The mind of a fool cannot be persuaded
ప్రతిపదార్ధము:
ఇద్దరణిన్= ఈ భూమి పై
ఎవ్వడు= ఎవ్వడైతే
సుధాధార= అమృత ధారలను
అనుకార+ ఉక్తులన్ = పోలినట్టి మాటలతో
మూర్ఖులన్= మూర్ఖులను
తెల్పున్= సమాధాన పరుచునో
వాడు= అతడు
కరిరాజున్= గజరాజును (ఏనుగును)
బిసతంతు= తామరపువ్వు కాండము
సంతతులచేన్= సమూహముచే
కట్టన్= బంధించుటకు
విజృంభించున్= ప్రయత్నిస్తాడు
ఉరు వజ్రంబు = గొప్ప వజ్రంను
శిరీష పుష్పములచేన్ = విరిసిన పువ్వులచే
భేదింపన్= కోయటానికి
ఊహించున్= ఆలోచిస్తాడు
లవణ+ అబ్దికిన్ = ఉప్పు సముద్రానికి
తీపు రచింపన్ = తీయ్యదనమును కలిగించుటకు
మధుకణంబున్= తేనెబొట్టును
చిందు= చిందించడానికి
యత్నించున్= ప్రయత్నిస్తాడు
భావం: తామరపూవు కాండములతో మదపుటేనుగును బందించాలని ఆలోచించే వాడు, విరిసేపువ్వుకొనతో వజ్రమును కోయటుకు ప్రయత్నించేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రము నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడితోనూ, మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానులవుతారు.
From the publisher's feed