నవీన కవిత

స్వాంతన


Listen Later

ఏదో ఒక వెలితి వెంటాడుతూనే ఉంటుంది

ఒకదాని తరువాత ఇంకొకటి

కావాలని కోరుతుంది కాలమనే రాకాసి

సాధించడం సంపాదించడం

రేపటి కోసం దాచడం

ఇంతేనా జీవితం??

కాదు కాదు ఇంకేదో ఉందనిపిస్తుంది

ఎవరూ నీ జీవితాన్ని కొనలేరు

ఎవరికో ఊడిగం చేయడానికి నిన్ను కనలేదు

ఇంతకాలం పరిగెత్తింది చాలు

ఇకనైనా చేసుకో నీకోసం నువ్వు వీలు


నులివెచ్చని రవి కిరణాలు

తొలకరి మట్టి వాసనలు

సముద్ర తీరాలు

సంధ్యా సాయంత్రాలు

ఆ తారా చంద్రుల అందాలు

అనుభవించడానికే పుట్టించాడు నిన్ను ఆ భగవంతుడు


పరుగుని ఆపిన క్షణం

బరువుని దింపిన క్షణం

కలిగిన ఉపశమనం

మనసుకు ఎంతో సుఖం

వారానికో రోజు నీకోసం కేటాయించు

నీకు నచ్చిందే చేస్తూ ఆనందించు


వయసు పెరగనీయకు మనసుకు

పసితనపు స్వచ్ఛతను పోగొట్టుకోకు

బాల్యం అంతా రంగులమయం

చిన్న చిన్న విషయాలకే అంతులేని ఆనందం

మూతినెందుకు అలా ముడుచుకొని ఉంటావు

మనసారా నవ్వితే నీ సొమ్మేం పోదు


Please check out my YouTube channel:

www.youtube.com/c/NS360

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna