5జి సేవల ను అక్టోబరు 1వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి ఇండియా మొబైల్ కాంగ్రెస్యొక్క ఆరో సంచిక ను ప్రారంభించనున్నారు
Posted On: 30 SEP 2022 11:49AM by PIB Hyderabad
ఒక కొత్త సాంకేతిక విజ్ఞాన యుగాని కి నాంది పలుకుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 1వ తేదీ నాడు ఉదయం 10 గంటల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో 5జి సేవల ను ప్రారంభించనున్నారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతరాయాల కు తావు ఉండనటువంటి విధం గా కవరేజి, ఉన్నతమైన డాటా రేటు, తక్కువ ఆలస్యం మరియు అత్యధిక విశ్వసనీయత కలిగినటువంటి కమ్యూనికేశన్స్ సౌకర్యాలను అందుకోవచ్చును. దీనితో శక్తి దక్షత, స్పెక్ట్రమ్ సామర్థ్యం మరియు నెట్ వర్క్ సామర్థ్యం లో కూడా మంచి మెరుగుదల చోటు చేసుకోనుంది.
ధాన మంత్రి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఆరో సంచిక ను కూడా ప్రారంభించనున్నారు. ఐఎమ్ సి 2022 ను అక్టోబరు 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ‘‘న్యూ డిజిటల్ యూనివర్స్’’ అనే ఇతివృత్తం తో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మేళనం ప్రముఖ ఆలోచనపరుల ను, నవ పారిశ్రామికవేత్తల ను, నూతన ఆవిష్కర్తల ను మరియు ప్రభుత్వ అధికారుల ను ఒక చోటు కు తీసుకు వచ్చి డిజిటల్ టెక్నాలజీ ని శీఘ్రగతి న స్వీకరించడం మరియు డిజిటల్ టెక్నాలజీ వ్యాప్తి తో అంది రాగల అద్వితీయ అవకాశాల పై సంప్రదింపుల కు, ఇంకా వివిధ ప్రజెంటేశన్ ల కోసం ఒక ఉమ్మడి వేదిక ను కూడా సమకూర్చనుంది.