రవికి ఉదయించడం, నదికి ప్రవహించడం
జాబిలికి వెన్నెలను పంచడం, కవికి రాయటం
ప్రత్యేకంగా ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు
నా రచనలు అందరికీ చేరాలి అన్న అభిలాష తప్పితే
ప్రతి ఒక్కరికీ నచ్చాలి అన్న అత్యాశ లేదు
రెక్కలు విప్పి ఎగరాలని
ఆ చుక్కల చెంతకు చేరాలని
వెండితెరపై వెలగాలని
నా కథలను కంచికి చేర్చాలని
కలలు కంటున్నా కునుకు రాకున్నా
అడుగులు తడబడుతున్నా
నెమ్మదిగానైనా నా దారిలో నే వెళ్తున్నా
కాలం నాతో కలిసి రాకున్నా
ఏదో ఒకరోజు చేరుకోగలను
నేను కలలుగన్న నా కళల తీరాలను
తెగించి ఎదురిస్తున్నా విధిరాతను
వెన్ను విరిగినా వెనకడుగు వేయను
ఏటికి ఎదురీదుతున్నా ఏనాడూ అలిసిపోను
ఖాళీ జేబుతో నేనేమీ చేయలేనని
నా కవితలతో ఒక కాకరకాయ కూడా కొనలేనని
నాకు బాగా తెలుసు
నిరూపించుకునేదాకా నా రచనలు చిత్తు కాగితాలు
సరైన సమయం దొరికేదాకా వేచి ఉండక తప్పదు
Please check out my youtube channel:
www.youtube.com/c/NS360