నవీన కవిత

ఉద్దీపన


Listen Later

ఈ లోకం ఒక యుద్ధభూమి

ఓడిపోతే విమర్శల సునామీ

అంతా ఒక గొర్రెల మంద

పరాకుగా ఉంటే నీ పని గోవింద

ఒడిసి పట్టుకో ప్రతి అవకాశాన్ని

కనిపెట్టుకొని ఉండు చుట్టూ ఉన్నవారిని

నీ బలాన్ని మించిన కల కను

నీ దారికి అడ్డం రానీయకు ఏ బలహీనతను

నీ మనస్సు చెప్పిందే విను

ఇక వినకు ఎవ్వరి మాటను


దూరమెంతైనా దారి లేకున్నా

జాలి పడదు కాలం నీ పైన

నీలో ఎంతో ఉందని నువ్వనుకున్నా

నీ ముఖంపై అది కనపడదురా కన్నా


తెలివే నీకు పెట్టుబడి

తెగువ చూపించు నీ కలకు కట్టుబడి

ఆ కలే నిజమై ఎదురొచ్చేను నిన్ను ఇష్టపడి

తగిలే ప్రతిగాయం విజయానికి సోపానం

ఎదురయ్యే ప్రమాదం గమ్యానికి ద్వారం


మండే కొద్దీ వెలుగునిచ్చే సూరీడులా

పగిలే కొద్ది పదును పెరిగే గాజులా

నరికే కొద్ది ఎదిగే చెట్టులా

ఈరోజు బికారిలా ఉన్న నువ్వే తిరిగొస్తావు

ఒకరోజు మహారాజులా


నీ కలే నీ బలం

వదలకు నీ ఆశయం

శ్రమించు నిరంతరం

కాదా విజయం నీకు దాసోహం


Please check out my YouTube channel:

www.youtube.com/c/NS360

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna