నవీన కవిత

విజాతి ధృవాలు


Listen Later

మన అభిరుచులు వేరు

అభిప్రాయాలు కలవలేదు

ఇద్దరి నమ్మకాలకు అసలు పొంతనే లేదు

మన మధ్య జరిగిన గొడవలకు లెక్కే లేదు

అయినా మనం విడిపోలేదు

విజాతి ధృవాలను కలిపి ఉంచే

అయస్కాంత క్షేత్రంలా

పనిచేస్తుందేమో మన మధ్య ఏదో బలం

ఏ జన్మలో ముడిపడిన బంధమో

ఈ జన్మలో అయ్యాం ప్రేమికులం


అనుకోకుండా కలిసాం మనం

చూస్తుండగానే ఒక్కటై పోయాం

కలలా ఉంది ఇన్నాళ్లు గడిపిన కాలం

తొలిసారి నిన్ను చూసిన క్షణం

నా మదిలో పదిలం కలకాలం


మన చేతికున్న వేళ్లే ఒకలా లేవు

అలాంటిది మనం కోరుకున్న వాళ్లు

మనం కోరినట్టు లేరు

అనుకోవటంలో అర్థం లేదు


విరుద్ధ స్వభావాలు మనవైనా

ఎలాంటి సారూప్యత లేకున్నా

నీకోసం నేను నాకోసం నువ్వు

మనసు చంపుకొని మారిపోవటం కాదు ప్రేమంటే

మనలా మనముంటూ

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ

కలిసి నడవడమే మనకి కావాల్సింది

ఇదే నవతరం ప్రేమకి నాంది


Please check out my YouTube channel:

www.youtube.com/c/NS360

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna