పాలు సంపూర్ణ ఆహారం . ఆరోగ్యముగా ఉన్న ఆవు నుంచి అప్పుడే తీసిన ఆవుపాలు అమృతతుల్యమైనవి. ఈ పాలు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అవుతాయి. కడుపుబ్బరం , పైత్యం , దగ్గును నయం చేయును . ఆవుపొదుగు నుంచి తీసిన పాలను వెంటనే నిలువ ఉంచకుండా తాగవలెను లేదా వేడిచేసి తాగవలెను. శుభ్రతలేని పరిసరాలలో పాలు తీసినప్పుడు ఆ పాలను మరగకాయాలి.
ఆవుపాలల్లో క్యాల్షియం ఫాస్పెట్ , పొటాషియం ఫాస్పెట్ , సోడియం క్లోరైడ్ , పొటాషియం క్లోరైడ్ , ఐరన్ ఫాస్ఫెట్ , మాంగనీస్ ఫాస్పెట్ ఉంటాయి. విటమిన్లు A , B , C , D , E , O కూడా పాలలో ఉంటాయి. పాలలో ఉండే ప్రొటీన్ కి బయోలాజికల్ విలువ బాగా ఉండి తేలికగా జీర్ణం అగును. శరీరానికి అవసరమయిన ఎమినో ఆమ్లములు దీనిలో ఉన్నాయి . ఐరన్ శాతంకూడా పాలలో లభించును.