శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతి శ్రీరామ నవమికి శ్రీరాముని జీవితంపై నాకున్న ఆలోచనలను, ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన గుణాలను ఒక 'ఎపిసోడ్' లా మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రయాణంలో మనం రాముడిని కేవలం దేవుడిగా కాకుండా, మన జీవన విధానానికి ఆదర్శంగా ఎలా మార్చుకోవచ్చో చర్చించుకున్నాం.
చాలామంది పాత మెసేజ్లను మిస్ అయ్యామని లేదా మర్చిపోయామని అన్నారు. అందుకే, ఈ ప్రయాణం యొక్క ఫ్లో మరియు ఎనర్జీని అర్థం చేసుకోవడానికి, గత నాలుగేళ్ల సందేశాలను ఇక్కడ ఒకే చోట అందిస్తున్నాను.
శ్రీరామ🏹
బయటి రాక్షసుడి మీద విజయం సాధించిన వామనుడు తరువాత అవతారంలో తనలోని రాక్షసుడిని చంపి 🔥పరశురాముడు అయ్యాడు.
ఈ రెంటి విజయాల తరువాత వచ్చిన శ్రీరాముడు వీరత్వము, ధీరత్వము, శూరత్వముతో పాటు కరుణా సముద్రుడు.
ఈయన మానవ మర్యాద కి ప్రతిరూపం (మస్తు షేడ్స్ వుంటాయి), అన్ని లక్షణాల సరైన మేళవింపు.
శ్రీ రామ నవమి నాడు మానవ మర్యాదకి ప్రతిరూపమైన శ్రీరాముని నుంచి నేర్చుకోవలసిన:
🌸 నిరాశ వద్దు.. (గెలుపు తలుపు తీసే వరకు కాలింగ్ బెల్ కొడుతూనే ఉండాలి)🌸 నిరాడంబరత నీ నైతికత🌸 ప్రశాంతత నీ ఆయుధం🌸 పెద్దోళ్ల మాట వినాలంటే.. (ఆళ్ళు ఉగాది పచ్చడిలో అరటిపండు చెర్రీస్ వెయ్యాలి అని చెప్పినా సరే)🌸 పక్షపాతం వద్దు
......
బాబోయ్ టైం ఐపోయింది..... రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు కదా అఫీస్ కి వెళ్ళాలి. వీలుంటే సాయియంత్రం ముగిస్తా.
శ్రీరామా చంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు🙏
ఎక్కడ ఆపాను? 🤔 ఆ...
శ్రీ రాముని నుంచి నేర్చుకోవలసిన....
అంతా బాగానే వుంది కానీ ఒక చిక్కు వచ్చింది. రాముడ్ని దేవుడు గా మార్చేశారు, ఇంకేముంది? పూజలు, పునస్కారాలు, హారతులు, కల్యాణాలు, గుడులు అబ్బో వైభోగం. ఆ పేరు చెప్పుకుని రాజ్యాలు కూడా ఏలుతున్నారు.
ఇంకేముంది, ఈ సెక్యులర్ దేశంలో గుడిలో ఉన్నోళ్లకి బడిలో చోటు లేదు కదా.
సో శ్రీ రాముడు అనే జీవన విధానం అటకెక్కేసింది. అస్తిత్వం మూలన పడిపోయింది.
అందుకే హ్యాపీ శ్రీ రామ నవమి అనే బదులు:
🙏 శ్రీరామచంద్ర రీతి ప్రశాంతత ప్రాప్తిరస్తు అనో,🙏 పితృ వాక్య పాలక, శ్రీ రామచంద్ర గుణ ప్రాప్తి రస్తూ అనో,🙏 మానవ మర్యాద ప్రతిరూపాయ, నిరాడంబర జీవన విధాన ప్రాప్తిరస్తు అనో విష్ చేయండి.
శ్రీరామ🏹
అమాయకత్వం వలనో లేదా అవకాశవాదంతోనో, మనలో వుంటూ మనతో నడవాల్సిన శ్రీ రాముడిని ఆకాశమంత ఎత్తుకు ఎత్తేసి ఆత్మాలయంలోంచి తీసేసి గుళ్లో తోసేశాం. వారానికోసారి దణ్ణం పెట్టేసి సంవత్సరానికి ఓసారి పెళ్ళిచేస్తే సరిపోద్ది అనే భావనలోనికి వచ్చేసాం. అలా చేస్తూ, మనలోనే ఉన్న శ్రీరాముడిని మర్చిపోయే పరిస్థితికి వచ్చేశాం (రిటైర్ అయిపోయి భక్తి ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్ప).
ఆయన జీవితం మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘర్షణల ప్రతిరూపం: వియోగం, ధర్మబద్ధత, హృదయవేదన, సహనం, స్వీయనిగ్రహం.
భూత భవిష్యత్తు మధ్య బందీ అయిన మనం ఈ సంవత్సరం మనం శ్రీరాముడు నుంచి నేర్చుకోవాల్సింది:
🌿 బలవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే హృదయాన్ని పక్కన పెట్టడమేమీ కాదు.🌿 ధర్మాన్ని పాటించడమంటే గెలవడమే కాదు, అప్పుడప్పుడూ కోల్పోవడమూ.🌿 శాంతి అనేది బయటికి కాదు… అది మన అభిప్రాయాలను ప్రశాంతంగా మార్చుకోగల సామర్థ్యం.🌿 భక్తి అంటే పాట పాడటం కాదు, పక్కవాళ్ల బాధను అర్థం చేసుకునే వినయం.🌿 న్యాయం అంటే కఠినత కాదు… అది మానవత్వం మీద నమ్మకం.
ఈ శ్రీరామనవమి నాడు శ్రీరాముని గొప్పతనాన్ని వెలికి తీయడానికి గుడిలోకి కాకుండా, మన అంతరాత్మ లోపలికి ప్రయాణం చేద్దాం.
🙏 శ్రీరామచంద్ర స్వభావశాంతి ప్రాప్తిరస్తు🙏 పితృవాక్య పాలనలోని పట్టుదల మనలోనూ నిలిచి ఉండాలి🙏 వివేకానికీ, విలువలకీ ప్రాధాన్యం ఇచ్చే సంస్కారం మన కుటుంబాల్లోనూ వర్ధిల్లాలి
శ్రీరాముని కల్యాణం జరుపుకుంటూ, మనిషిగా మనం కూడా మరొక మెట్టు ఎక్కుదాం.
శ్రీరామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు
— గోవింద్(విశ్వావసు నామ చైత్ర శుద్ధ నవమి నాడు)
2023 శ్రీరామ నవమి సందేశం: శ్రీరాముడు — మానవ మర్యాదకి ప్రతిరూపం2024 శ్రీరామ నవమి సందేశం: శ్రీ రాముడు అనే జీవన విధానం2025 శ్రీరామ నవమి సందేశం: ఆత్మాలయంలోని శ్రీరాముడు