*ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మనం చిన్నతనంలో మన తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు మరియు సమాజం నుండి చాలా నేర్చుకుంటాము. ఈరోజు నాకు కోపం వచ్చిందంటే
నాన్న దగ్గర నండి నేర్చుకున్నాను, అహం వచ్చిందంటే నా స్నేహితుల నుండి నేర్చుకున్నాను అని మనము చెప్తాము.
కానీ పరిపక్వత వచ్చిన తర్వాత కూడా మనలో అవే లక్షణాలు ఉంటే అది తప్పు. ఈరోజు మనం ఎలా ఉన్నామో దానికి బాధ్యత మనమే కాబట్టి, కామం, కోపం, దురాశ, మోహం మరియు అహంకారాన్ని అధిగమించాలి.