*ఆలోచనల ప్రతిబింబం జీవితం*
ఒక భర్త భార్యని అడుగుతాడు, నువ్వు పొద్దున్నే ఖర్చులకి డబ్బులు అడిగావు, నా దగ్గర కొంత డబ్బు ఉంది, నా దగ్గర ఉన్నది ఇచ్చి వెళ్ళిపోయాను, ఇప్పుడు ఇంత సంతోషంగా, ఉల్లాసంగా ఎలా కనిపిస్తున్నావు? అని అతను అడిగాడు. దానికి ఆ భార్య పొద్దున్నే వెళ్లేటప్పుడు ఉన్నదానితో ఎలాగైనా మేకప్ చేసుకో అని చెప్పి వెళ్లారు కదా అందుకే పక్కనే ఉన్న బ్యూటీ పార్లర్ కి వెళ్లి మేకప్ వేసుకుని నేను అందంగా ఉన్నానా? అని ఆమె అడిగింది. మనం చెప్పేది ఎంత ముఖ్యమో, మనం చెప్పేది ఇతరులు అర్థం చేసుకోవడం దానికంటే ముఖ్యమైనది.