*ఆలోచనల ప్రతిబింబం జీవితం*
మనుషులు మనతో అరాచకంగా ఉండవచ్చు, మనల్ని మోసం చేయవచ్చు, మన శరీరాన్ని గాయపరచవచ్చు కానీ మన మనసును ఎవరూ గాయపరచలేరు. ఎవరి మాటలూ, చేతలూ మనల్ని బాధించవు. బదులుగా, మన ఆలోచనలే మనల్ని బాధపెడతాయి. మనల్ని మనం బాధించుకుంటాము మరియు మనల్ని మనం నయం చేసుకుంటాము. ఎవరెన్ని మాటలు చెప్పినా మనసులోకి రానివ్వకుండా బయటికి ఎలా పంపాలో తెలియాలి. అందుకు ధ్యానం నేర్చుకోవాలి.