
Sign up to save your podcasts
Or


బాల సుబ్రహ్మణ్యం గారికి నేను సమర్పించే అక్షర సుమాంజలి
By రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
కథ: మిత్ర ద్వయం- మిరియాల జున్ను (హాస్య కథ), రచయిత: పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి
ఇది ఒక జున్ను ప్రియులయిన ఇద్దరి స్నేహితుల కథ.
చక్కని హాస్య చతురత, స్వచ్ఛమైన తెలుగు సంస్కృతి ప్రతిబింబించే పోలాప్రగడ వారి రచనలు నాకు చాలా నచ్చాయి.వీలయితే మీరు అయన రచనలు చదివి ఆనందించండి.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిస్వార్థమైన, నిర్మల మైన స్నేహాన్ని పంచుతూ ఎందరో ఉన్నతికి కారణం అవుతున్న ఎందరో స్నేహితులకి అంకితం ఈ భాగం "గుర్తుకొస్తున్నాయి"
శీర్షిక : గుర్తుకొస్తున్నాయి
రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ
సంగ్రహం: పుట్టినది మొదలు వార్ధక్యం వరకూ విస్తరించిన అనుభవాల మాలిక
Youtube link:
https://youtu.be/RXzRJZwaUPA: Dairy
https://youtu.be/QDHWQHyi1nA: India
https://youtu.be/lbUEkFlug_Y: Live sessio
కథ: డైరీ లో తనకొక పేజీ, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ
కథా సంగ్రహం: అర్దాంగి అనగానే ఎప్పుడూ భార్య భర్తలో సగ భాగం అనే అర్ధం చెబుతారు. అందువల్ల భార్యను భర్తకు తగినట్టు నడుచుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ నాకో సందేహం కలిగింది. అదేమిటంటే భార్య భర్తలో సగ భాగం అయినప్పుడు, భర్త కూడా భార్యలో సగ భాగం అయినట్టే కదా. అంటే భర్త కూడా భార్యను తనతో సమానంగానే చూడాలి కదా. ఈ ఆలోచనలోంచి పుట్టిన కథే "నా డైరీలో తనకొక పేజీ". ఈ కథ ఒక 60 ఏళ్ళ భర్త యొక్క స్వగతంలో నడుస్తుంది.
కథ: భారత్ మాతాకీ జై "షరతులు వర్తిస్తాయి"
కథా రచయిత: రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
కథా సంగ్రహం: కొన్ని వారాల క్రితం మన దేశ సరిహద్దుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆ తదనంతర పరిణామాలు, వేరే కోణంలో విశ్లేషించినప్పుడు నాకు ఒకింత ఆవేదనను కలిగించాయి. ఆ ఆవేదనతో నేను వ్రాసిన కథే ఈ "భారత్ మాతాకీ జై "షరతులు వర్తిస్తాయాయి".
కథ: నాన్న-నీడ , కథా రచయిత : రవి ఎఱ్ఱాప్రగడ
కథా సంగ్రహం: అమ్మ, నాన్న ఇద్దరినీ వేరు వేరుగా చూడలేము. కానీ ఎవరి స్థానం వారిదే. ఒకరితో ఒకరిని కూడా పోల్చలేము.
ఫాదర్స్ డే సందర్బంగా భాద్యతాయుతముగా ఎంతో మంది తమ బిడ్డలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నతండ్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ "నాన్న గొప్పతనాన్ని నాకు తోచిన మాటల్లో చిన్న కథ రూపంలో నీకందించే చిన్న ప్రయత్నమే" ఈ "నాన్న నీడ" కథ . మనం ఎంత పెద్ద వాళ్ళమైనా ఆ నాన్న నీడ మన వెన్నంటే ఉంటూ మన బాగు కోరుతుంది అనే కథాంశంతో రాసిన కథ.
"నాన్న ఒక గంభీర రూపం
నాన్న ఒక అభయ హస్తం
నాన్న ఒక భయం ఒక స్నేహం
నాన్న ప్రతీ బిడ్డకూ ఒక దిక్సూచి"
కథ: "పాఠశాల" అనే ప్రయోగశాల
కథా రచయిత: రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
కథా సంగ్రహం: రోజు రోజుకీ మసకబారుతున్న గవర్నమెంట్ స్కూల్స్ వైభవాన్ని పునః ప్రతిష్ట చేయవలసిన భాద్యతను తెలిపే కథ.
From the publisher's feed