Harshaneeyam

మా వాకాటి కథలకు కొనసాగింపు!


Listen Later

"ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్  చేశాము", అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల .

ప్రమీల మరియు కమల నాకు ఒక సంవత్సరం జూనియర్లు. ఓహో! అని అనుకున్నా. అవి కాలేజీకి కొత్త ప్రవేశాలు జరుగుతున్న తొలి రోజులవ్వటం మూలాన, ర్యాగింగ్ చేయాలన్న అత్యుత్సాహం చాలా మందిలో అప్పుడప్పుడే ఉరకలెత్తుతూవుంది. మేము అప్పటికే నాలుగవ సంవత్సరానికి చేరుకోవటంతో మాకు ఈ ప్రక్రియ పట్ల అంత వ్యామోహం లేదు. నా ఈ ఆలోచనలని భంగపరుస్తూ, "అబ్బబ్బా! ఏమున్నాడు వాడు, ముట్టుకుంటే మాసిపోయేలా అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె", అంటూ కొనసాగించింది ప్రమీల.

పైగా వాడికి ఎంత ధైయిర్యం మాతో ఏడిపించుకొని, "మాలా డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆడపిల్లలని తాను ఎక్కడా చూడలేదని, ఇలా మీ డైనమిజం అంతా అడవి కాచిన వెన్నెలలా బస్సుల్లో వృధా కాకూడదని, అలా కాకూడదంటే మీరు వచ్చి నన్ను మా తరగతి నుండి బయటకు పిలిచి మరీ ర్యాగింగ్ చేశారంటే అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటాను సవాల్ విసిరాడని" చెప్పింది తను.

వీడెయ్యా! వీడెవడో మరీ గుండెలు తీసిన బంటులా వున్నాడే, చేరీ చేరక ముందే ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే వీడు ఖచ్చితం గా హైదరాబాదోడే అయ్యుంటాడు అనుకుంటూ అడిగా తనని, అయితే తమరు ఆ సవాలును ప్రతిసవాలు చేయడానికే నిశ్చయించుకున్నారా అని. "అవును రేపు నేను, కమల వాడి తరగతి అయిన MH4  కి వెళ్లి వాడిని బయటకు లాగుతాము. అబ్బబ్బా! వాడున్నాడు చూడు అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె", అంటూ తన ధోరణిలోకి వెళ్ళిపోయింది. నాకు ఆ అమ్మాయి వాడిని చూసి ముచ్చట పడటం, ముద్దుగా వుండే ఓ చిన్ని కుంకను చూసి మనమెలా ముద్దు చేస్తామో అచ్చు అలాగే అనిపించింది.

"MH4 అంటే మెకానికల్ హాల్ 4  అది మా ఫైనల్ ఇయర్ మెకానికల్ వాళ్ళ తరగతి గది అంటే మా తరగతి, ఏమోలే క్లాస్ రూమ్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజి అవుతుంటాయని సర్ది చెప్పుకున్నా, నాకేదో ఎక్కడో తేడా అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మరియు వసతి గృహాలు, సీనియర్స్ వుండే ప్రదేశాలకు కాస్త దూరం లో ఉంటాయి, జూనియర్స్ ని ర్యాగింగ్ నుండి రక్షింపపడడానికి. మరి ఈ అమ్మాయేమో వాడి తరగతి MH4 అంటుంది", లాటి ఆలోచనలు తిరుగుతున్నాయి, ఆ అమ్మాయి వాడిని వర్ణిస్తున్నంత వరకూ. అయినా మనం చాలా విషయాల్లో మాశ్రీధర్ గాడిలా ఎక్కువ బుర్ర పెట్టము కదా అందుకే ఎక్కువగా ఆలోచించ కుండా వదిలేశా, ఆ విషయాన్ని అంతటితో.

మరుసటి రోజు మా అనీల్గాడు హడావిడిగా వచ్చాడు. వచ్చీ రాగానే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చొని పాఠాలు తెగ వినేసే  మా శ్రీధర గాడిని మరియు నాలుగో బెంచీలో కూర్చొనే నన్నూ తెగ ప్రేమగా, ఒరే నాకు ఈరోజు మా యింటి  మీద బెంగయ్యింది, నేను ఈ రోజంతా మీతోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈరోజు నా నివాస స్థలమైన ఆఖరు బెంచీకి రండిరా అని.

అబ్బా ఛా! వీడికి ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకునేలా మా హృదయాలను ద్రవింపచేసేలా బ్రతిమాలుకొని మమ్మల్ని చివర బెంచీకి బదిలీ చేయించుకున్నాడు. ఎప్పుడు వాడి పక్కన పడివుండే ప్రశాంత్ గాడినేమో మా శ్రీధర గాడు ఖాళీ చేసిన మొదటి బెంచీలో కుర్చోపెట్టాడు. నాకు ఇదంతా ఎదో తేడా అనిపిస్తున్నా, మమ్మల్ని అడిగిందెవరు మా అనీల్గాడు కాబట్టి నా సందేహాలు పక్కన పెట్టా. మా శ్రీధర గాడితో ఏమన్నా ముందే చెప్పుంటే వాడెప్పుడో ఈ చుక్కలన్నీ కలిపేసి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో చెప్పేసేవాడు.

అది మా  హెడ్డు అఫ్ ది డిపార్ట్మెంట్ మరియు ఆ సంవత్సరమే ప్రిన్సిపాల్ హోదా లభించిన మా ప్రభాకర రావు గారి క్లాస్. ఆయన ఎప్పటిలాగే ఆయన మానాన బోర్డు మీద ఓ బొమ్మని చెక్కి ఆ చెక్కటం లోని ఆయన ప్రావీణ్యానికి ఆయనే తన్మయులై, ఆ బొమ్మకే పాఠం చెప్పుకుంటున్న వేళ, ఆయనకి తపో భంగం కలిగిస్తూ, తలుపు దగ్గర ఎవరో నిలబడి ఆయన్ని ఎదో అనుమతి అడిగారు, ఆయన మా వైపు తిరగాల్సిన దానికే చిరాకు పడుతూ, "ప్రశాంత్ యు హేవ్ సం విజిటర్స్"  అని చెప్పి మరలా బొమ్మకి తుది మెరుగులు దిద్దటంలో  మునిగిపోయారు.

మా హాస్టల్ వెధవలందరూ పళ్ళికిలిస్తూ ఒకళ్ళకొకళ్ళు హై-ఫై  లు ఇచ్చుకోవటం మొదలెట్టారు. వీళ్ళు ఎందుకిలా అని మా సెంటర్ వాళ్లమంతా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నాము. కొంత సద్దుమణిగాక మా

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
Kathavahini - Telugu Stories Podcast by TeluguOne

Kathavahini - Telugu Stories Podcast

12 Listeners

Beyond The Zero by Dick's Pizza Media

Beyond The Zero

35 Listeners