Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 | Love Challenge Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    రిత్విక్ తో గొడవకు దిగిన వివేక్ ని చెంపమీద కొడతాడు జీవన్.

    జరగబోయే క్రికెట్ మ్యాచ్  లో తాను ఏ  ప్లేస్ లో రావాలనేది  కెప్టెన్ గా రిత్విక్ నిర్ణయిస్తాడని, అతను తన స్నేహితుడని అందరిలో చెబుతాడు.

    ఇంటికి వచ్చాక, జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ లో రిత్విక్ ని దెబ్బ తీయాలని ప్లాన్ చేస్తాడు.

    గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిపించిన బుకీ పూర్నేష్ ని ఇంటికి రమ్మంటాడు జీవన్.

    ఇక చదవండి…

    జీవన్ ఇంటికి చేరుకున్న పూర్నేష్ బయటినుంచే కాల్ చేసాడు.

    "ఇంటి బయటే ఉన్నాను. నాన్నగారు ఇంట్లో ఉన్నారా? నేను నేరుగా నీ గదిలోకి రావచ్చా?" సందేహంగా అడిగాడు.

    జీవన్ ఫోన్ లోనే బిగ్గరగా నవ్వుతూ, "నేను నాన్నతో కలిసి చాలా సార్లు పుచ్చుకున్నాను.

    నీకేం భయం లేదు. కింద హాల్లో నాన్నగారు కనపడి, ఏదైనా అడిగితే నా పేరు చెప్పు. అయినా నువ్వొస్తున్నట్లు మా నాన్నగారి గన్ మాన్ కి చెప్పానులే" అన్నాడు.

    తన కార్ ని రోడ్ కి అవతలి వైపు పార్క్ చేసి, గేట్ దగ్గరకు వచ్చాడు పూర్నేష్.

    సెక్యూరిటీ అతన్ని గుర్తు పట్టి, లోపలికి వెళ్ళమన్నాడు.

    లోపల మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న గన్ మాన్, "ఎం. పీ. గారు నిద్ర పోతున్నారు. జీవన్ సారు మిమ్మల్ని మేడ పైకి రమ్మన్నారు" అని చెప్పాడు...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ufqCW6ODDHg



    12 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 12 | Ventade Nida Episode 12 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 12

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో

    తన అన్న వికాస్ నంబర్ కు కాల్ చేస్తాడు  విశాల్.

    అటువైపు లిఫ్ట్ చేసిన వ్యక్తి తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, టివి లో స్క్రోలింగ్ చూడమనీ చెబుతాడు.

    టివిలో విశాల్ వదిన శ్రేయ మీద హాస్పటల్ లో హత్యాప్రయత్నం జరిగినట్లు చూపిస్తూ ఉంటారు.

    హాస్పిటల్ కు కాల్ చేసి, వికాస్ తో మాట్లాడుతాడు విశాల్.

    తరువాత వికాస్, ఇంట్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేస్తాడు.

    బాబును తీసుకొని వెళ్ళడానికి ఎవరో గోవర్థన్ అనే వ్యక్తి వచ్చినట్లు కొడుక్కి చెబుతాడు అతని తండ్రి విజయానంద.

    ఇక చదవండి...

    తండ్రితో మాట్లాడాక, లెక్చరర్ నరసింహారావు  గారికి ఫోన్ ఇచ్చింది దీక్ష.

    శంకర శాస్త్రి ఆయనతో మాట్లాడుతూ "ఆ అమ్మాయికి ప్రమాదం ఏమీ ఉండదు. కాస్సేపటికి స్పృహ వస్తుంది. ఇక మా అమ్మాయిని అక్కడే నలుగురిలో ఉంచుకో. ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనివ్వొద్దు. మేము కారులో ఊరికి బయలుదేరుతున్నాం. దీక్షను అక్కడే పికప్ చేసుకుంటాను" అన్నాడు.

    "ఇంత అర్జెంట్ గా ప్రయాణమా..సర్లే.. ఎక్కడికని అడగకూడదు కదూ! ఇంతకీ మీ బావమరిది గారి అబ్బాయి.. అదే.. ఆ సుమంత్ ఆచూకీ ఏమైనా దొరికిందా?"

    "ఇంకా తెలీలేదు నరసింహా! ఆ అబ్బాయి కోసం మృత్యుంజయ హోమం చేయించాలని అనుకున్నప్పటి నుంచీ ఏవో కష్టాలు వస్తున్నాయి. రేపు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్లి, అక్కడే హోమం జరిపించాలని నిశ్చయించాను. నన్ను అక్కడికి వెళ్లనివ్వకుండా ఎవరో ప్రయత్నిస్తున్నారు. అది మనిషో లేక దుష్ట శక్తో తెలీడం లేదు" అన్నాడు  శంకర శాస్త్రి..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/DBImVd5bhC8



    13 min
  • వివేకం | Vivekam | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వివేకం

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    మెకింజీ గోవాలోని పంజిమ్ వాస్తవ్యుడైనా యిప్పటి భారతీయ పౌరుడుగా మనుగడ సాగిస్తున్నా--  నిజానికి అతడి పుట్టుపూర్వోత్తరాలు అప్పటి పోర్చుగీస్ సంతతితో ముడిపడి ఉన్నాయి. అతడి తండ్రి కారు మెకానిక్- తల్లేమో మరాఠీ సంతతికి చెందిన స్త్రీ— సత్సాంప్రదాయాలు గల కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ప్రేమ గుడ్డిదని అంటుంటారుగా- ఆ రీతిన ఆమె పోర్చుగీస్ వాస్తవ్యుడైన మెకింజీ తండ్రి విసిరిన మోహపు వలలోపడి, మోహం ముప్పయి రోజులన్నది మరచి తనను తను పూర్తిగా అర్పించుకుని గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న మెకింజీ తండ్రి అదను చూసి రాబోయే పర్యవసానాలకు భయపడి  పోర్టుగీస్ కి పలాయనం చిత్తగించాడు, పెట్టేబేడా సర్దుకుని--

    పిదప అక్కడ అక్కడి స్త్రీని అక్కున చేర్చుకున్నాడు. ఉత్తమురాలైన ఆ మరాఠీ స్త్రీ భర్త ప్రక్కన లేకుండానే పురుడు పోసుకుంది. మెకంజీకి తల్లి అయింది. ఇకపోతే-- వారసత్వ మూలాలు ఊరకే పోవుగా! తండ్రినుండి పుట్టుకొచ్చిన జన్యువు లు రూపు దాల్చకుండా ఉంటాయా! యువకుడిగా ఎదిగిన తను కూడా అందాల వెలుగు రేఖల వెంట- రంగు రంగుల యవ్వనాల పొంగుల వెంటబడి యవ్వనవతుల వేట ఆడనారంభించాడు.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/EEB6A1o5M4s


    14 min
  • పీచు మిఠాయి |Pichu Mitayi | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పీచు మిఠాయి

    రచన: వెంకు సనాతని

    పీచు మిఠాయి బండి గంట శబ్దం చెవిన పడగానే ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా ఇళ్ళకు పరుగులు తీశారు. "అమ్మా.. త్వరగా డబ్బులు ఇవ్వమ్మా.. సుబ్బయ్య తాత పీచు మిఠాయి బండి వచ్చేస్తుంది." ఇంటి వెనుక అంట్లు కడుగుతున్న అమ్మ సుశీలను అడిగింది అమ్ములు.

    *****

    సాయంత్రం ఐదింటికి టంఛనుగా గంట మోగించుకుంటూ పీచు మిఠాయి బండితో ఊరి మధ్యలో ఉన్న చెట్టు వద్దకు వచ్చేస్తాడు సుబ్బయ్య తాత. పెద్దలు పనులు, పిల్లలు బడులు ముగించుకుని ఆ చెట్టు చుట్టూ చేరి అష్టాచెమ్మాలు, అచ్చంగిల్లాలు, పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసే సమయం అది. సుబ్బయ్య తాత తెచ్చే పీచు మిఠాయి అంటే అందరికీ ప్రీతే.

    బండి చుట్టూ మూగి పోటీపడి మరీ గంటను మోగించటమంటే పిల్లలకు భలే సరదా. అలా మోగించటం ద్వారా తన వ్యాపారానికి మరికొంత గిరాకీ పెరుగుతుందని తాతకి తెలుసు. అయినా విసురుకునే మనస్తత్వం కాదు సుబ్బయ్య తాతది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/MixZbzbw9uo


    6 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 | Love Challenge Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    ఆద్య, దీప్యలకు క్లాస్ రూమ్ చూపించడానికి తనతో తీసుకొని వెళ్తుంటాడు రిత్విక్.

    జీవన్ తన స్నేహితుడు సందీప్ కి కాల్ చేసి, రిత్విక్ కి ఎదురు వచ్చి ఏదో ఒక సాకుతో గొడవ పెట్టుకోమంటాడు.

    సందీప్ తన అనుచరుడు వివేక్ తో వచ్చి రాబోయే క్రికెట్ టోర్నమెంట్ లో జీవన్ ఏ ప్లేస్ లో రావాలనే విషయంగా గొడవకు దిగుతాడు.

    ఇక చదవండి...

    వివేక్ ఇంచుమించు తన మీదకు రావడంతో రిత్విక్ కు కోపం వచ్చింది. అప్రయత్నంగా అతని పిడికిలి బిగుసుకొంది.

    ఎప్పుడూ శాంతంగా ఉండే రిత్విక్ కి కోపం వస్తే ఎలా ఉంటుందో సందీప్ గతంలో ఒకసారి చూసి ఉన్నాడు.

    అతను వివేక్ ని పక్కకు లాగి, "ఏమిటిది.. రిత్విక్ మీదకు వెడతావా? ఏమనుకుంటున్నావ్ అతని గురించి? వాళ్ళ నాన్నెవరో తెలుసా.. అయన తలుచుకుంటే నిన్ను నలిపేస్తాడు" అన్నాడు.

    "న్యాయం అడిగితే నలిపేస్తారా? ధనికుల చేతిలో నలిగిపోవడానికి స్టూడెంట్స్ నల్లులు కాదు. పులులు" ఆవేశంగా అన్నాడు వివేక్.

    అంతే...

    అతని చెంప చెళ్లుమంది.

    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/gcXKWTrf6vc

    14 min
  • సు ధీర ఎపిసోడ్ 5 | Su Dheera Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సు...ధీర ఎపిసోడ్ 5

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    సుదర్శనం తీసుకొని వచ్చిన ప్రొడ్యూసర్ తో కథ విన్నాకే అడ్వాన్స్ తీసుకుంటానని చెబుతుంది సు.

    ప్రొడ్యూసర్ పంపిన రైటర్ సు కి కథ వినిపిస్తాడు. సు కి ఆ కథ నచ్చి ఆ విషయం సుదర్శనానికి తెలియజేస్తుంది.

    అనుదీప్ ఒక సింగిల్ ఎపిసోడ్ లో నటించడానికి సు ని ఒప్పిస్తాడు.

    ధీర పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇస్తుంది సు.

    ఇక చదవండి...

    "గత కొద్ది మాసాల నుండి గమనిస్తున్నా.. నువ్వు ఇది వరకటిలా ఉండడం లేదు" చెప్పింది సావిత్రి.

    "నేను లెక్కిస్తూనే ఉన్నా.. గత ఆరు మాసాలు లగాయితు." చెప్పాడు వెంకటరావు.

    "అబ్బే.. అలాంటిదేమీ లేదే" చెప్పాడు ధీర.

    "లేదు లేదు. మాకు తెలుస్తుందిగా." అంది సావిత్రి.

    "అయ్యో అమ్మా. మీకు ఎందుకు అలా అనిపిస్తుందో మరి." అంటున్నాడు ధీర...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/F2Vi6VtqA90



    14 min
  • శాపగ్రస్థులు | Sapagrasthulu | Telugu Short story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

     శాపగ్రస్థులు

    రచన: రామకూరు లక్ష్మి మణి

    సాగరయ్యా.. సాగరయ్యా.. ఏమిటయ్యా..  ఎందుకిట్టా జరిగింది.. రోజూ నీకు దణ్ణం పెట్టుకుంటాను.. ఇయాల నీకు ఎక్కువ మొక్కానే.. అయినా ఇట్టా తీసుకుపోయావు.. నా వారసుడిని నాకు గాకుండా సేసినావు.. నా కొడుకుని తీసుకుపోయావు.. నా కోడల్ని, నా మనవడ్ని కూడా నాకు గాకుండా సేసినావేందయ్యా.. ఇన్నేళ్లు నిన్నే నమ్మినాను గందా.. గిదేనా నాకు నువ్విచ్చే బగుమానం.. ఎవ్వరూ లేకుండా నేనేట్టా బతకాలి…

    ఏడుస్తున్న భూమయ్యని చూసి అక్కడి వారికీ గుండె పిండేసినట్లుయింది..

    భూమయ్యని ఆపడం ఎవరి తరం కావట్లేదు…

    భూమయ్య సముద్రంలో చేపలు పట్టడానికి వెడతాడు.. సముద్రాన్ని సాగరయ్య అని పిలుస్తూ బోలెడు పదాలు  పాడుతూ ఉంటాడు..

    సాగరయ్యా సాగరయ్యా

    ఎన్నెలమ్మ జత కట్టయ్యా

    ఎన్నెలమ్మ జత కట్టయ్యా

    సల్లంగా సూడయ్యా

    అంటూ పాడుకుంటూ చేపలు పట్టుకొని తీసుకెళ్లి సంతలో అమ్ముకుంటాడు.. అదే అతని జీవనాధారం...

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/2t28RiIWkkI

    5 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 2 | Love Challenge Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 2 

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    నిత్య ఇంజనీరింగ్ కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్- రిత్విక్, జీవన్ లు.

    రిత్విక్ ఒక ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకైతే, జీవన్ ఎం పీ కుమారుడు.

    ఇక ఫస్ట్ ఇయర్ లో ఆ కాలేజ్ ఎం డి కూతురు ఆద్య చేరుతుంది.

    చేరిన రోజే కాలేజ్ బ్యూటీగా అనిపించుకుంటుంది.

    తనతో మాట్లాడటానికి వస్తున్నదని అనుకున్న ఆద్య, రిత్విక్ తో మాట్లాడటంతో ఉడుక్కుంటాడు జీవన్.

    అతనితో పరాచికాలాడబోయిన స్నేహితురాలు శాన్వీ చెంప చెళ్లుమనిపిస్తాడు.

    ఇక చదవండి...

    రిత్విక్ దీప్య లతో పాటు తన క్లాస్ రూమ్ కి బయలుదేరుతుంది ఆద్య. రిత్విక్ ముందు వెళుతుండగా అతని వెనుక దీప్య, ఆద్య లు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అబ్బాయిలు కాస్త దూరంగా వాళ్లను ఫాలో అవుతున్నారు. ఎదురుగా వస్తున్న అబ్బాయిలు అందరూ ఆద్య వంక ఆసక్తిగా చూస్తున్నారు.

    అది గమనించిన దీప్య, ఆద్య తో చిన్నగా, " ఈ రోజే ఆఖరు. రేపటి నుండి నేను నీతో కలిసి నడవను" అంది నవ్వుతూ.

    "అదేం కాదు. నన్ను చూస్తున్నట్లు నటిస్తూ నీ వంకే చూస్తున్నారు అనిపిస్తోంది" అంది ఆద్య తను కూడా నవ్వుతూ.

    "నేను ఇదివరకు కూడా ఈ కాలేజీకి వేరే పనిమీద రెండు మూడు సార్లు వచ్చాను. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజే అంతలా చూస్తున్నారంటే అది నీ కోసమే. ఆ విషయం నీకు కూడా తెలుసు" అంది దీప్య.

    "అసలు విషయం నేను చెప్పనా" అంది ఆద్య రహస్యం చెప్పబోతున్నట్లుగా.

    ఏమిటన్నట్లు చూసింది దీప్య.

    "ఈ అమ్మాయికి ఆల్రెడీ చక్కటి ఫ్రెండ్ ఉన్నాడు. మనం ట్రై చేసినా లాభం ఉండదు అనుకుని ఉంటారు నీ గురించి" తన గొంతు వీలయినంత తగ్గించి అంది ఆద్య.

    ముందు వెళుతున్న రిత్విక్ ఠక్కున ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

    ఉలిక్కిపడింది ఆద్య.


    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/-C7PbyxUf3Q

    10 min
  • ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక | Prema Viluva Thelusukunna Chiluka | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక 

    రచన: పెండేకంటి లావణ్య కుమారి

    ప్రేమకు విలువ కట్టడం ఎవరి వల్లా కాదు. అలా విలువ కట్టవలసి వస్తే మాత్రం, మనకు ప్రేమ ఇచ్చిన వారికి తిరిగి అంతకంటే ఎక్కువ ప్రేమను ఇచ్చినప్పుడే విలువ కట్టినట్టవుతుంది. ఇంక మంచి తల్లిదండ్రుల ప్రేమైతే వెల కట్ట లేనిది. వారి రుణం తీర్చుకోవాలంటే, తిరిగి వారిని బిడ్డలుగా కడుపున మోసి కని మాత్రమే తీర్చుకోగలము. (సామాన్యంగా తల్లిదండ్రులందరూ మంచిగానే వుంటారులెండి, అయినా ఏ కొందరో బాధ్యతారహితంగా వుండి పిల్లలను కష్టాల పాలు చేస్తుంటారు. అలాంటి వారి రుణం గురించి కాదని చెప్పటానికే మంచి తల్లిదండ్రులు అన్నాను.)   నాకు తెలిసి, నిస్వార్థమైన ప్రేమకు కానీ  సహాయానికి కానీ, సేవలకు కానీ విలువ కట్టలేము. నిస్వార్థంగా ఎవరైనా సహాయం చేస్తే దానికి వెలకట్టడమంటే మనం వారికో, వేరేవారికో అంతే నిస్వార్థంగా సహాయం చేయడంతోనే సాధ్యం.    ప్రేమ విలువ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక రావి చెట్టు మీద ఒక రామచిలుకల గుంపుండేది.  ఆ గుంపులో వాటికవి జతలు కట్టేవి. జత కట్టడానికి మగ చిలుకలు ఆడ చిలుకల ముందు రకరకాల వేషాలు వేసి ఆకట్టుకునేవి. అలాగే ఒక ఆడ చిలుక ఒక మగచిలుక వేషాలు చూసి జత కట్టి సావాసం చేయసాగింది. ఆ మగ చిలుక మొదట్లో భార్యతో బాగా వుండేది, తర్వాత్తర్వాత అది ఆడ చిలుకను చాలా ఇబ్బందులు పెట్టసాగింది. నిజానికి ఆ మగ చిలుక చాలా మొరటుది. ఎప్పుడూ ఈ ఆడచిలుకను కొరకడం, కాళ్ళగోళ్ళతో బరకడం లాంటివి చేసేది. అప్పుడప్పుడూ... పాపం! ఆడచిలుకకు రక్తాలు కూడా వచ్చేవి. అది చూసిన గుంపులోని కొన్ని పెద్ద చిలుకలు ఈ మగచిలుకను కొన్ని సార్లు దండించటం కూడా జరిగింది. అప్పటికి ఆ మగచిలుక వింటుంది, ఇంక చేయనంటుంది, కానీ మళ్ళీ అప్పుడప్పుడూ అలానే ప్రవర్తిస్తుండేంది...


    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Pwab3wMlI8Y

    11 min
  • ముద్ద మందారం | Mudda Mandaram | Telugu Short Story | Madhuvani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ముద్ద మందారం

    రచన: మధువాణి

    వరిమడిలో నుంచి చల్లటి పిల్లగాలి ముచ్చెమటను వెక్కిరిస్తోంది. ఎర్రటి మట్టి దారి వరిమళ్ల పచ్చదనం ముందు తలొంచక తప్పలేదు. పచ్చని కొండలు, అక్కడక్కడా చిన్న చిన్న వాగులు, పచ్చటి పొలాలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆరు మైళ్ళ దూరం నడిచినా అలసట కనబడలేదు.

    ‘కౌలుపల్లెకు వెళ్ళాలంటే ఇంకెంత దూరం ఉంటుందండీ ?’ అని కళ్ళంలో వేరుశనగ కట్ట పెరుకుతున్న ఒకామెను అడిగాను.

    ‘ఇంకెంతమ్మా! అరఫర్లాంగే ! అద్దదిగో ఆ చింతచెట్ల గుబురుల మధ్య కనబడే ఊరుండాదే అదే’ అని ఆమె అనింది.

    పక్కనే ఉన్న మరొకామె ‘ఎవరక్కా ? ఎవరింటికి ?’ అని వేరుశనగ కట్టను పోగుచేస్తూ అడిగింది.

    ‘ఏమోనే నాకూ తెల్దు. ఎవరింటికేమో!’ అని అనింది.

    కొంత దూరం నడచిన తరువాత రచ్చబండ పై బారాకట్ట ఆడుతున్న ఇద్దరు కనబడ్డారు.

    ఊరిలొకి వచ్చి ‘స్కూల్ ఎక్కడండీ ?’ అని ఒక పెద్దాయనను అడిగాను.

    ‘ఈ సందమ్బడి బోతే కుంటొకటొస్తాది. దానెనకే బడమ్మా’ అని బీడీ పొగ వదులుతూ ఆయన చెప్పాడు.

    ఆ దారిలో కొంతదూరం  వెళ్లాను. అంతలో ఒక చిన్న కట్టె వచ్చి నా తలను తాకింది. రక్తం బొట బొటా కారింది. అది చూసిన ఒకావిడ ‘వొరేయ్  నాయాల్లారా కళ్ళు కనబడ్డడం లేదురా ? చిల్లా కట్టె ఇక్కడ ఆడొద్దని ఎన్ని సార్లు చెప్పాను. పోండి ఇక్కడి నుంచి. ఎప్పుడు చూసినా గోళీలు, పెంకుబిళ్ళాటలు మీరూ.’ పరిగెత్తుకొని ఇంటిలోకి వెళ్లి పసుపు తెచ్చి ‘అయ్యో ఎంతగా తగిలిందమ్మా! ఈ పిలకాయలకు చదువూ చట్టబండలు లేనే లేవు’ అని నా తలకు పసుపు అద్దింది.


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/hata8kaWepI

    12 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world