
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పశ్చాత్తాపం
రచన: నీరజ హరి ప్రభల
" ఏమండీ! మన అమ్మాయి సుధకి రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలిట. ఇందాకే తను చెప్పింది." అంది శ్యామల, భర్త రామయ్యతో.
"అలాగేలేవే! చూద్దాం. ఈనెల జీతం ఇంకా రాలేదు" అని ఆఫీసుకు వెళ్లాడు రామయ్య.
ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య భార్య శ్యామల, కూతురు సుధతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. చదువంటే ఇష్టంతో చిన్నప్పటినుంచి కష్టపడి చదువుతూ ఇప్పుడు డిగ్రీ ఆఖరి సం.. చదువుతోంది సుధ. తమ ఇంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని నడుచుకుంటూ తల్లి తండ్రులకు అనుకూలంగా ప్రవర్తించే సుధ అంటే వాళ్లకు ప్రాణం.
ఆ సాయంత్రం ఆఫీసునుంచి వస్తూనే జీతం డబ్బులను తెచ్చి భార్య చేతికిచ్చి అందులో సుధకు ఫీజు కట్టమన్నాడు రామయ్య. శ్యామల సుధను పిలిచి ఫీజుకు డబ్బులు ఇచ్చింది. ఈ సం… చదువు పూర్తవగానే ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదిస్తూ తండ్రికి చేదోడుగా ఉండాలని అనుకుంది సుధ. సుధ పెళ్లి కోసం ఒక చిట్ ఫండ్ కంపెనీలో చీటీ కట్టి డబ్బులు దాస్తున్నాడు రామయ్య. కాలం గడుస్తోంది. ఒక రోజున చిట్ ఫండ్ కంపెనీ వాళ్లు బోర్డ్ ఎత్తేసి పరారైనట్లు విని రామయ్య హతాశుడయ్యాడు. ఆదరాబాదరాగా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ తనలాంటి ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు ఆఆఫీసుకు సీల్ వేసి కేసు నమోదు చేసుకుని ఎవరెవరు ఎంతెంత కట్టారో తెలుసుకుని వ్రాసుకుంటున్నారు. రామయ్య కూడా తనెంత కట్టాడో వివరాలు చెప్పి ఇంటికి వచ్చాడు. జరిగింది భార్యతో, సుధతో చెప్పి బాధపడ్డాడు. వాళ్లిద్దరూ ఆయన్ని ఓదార్చారు...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/KqIB0r2QYm4
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కలిసి పోరాడు
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అవగాహన లేక అన్యాయాల పాలయ్యే బడుగు వర్గాల వారు కలిసి పోరాడటం వల్ల జరిగిన న్యాయం గురించి తెలిపే కథ. *****
గౌరిని చూస్తే ఎవ్వరికైనా నల్ల కలువే గుర్తొస్తుంది. మరి పొద్దుటి నుండి మాపటి వరకు సూర్యుడి క్రింద పని చేసేవారు నల్లగా కాక ఎలా వుంటారు. వారంతా సూర్యుడి ముద్దు బిడ్డలు. గౌరి లంగా, ఓణీ వేస్కుని తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా వుంటుంది. గౌరీ వాళ్ళది బడుగు వర్గానికి చెందిన దినసరి కూలీ కుటుంబం. గౌరి ఒక్కతే కూతురు, గౌరిని కంటూనే సరైన వైద్యమందక తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేస్కోకుండా, తన తల్లి సాయంతో గౌరీని పెంచాడు. గౌరీకి పన్నెండేళ్ళప్పుడు, ముసల్ది చనిపోయింది. ఇప్పుడు గౌరీకి పదహారేళ్ళుంటాయి, ఈ మధ్యే వాళ్ళ నాన్నకు పక్షవాతమొచ్చి మంచం పట్టాడు. అప్పటి నుండి గౌరీనే, వాళ్ళ నాయనకు అన్నీ చేసి పెడ్తోంది. ఊరి బయట వాళ్ళ వర్గమంతా పాకలేస్కుని వుంటున్నారు. ఎలక్షన్ల ముందు పక్కా ఇళ్ళు ఇస్తామన్నారు గానీ ఎప్పుడిస్తారో, ఎదురు చూస్తూనే వున్నారు. వాళ్ళకొరకు అక్కడే ఒక ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది, దాంట్లోనే వాళ్ళ నాయనకు బాగున్నన్ని రోజులు చదువుకుంది గౌరి. చదవడమంటే, పర్వాలేదు ఏదో బాగానే చదివేది. ఇంకొక్క ఏడాది అయ్యుంటే పది పాసయ్యేది, కానీ అంతలోనే వాళ్ళ నాయన మంచం పట్టాడు. అప్పటి నుండి బడి మానేసి పొలం పనికి పోతోంది గౌరి. ఆ దినం నుండి గౌరిని చూచి వాళ్ళ నాయన ఏడ్వని రోజు లేదు. ఇంకా గౌరీనే ఆయనకు ధైర్యం చెప్తూ, "ఏమీ కాదులేయ్యా, ఊర్కో," అనేది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/GzNBto4awWs
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 1
రచన: మల్లవరపు సీతారాం కుమార్
ఒక అందమైన అమ్మాయి కోసం రిత్విక్, జీవన్ అనే అబ్బాయిల మధ్య పోటీకి నాంది పడింది.
ఆ అమ్మాయి పేరు ఆద్య. అందానికి ప్రతిరూపం. ఆ కుర్రాళ్ళు కూడా సామాన్యులు కాదు.
ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు. మరొకతను ఎం పీ. కుమారుడు. ఆ పోటీ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూద్దాం.
అమ్మాయి మనసు దోచుకునేదెవరో తెలుసుకుందాం.
అది నిత్య ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం.
స్టూడెంట్స్ అందరూ గుంపులు గుంపులుగా చేరి ఒకే విషయం మాట్లాడుకుంటున్నారు.
రిత్విక్, జీవన్ ల మధ్య లవ్ ఛాలెంజ్....
అమ్మాయి పేరు ఆద్య.
నెల లోగా ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలి.
ఇదీ.. ఆ ఛాలెంజ్.
గెలిచిన వాళ్లకు అమ్మాయి ప్రేమతో పాటు లవర్ బాయ్ బిరుదు దక్కుతుంది.
ఓడిపోయిన వాళ్ళు అరగుండుతో కాలేజ్ కాంపస్ చుట్టూ మూడుసార్లు తిరగాలి.
లెక్చరర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది.
ఈ ఛాలెంజ్ ఏ పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన కూడా చాలామందిలో మొదలైంది.
రిత్విక్, జీవన్ లు బి టెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్.
ఇప్పటి వరకు ఇద్దరి మధ్య పెద్దగా స్నేహం లేకపోయినా శత్రుత్వం కూడా లేదు.
కానీ కొత్తగా ఫస్ట్ ఇయర్ లో ఆద్య జాయిన్ కావడంతో ఈ కథ మొదలైంది.
జాయిన్ అయిన రోజే దాదాపు అందరూ ఆ అమ్మాయిని కాలేజ్ బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు.
అంతవరకు అందగత్తెలుగా పిలిపించుకున్న అమ్మాయిల్లో అప్పుడే అంతరాంతరాల్లో కాస్త అసూయ మొదలైంది...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/HaLnYmS9bng
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నేను ఒంటరిని కాదు
రచన: యశోద పులుగుర్త
" పూర్ణా! నవ్వుతున్నావా ఈ నిర్భాగ్యుడిని చూసి ? నానుండి శాశ్వంతంగా ఎందుకంత తొందరగా వెళ్లిపోయావు ? నీవే ఇప్పుడు ఉండి ఉంటే మనిద్దరం ఒక చిన్న గుడిసెలో ఉంటూ గంజిత్రాగుతూ బ్రతికినా మన పాలిట నందనవనంలా ఉండేది కాదూ ?
అయినా మీకేం తక్కువంటూ పరిహసిస్తున్నావా ? నిజమే మన 'నందూ' ఇంట రాజభోగాలు అనుభవిస్తున్నాను.. ఆనంద్ పెద్ద డాక్టర్ అవ్వాలని కలలు కన్నావు.. కడుపుకట్టుకుంటూ, ఎన్నో ఆనందాలను, సౌఖ్యాలను త్యాగం చేసి మరీ చదివించాం. కానీ కొడుకుని డాక్టర్ గా చూసుకోకుండానే కన్నుమూసావు..
ఆనంద్ ఇప్పుడు పేరుమోసిన పెద్ద డాక్టర్ పూర్ణా..
చిన్నప్పుడు వాడు మట్టిలో ఆడుకుని వస్తే వాడి కాళ్లు కడిగి మెత్తని టవల్ తో తుడిచి మట్టిలోకి వెళ్లకురా నందూ అంటూ కాలు కిందపెట్టనీయకుండా పెంచావు యువరాజులా.. ఇప్పుడు...... జనం వాడిని తివాసీలమీద నడిపిస్తున్నారు.. పెద్ద బంగ్లా, కారులు, ఇంటినిండా నౌకర్లు.. నీవు వాడి గొప్పతనాన్ని హోదాన్ని చూడకుండానే వెళ్లిపోయిన దురదృష్టవంతురాలివైతే, నేను నా పెద్దకొడుకు ఐశ్వర్యాన్ని, హోదాను కళ్లెదుట చూస్తూ కూడా ఇంకా ఎందుకు ఎవరికోసం బ్రతికి ఉన్నానో అర్ధంగాక సతమతమౌతున్న ఒక దౌర్భాగ్యుడ్ని.
కంటి నుండి స్రవిస్తున్న కన్నీటిని చేతిరుమాలుతో వత్తుకుంటూ ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చుని శూన్యంలోకి చూస్తూ భార్యతో తన ఆవేదనను పంచుకుంటూ ఉండిపోయారు దశరధరామయ్యగారు..
Read full story in www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/QgbryVgYJ3s
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ ఎపిసోడ్ 10
రచన: మల్లవరపు సీతారాం కుమార్
కాలేజీలో శంకర శాస్త్రి స్నేహితుడు నరసింహారావు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.
అతనికి ఫోన్ చేసి తన కూతురు అక్కడ ఉందో లేదో కనుక్కోమని చెప్పాడు శంకర శాస్త్రి.
తరువాత భార్య దగ్గరకు వచ్చి కదిలించి చూసాడు.
నెమ్మదిగా కదిలిందామె.
వెంటనే ఒక టవల్ ను చల్లటి నీళ్లతో తడిపి ఆమె ముఖాన్ని అద్దాడు.
కొంతసేపటికి కళ్ళు తెరిచిందామె.
భర్త వంక చూసి, "హమ్మయ్య! మీరు క్షేమంగానే ఉన్నారు" అని సంతోషంగా అంది.
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శంకర శాస్త్రికి.
ఆమె ప్రాణం మీదకు వచ్చినా తన గురించే ఆలోచిస్తోంది.
భార్య పార్వతమ్మ వైపు ప్రేమగా చూశాడు శంకర శాస్త్రి.
"ఏమండీ..! ఏం జరుగుతోందిప్పుడు? నాకేదో ఆందోళనగా ఉంది.ఆ సాధువెవరో.. చిత్త భ్రమలు తొలుగుతాయంటూ ఒక విభూది పొట్లం నా చేతికిచ్చి, మీ నుదుటికి రాయమన్నారు. ఎందుకైనా మంచిదని ముందుగా వాసన చూసాను. అంతే! తరువాతేమైందో నాకు తెలీలేదు" ఇంకా తొలగని భయం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది...
Read full story in www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/3ZKUE2lq7JA
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ ఎపిసోడ్ 9
రచన: మల్లవరపు సీతారాం కుమార్
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
గత ఎపిసోడ్ లో
కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి శంకరశాస్త్రి ఇంటికి వస్తాడు. 'ఆయన కోసం ఒక ప్రత్యేకమైన విభూది తెచ్చాను అనీ, దాన్ని ఆయనకు వాసన చూపించి నొసటన రాయ'మనీ చెబుతాడు. ఆ వ్యక్తి తన పేరు 'గోవర్ధన స్వామి' అని చెబుతాడు.
ఇక వినండి...
అతను ఇచ్చిన విభూదిని తీసుకొని భర్త ఉన్న గదిలోకి వెడుతుంది పార్వతమ్మ. ఎప్పుడూ లేని విధంగా నిద్రలో కూడా భర్త ముఖం చికాకుగా ఉండటం గమనించింది.
'పాపం! ఇందాక కలిగిన భ్రమ వల్ల చికాకు పడ్డట్లు ఉన్నారు' అనుకొని సాధువు తనకు ఇచ్చిన విభూది పొట్లం తెరిచింది. ఆ విభూతిని భర్తకు వాసన చూపించి నొసటికి రాస్తే ప్రశాంతంగా నిద్ర పోతారని భావించింది. పొట్లం తెరవగానే ఆ విభూది వాసన ఏదో తేడాగా అనిపించింది ఆమెకి. ఇందాక తనకు వాసన చూపించిన విభూది ఇది కాదని గుర్తించింది. పొట్లాన్ని తన ముక్కు దగ్గర వుంచుకొని వాసన చూడగానే ఆమెకు స్పృహ తప్పి, 'ఏమండీ!' అని అరుస్తూ కింద పడిపోయింది.
నిద్రలో ఉన్న శంకర శాస్త్రికి తనకు ఇందాక కనిపించిన వికృతమైన ఆకారం మళ్లీ కనిపించింది. ఈసారి ఆ ఆకారం కాషాయ వస్త్రాలు ధరించి తన ఇంటి వైపు వస్తోంది. నిద్రలోనే అసహనంగా అటూ ఇటూ కదిలాడు శంకర శాస్త్రి. ఇంతలో భార్య పెట్టిన కేకకు అతనికి మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి తన మంచం పక్కన నేల మీద అచేతనంగా పడి ఉంది అతని భార్య పార్వతమ్మ. ఆమె చేతిలో నుంచి జారిపడ్డ పొట్లం లోని విభూది నేల మీద చెల్లాచెదురుగా పడి ఉంది. దూరం నుండే ఆ విభూది నుండి వింత అయిన తియ్యటి వాసన వస్తోంది. క్షణాల్లో విషయం గ్రహించాడు ఆయన. ముక్కు మూసుకుని తన ఉత్తరీయంతో కిందపడ్డ విభూదిని తుడిచి, దూరంగా విసిరేశాడు. తరువాత ఫ్రిజ్ లోంచి చల్లటి నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు.
కానీ ఆమెలో చలనం లేదు.
వేగంగా ఇంట్లోకి వెళ్లి ఒక ఉల్లిపాయను అడ్డంగా కోసి ఆమె ముక్కు వద్ద ఉంచాడు. ఆ ఘాటుకు ఆమెలో స్వల్పంగా కదలిక వచ్చింది.
Read full story in www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/zHfXNPyEgAI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ ఎపిసోడ్ 8
రచన : మల్లవరపు సీతారాం కుమార్
మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి, తిరిగి తోటలోకి వెళ్లిన విశాల్ కు అక్కడ సుమంత్ కనిపించడు.
ఈ హారర్ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది.
ఇక వినండి...
శ్రేయకు ఇంజక్షన్ చేయబోతున్న వ్యక్తి తనను తాను డాక్టర్ గోవర్ధన్ గా పరిచయం చేసుకుంటాడు. ఇంతలో శ్రేయ మంచంపై ఉంచిన వికాస్ ఫోన్ మోగుతుంది. ఫోను అందుకోబోతున్న శ్రేయను విసురుగా పక్కకు నెట్టి, ఆ వ్యక్తి ఫోన్ తీసుకుంటాడు. అటువైపునుంచి ఒక స్త్రీ కంఠం వినపడటంతో "నేను డాక్టర్ గోవర్ధన్" అని చెబుతూ వికృతంగా నవ్వుతాడు ఆ అగంతకుడు.
అతను బలంగా తోయడంతో కింద పడ్డ శ్రేయ పైకి లేచి, రూమ్ కు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ లోకి దూరి తలుపు వేసుకుంటుంది. క్రింద పడడం, వెంటనే లేచి వేగంగా పరిగెత్తడం వల్ల ఆమెకు ధారగా బ్లీడింగ్ అవుతోంది. ఆమె వెనుకే పరుగెత్తిన ఆ అగంతకుడు, శ్రేయ తలుపు వేసుకోవడంతో కోపంతో ఊగిపోతాడు.
తలుపు మీద దబదబా బాదుతూ "మర్యాదగా డోర్ తీస్తే ఈ మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. లేదంటే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చి నీ అంతు చూస్తాను" అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో ఆ హాస్పిటల్ లో ఉన్న డేంజర్ అలారం మోగింది. ఉలిక్కిపడ్డాడు ఆ వ్యక్తి. 'అంటే తనను అనుమానించారు అన్నమాట. లాభం లేదు. వెంటనే తప్పించుకోవాలి. వీలు చూసుకుని మరో అటెంప్ట్ చేయవచ్చు' అనుకొని వేగంగా ఆ గదిలోంచి బయటకు వచ్చాడు.
ఆ హాస్పిటల్ లో డాక్టర్లు వెళ్లడం కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఉంది. క్షణాల్లో అక్కడికి చేరుకున్నాడు అతను. అప్పుడే లిఫ్ట్ డోర్ తెరుచుకుని డాక్టర్ ఆండాళ్ బయటకు వచ్చింది.
అతను ఆమెతో "మేడమ్! రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ లో మీ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. వెంటనే వెళ్ళండి" అని చెప్పి తను లిఫ్ట్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు.
డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఆ హాస్పిటల్ లో ఎప్పుడూ చూసినట్లు గుర్తు లేకపోవడంతో, పైగా డేంజర్ అలారం మోగడంతో వెనక్కి తిరిగి "మీ పేరు చెప్పండి డాక్టర్" అని అడిగింది డాక్టర్ ఆండాళ్.
నా పేరు డాక్టర్ గోవర్ధన్. కొత్తగా హెల్త్ హాస్పిటల్ నుంచి వచ్చాను" అన్నాడు ఆ వ్యక్తి. ఆలోచించేందుకు టైం లేకపోవడంతో రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ వైపు పరుగు తీసింది డాక్టర్ ఆండాళ్. లిఫ్ట్ లోకి వెళ్లిన ఆ వ్యక్తి క్షణం ఆలోచించాడు. 'కిందికి వెళితే తనను కార్నర్ చేయడం ఖాయం' అనుకొని ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడినుంచి క్షణాల్లో టెర్రస్ పైకి వెళ్ళాడు..
Read full story in www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/CvRJ3SwAYhU
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ - ఎపిసోడ్ 7
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి, తిరిగి తోటలోకి వెళ్లిన విశాల్ కు అక్కడ సుమంత్ కనిపించడు.
ఇక చదవండి...
సుమంత్ ఉద్దేశం గ్రహించిన ఆ వ్యక్తి 'నా పేరు వెంటాడే నీడ' అని చెబుతాడు.
ఆ మాట వినగానే సుమంత్ భయంతో వణికిపోతున్నాడు.
అది గ్రహించిన ఆ వ్యక్తి "ఎందుకలా భయపడుతున్నావు? నీతో పాటు మీ వాళ్ళు ఎవరూ రాలేదు కదా! అందుకనే హాస్పిటల్ వాళ్ళు నన్ను నీకు పర్సనల్ అటెండెంట్ గా ఉండమన్నారు. మీ వాళ్ళు ఎవరైనా వచ్చేవరకూ నేను నీకు నీడలా వెన్నంటి ఉంటాను. అందుకే నా పేరు అలా చెప్పాను. నా అసలు పేరు గోవిందం. నువ్వు బహుశా ‘వెంటాడే నీడ’ అనే పేరుతో ఏదైనా హారర్ మూవీ చూసి ఉంటావు. లేదా ఆ పేరుతో ఉండే దయ్యాల నవల చదివి ఉంటావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నీకేం భయం లేదు. కాసేపట్లో డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేస్తారు" అని చెప్పాడు గోవిందం.
ఇంతలోనే నర్సు డాక్టర్ దగ్గరకు వెళ్లి, పేషేంట్ కదులుతున్న విషయం చెప్పి, అతన్ని పిలుచుకొని వచ్చింది. డాక్టర్, సుమంత్ నాడిని పరీక్షించి చూశాడు. అతని తలను తన చేతుల్తో అటు ఇటు రెండు మార్లు కదిపాడు. తరువాత సుమంత్ తో "మీకేం భయం లేదు. ప్రాణాపాయం నుండి బయటపడ్డారు" అని చెప్పాడు.
డాక్టర్ పేరు అడుగుదామని ప్రయత్నించాడు సుమంత్. కానీ ఇందాకటి లాగే మాట్లాడలేకపోయాడు. అది గమనించిన డాక్టర్, గోవిందం వైపు తిరిగి "అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు" అన్నాడు.
అది చూసిన గోవిందం, "ఇతను మీ పేరు అడగాలని అనుకుంటున్నాడు" అని డాక్టర్ తో చెప్పాడు.
"గుడ్! అతని కదలికలను బట్టి అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కనిపెట్టగలుగుతున్నావు" అని, సుమంత్ వైపు తిరిగి "నా పేరు డాక్టర్ గోవర్ధన్. నా చేతిలో పడ్డావు కాబట్టి నీ ప్రాణాల గురించిన ఆలోచన వదిలేయ్" అన్నాడు డాక్టర్.
అతని మాటలకు సుమంత్ ముఖంలో మళ్లీ కదలికలు మొదలయ్యాయి. అది గమనించిన ఆ డాక్టర్, గోవిందంతో "ఇతని భాష పట్టేశావు కదా. ఇప్పుడు ఏం అనుకుంటున్నాడో చెప్పు" అన్నాడు.
గోవిందం "అతను ఎందుకో మీ మాటలకు భయపడుతున్నాడు" అని చెప్పాడు.
"భయం ఎందుకు? ఇతను ఉన్న చోటినుంచి కదల్లేడు. కనీసం తల కూడా కదిలించలేక పోతున్నాడు. మరి ఇతని ప్రాణాలు నా చేతిలోనే కదా ఉన్నాయి?" అన్నాడు డాక్టర్ గోవర్ధన్.
"విన్నావుగా! నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. భారం డాక్టర్ గారి పైనే వేసి ఉంచు. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు" అని చెప్పాడు గోవిందం..
Read full story in www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/gITVmUFKIs0
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ ఎపిసోడ్ 6
రచన: మల్లవరపు సీతారాం కుమార్
ఐదవ భాగంలో ...
ఇంజక్షన్ తేవడానికి మెడికల్ షాప్ కి వెళ్తాడు వికాస్. ఆ సమయంలోనే అతని భార్య శ్రేయ ఉన్న గదిలోకి ఒక వ్యక్తి వెళతాడు. తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, ఇంజక్షన్ చెయ్యడానికి వచ్చాననీ చెబుతాడు.
ఇక్కడ మామిడి తోట దగ్గర చనిపోయింది షణ్ముగమా లేక గోవర్ధనమా తెలుసుకోవడానికి తన అల్లుడు వికాస్ కు ఫోన్ చేస్తుంది సావిత్రి.
అటు వైపు ఫోన్ తీసిన వ్యక్తి తన పేరు గోవర్ధన్ అని చెబుతాడు.
ఇక చదవండి....
భోజనం పూర్తి చేసి పెరట్లోకి వెళ్లి, చెయ్యి కడుక్కొని వచ్చాడు శంకరశాస్త్రి. పెరటి గుమ్మం వద్ద నిలబడి, అతను లోపలికి రాగానే చేయి తుడుచుకోవడానికి టవల్ అందించింది అతని భార్య పార్వతమ్మ. చేయి తుడుచుకొని ఆ టవల్ తిరిగి ఆమెకు అందించాడు శంకరశాస్త్రి. తరువాత హాల్ లోకి వచ్చి ఈజీ చైర్ లో కూర్చున్నాడు. కాసేపటికి పార్వతమ్మ వచ్చి అతని కుర్చీ పక్కనే చేతులు నలుపుకుంటూ నిలుచుంది. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడే ఆమె అలా వచ్చి నిలుచుంటుంది అని అతనికి తెలుసు.
"ఏమిటోయ్! కొత్త పెళ్ళికూతురులా అలా సిగ్గు పడుతున్నావు?" అని అడిగాడు ఆమెను.
" ఏమీ లేదండీ!" అంది పార్వతమ్మ.
"30 ఏళ్ళు నీతో కాపురం చేసిన వాడిని, నీ గురించి ఆ మాత్రం తెలీదా! నేను కోప్పడే విషయం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలా చేస్తావు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి.
"మరేం లేదండీ. నిన్న మా అన్నయ్య, వాళ్ళ అబ్బాయి సుమంత్ ని తీసుకొని మన ఇంటికి వచ్చాడు కదా! ఆ అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు. మన అమ్మాయి దీక్షను చేసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. ముందుగా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను" నీళ్ళు నములుతూ చెప్పింది పార్వతమ్మ.
" వాళ్ళు వచ్చింది పెళ్లి చూపులకు కాదు గదా! అబ్బాయి జాతకం నా చేత చూపించుకోవడానికి వచ్చామని మీ అన్నయ్య చలపతిరావు నాతో చెప్పాడు" అన్నాడు శంకరశాస్త్రి.
Read full story in www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/88HTKyroioA
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
వెంటాడే నీడ - ఎపిసోడ్ 5
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
మామిడి తోట దగ్గర ఆగుతారు శ్యామలరావు దంపతులు.
అక్కడ గోవర్ధన్ అనే వ్యక్తి వీళ్లకు కనపడతాడు. ఆ తోట వాచ్ మాన్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడతను. శ్యామలరావు దంపతులు బయటకు వెడతారు. విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్ల కోసం డ్రైవర్ వెంకటేష్ తిరిగి తోటలోకి వెడతాడు. అతన్ని ఒక వ్యక్తి కత్తితో పొడవడానికి తరుముకుంటూ వస్తూ ఉంటాడు. అతడు, చనిపోయాడని చెప్పబడ్డ తోటమాలి షణ్ముగం గా గుర్తిస్తాడు శ్యామల రావు.
ఇక చదవండి ...
ఇదేమిటి? కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న షణ్ముగం తిరిగి ఎలా వచ్చాడు?
భయంతో బిగుసుకు పోయిన గొంతును పెగుల్చుకొని "ఎవరు.. ఎవరు నువ్వు? " అని అడిగాడు శ్యామలరావు.
"అదేంటి సార్! నన్ను గుర్తు పట్టలేదా? నేను ఈ తోటమాలి షణ్ముగాన్ని" అన్నాడతను.
“గుర్తుకు వచ్చావులే. కానీ నువ్వు మా డ్రైవర్ ను ఎందుకు తరుముతున్నావు? మేము తోటలోకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు లేవు?" అతని వంక భయంగా చూస్తూ అడిగాడు శ్యామలరావు.
అతను ఏదో చెప్పబోయేంతలో " ఇప్పుడవన్నీ ఎందుకండీ? ముందు మనం బయలుదేరుదాం" అంది సావిత్రి.
"సార్! ఇతను మీ డ్రైవర్ అని నాకు తెలీదు. ఆ చచ్చిన గోవర్ధన్ గాడిని పిలవడంతో కోపం వచ్చింది. వచ్చింది వాడి ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. ఆ గోవర్ధన్ చేసిన పని ఇంకా మర్చిపోలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనే చంపేసేవాణ్ని" అన్నాడు షణ్ముగం.
"గోవర్ధన్ చనిపోవడం ఏమిటి? మేము ఇప్పుడే అతనితో మాట్లాడాము. నేను ఒక్కడినే కాదు, అందరం చూసాము” అన్నాడు శ్యామల రావు..
అంతే...!
షణ్ముగం చేతిలోని కత్తి జారి పడింది.
పూర్తి కథ manatelugukathalu.com ( ఎప్పటికీ పూర్తిగా ఉచితం) లో చదవండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/jWtbwvjtczo
From the publisher's feed