Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • యుగయుగాల ప్రేమ | Yugayugala Prema | Telugu poem | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    యుగయుగాల ప్రేమ

    రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

    "నీకోసం యుగయుగాలుగా పరితపిస్తున్న నాకు

    ఈరోజు విరహపు వీధుల్లో 'నీకో సాయంత్రం నాకో సాయంత్రం'

    సమయం కుదిరింది,

    మన ప్రేమ దీపం దివ్యంగా వెలిగింది.

    ఎదలోని విరహాగ్ని భగభగమండగా,

    నీ చిరునవ్వుల చల్లని మనసు శాంతి చేకూర్చే!

    'ఎడారి మనసుల రాడారు ప్రయాణం '

    ఎండమావుల చిరు ఆశతో, నీకోసం పరితపిస్తున్నా ప్రియా


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/cdiU-YqPUO4




    2 min
  • శాంతి సత్యం | Santhi sathyam | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com

    (కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)

    శాంతి సత్యం

    రచన: N. సాయి ప్రశాంతి

    ఈ దేశం మనదేశం

    అందించే సందేశం

    శాంతి, సత్యం

    కళలందు విజ్ఞానమందు ధర్మమునందు చూపెను మార్గం  జగతికే... పూజామందిరమై సాంస్కృతిక దీపికయై  తరతరాలుగా నిలిచినది మన భారతదేశం  నరనరాలలో నింపుకో ఆ సందేశం...

    ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కవితను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/jwlKpHGbuZc




    2 min
  • భార్యాభర్తలు | Bharyabharthalu | Telugu Short story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    భార్యాభర్తలు

    రచన: భాగవతుల భారతి

    "ఎలాగోలా తప్పించున్నామనుకున్నాం."

    ముఖం కంద గడ్డలా చేసుకుని భార్యవంక రుసరుస లాడుతూ చూసాడు కూర్మాంగద.

    "తాతాచార్ల వారి ముద్ర వీపు తప్పినా భుజం తప్పలేదన్నమాట. గత మూడు వేవ్ లూ దాక్కుని దాక్కుని,ఇంట్లో అందర్నీ మీ అతిభయంతో చావగొట్టుకు తిన్నారుగా ..

    పిట్ట బిఱ్ఱు మననీయకుండా, ఒకింటి మీది కాని మనింటిమీద వాలనీయకుండా,..

    డబ్బులు కూడా కడిగారుగా! "

    మూతి మూడువంకర్లు తిప్పింది తాయారు.

    "అంటావే! అంటావ్! నేను అంత జాగ్రత్తగా ఉండబట్టే మెుదటి మూడూ తప్పించుకున్నామ్. ఈ వేవ్ నీ వల్లే వచ్చుంటుంది. వద్దన్నకొద్దీ ...అక్కావాళ్ళు కారుకొన్నారూ? చూసి వస్తామని పోయావుగా! అంటి ఉంటుంది. "

    "ఆ మాటే అనొద్దన్ననా!? నేను ఎంత జాగ్రత్త గా గ్లౌజులూ, మాస్కులూ వేసుకుని వెళ్ళానూ? మీరే సిగరెట్లనీ పాన్ లకీ షాప్ కి వెళ్ళి, కరోనా.... "


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/MvhM6hGraNw


    7 min
  • నిజాయితీ ఖరీదు | Nijayathi kharidu | Telugu short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నిజాయితీ ఖరీదు

    రచన : డా: షహనాజ్ బతుల్

    ఊరిలో జనమంతా కలెక్టరు గారికి స్వాగతం పలకటానికి నిరీక్షిస్తున్నారు. కలెక్టర్ శిరీష గారికి స్వాగతం అని బ్యానర్ పెట్టారు.

    ఊరి సర్పంచ్ గారు పూలదండ పుచ్చుకొని నిల్చున్నారు. ఆయన ప్రక్కన కొంతమంది పెద్దమనుషులు నిల్చున్నారు. కొంతమంది బోకెలు పుచ్చుకొని, నిల్చున్నారు. కొంతమంది మహిళలు ఒక చోట దండ పుచ్చుకొని, నిల్చున్నారు.

    తమ ఊరిలో పుట్టి, మన ఊరి బడిలో చదివిన అమ్మాయి ఒక కలెక్టర్ కావడం అందరికీ సంతోషముగా ఉంది. ఆ ఊరి వాళ్లకు విశేషము కూడా.

    సుజన ఒక వైపు నిల్చుంది. తన ఊరిలో పుట్టి, తను చదివిన బడిలో చదివింది. ఎవరై  ఉంటారు? నేను చూసే ఉంటానా?..


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/YnZyfDuy9fQ

    11 min
  • శుభమస్తు | Subhamasthu | Telugu short Story | Dr Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శుభమస్తు

    రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

    “కాసేపయినా నోరు మూసుకోనుండవా?  చావన్నా రాలేదు. మాకు పట్టిన శని..”

    ఇవి ఎవ్వరో  శతృవులు, గిట్టని వాళ్ళు, ఇరుగుపొరుగు వాళ్ళు ఛీ కొట్టిన మాటలు కాదు. స్వయాన కడుపున పుట్టిన ఒక్కగా నొక్క కొడుకు తల్లిమీద కురిపించిన ప్రేమ పరంపర, ఆప్యాయత పొంగు.

    ఆవిడ, ఏమో అనరాని మాటలు అని కాదు. అదేవిటో ఎలాంటి మంచి చెప్పినా దరిద్రం.. శని.. అని ఉన్న ముగ్గురూ కస్సుమంటారు.  ఏవిటో ఆ తల్లి పేద పిచ్చమ్మ అదృష్టం . అర్ధం గాని అపనిందల ఆశీర్వాదాలు.

    ‘తప్పుమాట  అన్నానా!?’ అని బాధ గుండె గూట్లో దాక్కుని గొణగ సాగింది. ‘చిన్నతనం. ఇంకా మంచి చెడులు తెలియని  అమాయకుడు.. పిచ్చి మాలోకం  నా బిడ్డ’ అని అనుకుంది. ఎనభై సంవత్సరాల పిచ్చమ్మకు  యాబై పదులు దాటిన కొడుకు మీద వాత్సల్యం పొంగు కొచ్చింది.

    ముప్పై దాటినా, పెండ్లిగాని పెద్ద సాఫ్ట్ వేర్  ఉద్యోగి మనవడు. ఈ మధ్య ఏదో గొడవలో ఇరుక్కుని ఉద్యగం తీసే వేస్తారని, జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుందని  విన్నది. పాపం బిడ్డ ! పిచ్చివాడిలాగా అయిపోయాడు. దిగులుగా కూర్చున్న అతన్ని చూస్తే మనసు తరుక్కు పోయేది.

    ప్రతి రోజు ప్రతి క్షణం కోటి సార్లు మొక్కుకునేది. భగవంతుడా! కరుణించు. ఉద్యోగం వచ్చి పెండ్లి జరిగితే జీవితం నీకు అంకితమిస్తా అని పరితపించి పోయేది...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/yUD7mL8XuQE



    10 min
  • అఖిల్ | Akhil |Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అఖిల్

    రచన: N. ధనలక్ష్మి

    చిన్నపిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది. వాళ్ళు ఎటువంటి కల్మషం లేని వారు. అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలవాడు అఖిల్. అఖిల్ తన స్వచ్ఛమైన మనసుతో

    అందరిలో ఎలా మార్పుని తీసుకుని వచ్చారో తెలియజేసే కథ..

    ఓ పట్నంలో అఖిల్ అనే అబ్బాయి 5వ తరగతి చదివేవాడు. అన్నిటిలో ముందుడేవాడు.

    అఖిల్ అంటే చరణ్ సర్ కి చాలా ఇష్టం. ఎందుకంటే

    అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటాడు. అలాగే చెప్పిన పనిని ఎటువంటి తప్పులు లేకుండా చేయడమే కాకుండా కొత్తవి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపేవాడు.

    భోజన సమయంలో తన మిత్రులతో కలిసి తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. అఖిల్ తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు.

    అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గా తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరి పారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు. ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నా, వాటిని కూడా తినేవాడు.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Th4zvBln_8k

    8 min
  • అందిన సాయం | Andina Sayam | Telugu Short story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అందిన సాయం

    రచన: రామకూరు లక్ష్మి మణి

    ఫోన్ రింగ్ అయింది.. చేతిలో ఉన్న ట్రైపాడ్ బోర్డు కింద పెట్టి ఫోన్ ఆన్ చేశాడు.

    "ఆ స్నేహ.. చెప్పు.."

    "ఏమిటీ.. ఇంకా ఇల్లు గుర్తుకు రాలేదా.."

    "ఏం చెయ్యను.. నాకు మంచి స్పాట్ దొరకలేదు ఇప్పటిదాకా.. సరే సరే.. తర్వాత మాట్లాడతాను.. అక్కడేదో గుట్ట లాగా కనిపిస్తోంది అక్కడకు వెడుతున్నా"

    "జాగ్రత్త మధు.. ఎక్కువ దూరం వెళ్లకు.. చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేయ్.."

    "అలాగే స్నేహ.. నువ్వేం భయపడకు" అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు మధుకర్.

    మధుకర్ ఆర్టిస్ట్. బొమ్మలు వేస్తూంటాడు.. ఆలా బయటకు ప్రకృతి లోకి వచ్చేసి, మంచి స్పాట్ కనబడితే వెంటనే బొమ్మ స్కెచ్ వేసుకుని, తర్వాత రంగులద్దుతాడు..

    అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఆర్ట్ అంటే ప్రాణం.. వీకెండ్ లో ఒకరోజు బయటకు వెళ్ళిపోతాడు..

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Wyg6CiwT1Jc

    7 min
  • ఒక అగమ్య జీవన రాగంలో | Oka Agamya Jeevana Ragamlo | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఒక అగమ్య జీవన రాగంలో

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    కల్పన భుజాన వ్రేలాడుతూన్నషోల్డర్ బ్యాగుని ఉన్నపళంగా విసురుగా కుడిచేతిలోకి అందుకుని, గట్టిగా బిగించుకుని, రైల్వే లైన్ వీధిలోకి వడివడిగా నడిచింది. రాను రాను పరిస్థితి నలువైపులా అతలా కుతలమై పోతూన్న సమయం. ఎవడు-  ఎవడేమిటి యెవతె యెక్కణ్ణించి యెలా దూసుకు వచ్చి చేతికి దొరికింది యెలా యెత్తుకు పోతారో చెప్పలేని అథోగతి.

    తన మెళకువకి అతీతంగా అటువంటిదేమైనా జరిగితే యెక్కడకు వెళ్ళి యెవరితో చెప్పుకోగలదు? కోవిడ్ అరికట్టే కార్యరంగంలో అందరూ-  ముఖ్యంగా నగర రక్షక భటులు కుత్తుకంట మునిగి తేలుతూన్న లాక్ డౌన్ గడ్డు సమయం. ఇటువంటి  పిర్యాదుల వేపు కన్నెత్తి కూడా చూసే నాథుడుండడు. సమయ సందర్భమెరిగి నడచుకోవడం ఉత్తమం కదా! అందుకే- తను మోడల్ అన్నది ప్రక్కన పెట్టి మోతాదుకి మించని రీతిన మామూలుగా ముస్తాబయి, సాదాసీదా పింక్ రంగు చుడిదార్ వేసుకుని బయల్దేరింది.

    కాని కల్పన తనకు తెలియకుండానే ఒక వాస్తవాన్ని మరచినట్లుంది. ఎటువంటి సందర్భంలోనూ రెండు అంశాలు ఆడదానిని గిరిగీసిన వలయంలా మరచిపోనివ్వవు. యవ్వన వయసు- వయసులోని సొగసు. అవి రెండూ దాగనివి. దాచుకోలేనివి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/dnphzEaUUT4

    26 min
  • నా డిటెక్టివ్ అమ్మ | Na Detective Amma | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నా డిటెక్టివ్ అమ్మ

    రచన: N. ధనలక్ష్మి

    ఈ ప్రపంచములో తల్లి ప్రేమను మించినది మరొకటి లేదు ఇంకోటి ఉండదు ..బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలరు, ఎంతటి సాహసం అయినా చేయగలరు, ఎంతటి తెగింపు అయిన చూపగలరు. ఏ ప్రేమకైనా అంతం అనేది ఉంటుంది కానీ అమ్మ ప్రేమకి, అనురాగానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. కొడుకు కోసం డిటెక్టివ్ గా  మారిన ఓ అమ్మ కథ...

    ముకుంద్, కృష్ణవేణి ల ముద్దుల సంతానం త్రిలోక్..

    ముకుంద్ ఒక  ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు..

    కృష్ణ వేణి ఏమో ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది.

    ఉన్న వాటిలో ఎంతో సంతోషంగా ఉంటారు..

    త్రిలోక్ ఐదో తరగతి చదువుతుంటాడు..

    అన్నిటిలో  ముందుండే వాడు.

    స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి, వాళ్ళమ్మతో కలిసి దగ్గరలో ఉండే పార్క్ కి వెళ్ళి ఆడుకునే వాడు..

    అలా ఆడి తిరిగి ఇంటికి చేరుకొని ఇచ్చిన స్కూల్ వర్క్ ఫినిష్ చేసేవాడు..

    అలా ఒక్కసారి పార్క్ కి వెళ్ళి ఆడుతుంటే తన ఫ్రెండ్ విక్కి సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు .. పాపం మోకాలి చిప్పకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. విక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/LGgohwotNIs

    9 min
  • అనంతమైన నవ్వులు | Ananthamaina Navvulu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అనంతమైన నవ్వులు

    రచన: పెండేకంటి లావణ్య కుమారి

    ఒక అనాథను దత్తత తీస్కోవాలని నిర్ణయించుకున్న అతను, తర్వాత ఒక చిన్న అబ్బాయి చేసిన పనిని చూసి తన నిర్ణయం మార్చుకోవటం వల్ల ఎందరి జీవితాలలోనో వెల్లి విరిసిన ఆనందాల నవ్వులే ఈ అనంతమైన నవ్వులు. మరి ఆ అబ్బాయి చేసిన పనేంటో తెలుసుకోవాలనుందా?.. అయితే కథ చదవండి/వినండి.

    అనంత్ ఓ బాగా డబ్బున్న వర్తకుడు. లక్ష్మి, అనంత్ యొక్క భార్య. మంచి గుణవతి, చాలా అందమైనది కూడా. కోరి, కోరి పెళ్ళి చేస్కున్నాడు. వారిద్దరూ ఏ కొరతా లేని అన్యోన్యమైన దంపతులు. అంతా బాగుంటే నన్నెందుకు తలుచుకుంటారీ మానవులనుకుంటాడో ఏమో, ప్రతి ఒక్కరికీ ఏవో ఇబ్బందులు పెడ్తూనే వుంటాడు దేవుడు. అలాగే వీరికి కూడా అన్నీ వున్నా సంతానం లేని లోటు వుంది.   లక్ష్మి ప్రతిరోజూ దేవుడిని కోరే కోరిక ఒక్కటే, అది తమకు సంతానం ప్రసాదించమని మాత్రమే. ఇప్పుడు లక్ష్మికి నలబై రెండేళ్ళు వచ్చాయి. ఇన్ని రోజులూ పిల్లలు కలుగుతారు అనే ఆశ వుండేది, ఇప్పుడు ఇద్దరికీ ఆ ఆశ అడుగంటి పోయింది. అందరూ సిటీకి వెళ్ళి చూపిస్తే డాక్టర్లు ఏదైనా చెప్తారు, ఇప్పుడు ఎన్నో రకాల వైద్యాలు వచ్చాయి అంటుంటే నాలుగేళ్ళ క్రితం వెళ్ళి చూపించుకున్నారు. డాక్టర్లు లోపము అనంత్ దే అన్నారు. పుట్టే అవకాశమే లేదన్నారు. దానితో తిరిగి వచ్చేసారు...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/kPlOMl2rsek


    10 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world