Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట | Bolthaa Kottindile Bul Bul Pitta | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట

    నల్లబాటి రాఘవేంద్ర రావు

    ఆకాశంలో హాహాకారాలు చాలా భయంకరంగా ఉన్నాయి.. భూమిని సమీపించేస్తున్నాయి....

    అయినా ఎవరికీ వినిపించడం లేదు!

    రెండు   ముళ్ళకొండల  లాంటి ఆకారాలు వికట నృత్యాలు.... చేస్తూ వస్తున్నాయి.  వాళ్ల రెండు చేతులలో ఉన్న విచిత్ర  శూలఖడ్గాల  రాపిడికే అగ్నిబండలు.. ఆ ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. కానీ భూమ్మీద ఎవరికీ ఏ విషయమూ తెలియడం లేదు!

    ఆ వచ్చే వాళ్ళు  రాక్షస యమకింకరులు  ప్రజృంభకాసురుడు ..విజృంభకాసురుడు !!

    యమకింకరులు భూమ్మీద  శరీర రహిత  మానవులను యమలోకం తీసుకు వెళ్ళవలసి వచ్చిన ప్రతి సారి.. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని తీసుకురావాలో వాళ్లకు చాలా ప్రస్ఫుటంగా మార్గం  కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ దిగాలో ఎవరిని తీసుకువెళ్లాలో తెలియని... విచిత్ర పరిస్థితి... ఒక ఆత్మను తీసుకు రావలసి ఉంది... అందుకు వాళ్లకు  యమలోకంలోనే సంకేతాలు అందాయి...


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/SbCzsage0Kw

    24 min
  • నేర్చుకుందాం | Nerchukundam | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com

    (కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)

    నేర్చుకుందాం

    రచన: ఏ. అన్నపూర్ణ

    మనిషి జీవితం పూలబాటకాదు

    అన్నీ సంతోషాలు వుండవు

    నడిచేదారి  ఏదైనా

    ఎత్తుపల్లాలు ముళ్ళ పొదలు అగాథాలు ఉంటాయి

    ఆవేదన కలిగితే తట్టుకోవడం కష్టమే కానీ

    మనసు కుదుట పరచుకుని

    బాధను అధిగమించే ప్రయత్నంలో

    ఎక్కడో ఒక వెలుగురేఖ ఉదయిస్తుంది...

    ఈ  కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కవితను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/rALEkPTpR-4

    3 min
  • స్టార్ కీ |Star Ki | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    స్టార్ కీ..!!

    రచన: వెంకు సనాతని

    వెండి తెర మీద ఆనందంతో స్టెప్పులు వేస్తూ వుండే స్టార్ లకి కూడా గుండెల్లో విషాదం ఉంటుందని తెలిపే ఈ కథను ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించారు.

    ఫోటోషూట్ బాగొచ్చింది అక్షయ్..!! హీరోగా ఆఫర్స్ వచ్చే పాసిబులిటీ ఉంది. "మే బీ ఇట్ విల్ సూన్" అన్న ఫోటోగ్రాఫర్ సన్నీ మాటలకు చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చాడు అక్షయ్.

    ***

    అక్షయ్! హీరో అవ్వాలని.. స్టార్ గా వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కనే వాళ్ళలో అతడూ ఒకడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి, అదీ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చిన వాడు. రెండు మూడు సినిమాల్లో హీరో ఫ్రెండుగా  నటించాడు. హీరో అవ్వాలన్న దృఢనిశ్చయంతో ప్రయత్నాలు సాగిస్తున్నాడు.

    కొత్తగా ఫోటోషూట్ చేసిన ఫొటోలను తెలిసిన దర్శక నిర్మాతలకు, స్టూడియోలకి పంపటం, తెలిసిన నిర్మాత కబురు చేసి ఓకె అనటం, ముహూర్తపు సన్నివేశానికి శ్రీకారం చుట్టటం, ప్రముఖులతో క్లాప్ కొట్టించటం అన్నీ చకచకగా జరిగిపోయాయి...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/WfSm7QPF-qg

    9 min
  • బుద్ది వచ్చింది | Buddhi Vachhindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బుద్ది వచ్చింది

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    సుబ్బారావు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రిటైర్ అయిన తరువాత, పేపర్లు, tv న్యూస్, వెబ్ పత్రికలు చదవటం మొదలుపెట్టాడు. వెబ్ పత్రికలో వచ్చిన ప్రతీ కథలో తప్పులు వెతకడం, ఆ కథ రాసిన వారి గురించి, కథ గురించి కామెంట్స్ పెట్టి వాళ్ళని బాధపెట్టాను అని తనంత తెలివితేటలు వున్నవాడు లేడని గర్వం తో వున్నాడు.

    చాలామంది ఆ కథ రాయడం లోని ఉద్దేశ్యం విపులంగా చెప్పినా  వినకుండా వాళ్ళ కథ కి అర్ధం లేదని వాదిస్తో కామెంట్స్ పెట్టేవాడు.

    చివరికి ఒక రచయిత, దమ్ముంటే నువ్వే మంచి కథ రాసి చూపించు,అంతేగాని అందరిని కించపరచడం తప్పు అని చివాట్లు పెట్టాడు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/QQWhlifLv4Y

    4 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 | Kakathi Rudrama Episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 2

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో

    గణపతి రుద్ర దేవులకు పురుష సంతతి లేదు.

    అందుచేత కుమార్తె రుద్రమ దేవిని రుద్ర దేవుడిగా పెంచుతాడు.

    రుద్రమ దేవి అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరుతుంది.

    ఇక చదవండి...

    రుద్రమ 27 నవంబర్‌ 1289 వ సం!! చందంపట్ల గ్రామము, నకిరేకల్‌ మండలం నల్లగొండ జిల్లాలో జన్మించెను.

    కాకతీయ గణపతి దేవ చక్రవర్తి యిహ రాజ్యాన్ని పాలించటానికి పనికిరాడు.

    అస్తమించబోయే ప్రొద్దులాంటి వయస్సు ఆయనది. ఆయనకి దుఃఖం వుంది.

    కానీ చక్రవర్తిగా  కష్టనష్టాల్ని  యితరులతో  చెప్పుకోలేడు.

    ఆయన తొలి కుమార్తె ' రుద్రమదేవి' ని- పురుషవేషం లోనే పెంచాడు.ఆమె అన్నింటిలోనూ ధీర........'

    మహావీరుడు' గా చలామణి ఐన పురుషవేషధారి.

    ప్రజలకు ఆమె స్త్రీ అయినా రుద్రమదేవిగా కాదు. పురుషుడైన ' రుద్రదేవుడు' !

    రుద్రమదేవి-రుద్రదేవుడుగా సింహాసనం ఎక్కటంతో - జరుగుతున్న గందర గోళాలకు లెక్కలేదు. అయితే  గణపతి రుద్రదేవ చక్రవర్తి అదృష్టవంతుడు కావటం చేత , ఆయనకి ముఖ్యులూ- విశ్వాసాపాత్రులు ఈ రాజ్యంలో ప్రచ్ఛన్నయుద్దాలు లేకుండా శాంతి ధామంగా చేసారు...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/tGXlYBNwQ7A



    17 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17 | Srivari Kattu Kathalu Episode - 17 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    కనకారావుకు అతని అనుచరుడు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి పోలీస్ అని అనుమానంగా ఉందని చెబుతాడు. తనకు తెలిసిన పోలీస్ వ్యక్తిని తీసుకొని వచ్చి అతనికి వాళ్ళను చూపిద్దామని చెబుతాడు.

    తన సీక్రెట్ ఫోన్ నుండి విల్సన్ కి కాల్ చేస్తుంది జయా ఆంటీ.

    అతను లిఫ్ట్ చెయ్యక పోవడంతో ఆమె అనుమానం బలపడుతుంది.

    ఇక చదవండి…

    "విల్సన్ ను నా దగ్గరకు తీసుకొని రండి" చెప్పాడు ఏ సి పీ ప్రతాప్.

    ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్లి విల్సన్ ను తీసుకొని వచ్చారు.

    అతన్ని కొట్టడానికన్నట్లుగా లాఠీని పైకెత్తాడు ప్రతాప్.

    "ఇప్పటికే మీవాళ్లు కుళ్లబొడిచారు. మళ్ళీ కొట్టకండి సార్" అన్నాడు విల్సన్ చేతులు జోడిస్తూ.

    "సరేగానీ మీవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా కోడ్ చెబుతూ ఉంటావా?" అడిగాడు ప్రతాప్.

    క్షణం ఆలోచించాడు విల్సన్.

    తాము కోడ్ వాడుతున్నట్లు వీళ్లకు తెలిసి పోయిందా లేక చీకట్లో ఒక రాయి వేసారా అతనికి అంతు పట్టలేదు.

    "నిన్నే అడిగేది" రెట్టించాడు ప్రతాప్.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/X0FXMWEQVn0



    12 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 | Srivari Kattu Kathalu Episode - 16 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    పర్వీన్, శిల్పలకు జయా ఆంటీ ద్వారా జరిగిన అన్యాయం గురించి విన్న సమీర ఆవేశపడుతుంది.

    గౌతమ్ ఊహించినట్లుగానే హాస్పిటల్ లో డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అందర్నీ డైవర్ట్ చేసి, మరో వ్యక్తి నర్స్ వేషంలో ప్రమోద్ ఉన్న గదిలోకి దూరుతాడు.

    ఇక వినండి…

    డోర్ తెరవడానికి వెళ్ళబోతున్న షాలిని, వినీత్ పిలవడంతో తిరిగి బెడ్ రూమ్ లోకి వెడుతుంది.

    ఎందుకు పిలిచారని అడగబోతున్న ఆమెను కాసేపు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేస్తాడు వినీత్.

    ఒక పోలీస్ ఆఫీసర్ చెవిలో రిసీవర్ పెట్టుకొని ఎవరివో మాటలు శ్రద్ధగా వింటున్నాడు.

    అటువైపు మాటలు వినడం పూర్తయ్యాక రిసీవర్ తీసేసి, ఇలా చెప్పాడు.

    “గౌతమ్, సందీప్ కి ఒక మైక్రోఫోన్ ఇచ్చాడు. సందీప్ దాన్ని జయా ఆంటీ ఇంట్లో సోఫాలో కూర్చున్నప్పుడు సీట్ అంచుల్లోకి నెట్టి ఉంచాడు. రిసీవర్ మాకు ఇచ్చాడు గౌతమ్. దాంట్లో సందీప్ బయటకు వచ్చాక జయా ఆంటీ ప్రవీణ్ తో మాట్లాడిన మాటలు విన్నాను.వాళ్ళ మాటల ప్రకారం ఆంటీ సందీప్ ని పూర్తిగా నమ్మలేదు. విల్సన్ ఆంటీతో మాట్లాడేటప్పుడు సీక్రెట్ కోడ్ చెప్పలేదట. అందుకే సందీప్ షర్ట్ వెనుక ఒక మైక్రోఫోన్ పెట్టిందట. అంతే కాదు. ముందు సందీప్ మాత్రమే లోపలికి వస్తాడట. మైక్రోఫోన్ లో అతను మీతో మాట్లాడే మాటలు విన్నాకే వాళ్ళు ఏంచెయ్యాలో డిసైడ్ చేసుకుంటారట" చెప్పడం ముగించాడతను.

    తరువాత ఏ సి పి ప్రతాప్ గారికి కాల్ చేసాడు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/aNws_bKiP2s





    10 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 15 | Srivari Kattu Kathalu Episode - 15 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 15

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    తనని గదిలోకి లాగిన వ్యక్తి గౌతమ్ అని తెలియడంతో రిలాక్స్ అయింది సమీర.

    జరిగిన విషయాలు ఆమెకు వివరిస్తాడు గౌతమ్.

    సందీప్ షర్ట్ వెనుక మైక్రోఫోన్ తగిలిస్తుంది జయా ఆంటీ.

    ఇక చదవండి...

    వినీత్  చెప్పేది శ్రద్ధగా వింటోంది స్నేహ.

    "గౌతమ్ మెయిల్ పెట్టడంతో తండ్రిని ప్రశ్నించి సందీప్ నిజం తెలుసుకున్నాడట. వెంటనే ఇండియా వచ్చేసాడు. గౌతమ్ ప్లాన్ ప్రకారం నిన్ను చంపించమని జయా ఆంటీని కోరాడు. మరి కాస్సేపట్లో సందీప్, జయా ఆంటీ, ప్రవీణ్ ఇక్కడకు వస్తారు. ఆంటీవాళ్ళు నీ మీద మర్డర్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికే ఈ ప్లాన్. పక్కా ఆధారాలు లేకుంటే ఆంటీ తప్పించుకుంటుంది. అందుకే మా ముగ్గురిలో ఒకరు మొత్తం వీడియో తీస్తాం" అంటూ ఒక లాకెట్ స్నేహ చేతికి ఇచ్చాడు.

    "ఇందులో హిడెన్ కెమెరా ఉంది. దీన్ని నీ మెడలో ఉన్న చైన్ కి తగిలించుకో" అని చెప్పాడు.

    అలాగే చేసింది స్నేహ.

    ఇంతలో బయటనుండి డోర్ తట్టిన శబ్దం వినిపించింది.

    "సందీప్ వచ్చినట్లున్నాడు. వెళ్లి కీ హోల్ నుండి బయటకు చూస్తూ ఉండు. అదే సమయంలో మేము హాల్లోకి వచ్చి, సోఫా వెనుక పొజిషన్ తీసుకుంటాం. వాళ్ళు అటాక్ చెయ్యబోతుండగా వాళ్ళని పట్టుకుంటాం. వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. మరీ అవసరమైతే ఉపయోగించ వచ్చని ఏ సి పీ గారు వీళ్లకు పర్మిషన్ ఇచ్చారు. " చెప్పాడు వినీత్.

    సరేనంటూ హాల్లోకి వెళ్తున్న స్నేహను తిరిగి వెనక్కి పిలిచాడు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/e8aGj5cTDsc


    10 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14 | Srivari Kattu Kathalu Episode - 14 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    కనకరావును ఇంటర్వ్యూ చెయ్యడానికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. వాళ్లకు పర్వీన్, శిల్పలను ఎరగా వెయ్యాలనుకుంటాడు కనకారావు. అలా చేస్తే తను చెయ్యబోయే పనికి ఏ అడ్డూ ఉండదని భావిస్తాడు…

    ఇక చదవండి....

    తనకు గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేస్తూ ఉండగానే అతను గౌతమ్ అని గుర్తించింది సమీర. వెంటనే చేతిలోని స్ప్రే బాటిల్ ని వదిలేసి గౌతమ్ దగ్గరకు చేరుకుంది. తన చున్నీతో అతని ముఖం తుడిచింది.

    "మరీ అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయితే ఎలా" అన్నాడు గౌతమ్ కళ్ళు నులుముకుంటూ.

    “ఇంకేం చెయ్యాలి? ఆలోచిస్తూ వుంటే ఈ లోపల నా మీద అటాక్ చెయ్యరూ.. అయినా అయం వెరీ సారీ" అంటూ అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తనూ పక్కనే కూర్చుంది.

    అతను కాస్త రిలాక్స్ అయ్యాక అతన్ని దగ్గరకు లాక్కుంటూ "ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?" అంది.

    ఇక వినండి...

    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Tr0PPQkwe3M


    10 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 | Srivari Kattu Kathalu Episode - 13 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    తనను గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే  చేస్తుంది సమీర. బయటకు ఆ వాసన రావడంతో నవ్వుకుంటారు పర్వీన్, శిల్ప.

    ఇక్కడ  జయా అంటీ ఇంట్లో సందీప్ తో కలిసి స్నేహ మీద అటాక్   చెయ్యడానికి ప్లాన్ వేస్తారు ప్రవీణ్, ఆంటీ.

    ఇక చదవండి ....

    కీ హోల్ నుండి చూసిన స్నేహ, బయటనుంచి ఎవరో లోపలి చూస్తూ ఉండటంతో భయపడుతుంది. గబుక్కున పక్కకు జరిగి గోడకు ఆనుకొని నిలుచుంటుంది.

    ఇంతలో అతను బయటనుండి "అమ్మా స్నేహా! నేనమ్మా .. వినీత్ అన్నయ్యను' అనడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.

    సందేహం లేదు. అది తన కజిన్ వినీత్ గొంతే! అయినా అనుమానం తీరక మరోసారి కీ హోల్ నుండి బయటకు చూసింది.

    అది గమనించిన అతను తన మొహం కనిపించేలా వెనక్కి జరిగి, "తొందరగా తలుపు తియ్యమ్మా! నేను బయట నుంచి లాక్ తీసేసాను. గౌతమ్ తన దగ్గరున్న కీ ఇచ్చాడు. నువ్వు లోపలి గడియ తియ్యి. చాలు" అన్నాడు వినీత్....

    ఇక వినండి...

    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/rBOaD6TIbPM

    9 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world