
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమీర. కానీ అతను ఎంతసేపటికీ రాడు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాననీ, మరికాసేపట్లో వచ్చేస్తానని చెబుతూ ఉంటాడు. అనుకోకుండా అతని బాస్ మోహిత ఫోన్ చేసి గౌతమ్ సెలవులో ఉన్నట్లు చెబుతుంది.
( ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురితమవుతోంది. )
ఇక వినండి…
మెదడంతా మొద్దు బారి పోయినట్లు అనిపించింది సమీర కు.
గౌతమ్ తనతో అబద్ధం చెప్పాడా...?
ఎంత మాత్రం నమ్మలేక పోతోంది. మరోవైపు 'మగాళ్ళు వట్టి మాయగాళ్ళు' అంటూ పక్క పోర్షన్ జయా ఆంటీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
‘కానీ ఆమె మాటలు నమ్మి తను గౌతమ్ ను అనుమానించ కూడదు. తొందరపడి ఏ నిర్ణయానికీ రాకూడదు. అలాగని ఇదివరకు లాగా అతన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇలాంటప్పుడే తన తెలివితేటలు చూపించాలి. తను అనుమానిస్తున్నట్లుగా గౌతమ్ కు ఎంత మాత్రం సందేహం రాకూడదు' .
ఆలోచన వచ్చిందే తడవుగా వాష్ బేసిన్ వద్దకు వెళ్లి ముఖాన్ని కడుక్కుంది.
ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకుని నార్మల్ గానే ఉన్నట్టుగా తెలుసుకుంది. తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్లి అటువైపు తిరిగి పడుకుంది.
సమీర చాలా ఆతృతగా బాత్రూమ్ డోర్ తెరుచుకున్న శబ్దం కోసం ఎదురుచూస్తూ ఉంది.
'గౌతమ్ బయటకు రాగానే ఏం చేస్తాడు? ముందు తన బాస్ కు కాల్ చేయవచ్చు. ఎందుకంటే అతను బాత్రూం లో ఉండగా ఆవిడ నుండి కాల్ వచ్చినట్లు తను చెప్పింది కదా! లేదా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తను ఎంతగా అవస్థ పడిందీ వివరించి చెప్పవచ్చు. ఈ రెండేనా లేక మరేదైనా విషయం మాట్లాడే అవకాశం ఉందా? తను డోర్ తీసేటప్పుటికి అతను జయా ఆంటీ తో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Df-32DyaHSE
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ - 1
రచన : మల్లవరపు సీతారాం కుమార్
భర్త అంటే పిచ్చి ప్రేమ సమీరకు. రోజంతా అతనితోనే గడపాలని కోరుకుంటుంది. అలాంటి సమీరకు భర్త తనను మోసం చేస్తున్నాడని అనుమానం వస్తే ఏమౌతుంది? అతన్ని ఏం చేస్తుంది?
ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన శ్రీవారి కట్టుకథలు అనే కథ వింటే తెలుస్తుంది. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింపబడింది..
ఇక కథ ప్రారంభిద్దాం...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/400u-_7m9M8
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అరణ్య రోదన
రచన: పెండేకంటి లావణ్య కుమారి
మనుషులు చేసే పనుల వల్ల అడవి జంతువులు పడే కష్టాల రోదనను అరణ్య రోదనన్న పేరుతో చిన్న కథగా వ్రాసాను. *** వేసవికాలం అనగానే సూర్యుడి వేడి, ఆ తాపం తగ్గించుకోటానికి జనాలు ఏ.సీలలో సేదతీరటం, అలాగే వారు తాగే టెంకాయ నీరు, రకరకాల కూల్డ్రింక్సే గుర్తుకొస్తాయి. మనం మనుషులం కాబట్టి కృత్రిమంగా ఎన్నో తయారు చేసుకుని వేడి బాధను తగ్గించుకుని ఉపశమనం పొందుతుంటాము. మరి కేవలం ప్రకృతి మీద ఆధారపడి జీవించే జంతువుల సంగతో... వాటికి అడవిలో దొరికే నీరు మాత్రమే ఆధారం. సంవత్సర, సంవత్సరానికీ పెరుగుతున్న, కాదు మనుషులు పెరిగేలా చేస్తున్న ఎండ తీవ్రతతో అడవులలోని జంతువులు ఎప్పుడూ లేని నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాయని ఎంతమందికి తెలుసు. మామూలుగా ప్రాకృతికంగా జరిగే పర్యావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటే మనమెవ్వరమూ కంగారు పడవలసిన అవసరం లేదు. అది ఒక చక్రంలా జరుగుతూ వుంటుంది, అంటే ఎలా మార్పులు వచ్చాయో అలాగే సర్దుకుంటూ వుంటాయి కూడా. కానీ అదే అసహజంగా కొన్ని శతాబ్దాలలో జరగాల్సిన పర్యావరణ మార్పులు కేవలం కొన్ని సంవత్సరాలలో జరుగుతుంటే కచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం వుంది...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/hW07ailR2ic
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సు..ధీర ఎపిసోడ్ 2
రచన : బివిడి ప్రసాదరావు
గత ఎపిసోడ్ లో…
ప్రేమించానంటూ సు వెంటపడతాడు ధీర.
అతన్నివారిస్తుంది సు.
అయినా తన పట్టు వీడడు ధీర.
ఇక చదవండి...
"కట్" అన్నాడు డైరక్టర్.
ఆ వెంబడే తన కుడి చేతి బొటన వేలుని పైకి చూపుతూ..
"వెల్ డన్" అన్నాడు సుని చూస్తూ.
"థాంక్యూ" అంది సు. కెమెరా ఫ్రేం నుండి బయటికి వచ్చింది.
వెళ్లి.. కుర్చీలో కూర్చుంది.
మేకప్ మాన్ టచ్ ఆప్ లకై వచ్చాడు.
"ఫ్రేం నుండి రాగానే తయారైపోతావు. రిలాక్స్ కానివ్వవు. రా.. నీ పని కానిచ్చుకో." అంది సు నవ్వుతూనే.
టచ్ ఆప్ లు కాగానే.. అసిస్టెంట్ ఎంటరయ్యాడు.
అతన్ని గుర్రుగా చూసింది సు.
అతను నవ్వుతూనే.. తీయబోయే సీన్ ని వివరించేశాడు.
అతను వెళ్లబోతుండగా..
"నెక్స్ట్ కి టైం ఉందా" అడిగింది సు.
"పావు గంటలో తిరిగి షూట్ మొదలవ్వొచ్చు. డైరక్టర్ గారు కాఫీ కై వెళ్లారు." చెప్పాడు అసిస్టెంట్...
ఈ వెబ్ సీరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/d4Ihqhif73U
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అందమైన కిటికీ
రచన: పెండేకంటి లావణ్య కుమారి
ఒక అందమైన కిటికీ చూసి ఆ కిటికీ వెనుక కథ ఇంకెంత అందంగా వుంటుందోనని, తెలుసుకోవాలని ప్రయత్నించి, తెలుసుకుని వారితో కలిసిపోయిన ఒక యువకుని కథ ఇది.
రవి కాలేజీకి వెళ్ళే దారి పక్కనే ఒక అందమైన ఇల్లు కొత్తగా కట్టారు. సంవత్సరం క్రితం ఆ ఇల్లు కట్టటం మొదలయ్యింది. అప్పటి నుండి రవి ప్రతిరోజూ ఆ ఇంటిని కట్టటానికి జరిగే పనులు గమనిస్తూ వచ్చాడు. ఆ ఇంటి ముందు అప్పుడప్పుడూ ఒక కారు ఆగి వుండేది. బహుశా ఇంటి ఓనర్లు వచ్చారేమో అనుకునే వాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/D7jNvIFxzfQ
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కడలి కెరటాలు
రచన: నీరజ హరి ప్రభల
"రమ్యా! రేపు ఉదయమే నీకు పెళ్లి చూపులు. రోజూ పిల్లలను పోగేసుకుని పొలాలగట్లంటూ తిరుగుతావు. రేపన్నా బుధ్ధిగా ఇంట్లో ఉండు." అన్న తండ్రి రామయ్య మాటలను వింటూ లోపలికి వెళ్లింది రమ్య.
ఆ ఊరిలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రామయ్య - భార్య జానకమ్మ , కూతురు రమ్య తో పెద్దలిచ్చిన చిన్న ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నారు. పదవతరగతి చదివిన రమ్యను ఇంక పై చదువులు చదివించే స్ధోమత లేక పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు రామయ్య గారు. భర్తకు తగిన ఇల్లాలు జానకమ్మ. భర్త మాటకు ఏనాడూ ఎదురు చెప్పి ఎరగదు. నోరు వాయీలేని ఇల్లాలు అని ఆమెకు పేరు. ఉన్నంతలో గుట్టుగా బ్రతుకుతూ రమ్యని ప్రేమగా చూసుకుంటున్నారు రామయ్యా వాళ్లు.
తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఇంకా పై చదువులు చదువుకోవాలనే తన మనసులోని మాటను ధైర్యంగా తల్లి తండ్రుల వద్ద రమ్య చెప్పగా, వాళ్లు తమ ఆర్థిక పరిస్థితిని వివరించి రమ్యను పెళ్లికి ఒప్పించారు. కన్నవాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక , ఇంటి స్ధితిగతులను అర్థం చేసుకున్నదై మౌనంగానే పెళ్లికి అంగీకరించింది రమ్య.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/ACOP5nceBTM
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అనిరుధ్ అనే నేను
రచన: రామకూరు లక్ష్మి మణి
“ఒరే మావా.. కొట్టు కట్టేసేయ్యకూడదూ.. అలా పోయొద్దాం కాసేపు..”
ఫ్రెండ్ హరి ఒకటే నస పెడుతున్నాడు..
“ఒరేయ్ నీకెన్ని సార్లు చెప్పానురా.. తొమ్మిది గంటలయితేనే గాని షట్టర్ దించనని.. అయినా పోరా.. ఇంటికి పో.. వెళ్లి చదువు కో, లేదా పడుకో.. రాత్రిపూట షికార్లేమిట్రా…”
“నీతో కాసేపు నడిస్తే కొన్ని మంచి విషయాలు తెలుస్తాయని
అడుగుతున్నారా.. నీతో మాట్లాడకపోతే నాకు తోచదని తెల్సు కదరా..”
హరి అక్కడే కూర్చుంటూ అన్నాడు.
వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్..ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్ లో చదివారు. అనిరుధ్ చదువు ఆపేశాడు. హరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు..
రోజులో ఒక్కసారైనా కలుసుకుంటారు.
“సర్లే పద.. ఇంకెవరూ కస్టమర్స్ వచ్చేట్లు లేరు.. పద కాసేపు వాకింగ్ చేసి నేను కూడా ఇంటికెడతా “ అంటూ షాప్ మూసేసి తాళం వేసాడు అనిరుధ్...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/hxUnCbJhzrA
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
డాక్టర్ పూర్ణిమ
డాక్టర్ షహనాజ్ బతుల్
“సుమతీ! ఇలా రా..” తన మనవ రాలిని పిలిచింది డాక్టర్. పూర్ణిమ.
పలుకకుండా లోపలకు వెళ్ళిపోతుంది సుమతి.
మనవరాలికి మంచి మార్కులు వచ్చాయని, బాగా చదువుతుంది అని కౌగిలించుకొని, అభినందన
తెలుపుదామనుకుంది. కానీ మనవరాలు ఎప్పుడూ తన దగ్గరకు రాదు.
స్వాతి గమనిస్తుంది.
"మా అమ్మను ఏమనుకుంటున్నావు? అమ్మను అసహ్యిచుకుంటున్నావు. పిలిస్తే రావు. నీకు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే అభినందనలు చెప్పాలని నిరీక్షిస్తోంది."
తన తల్లి కథ కూతురికి చెప్పుతుంది స్వాతి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/3NEu13Bmh5Y
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కాకతి రుద్రమ ఎపిసోడ్ 1
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమ దేవి కథను సీరియల్ గా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత, కవి శ్రీ అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు.
పాఠకులు ఈ సీరియల్ పై తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయ వలసిందిగా కోరుతున్నాం.
ఇక మొదటి ఎపిసోడ్ ప్రారంభిద్దాం.
నవలకాల చరిత్ర
------------------------
పదమూడో శతాబ్దంలోనే కత్తి పట్టింది. కదనరంగంలో దూకింది. మత్తగజాన్నే కాదు
.. మగరాయళ్ళ అహంకారాన్ని అణచివేసింది. సమస్త స్త్రీజాతికి ఆదర్శమూర్తి
-- కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి. చెదిరిన ఆంధ్ర దేశాన్ని ఒక్కటిగా చేర్చిన గణపతి
దేవుని పెద్ద కూతురు. ఓరుగల్లు రాజదాని గా దక్షిణాదిని ఏలిన కాకతీయ వంశానికి చెందిన ధీరోదాత్తురాలు రుద్రమ దేవి.
ఆ వంశ మంత్రి శివదేవయ్య. ఆయనే రుద్రమదేవికి యుద్దవిద్యలన్నీ నేర్పించాడు.
రుద్రమదేవి సాహసాలను మాటల్లో వ్యక్తీకరించలేము. గణపతిదేవుడు బతికున్న కాలంలోనే , తండ్రి అనారోగ్య కారణంగా సైన్యాన్ని ముందుకు నడిపింది. దక్షిణ భాగం అధికం కాకతీయ సామ్రాజ్యం లో ఉన్న సమయమది. పురుషాధిక్యాన్ని తట్టుకుని పాలించడం సామాన్య విషయం కాదు...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/HZ8n-tddhj0
(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)
కాపాడుకుంటాను
ఏ.అన్నపూర్ణ
నా ఇంటి బాల్కానీ కుండీలో వేసిన మల్లెతీగ చిగురులు వేసింది
అప్పుడే పుట్టిన చిన్ని పాపను చూసినట్టు మురిసిపోయాను
ప్రతిరోజూ సాగె తీగలను తాకి సంబర పడుతుంటాను
ఆ చిగురులనుంచి వచ్చే చిట్టి మొగ్గలు ఎంత బాగుంటాయో
రోజూ నీళ్లు పోస్తూ వాటిని పలకరించకపొతే తోచదు నాకు
చూస్తూ ఉండగానే తీగలు సాగి బాల్కానీ గ్రిల్లుకి అల్లుకు పోతుంటే
నా కన్నబిడ్డ అందంగా యవ్వనిగా ఎదుగుతున్నట్టే అనిపిస్తుంది
మొగ్గలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ పరవశం మాటలకూ అందనిది...
ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కవితను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/SAEEf98hdEc
From the publisher's feed