
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సు..ధీర ఎపిసోడ్ 1
రచన : బివిడి ప్రసాదరావు
ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారు రచించిన 'సు..ధీర' సీరియల్ నవల ఈ వారం నుండి ప్రారంభిస్తున్నాం. ఈ సీరియల్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతున్నాం.
ఇక కథ ప్రారంభిద్దాం.
"ఒప్పుకుంటే.. నేను జీవిస్తా.. కాదంటే.. నేను చనిపోతా.." చెప్పేశాడు ధీర.
ఉలిక్కి పడింది సు.
ధీరని ఎగాదిగా చూసింది.
"ఏమిటి నువ్వు.. నీ వాగుడు ఏమిటి?" చరచరా అంది సు.
"ఎన్ని మార్లు కలిసినా.. నీ వైపు పలుకు లేదు. నవ్వేస్తావు. నీ దారిన నువ్వు పోతున్నావు." చెప్పాడు ధీర.
"అందుకు.. 'చనిపోతాను' అన్నంత వరకు పోతావా" కసిరింది సు.
"అవును. అంతే. నీ పరిచయం నాకు కావాలి. నీ ఆదరణ నాకు దక్కాలి.. కాక పోతే.. నా బ్రతుకు వేస్ట్.."
"షటప్" ధీరకి అడ్డు పడింది సు.
ధీర చెప్పడం ఆపేశాడు.
త్వరత్వరగా తన స్కూటీని తీయబోయింది సు.
తన కుడి అర చేయిని గమ్మున చాచి.. ఆ స్కూటీని ఆపగలిగాడు ధీర.
సు చుట్టూ చూసింది....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/NtCG3A9JLz0
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అమ్మ బాట
రచన: పరిమళ కళ్యాణ్
"ఇంకెందుకు నేను బ్రతికి ఉండటం, నాకు ఆత్మహత్యే శరణ్యం. ఒరేయ్ కన్నా నువ్వు ఈ లోకంలోకి రాక ముందే నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాను రా. క్షమించరా కన్నా, ఈ చేతగాని తల్లిని!" అంటూ బాధతో కడుపులో ఉన్న బిడ్డని తలచుకుంటూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ, రైలు వస్తున్న వైపుగా వెళ్తూ ఉంది రాధిక.
రాధిక, గౌతమ్ ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకే టీం లో వర్క్ అవ్వటం తో ఇద్దరి మధ్యా చనువు ఏర్పడింది. ఆ చనువు స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఆరు నెలలు గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు.
అదే విషయం ఇంట్లో చెప్పింది రాధిక. రాధిక తల్లి పద్మావతి ఒప్పుకోలేదు. ప్రేమ వివాహానికి ఆమె పూర్తి వ్యతిరేకి. రాధిక తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడు. రాధికకి అమ్మ మీద నమ్మకం ఎక్కువే అయినా, గౌతమ్ విషయంలో మాత్రం అమ్మ మాట లెక్కచేయ్యలేదు...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/-jD-I3iWy00
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అందరూ వినండి.!
ఏ.అన్నపూర్ణ.
హైదరాబాద్ నగరంలో నేరాలు కోవిద్ తో బాటు పెరిగాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు దేశాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయి. కోవిద్ 19 లా దేశరాజధాని ఢిల్లీలో నిర్భయపై దాడి మొదలుకొని ఈనాటివరకు ఆగలేదు.కొద్దిగా మరుగున పడ్డాయి అంతే! అడపా తడపా విజృంభిస్తూ అమ్మాయిల జీవితాలకు సంకటంగామారాయి. పోరాటానికి ఓపికలేని మహిళా సంఘాలు సైతం మవునం వహించాయి.
కాలేజీలకు స్కూలుకు సెలవులు వచ్చాయి.కాలం ఎలా గడపాలి...అని ఏ ఆశయం ఒక గోల్ అంటూ లేని
యూత్ ''పెద్దలు అనబడే ప్రజా నాయకుల పుత్ర రత్నాలు ''వారి ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ మెంట్ కోసం
పనికిరాని ఆలోచనలతో పార్టీలు పేరుతొ మతి తప్పి ప్రవర్తిస్తున్నారు.అక్రమమో సక్రమమో సంపాదించిన
డబ్బు ఎలా ఖర్చు చేయాలి పిల్లలకేగా ..అని తల్లి తండ్రులు వారు అడిగినంతా ఇస్తూ ఎందరో అమ్మయిలా
పాలిట రాక్షసుల్లా తయారు అయ్యారు. పార్టీ అంటే ఏమిటో ఎందుకో ఎక్కడో పట్టించుకోరు...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Yw-6iMOdNMo
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అంతర్మథనంలో సంధి కాలం
పి. దినకర్ రెడ్డి
ఇందులో తన తప్పేముంది మేడమ్? వీణను ఓదారుస్తూ అడిగింది శైలజ.
ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళజోడు సరి చేసుకుని చుట్టూ చూసింది. ఆ కిషోర్ ఒక మొండి వెధవ. పైగా ఇది ర్యాగింగ్ అని కూడా చెప్పలేం శైలజా అంది.
మళ్లీ ఒక్కసారి చూడండి మేడమ్. క్లాసులో ఉండగానే వీణ ఫోటో తీసి, వాళ్ళు తన శరీరాన్ని ఎలా అనుభవించాలి అనే తమ కోరికల్ని సిగ్గు లేకుండా డిస్కస్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ లో జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్ చూపించింది శైలజ.
గట్టిగా అరిచి ఆ అమ్మాయిని ఇంకా అల్లరి చెయ్యడం సబబా. వాళ్ళ పర్సనల్ వాట్సాప్ గ్రూపులో మాట్లాడుకున్న విషయాల గురించి సీరియస్గా తీసుకోకపోవడం మంచిది. అమ్మాయ్! ముందు నువ్వు క్లాసుకు వెళ్ళు అంటూ వీణను పంపించింది ప్రిన్సిపల్ మేడమ్.
శైలజా! కిషోర్ చేసిన పనిని నేను సమర్థించడం లేదు. కానీ కొన్ని విషయాలు మనం చూసీ చూడనట్టు వదిలేయాలి. లేదంటే అవి అందరినీ ఇబ్బంది పెడతాయి అని చెప్పి లెక్చరర్ శైలజను కూడా పంపించింది.
ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళల్లో తడి చూసాక శైలజ ఏమీ మాట్లాడలేదు. ఆ కళ్ళలో అశక్తత..
శైలజకి కారిడార్లో కనిపించాడు కిషోర్ మిడిగుడ్లు వేసుకుని. నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయావు అనే గర్వం వాడి కళ్ళల్లో కనిపించింది. ప్రిన్సిపల్ మేడమ్ భయపడ్డారు అంటే ఆ కిషోర్ తండ్రికి రాజకీయ పార్టీ అండ దండలు ఉన్నాయి అనే కదా. అశక్తత..
ఇంటర్మీడియెట్, డిగ్రీ చదివే ఈ పిల్లలు అమ్మాయిని ఆట వస్తువుగా చూడడం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఇంటి నుంచా? సమాజం నుంచా? తనేమీ చెయ్యలేక తల దించుకుంది. అశక్తత. అంతర్మథనం చేసుకున్న ప్రతీసారీ అశక్తత పలకరిస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/ys1KBQLcAZ4
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పూల బాట వెయ్యండి
రచన:రామకూరు లక్ష్మి మణి
“అబ్బా! హాయిగా ఉందండి, నారాయణ గారు.. మీ ఇంటి వాతావరణం ...చక్కగా బోల్డు చెట్లు వేశారు ఇంటి ముందు..” అన్నాడు కేశవ్.
లోపలి ప్రవేశిస్తూనే, మంచి గాలి వీస్తూ పచ్చని చెట్లతో కనులవిందుగా అనిపించింది. ఇంట్లోకి ప్రవేశించే మెట్ల పక్కన రంగురంగుల పూలతో కుండీలు స్వాగతం పలికాయి.
నారాయణ, కేశవ్ ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులు...నారాయణ కేశవ్ కన్నా సీనియర్. కేశవ్ నారాయణ చేసే బ్యాంకు కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. బ్యాంకు కి దగ్గరగా
ఇల్లు చూసుకోడానికి నారాయణ సహాయం అడిగాడు.
ఇదివరకు చేసే బ్రాంచ్ కి దగ్గరలో ఉంటున్నాడు ప్రస్తుతం. అయితే అది చాల దూరం అవటం వలన ప్రస్తుతం చేస్తున్న చోటికి రావడానికి రోజూ ఇబ్బంది పడుతున్నాడు. తమ రోడ్డులోనే ఇల్లు ఖాళీగా ఉంది, చూడటానికి రమ్మని తనతోబాటు తీసుకు వచ్చాడు నారాయణ ..
ఇల్లు చూసారు, చాలా నచ్చింది కేశవ్ కి. మర్నాడు భార్యని కూడా తీసుకొచ్చి చూపించి అడ్వాన్స్ ఇస్తానని ఇంటి ఓనర్స్ కి చెప్పి వచ్చాడు.
ఇంతదూరం వచ్చారు మా ఇంటికి రండి అంటూ నారాయణ ఆహ్వానంతో వాళ్ళింటికి వెళ్ళాడు. నారాయణ భార్య రాధిక లోపల్నించి వచ్చి నమస్కారం చేసింది.
ముందు రూమ్ లో కూర్చున్నారు. అన్నీ చక్కగా నీట్ గా మంచి కళాత్మకంగా సర్ది ఉన్నాయి.
ఇంతలో నారాయణ ఇద్దరు కొడుకులు లోపల్నించి వచ్చారు. మంచినీళ్ల గ్లాసులతో ఒకరు, టీ కప్స్ పట్టుకుని ఒకరు. నారాయణ పరిచయం చేసాడు. చిన్నవాడు టెన్త్ క్లాస్, పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు వినయంగా నమస్కరించి లోపలి వెళ్లి పోయారు..
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/LLdKq7d-aK0
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నా నాన్న
రచన : బివిడి ప్రసాదరావు
"ఏమిటమ్మా.. ఆయన మరీ కటువైపోతున్నాడు" అన్నాను.
"ఆయనా.. ఎవరూ." విస్మయమయ్యింది అమ్మ.
"అదే.. నీ ఆయన." చెప్పాను.
"ఒరే.. ఆ పెడసరమేమిటిరా. నాన్నా అనవచ్చుగా." కసిరింది అమ్మ.
"ఏమోనమ్మా.. ఆయన అలా అనిపించడం లేదు. నా పాలిటి విలన్ లా కనిపిస్తున్నాడు." చెప్పాను.
"చాల్లే. నోరు అదుపులో పెట్టుకో.. ఆయన నీ నాన్న.. నీ మేలు కోరడమే తప్పా.. ఆయనకి నీ మీద ఏమీ లేదు" అనేసింది అమ్మ.
"అవునులే.. నీ ఆయన్ని ఎప్పుడూ వెనుకేసుకు వస్తావు." గుణిశాను.
నా పేరు కుమార్. టెన్త్ చదువుతున్నాను.
చూస్తున్నానుగా.. చిన్నప్పటి నుండి.. ఆయన.. అదే.. చెప్పాలి కనుక చెప్పుతున్నాను.. నాన్న.. నా పట్ల మొదటి నుండి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
నా ప్రతి పనిని పట్టి పట్టి చూస్తుంటాడు.
అలాగని 'తిడతాడా' అంటే లేదు.. 'కొడతాడా' అంటే లేదు.
మార్కులు బాగా తెచ్చుకుంటున్నా.. 'ఏం పట్టనట్టు ప్రొగ్రస్ కార్డు మీద సంతకం' పెట్టేస్తాడు.
'బాగా చదవాలి. పరీక్ష తప్పితే నా కోపం ఏమిటో మరింత తెలుస్తుంది' అని మాత్రం అనేస్తాడు. అదీ నాతో కాదు.. అమ్మతో చెప్పిస్తాడు.
చెప్తే నమ్మరు కానీ.. చాక్లెట్ కాదు కదా.. చిన్న తీపి బిళ్ల నాకు ఇప్పటికీ ఇచ్చేదే లేదు.
అమ్మే లేక పోతే.. ఈ నాన్నతో ఉండేది పరమ కష్టం. అమ్మో.. తల్చుకుంటేనే భయమేస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/INNBDXZKz1o
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఒక దీపం వెలిగిన వేళ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
‘’ అమ్మాఅనితా ...ఎలా ఉన్నావ్? బావ...పిల్లలు బాగున్నారా?’’ ఫోన్ లో అన్నగారి మాటలు వింటూనే సంబర పడిపోయింది అనిత.
‘’బాగున్నాను అన్నయ్య.మీరంతా ఎలా ఉన్నారు?’’
‘’అంతా బాగున్నామ్. సరే గానీ నీకో శుభవార్త.’’
‘’ ఏంటన్నయ్యా...అది?’’
‘’మన వూళ్ళో తొందరలో గ్రంధాలయం ఏర్పాటుచేస్తున్నానమ్మా. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నువు, బావ పిల్లలు తప్పక రావాలి.’’
‘’అన్నయ్యా...నిజమా...ఎంత మంచి వార్త చెప్పావు?ఇంతమంచి ఆలోచన నీకు ఎలా వచ్చిందన్నయ్యా? మన చిన్నప్పుడు ప్రాధమిక పాఠశాల తప్ప ఏమీ సౌకర్యం ఉండేది కాదు. అలాంటిది నువు మొన్న పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ గా ఎన్నిక అయ్యాక వూరికి ఇంత మంచి జరుగుతోంది అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్యా. తప్పకుండా వస్తాను. ‘’
‘’సరేనమ్మా. నేను గ్రంధాలయ ప్రధాన కార్యదర్శిగారిని కలవడానికి వెళ్తున్నాను. గ్రంధాలయానికి కావలసిన పుస్తకాల కొనుగోలుకు పంచాయితీలో తీర్మానం కూడా చేశాం. ఆ జాబితా ఇవ్వడానికి వెళ్తున్నాను. ఉంటానమ్మా మరి.’’
‘’ సరే అన్నయ్యా... ఏది ఏమైనా నీ చేత్తో మనవూరిలో ఆ చదువులతల్లి ఆలయంలో నీచేత్తో దీపం వెలిగించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా.తప్పకుండా వస్తానన్నయ్యా. సరే.ఉంటాను.’’అనిత ఫోన్ పెట్టేసింది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/BY5W0sKYUlY
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
స్నేహం
రచన: శ్రీనివాసరావు జీడిగుంట
రమణ, శ్రీధర్ యిద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరడంతో ఇద్దరికీ స్నేహం కుదిరిపోయింది. ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసి తిరుగుతో వుండేవారు. వాళ్ల పెళ్లిళ్లు కూడా ఒక నెల తేడా లో చేసుకుని, హైదరాబాద్ లో పక్క పక్కన ఇల్లు తీసుకొని, ఆఫీస్ కి యిద్దరు కలిసి వెళ్ళి వస్తోవుండే వాళ్ళు. రమణ కి స్కూటర్ వుండటం వలన అదే స్కూటర్ ఎక్కి రమణతో శ్రీధర్ వెళ్ళేవాడు.
భర్త దగ్గర చనువు వచ్చిన తరువాత, ఒకరోజు రమణ భార్య రమణ ని “మీ ఫ్రెండ్ రోజూ మీ స్కూటర్ మీద రావడమేనా, పెట్రోల్ ఖర్చు సగం ఏమైనా యిస్తున్నాడా” అని అడిగింది.
“ఆ.. వాడు ఏమీ యివ్వడం లేదు, అయినా రోజూ నేను ఎలాగో వెళ్ళాలి. వాడు వెనుక కూర్చుంటాడు.. అంతే! దీనికి డబ్బు సగం ఇమ్మంటే ఏం బాగుంటుంది?” అన్నాడు రమణ.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/4YCLcCaLSHc
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ముసుగు తొలిగింది - కథ మారింది
రచన: పరిమళ కళ్యాణ్
కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి షాపింగ్ అప్పుడే అయిపోయిందా అనుకుంటూ తలుపు తెరిచాడు.
తలుపు తీయగానే ఎదురుగా కనపడిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు, కంగారుపడ్డాడు హరీష్.
"అసలెందుకు వచ్చింది ఇదీ..? పెళ్ళికి ముందు రూపతో తిరిగిన విషయం, కట్నం డబ్బుల కోసం లతని పెళ్ళి చేసుకున్న విషయం అవన్నీ దీనికి తెలుసు. ఇప్పుడు నా గురించి మా ఆవిడకి చెప్తే, ఇక అంతే సంగతులు. అసలే కట్నం ఎక్కువ ఇచ్చానని దెప్పుతూ ఉండటమే కాదు, ఇంటి పనంతా నాతో చేయిస్తోంది లత. ఇక ఇప్పుడు ఈ మాధురి వల్ల రూప సంగతి తెలిస్తే ఇంకేం పనులు చేయిస్తుందో ఏమిటో?" అని భయపడ్డాడు. కాస్త తమాయించుకుని, ఇంట్లో భార్య లేదన్న విషయం గుర్తుచేసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/FA93OeNQu8E
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అండదండలు
రచన: పెండేకంటి లావణ్య కుమారి
రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసమే ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడ్తుంటారు. అవి సమాజం మీద చూపే ప్రభావం గురించి ఆలోచించరు. కొందరు తల గొరిగించుకుని దాన్ని ఫాషన్గా అనుకుంటూ ఫోజులు కొడుతున్నారని, అందర్కీ ఉచితంగా తల గొరిగించుకునే అవకాశం కలిగించారా అన్నట్టున్న ప్రభుత్వపు ఒక నిర్ణయం గురించి హాస్యంగా రాశారు ప్రముఖ రచయిత్రి పెండేకంటి లావణ్యకుమారి గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/e3DG8iMHlAM
From the publisher's feed