Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • అమ్మ మనసు | Amma Manasu | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అమ్మ  మనసు

    రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

    “కవితా  …నాకు టైం అవుతుంది  టిఫిన్  అయిందా? ఎంత సేపు పిల్లలతోనేనా? నన్ను పట్టించుకునేది  వుందా లేదా,” గట్టిగా కేక వేసాడు మధు.

    “అబ్బా…   వస్తున్నానండి మీకే టిఫిన్  తయారు చేస్తున్నాను,  అయినా పిల్లలు చిన్నవాళ్ళు. ఎంత సేపు వాళ్ళ మీదనే  మీకు, మీరేం చిన్నపిల్లలా… లోపలికి వచ్చి  ప్లేట్ లో  పెట్టుకోవచ్చు కదా! పిల్లలకు స్కూల్ లో లేట్  అయిందంటే  వాళ్ళకు దెబ్బలు పడతాయి  మీకేం తెలుసు,” అంది ప్లేట్ లో టిఫిన్ తెస్తూ.

    “సరేలే …అలా అనుకున్నప్పుడు పిల్లలు నువ్వు తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి,రాత్రి టీవీచూసుకుంటూ కూర్చునే బదులు పిల్లలను తొందరగా పడుకోబెట్టడం అలవాటు చేయ్యాలి నన్నడం కాదు,” అన్నాడు మధు టిఫిన్ తినడం ముగిస్తూ...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Yq457sVN88A



    10 min
  • బంధాలు - విలువలు | Bandhalu Viluvalu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బంధాలు - విలువలు

    రచన: యశోద పులుగుర్త

    “ఇదిగో వసంతా! ఎక్కడున్నావు?  ఒకసారి వస్తావూ” అంటూ భర్త  రామకృష్ణ   పిలిచిన పిలుపుకి వంటింట్లోనుండి హాలులోకి వచ్చింది..

    లేప్ టాప్ ముందు పెట్టుకుని  కీబోర్డుమీద టైప్ చేస్తూ,  “వచ్చావా ?  ఎల్లుండి బుధవారం నా స్నేహితుడు విశ్వమూర్తి  వస్తున్నాడు మనింటికి..  పదిరోజులు ఉంటాడుట..

    విశ్వం  గురించి నీకెప్పుడూ చెపుతూనే ఉంటాను కదా వసంతా..  ఆ మధ్య కాకినాడ లో  కాలేజ్ రీ యూనియన్ ఫంక్షన్ లో కలసినపుడు మన ఇంటికి  రమ్మని  ఆహ్వానించాను..  ‘వస్తానులేరా  రామం’ అన్నవాడు ఇప్పుడు వస్తున్నా”డంటూ ముఖంనిండా ఆనందం  పులుముకుంటూ భార్యతో పంచుకున్నాడు ఆ విషయాన్ని..

    రామకృష్ణ,  విశ్వమూర్తి కాకినాడలో పి..ఆర్ గవర్న్ మెంట్  కాలేజ్ లో బి..కామ్ చదువుతున్నరోజుల్లో   మంచి స్నేహితులు..

    విశ్వమూర్తి  బి..కామ్.. చదివిన తరువాత  అతని  తండ్రి   ఉద్యోగరీత్యా హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయితే మొత్తం కుటుంబం హైద్రాబాద్ కి వెళ్లిపోయారు..  అప్పట్లో  ఇద్దరూ   ఉత్తరాలు వ్రాసుకునేవారు కొంతకాలం..  ఆ తరువాత కాకినాడలోనే  తనకి బి..ఎస్..ఎన్.ఎల్  లో ఉద్యోగం రావడం, అదే   జిల్లాలో అటూ ఇటూ బదిలీలతో ఇద్దరిమధ్యా ఉత్తరాలు పూర్తిగా తగ్గిపోయాయి...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/GMF5vkpOZAM


    19 min
  • సంసారీ సుఖీ | Samsari Sukhi|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సంసారీ సుఖీ

    రచన: భాగవతుల భారతి

    మన ఆలోచనలకూ తగ్గట్టుగానే మనం పొందే ఫలితాలు ఉంటాయని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించారు.

    న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే

    భావేహి విద్యతే దేవో తస్మాత్‌ భావోహి కారణం

    "దేవుడు చెక్కలోనూ లేడు,రాతిలోనూ లేడు మట్టిలోనూ లేడు. మన భావనలోనే ఉన్నాడు... దేవుడు అనే మంచి భావనకు మనసే కారణం కాబట్టి... భావనలు  సక్రమంగా చేయండి. మంచి భావనలు మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈరోజు కి స్వస్తి... " అంటూ ప్రవచనం ముగించి లేచాడు … త్రిలోచన బ్రహ్మచారి.

    "నేను ఐ. ఎ. యస్ కి ప్రిపేర్ అవుతున్నాను. నన్ను ఆశీర్వదించండి అయ్యగారూ?! "అంటూ వచ్చిన ఆమెను తేరిపార చూసి 'విజయీభవ' అని ఆశీర్వదించాడు త్రిలోచన బ్రహ్మచారి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/TQ6tqAiReow



    9 min
  • కోరికలే గుర్రాలైతే | Korikale Gurralaithe | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కోరికలే గుర్రాలైతే

    రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

    ఇంటి ఇల్లాలి మితీమీరిన ధన వ్యామోహం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది.

    కానీ భర్త సంయమనం తో వ్యవహరించడంతో ఆ కుటుంబం గట్టెక్కింది.

    ప్రముఖ రచయిత్రి బి లక్ష్మి శర్మ గారి 'కోరికలే గుర్రాలైతే' కథలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    “అబ్బబ్బా… ఏమిటి పద్మా ఇది?  ఎప్పుడు చూసినా డబ్బుపిచ్చి తప్ప నీకింకో ఆలోచన రాదా? నేను బాగానే  సంపాదిస్తున్నాను  కదా! నువ్వు హాయిగా ఉంటూ పిల్లలను చూసుకో చాలు” అంటూ విసుక్కున్నాడు రఘుపతి, భార్య మీద.

    “అయ్యో రామ! ఇప్పుడు పిల్లలకు, మీకు ఏం తక్కువ చేస్తున్నాను? ఏదో  ఊరికే తిని కూర్చోవడం ఎందుకని..  నాకంటూ ఒక వ్యాపకం ఉండాలి కదా! ‘వేన్నీళ్ళకు

    చన్నీళ్ళు తోడ’న్నట్టు  నా చీరల ఖర్చులు, పిల్లల చిన్నచిన్న  సరదాలు వెళ్ళిపోతాయి కదాని ఆలోచిస్తున్నా” అంది పద్మ.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/PMm2iCFvijU


    17 min
  • భావుకతకు భాష్యం | Bhavukathaku Bhashyam | Telugu Short Story |Avadhanula Vijayalakshmi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    భావుకతకు భాష్యం

    రచన: అవధానుల విజయలక్ష్మి

    “మరో గంటలో పెద్ద వానొచ్చేటట్టుంది” దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశం వంక చూస్తూ అంది శ్రీమతి.

    “చాలా పెద్ద వాన పడితే బాగుంటుంది. దెబ్బతో వేడి తగ్గిపోతుంది” కిటికీలోంచి బయటకు చూస్తూ అన్నాను.

    “అవును డాడీ. వానొస్తే ఎంచక్కా డాబా మీద కెళ్ళి ‘వానా వానా వల్లప్పా’ తిరగొచ్చు… చిన్న చిన్న పడవలు చేసి నీళ్ళలో వదలొచ్చు” నాలుగో క్లాసు చదువుతున్న మా ఆఖరుది కళ్లు చక్రాల్లా తిప్పతూ అంది.

    “ఎహే! నీ కెప్పడూ ఆట గొడవేనే! నాకైతే పెద్ద వాన పడుతున్నపుడు ఎంచక్కా మంచం మీద దుప్పటి కప్పుకొని పడుక్కొని ఏ టార్జాన్ కామిక్కో చదువుకోవాలనుంటుంది.” చెల్లెలి చిన్నతనానికి జాలిపడుతూ అన్నాడు మా రెండోవాడు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/cYvd_m9j-_0

    6 min
  • నన్ను కాపాడండి... ప్లీజ్ | Nannu Kaapadandi Please | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నన్ను కాపాడండి... ప్లీజ్

    రచన : మల్లవరపు సీతారాం కుమార్


    నన్ను కాపాడండి... ప్లీజ్ !! అనే కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

    ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు ఈ కథను రచించారు.

    మొదటి నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ తో కథ నడుస్తుంది.

    కథ ముగిసాక ‘కేవలం సస్పెన్స్ మాత్రమే కాదు, చక్కటి సామాజిక స్పృహ కూడా ఈ కథలో ఉంది’ అనేది తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/n3nDm2azFpI


    13 min
  • బుడుగు సీగానపెసూనాంబ స్వగతం | Budugu Ceeganapesunamba Swagatham | Telugu Short Story |Avadhanula Vijayalakshmi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    బుడుగు/సీగానపెసూనాంబ స్వగతం....

    రచన: అవధానుల విజయలక్ష్మి

    అసలు నాకు ఒక్కటి అర్ధం కాదు... ఈ పెద్దోళ్లందరూ బాల్యం... బాల్యం అని ఎందుకంత కొట్టుకుపోతూ ఉంటారోనని....

    అప్పుడప్పుడు మళ్ళా ఆ బాల్యం తిరిగివస్తే బాగుంటుంది అంటారు... బంగారు బాల్యం అంటారు...

    నా మొహం ఈ పెద్దవాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు... మేమేమీ చిన్నవాళ్ళం చితక వాళ్ళం కాదు కదా మాకు అన్నీ తెలిసిపోతున్నాయి...

    అసలు బాల్యంలో జరిగినన్ని మోసాలు ఇంకెప్పుడూ జరగవు అంటాను నేను...

    అదిగో అక్కడ చూడండి.... మా అమ్మ తమ్ముడిని చంకలో పెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తోంది...

    "పిలు... చందమామని పిలు.... దాయ్ దాయ్ చంద మామా" అంటోంది...

    వాడికేమో పాపం జరుగుతున్న మోసం తెలియదు కదా అందుకే నోరుతెరుచుకొని చందమామని చూస్తూ "దాయ్ దాయ్" అంటున్నాడు...

    వాడి తెరిచిన నోట్లో అమ్మ గబుక్కున ఇంత ముద్ద పెట్టేసింది... ఎంత మోసం కదూ?... చందమామ ఎక్కడైనా దిగి వస్తాడా? మేమేమీ చిన్నవాళ్ళం చితకవాళ్ళం కాదుకదా... మా అక్కలూ అన్నలూ ఆ ఫోన్లో ఎవో... అవి చూసినప్పుడల్లా మేమూ పక్కన కూర్చునీ అన్నీ చూస్తాము కదా... చంద్రుడు ఎక్కడో దూరంగా ఉన్న ఫేధ్ధ బంతి అని మాకు తెలియదూ?

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/shapw6IQe1o



    4 min
  • అదృష్టానికి చిరునామా | adrushtaniki Chirunama | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    అదృష్టానికి చిరునామా

    రచన: యశోద పులుగుర్త

    నా ఫ్రెండ్ వైష్ణవి గురించి చెప్పాలి ముందు. అదీ నేనూ హైస్కూల్ నుండి డిగ్రీవరకూ ఒకే స్కూల్ , కాలేజ్ లో చదివాం.. దాని ఆశలూ, కోరికలకూ ఎల్లలు ఉండేవి కావు.. అప్పుడప్పుడు దాన్ని చూస్తూ అనుకునేదాన్ని, దీని కోరికలూ, ఆశలకూ తగ్గట్లుగా దేవుడు కలవారింట్లో పుట్టించవలసి ఉండేదని..

    అది మాత్రం నాతో అనేది, "భగవంతుడికి కూడా వలపక్షమేనే పల్లవీ , ఎందుకు కొందరిని అత్యంత ధనవంతుల ఇళ్లల్లో పుట్టిస్తాడు, నన్నుకూడా అక్కడే ఎందుకు పుట్టించలే"దంటుంది..

    "ఎవరైనా తన ముందు అత్యంత ఖరీదైన కార్లలో వెళ్లిపోతుంటే, " చూడు చూడు, ఆ కారులో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా" అదేనే ఐశ్వర్యపు అందం.. మనలాంటి వాళ్లం ఎంత అందంగా ఉన్నా కంటికి కనపడం.. ఆ అమ్మాయి అందంలో ఒక మెరుపు ఉంది, హోదా ఉంది, అ అందాన్నిమరింత మెరుగులు దిద్దకునే స్తోమత ఉంది.. అందుకనే ఆ అమ్మాయి అందరినీ ఆకర్షిస్తుందే అంటుంది.. కారులో వెడ్తున్న ప్రతీ అమ్మాయి బాగుంటుంది, కావాలంటే ఛాలంజ్" అంటుంది..

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/K0M0BSsEBzk

    12 min
  • కనువిప్పు | Kanuvippu |Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కనువిప్పు

    రచన: N. ధనలక్ష్మి

    మనకంటూ కుటుంబం రాగానే  మన పుట్టకకి కారణమైన తల్లిని, తండ్రిని మరిచిపోతున్నాము. మన వృత్తిలో ఎదుగుతూ ఆ ఎదుగుదలకు కారణమైన వారిని చిన్నచూపు చూస్తున్నాము. తల్లితండ్రులు మన నుండి ఆశించేది కాసంత ప్రేమ, గుప్పెడు మెతుకులు.

    తల్లి పట్ల నిర్లక్ష్యం చూపించిన కొడుకుకి  బుద్ది వచ్చేలా చేసిన ఓ చిన్నారి కథ.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/sUVYb3YT178


    9 min
  • ఆత్మ విశ్వాసము | Athma Viswasamu | Telugu Short Story | Dr Shahanaj Bathul | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఆత్మ విశ్వాసము 

    షహనాజ్ బతుల్

    "కాంతి నిన్ను సులోచన మేడం రమ్మన్నారు". అన్నది పూజిత వచ్చి.

    "ఎందుకు?" అడిగింది, కాంతి.

    "ఏమో తెలియదు."  అని చెప్పి, వెళ్ళిపోయింది.

    కాంతి హాస్టల్ ఆఫీస్ కి వెళ్ళింది.

    "కూర్చో కాంతి" అన్నారు సులోచన మేడం.

    "ఫర్వాలేదు మేడం. నన్ను పిలిచారట,"

    అడిగింది

    "నీ కూతుర్ని తెచ్చుకున్నావట.  ఇది వర్కింగ్ విమెన్స్ హాస్టల్. దీనిలో కి చిన్న పిల్లల్ని తెచ్చుకో కూడదు. మీ అమ్మాయిని పంపించినా సరే. లేక నువ్వు పాపతో వెళ్ళిపోయినా సరే."

    కాంతి కి గొంతుక లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. అబద్ధం చెప్పలేదు.

    "అలాగే మేడం రేపు గానీ, ఎల్లుండి గానీ వెళ్ళిపోతాను. ఉన్నఫళంగా వెళ్ళటం కష్టం", అన్నది.

    "సరే రేపు నేను నువ్వు ఎంత కట్టాలో కలిక్యులెట్ చేసి, చెప్తాను. కట్టేసి, వెళ్ళు."

    "మేడం నాకు జీతం మొదటి తారీకున అందుతుంది. ఇప్పుడు నా దగ్గర లేవు మేడం."

    "హాస్టల్లో ఎవరిదగ్గరైనా అప్పు తీసుకొని ఇవ్వు మొదటి తారీకున వాళ్ళ అకౌంట్ లో వేసేయ్యి."

    "వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా మేడం. సరే నేను ప్రయత్నం చేస్తాను."

    అని చెప్పి, రూం కి తిరిగి వచ్చింది....


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Bd_OjZzPqs8

    7 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world