
Sign up to save your podcasts
Or


(మనతెలుగుకథలు.కామ్ లో ఈ కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) : అమ్మంటే అమ్మే
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అమ్మ అంటే అమ్మే, పిల్లలకు ఎప్పుడు బాధ కలిగినా అక్కున చేర్చుకొని ఓదార్చేది అమ్మే. ఆమె అమృతవర్షిణిలా ఎంత వయసొచ్చినా తను చేయగలిగింది పిల్లలకు చేసిపెడ్తూనే వుంటుంది.
ఒక చిన్న పిల్లవాడు తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పే కథకు మూలం. త్యాగం అంటే అమ్మే గుర్తొస్తుంది. ఆమె చేసిన త్యాగమేంటో ఈ కథను చదివి తెలుసుకోండి....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/M4VHT1lF-ck
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
చెరపకురా చెడేవు
రచన : షహనాజ్ బతుల్
పవన్ కుమార్ పెయింటింగ్ లెక్చరర్.
చాలా మంచి పైంటింగ్స్ వేశాడు. చిత్రాల ప్రదర్శన లో కొన్ని సార్లు బహుమతులు వచ్చాయి.
చాలా పేదరికం నుండి వచ్చాడు. వివాహమైంది. ముగ్గురు
పిల్లలు. జీతం సరిగ్గా సరిపోతుంది.
పవన్ కుమార్ భార్య కల్యాణి, అనుకూలవతీ. భర్తకి అన్నీ పనులలో చేదువాదోడు గా ఉండేది.
10వ తరగతి వరకు చదివింది. ఇల్లాలు. పనిమనిషి లేకుండా ఇంటి పనులన్నీ శ్రద్ధ గా చేస్తుంది. ఎప్పుడూ నోరువిప్పి ఏది అడుగదు.
ఉన్న దానితోసర్డుకు పోయే, మనస్థత్వం.
భర్త పనులన్నీ సమయానికి చేస్తుంది.
కాలేజీలో ఒక రోజు ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ అందరిని
పిలిచి, మీటింగ్ పెట్టారు.
"మన దేశ ప్రధాని, హైదరాబాద్ కి వస్తున్నారు. పెయింటింగ్ ప్రదర్శన ఒకటిపెట్ట బోతున్నారు. ఆ ప్రదర్శనను, స్వయముగా ప్రధాన మంత్రి గారు సందర్శిస్తారు. బహుమతి ఎవరికివ్వా లో ఆయనే నిర్ణయిస్తారు. అంతే కాదు బహుమతులు ఆయనే ఇస్తారు.
పెయింటింగ్ లెక్చరర్స్ కాక వేరే లెక్చరర్స్ కూడా, మీలో ప్రతిభ ఉంటే ప్రదర్శన శాల లో పెట్టవచ్చు. బహుమతి కాకుండా అమ్మకానికి కూడా పెట్టవచ్చు...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/UGY5n85dY2U
మజిలీ
రచన: ఏ.అన్నపూర్ణ
''రాజేంద్రా.. రెండు రోజులుగా పార్క్ కి రాలేదు. కారణం ఏమిటి? అన్నాడు శంకరం, ఇద్దరూ పార్కులో వాకింగ్ పూర్తిచేసి కూర్చున్నాక.
''ఏమీలేదు హెల్త్ చెకప్ కోసం వెళ్ళాను. ఏడాదికి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయిన్చుకుంటాం- నేను, రేవతి . లేకపోతే లండన్ లో వున్న మా పిల్లలు ఊరుకోరు.''అన్నాడు రాజేంద్ర.
''అవన్నీ వృధా ఖర్చులు. డాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన డయాగ్నసిస్ సెంటర్లు కలిసి మనదగ్గిర చేసే నిలువు దోపిడీ.! ఐ కాంట్ బిలీవ్ ఇట్' 'అన్నాడు శంకర్.
''పోనేవోయి ... దూరంగా వుండే పిల్లల సంతృప్తి కోసం ఏమీ ప్రాబ్లమ్ లేదని అనిపించుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చు అంటూ వేరే ఏముంటుందిలే .....ఇదొక్కటే!” అన్నాడు రాజేంద్ర.
''ఈ వయసుకి ఏదో ఒక జబ్బురాకుండా ఎలావుంటాం? వంటింటి చిట్కాలు లేదా హోమియో పతీ పిల్స్.. వీటితో మానేజ్ చేసేస్తాను. మా పిల్లలు కూడా పోరుతారు. హెల్త్ చెకప్ చేయిన్చుకోమని.'' అన్నాడు శంకరం.
అంతలో హరిబాబు, కృష్ణమూర్తి కూడా వచ్చి జాయిన్ అయ్యారు.
వాళ్లిద్దరూ వేరే రూటులో వాక్ చేసి ఇంటికి వెళ్లేముందు కలుస్తారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/GPSuV_mEV9E
అభిమానం అనుమానంగా మారితే
రచన: కిడాల శివకృష్ణ
రాజేష్ కి పెళ్లి కుదిరింది. అతను సాఫ్టు వేర్ కంపెనీ లో పని చేస్తాడు, నెలకు యాభై వేల రూపాయల జీతం వస్తుంది. రాజేష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ప్రియ, ఆమె ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ప్రియకి పాతిక వేల రూపాయల జీతం వస్తుంది. పెళ్లి కుదిరిన తరువాత రెండు నెలల లోపే వారి వివాహం జరిగింది. ఇద్దరూ అనోన్యంగా వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు.
అయితే ప్రియకు డే టైం లో మాత్రమే వర్క్ ఉంటుంది....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/yvGpPzp1h_0
నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి!
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
సుబ్బరామయ్య కాలిలో దురద పెట్టిన పిల్లిలా హాల్లో అటూఇటూ తిరుగుతున్నాడు.
అతని సెల్ కుయ్యో కుయ్యో అంది. వెంటనే ఆన్ చేశాడు.
ఎవరండీ మీరు?'' అంటూ అడిగాడు.
''అన్నయ్యా నేను.. నీకు సొంత తమ్ముడిని.'' అన్నదో కంఠం.. అవతల నుండి.
'' సొంత తమ్ముడా... చింతపండా..నాకెవరూ తమ్ముడులు లేరు.. నీ పేరు.?..'' అడిగాడు సుబ్బరామయ్య.
'' నేనన్నయ్య నీ రక్తబంధం.. నీ తర్వాత పుట్టిన ప్రయోగాలరావుని.'' అన్నాడు అవతల వ్యక్తి.
''మా ప్రయోగాలరావా.. నువ్వు చచ్చిపోలేదా..? బ్రతికున్నావా? అసలు నువ్వు మనిషివా.. లేక.. దెయ్యానివా''?.. చిత్ర విచిత్రంగా అడిగాడు సుబ్బ రామయ్య.
''అప్పుడు నాకు ఐదేళ్ళు.. అన్నవరంలో మన కుటుంబం దగ్గరనుండి తప్పిపోయిన నేను తెలివి వచ్చి చూసేసరికి ఇతరదేశాల్లో ఉన్నాను.. చదువు సంధ్య అన్నీ అక్కడే. ఈ పాతికేళ్లలో బస్తాలు బస్తాలు డబ్బు సంపాదించాను. నీ అడ్రస్ తెలుసు కున్నాను.. ఇప్పుడు రాజమండ్రి లో ఉన్నాను.. ఒక గంటలో వచ్చేస్తున్నాను నీ దగ్గరికి.''.. అలా అనడం ప్రయోగాలరావు అన్నగారు దగ్గరకి వచ్చేయడం గంటలో జరిగిపోయాయి.
''పాతిక సంవత్సరాల తర్వాత ఇతరదేశాల నుంచి వస్తున్నాను కదా.. పైగా ముద్దుల తమ్ముడిని..
ఏమిటన్నయ్యా కాస్త స్వాగతం కూడా లేదు...'' రావడంతోనే గారాలు పడ్డాడు ప్రయోగాలరావు.. రోడ్డు అవతల నిలబడి
సుబ్బరామయ్య తెల్లమొహం వేసి ఇలా అన్నాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/6BlnAfxkJV8
మర మనిషి కథ
రచన: కిడాల శివకృష్ణ
మనుషుల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. కానీ మర మనుషుల గురించి కిడాల శివకృష్ణ గారు రచించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా బోర్ గా ఉంది. టైం పాస్ కావడం లేదు అందుకే కథల పుస్తకాల కోసం వెతకడం మొదలు పెట్టాను. చేతికి ఒక కథల పుస్తకం దొరికింది. వెంటనే విషయ సూచికను పరిశీలించాను. అందులో రొటీన్ గా ఉండే కథల పేర్లు మాత్రమే కనిపించాయి.
మరి కొన్ని పుస్తకాలు వెదికాను. ఈసారి మంచి కథల పుస్తకం దొరికింది.
పేజీలు తిప్పి చూస్తే ‘మర మనిషి’ అనే కథ కనిపించింది, అరే.. ఇదేదో కొత్తగా ఉందే అనుకుంటూ చదవడం మొదలు పెట్టాను.
నేను మరమనిషిని కాబట్టి నాకు చెప్పిన పనిని చేయడం మాత్రమే తెలుసు అని అనుకుంటున్నారా?? అస్సలు కాదు. నా అసలు పేరు హరి. నా జీవితం మొత్తం ప్రణాళిక ప్రకారం నడవాలి అన్నది నా లక్ష్యం. ఆ ప్రణాళిక వల్ల నేను మనిషిని కాస్తా మరమనిషి గా అయ్యాను. అయితే అదెలానో తెలుసుకుందాం రండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/nAqfNfzeJho
లోహితం
రచన: అల్లు సాయిరాం
సమయం రాత్రి ఏడున్నర కావస్తోంది. ఆగకుండ కురుస్తున్న వర్షంలో
తడిచిపోయి యింటికి వచ్చిన లోహిత్ బైక్ శబ్దానికి, వంటగదిలో వంట చేస్తున్నఈశ్వరి తువ్వాలు పట్టుకుని ఎదురుగా వచ్చింది. లోహిత్ బ్యాగ్ పక్కనబెట్టికూర్చుంటూ, ఎర్రగా ఉన్న ఈశ్వరి కళ్ళు చూసి "ఏమైందోయ్? ఉల్లిపాయలు కొస్తున్నావా? మిరపకాయలు కొరికావా?" అని నవ్వుతూ అడిగాడు.
ఈశ్వరి లోహిత్ తల తుడుస్తూ "ఆఁ ఉల్లిపాయలు, మిరపకాయలు! కుదిరితే మిమ్ముల్ని కుడా కొరికి తినేస్తా! కానీ, మీరు, మీ ముద్దుల కూతురు మాత్రం, నేను ప్రేమగా ఏది చేసినా తినరు! పైగా, అలా ఉంది, యిలా ఉందని వంకలు పెడతారు!" అని టేబుల్ మీదున్న కప్పులో సగం తిన్న సేమ్యా పాయసం చూస్తూ అంది.
తన తల తుడుస్తున్న ఈశ్వరిని ఆపి, సూటిగా చూస్తూ "ఏమైంది? లలితని ఏమైనా అన్నావా?" అని అడిగాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Nf9jIv35ikw
నాన్నమ్మ పంచాయితీ తీర్పు
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
కనకమ్మ వయసు డెబ్బైఐదు. మనిషి బలంగా ధృడంగా ఉంటుంది, కాస్త అద్దాలొచ్చాయి గాని. అన్ని ముచ్చట్లు తీరాయిగానీ ఓ కోరిక మాత్రం మిగిలి ఉంది. నడుముకు వడ్డాణం చేయించుకోవాలని బంగారంతో. తీరని కోరిక గా ఉండిపోయింది.
చిన్నప్పుడు అమ్మవారి ఫోటో చూసి అన్నీ నగలని చూసేసరికి బోలెడు ఆశ్చర్యపోయింది. ఆడవాళ్ళకు ఇన్ని నగలుంటాయా అని? తను పుట్టి పెరిగిన ఊళ్ళో బంగారు మంగళసూత్రాలు ఉండటమే మహా గొప్ప. ఇంక వడ్డాణం అన్న మరుక్షణం తిండికి గతిలేదు కానీ అంటూ వాళ్ళ నాన్నపెదవ్విరిచాడు. కూతురుని బాధపెట్టడం ఇష్టం లేక పంట అమ్మిన డబ్బులోంచి తీసి వెండి మువ్వల పట్టీలు చేయించాడు. అదే గొప్ప కానీ వడ్డాణం కోరిక తీరలేదు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/EGKNk3r6SVI
కోల్పోయిన స్వేచ్ఛ
కిడాల శివకృష్ణ
రవి సినిమాకి వెళ్ళి ప్రతి రోజూ లేటుగా రావడం అతని తండ్రి హరీష్ రావు గమనించాడు. ఈ విషయాన్ని తన భార్య అయిన శ్యామల దగ్గర చర్చకు తీసుకు వచ్చాడు.
“శ్యామలా! మన రవి ఈ మధ్య సినిమాలు ఎక్కువగా చూస్తున్నాడు. అంతే కాకుండా వాడు కొంత వరకు దురలవాట్లకు అలవాటు పడ్డాడేమో అనే భయం వేస్తుంది. అందుకే వాడికి మనం నచ్చ చెప్పి సినిమాలకి వెళ్లకుండా ఆపాలి” అన్నాడు హరీష్ రావు.
“నిజమేనండీ! వాడు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు” అంది శ్యామల.
“మనం ఏమైనా చేసి ఆపాలి. మరి ఏమి చేద్దాం అంటావు శ్యామలా?” అన్నాడు హరీష్ రావు.
“ముందు మనం మంచిగానే మాట్లాడి చెపుదాము” అంది శ్యామల.
“సరే” అన్నాడు హరీష్ రావు. రవి ఇంటికి వచ్చాడు. అప్పుడు టైం పదిన్నర అవుతోంది.
“ ఎందుకు రా లేట్ గా ఇంటికి వస్తున్నావు?” అంది శ్యామల.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/vMWk3j4zPMs
జీవితనౌక
రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)
రామాపురం పేరుకు తగ్గట్టుగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే పల్లెప్రాంతం.
ఆప్యాయతలకు అనురాగాలకు పుట్టినిల్లు. చిన్నలు పెద్దలు అందరూ ఒకరంటే ఒకరికి గౌరవం. “పెద్దలమాట చద్దన్నం మూట” అన్న నానుడిలాగా, పెద్దవాళ్లకు ఎదురుచెప్పడమనేదే
ఎరుగరు ఆ పల్లెప్రజలు. ఆడవాళ్ళంటే గౌరవం పిల్లలంటే ఆత్మీయత. అంతా ఒకే కుటుంబంలా ఉంటారు వాళ్ళంతా. ఎవరింట్లో కష్టం వచ్చిన తమకే వచ్చినంతగా బాధపడతారు. ఎవరింట్లో శుభకార్యం జరిగిన తమ ఇంట్లోనే జరుగుతున్నంత హడావుడి చేస్తారు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరి ఇలవేలుపు తండ్రి మాటజవదాటని శ్రీరామచంద్రుడే.
ఊరు చిన్నదే అయినా బస్సు సౌకర్యం ఉంది. పదవతరగతి వరకు బడిఉంది. చిన్న గ్రామపంచాయితి కూడా ఉంది. కానీ , ఎప్పుడు దాని అవసరం ఆ ఊరిలో ఎవరికి అవసరపడలేదు. ఎందుకంటే ఐకమత్యమే వారి బలం బలగం. అందుకే వాళ్ళలో ఎప్పుడు జగడాలు రాలేదు. ఆ ఊరి బడిలో కృష్ణమాచార్యులు అనే పేరుగల బడిపంతులున్నాడు.
అతనికి ఎంతసేపు ఎవరికైనా ఏమైన చిన్న చిన్న సమస్యలుంటే చక్కబరచడం. అందరికి నీతిపాఠాలు వల్లించడమే తెలుసుగానీ, ఎవరి దగ్గర చేయిచాచిన పాపానపోలేదు. అతనికి నలుగురు కొడుకులు . అనుకూలవతి అయిన భార్య కామాక్షమ్మ. పిల్లలందరిని అంతో ఇంతో చదివించి పెళ్ళిలు చేసి ఎవరి దారిన వాళ్ళను పంపించాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/vXR89MWo6R0
From the publisher's feed