Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • మనశ్శాంతి కరువాయే | Manassanthi Karuvaye | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    మనశ్శాంతి కరువాయే

    రచన: కిడాల శివకృష్ణ

    ఆఫీస్ నుంచి చిరాకుగా ఇంటికి వచ్చాడు కాంతయ్య.

    “రావే శారదా! ఇంత కాఫీ నా మొహాన కొట్టు” అన్నాడు నీరసంతో.

    “హా! వస్తున్నానండీ..” అంటూ, “ముందు మీరు వెళ్ళి ముఖం, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి. అంతలోపు తీసుకొస్తాను” అంది శారద.

    సరే అని బాత్ రూమ్ లోకి వెళ్లి శుభ్రం చేసుకొని వచ్చాడు కాంతయ్య.

    “ఇదిగో తీసుకోండి” అంటూ కాఫీ కప్పును చేతికందించింది శారద.

    “అబ్బా! ఒక్కటే టెన్సన్స్ శారదా ఆఫీసులో..” అన్నాడు కాంతయ్య.....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/_WuI2sTh-40


    4 min
  • దత్తత | Datthatha | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com

    దత్తత

    - బివిడి ప్రసాదరావు

    "రేపు సండేగా.. నాకు బయట పని ఉంది. నీ బైక్ కావాలి" అన్నాను.

    "సరే.. పెట్రోల్ మాత్రం కొట్టించుకో." చెప్పాడు కిరణ్.

    తర్వాత.. ఇద్దరం.. నేల మీద పక్కలు వేసుకున్నాం. పడుకున్నాం.

    కిరణ్.. నా ఆఫీస్మేట్.. రూమ్మేట్.

    ***

    ఇద్దరం కేంటిన్ నుండి బయటకి వచ్చాం.

    రూం వద్దకి చేరాం.

    నేను బైక్ దిగేక.. "నువ్వు రూంలోకి వెళ్లు.. నీ బైక్ తీసుకు వెళ్తా.. రాత్రి చెప్పాగా" చెప్పాను.

    "లంచ్ టైంకి వచ్చేస్తావా." అడిగాడు కిరణ్.

    "సాధ్యపడితే వచ్చేస్తా. లేటైతే ఫోన్ చేస్తా." చెప్పాను.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/UmpuPqntTHI


    11 min
  • హమ్మ నా అత్తో | Hamma Naa Attho|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    హమ్మ నా అత్తో

    రచన: భాగవతుల భారతి

    "నాలుగింట శని పాపి, సప్తమంలో రాహువూ కలహకారకుడు, గురువేమో నీచంలో పడ్డాడూ, నీచభంగ రాజయోగం అనుకోండి, ఎటునుండి చూసినా. అబ్బే ఏం బాగుండలేదండీ! "

    నాలుకబయటపెట్టి పెదవులు చప్పరిస్తూ, ఇంకా ఏవేవో చెబుతూనే, వాటికి తను తీసుకోవలసిన జాగ్రత్తలూ, మెలకువలూ ,చెప్పిందే చెప్పి ,దక్షిణ పుచ్చుకున్నారు ,కరటక శాస్త్రిగారు.

    పర్వత వర్ధనమ్మకి మాత్రం గుండెల్లో రైళ్ళు పరుగెత్తటం మెుదలయింది.

    ఎన్నేళ్ళ నుండో, పర్వత వర్ధనమ్మ కుటుంబానికి మంచీ చెడూ, ఆ శాస్త్రి గారే చెబుతారు.

    పిల్లలు అవన్నీ చాదస్తాలే! అని విసుక్కుంటూనే తల్లి మాట జవదాటక కాస్తో కూస్తో, ఆచరిస్తూనే ఉన్నారు.

    భర్త పోయాక ఇంకా ఎక్కువైంది పర్వత వర్ధనమ్మ లో , భయంతో కూడిన చాదస్థంతో కూడిన,

    జాగ్రత్తతో కూడిన, బాధ్యత తో కూడిన....అదో లాంటి భావం

    ఈకలుపీకేసిన కోడిలా, చీకేసిన తాటి టెంకలాముఖం పెట్టుకుని ,గబగబా ఇంటికొచ్చి,చెప్పులు  ఎడాపెడా విప్పేసి,

    "బామ్మా! హాండ్ వాష్ ,లెగ్ వాష్ చేసుకోలా పప్పి షేమ్ షేమ్" అని మనుమడు అంటున్నా పట్టించుకోకుండా మంచంమీద పడిపోయింది.పర్వత వర్ధనమ్మ .

    అత్తగారి వాలకం చూసిన కోడలు శాంత ఆమె గదివంకే మిఱ్ఱీ మిఱ్ఱీ చూస్తూ...

    ఏం మాట్లాడితే ఏం తంటానో అనుకంటూ అటూఇటూ తిరుగుతోంది.

    తల్లి ముఖం వేలాడేసుకుని ఉండటంచూసి "అమ్మా!  ఏమయిందీ "అడిగాడు శంకర్ .

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/qZbOJH5dszI


    5 min
  • మరణం ఒక్కటే శరణమా | Maranam Okkate Saranama | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    మరణం ఒక్కటే శరణమా

    రచన : కిడాల శివకృష్ణ

    “అవునూ.. మన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను పాస్ అయ్యాను, మరి మన ఫ్రెండ్స్ అందరూ పాస్ అయినట్లేనా” అన్నాడు కిరణ్.

    “అవును. అందరూ పాస్ అయ్యారు కానీ మనతో పాటు చదివిన నరేష్ గాడు మాత్రం పాస్ అవ్వలేదు రా కిరణ్” అన్నాడు గణేష్.

    అప్పుడు కిరణ్ “నరేష్ గాడు పదవతరగతి లో నెంబర్ వన్ కదరా! వాడెలా ఫెయిల్ అవుతాడు రా గణేష్?” అన్నాడు .

    అప్పుడు గణేష్ “నిజమే! అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాలేదురా కిరణ్” అన్నాడు.

    “ఏమైంది వాడికి?” అన్నాడు కిరణ్.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/DjwRp6UMt2Q

    4 min
  • ఆవకాయ ప్రసవం | Avakaya Prasavam | Telugu Short Stories | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    ఆవకాయ ప్రసవం

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    ప్రసవానికి ఎంత కష్టపడాలో ఆవకాయ పెట్టడానికి కూడా అంత కష్టపడాలి. మరి ఆ ఆవకాయ తయారీలో ఓ కిలో హాస్యాన్ని కూడా కలిపి ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన ఈ  కథను చదవండి.

    “ఏమండోయ్! తెల్లారితే చాలు.. ఆ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళిపోతారు. వీళ్ళ మీదా, వాళ్ళ మీదా మాట్లాడు కోవడమే గానీ, ఉపయోగపడే విషయం ఒక్కటి వుండదు మీ అన్నదమ్ములకి. ఒకసారి క్రిందకి దిగి బజార్ వెళ్ళి, మామిడికాయలు కొని, ఆవకాయ ముక్కలు కొట్టించుకుని రండి” అని అరుస్తోంది సుబ్బారావు భార్య రమణి.

    "వదిన పిలుస్తున్నట్టు వుంది, వెళ్ళు. తరువాత మాట్లాడుకుందాం," అని అటునుంచి తమ్ముడు అనగానే, ఈ అరుపులు అన్నీ తమ్ముడు వినేసాడు అని అవమానం అనిపించింది.....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/OLGRNiStcuA

    9 min
  • తమలపాకుతో తానిట్టంటే | Telugu Short Stories | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    తమలపాకుతో తానిట్టంటే

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    అన్యోన్యంగా ఉన్న భార్యా భర్తల మధ్య అత్తగారి మాటల వల్ల మనస్పర్థలు వచ్చాయి.

    కానీ అల్లుడి చాకచక్యం వల్ల అత్తగారి కళ్ళు తెరుచుకున్నాయి.

    సరదాగా సాగే ఈ కుటుంబ కథను మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

    14 min
  • పుటం పెట్టబడ్డ హృదయాలు | Putam Pettabadda Hrudayalu | Telugu short Stories | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    పుటం పెట్టబడ్డ హృదయాలు

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    బంగారాన్ని వేడిచేసి, కరిగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియనే పుటం పెట్టడం అంటారు. పుటం పెట్టబడ్డ బంగారం, స్వచ్ఛంగా తయారవుతుంది. అలాగే మనసుకు మలినం అంటి, పెద్దలను దూరం చేసుకున్న హృదయాలు వేదన చెంది, తిరిగి స్వచ్ఛంగా మారిన కథను హృదయానికి హత్తుకునేలా రచించారు ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    ఇక కథ ప్రారంభిద్దాం...

    ' ఆనందమయం వృద్ధాశ్రమo ''. . . పైన నేమ్ బోర్డు చూసి ఆ వృద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. . రామ చంద్రం, సీతామాలక్ష్మి. . . అది కాకినాడకు అటు పక్క, దూరం గా ఉన్న ప్రశాంతి నగర్.

    హరిహరమహదేవయ్య అన్నపూర్ణమ్మ అనే వృద్ధ జంట 4 నెలలక్రితం ఈ అనాధఆశ్రమంలోజాయిన్ అయ్యారని వాళ్ళను ఒకసారి చూపిస్తే మాట్లాడి వెళ్ళిపోతామని ఆ ఇద్దరూ అడిగారు ఆఫీసు నిర్వహకుడు ముత్యాలరావు ని.

    అతను రిజిస్టర్ చూసి వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నా రని. . ‘వాళ్లకు మీరు ఏమి అవుతారు?’. . అని అడిగాడు.

    రామచంద్రం తడబడి. . “వాళ్ళిద్దరూ కొంచెం తెలుసు, దూరపు బంధువులు. . ” అని చెప్పాడు.....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/TXjW3NRXo4Q


    18 min
  • సీతాకోక చిలుక | Seethakoka Chiluka | Telugu Short Story | Lanka Sankara Narayana | manatelugukathalu.com

    సీతాకోక చిలుక

    రచన: లంకా శంకర నారాయణ

    రెండు వారాలు టూర్ వెళ్ళి ఆరోజు ఉదయమే ఇంటికి వచ్చాను.  మా దూరపు బంధువు ఇంట్లో నామకరణం కార్యక్రమం ఉందని, భోజనానికి పిలిచారని మా ఆవిడ నాతో చెప్పింది.

    ఉదయం గం.10  కి నేను మా ఆవిడ బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నామకరణం చెయ్యవలసిన మా బంధువు, ఆయన భార్య చాలా భాధపడుతున్నట్లు  నాకనిపించింది.

    అదే విషయం మా బంధువు ని అడిగాను....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/VBQ5U1wZ9OA

    5 min
  • గృహలక్ష్మి | Gruhalakshmi | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com

    గృహలక్ష్మి

    రచన: మద్దూరి బిందుమాధవి

    ఉద్యోగ రీత్యా అస్సాంలో ఉంటున్న గిరీష్ అమ్మా నాన్నాలని చూసి వెళదామని వచ్చి, అమ్మ ఇంట్లో లేదని తెలిసి ఆశ్చర్య పోయాడు.

    'అమ్మ దగ్గరకి వెళ్ళాలి. ఈ వయసులో అమ్మ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది, ఏ పరిస్థితులు ఆవిడని ఆ వైపు నడిపించాయ్?'

    వైవాహిక జీవితాన్ని గురించి, కుటుంబంలో బంధాల గురించి అంత స్పష్టంగా, లోతుగా ఆలోచించే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం అనిపించింది గిరీష్ కి. కానీ కారణం చాలా బలమైనదే అయ్యుంటుంది అనుకున్నాడు.

    'అంత ముఖ్య విషయం తనకెందుకు తెలియలేదు? కావాలనే అమ్మ చెప్పలేదా? ఏమో బుర్ర వేడెక్కి పోతున్నది. అమ్మని కలిస్తే తప్ప వివరాలు తెలియవు' అని మనసులో మధన పడుతున్నాడు గిరీష్.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/5OQKHG3Kk3I

    13 min
  • వెట్టిచాకిరి బ్రతుకులు | Vetti Chakiri Brathukulu | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

    వెట్టిచాకిరి బ్రతుకులు

    రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)

    భానుడు నులివెచ్చని తన కిరణాలను పుడమి తల్లి నుదుట ప్రసరింప చేస్తున్నాడు. పల్లె ప్రజలంతా ఆపాటికే లేచారు. ఆడవాళ్ళంతా ఇంటి ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెడుతున్నారు. మగవాళ్ళందరు చెంబులో నీళ్ళు తీసుకొని బహిర్భూమికి వెళుతున్నారు.

    రమణయ్య ఆ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన మాటంటే ఆఊరి వాళ్ళకు వేదవాక్కు. ఆయన చెప్పిందే జరగాలి. ఎవరూ ఎదురు మాట్లాడలేరు. ఆయన దగ్గర పని చెయ్యాలంటే భయభక్తులతో ఉండాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఊరుకునే మనిషి కాదు. రంగడు బుద్ది తెలిసిన నాటినుండి ఆయన దగ్గరనే పనిచేస్తున్నాడు. రంగడి తాతల నాటినుండి వస్తున్న ఆనవాయితీ. రంగడే కాదు, ఆయన మనవళ్లు చేసినా, తీరవు వాళ్ళ బాకీలు. వెట్టి చాకిరి బ్రతుకులు.. పైసా ఆదాయము ఉండదు. గడియ తీరదు. రంగడి భార్యకు ఇది ఎలాగైనా వదిలించుకోవాలని ఉంది.....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/vxPLTrRRSRw

    14 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world