Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

    మాతృదేవోభవ

    రచన: నీరజ హరి ప్రభల

    మాతృదినోత్సవము"  అంటూ  ప్రత్యేకంగా  ఈ ఒక్క రోజు  మాత్రమే  కాదు.  ప్రతి రోజూ మనం  చేసుకుంటూ   తల్లిని  పూజించాలి. పూజించకపోయినా  ఫరవాలేదు.  ఆమెనీ, ఆమె  మనసుని  నొప్పించకుండా  ప్రేమానురాగాలను  అందిస్తూ  కడదాకా  కంటికిరెప్పలా  చూసుకుంటే  అంతకన్నా  అమ్మకు  ఇంకేం  కావాలి ?

    దేవతే  మరో రూపంలో  అమ్మగా  మనకు దర్శనమిస్తున్నది. దేవుడు  తనకు మారుగా  అమ్మను   సృష్టించాడు.

    కనిపించే, కని  పెంచే  ప్రత్యక్ష దైవం  అమ్మ. అనిర్వచనీయమైన  రూపం అమ్మ.

    "అమ్మ"   అన్నది  అమృతము.

    అమ్మతనము  లోనే  ఉంది ఆ  కమ్మదనము. అప్పుడే  స్త్రీ  జన్మకు   పరిపూర్ణత  సిధ్ధిస్తుంది.

    అమ్మను  గురించి   ఏం చెప్పగలము ?  ఎంత  చెప్పినా  తక్కువే. అసలు  చెప్పనలవికాదు. అది  అనంతం.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వ్యాసాన్ని యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/8v1LxY6yJ48

    6 min
  • నాతి చరామి | Nathi Charami | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

    నాతి చరామి

    రచన: సీత మండలీక

    “చక్రీ, నిన్న నా స్నేహితురాలు సునంద హైద్రాబాద్ నుండిఫోన్ చేసింది. కాలేజీ స్నేహితులందరూ హైద్రాబాద్ లో కలుద్దామని ప్రపోజ్  చేసింది.. వెళ్ల మంటారా?

    "అలా అడుగుతావేమిటి గాయత్రీ. నువ్వు తప్పకుండా వెళ్ళు. ఎన్నాళ్ళు ప్రోగ్రాం వేసుకున్నారు డియర్?"

    "అంతా వారం. హైద్రాబాద్ లో నాలుగు రోజులు గడిపేక శ్రీ శైలం వెళ్తాం. అక్కడ నించి తిరిగి వచ్చేక ఒక రోజు హైద్రాబాద్ లో బడలిక తీర్చుకుని తిరిగి వచ్చేస్తాను".

    "హాయి గా తిరిగి రా గాయత్రీ. అన్ని చోట్ల ఫోటో లు తీసుకుని వెంటనే నాకు పంపించాలి. స్నేహితులతో పడి మర్చిపోకు"

    "ఎలా  మర్చిపోతాను చక్రీ. అయినా మీరు కూడా రావచ్చు కదా"

    "నేను రాను గాయత్రీ. నువ్వు వచ్చేక మనం ఊటీ వెళదాం"

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Bqa1Cuh_4uk

    8 min
  • రిటైర్ మెంట్ | Retirement | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

    రిటైర్ మెంట్

    B,లక్ష్మీశర్మ త్రిగుళ్ళ

    “ఏమండి…  కాఫీ చల్లారిపోతుంది ఏమిటాలోచిస్తున్నారు? ముందు కాఫీ తాగండి ఎంతసేపయింది మీకు కాఫీ ఇచ్చి. మర్చిపోయారా! ఏమిటో అంత పరధ్యానం” అంటూ తను ప్రక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ.

    “అరే, మర్చిపోయాను” అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని తాగుతూ, “అన్నపూర్ణ… నీతో కొన్ని విషయాలు చెప్పాలి. విన్న తరువాత నన్ను అపార్థం చేసుకోవు కదా” అడిగాడు సాంబమూర్తి.

    “ఏమండి… మీరు నన్నర్ధం చేసుకున్నది ఇంతేనా! ఇన్నాళ్ళ మన కాపురంలో నేనెప్పుడైనా మిమ్మల్ని తప్పుపట్టాన చెప్పండి? అయినా… అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు, తరువాత బాధపడడం ఎందుకు చెప్పండి, ” అంది అన్నపూర్ణ.

    “అదికాదు పూర్ణా!…నిన్ను పెళ్ళి చేసుకున్ననాటి నుండి, నీతో ప్రేమగా మాట్లాడిందిగానీ, నిన్ను ఆప్యాయంగా చూసిందిగానీ లేదు. అయినా నువ్వు నిండుకుండలా అన్నింటికీ భూమాతలా సహనం వహించావు. ఏనాడూ నన్ను నిలదీసి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది లేదు. నీలాంటి ఉత్తమురాలి మనసు బాధపెట్టానేగానీ, నిన్ను అర్థంచేసుకుని నీకు బాసటగా నిలబడలేకపోయాను. పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణా! నువ్వు నన్నడిగిన చిన్న కోరిక ఇప్పటివరకు తీర్చలేకపోయాను. అందుకే నీ క్షమాపణ పొందాలని వుంది” అన్నాడు సాంబమూర్తి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Qd6sEFEc38g

    19 min
  • కర్తవ్యం | Karthavyam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

    కర్తవ్యం

    రచన: శ్రీనివాసరావు జీడిగుంట

    శేఖర్, మూర్తి.. యిద్దరూ  ప్రాణ స్నేహితులు. యిద్దరూ మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. రోజూ యిద్దరూ కలిసి పార్క్ కి వెళ్లి నడుస్తూ పిచ్చా, పాటి మాట్లాడుకోవడం అలవాటు.

    ఒక రోజు సాయంత్రం పార్కులో నడుస్తో సడన్ గా మూర్తి, శేఖర్ ని అడిగాడు, “శేఖర్! మీ వూరి వాడు కృష్ణారావు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు రా? అతను వాళ్ళ కులం వాళ్ళకి తప్పా ఎవరికి తన కంపెనీలలో ఉద్యోగం ఇవ్వడుట, అటువంటి అతనిలో ఏమి గొప్ప వుందో తెలియటం లేదు, యింత పేరు రావడానికి” అన్నాడు మూర్తి.

    వేగంగా నడుస్తున్న శేఖర్ ఒక్కసారిగా ఆగి, “పద, ఆ బెంచీమీద కూర్చొని మాట్లాడుకుందాం” అంటూ బెంచీ వైపు కి నడిచాడు.

    “చూడు మూర్తి! ప్రతీ వ్వక్తిలో ఏదో ఒక సుగుణం వుంటుంది. అది ఒక్కొక్క మనిషి లో వేగంగా పనిచేసి ఆ వ్వక్తి ని మంచి స్టేజి కి తీసుకొని వెళ్తుంది. అది తెలుసుకోకుండా అతను అంత గొప్ప స్థితి కి ఎలా వెళ్ళాడు, మనం యిలాగే ఎందుకు వున్నాము అని బాధపడుతో వుంటాము. నువ్వు అడిగిన ఆ కృష్ణారావు గారు గురించి నాకు తెలిసిన నిజం చెపుతాను విను” అని చెప్పడం మొదలుపెట్టాడు శేఖర్.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/sr6Resb9ysg

    7 min
  • కోడలు అయినా కూతురే | Kodalu Ayina Kuthure | Telugu Short Stories | Kidala Sivakrishna | manatelugukathalu.com

    కోడలు అయినా కూతురే

    రచన: కిడాల శివకృష్ణ

    అంగరంగ వైభవంగా పెళ్లి మండపాన వివాహం జరిగింది. సంధ్య అత్తగారి ఇంట్లో మొదటి సారిగా కుడి కాలు పెట్టి దీపం వెలిగించింది. లెక్కలేనంత సంతోషంతో, చిగురిస్తున్న ఆశలతో మెట్టినింట జీవితాన్ని గడపసాగింది సంధ్య. కాలం గడుస్తుంది. ఇంట్లో నచ్చని సంఘటనలు ఎదురవుతున్నాయి. చిన్నగా గొడవలు జరుగుతున్నాయి, ఒకరోజు సంధ్య తన భర్త మీద గొడవపడుతుంది.

    మధ్యలో అత్తామామలు “ఎందుకు గొడవ పడతారులేమ్మా! సంసారం అన్న తరువాత కొన్ని సందర్బాలలో గొడవలు జరుగుతుంటాయి. మామూలే. సర్దుకు పోవాలి” అన్నారు.

    “మా గొడవలకు అసలు కారణమేమిటో తెలుసా మీకు?” అంది సంధ్య.

    “కారణమేమిటి సంద్యా?” అన్నారు అత్తామామలు.

    “ మీరే!” అంది కోపంతో సంధ్య.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/htpIVLeowXk

    3 min
  • కూతురు దిద్దిన కాపురం | Kuthuru Diddina Kapuram | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com

    కూతురు దిద్దిన కాపురం

    రచన: వెంకు సనాతని

    తండ్రి ఇల్లు అమ్మబోతున్నాడన్న వార్త తెలిసిన వెంటనే భర్తకు ఓ మాట చెప్పి, వెంటనే బస్సు టికెట్ బుక్ చేయించి మరీ హుటాహుటిన ఊరికి బయలుదేరింది శ్యామల.

    "నాన్నా.. నేను విన్నది నిజమేనా..!!" గుమ్మంలోకి అడుగు పెడుతూనే అంటుంది శ్యామల.

    "అమ్మా..! శ్యామలా..!!" ఇదేనా రావటం. అక్కడ అంతా బాగానే ఉంది కదా అన్నాడు శేషయ్య, కూతురి ఆకస్మిక ఆగమనంతో..

    నాన్నా అవన్నీ తర్వాత “ఇల్లు అమ్మకానికి పెట్టారట నిజమేనా..!!” గొంతు కాస్త పెద్దది చేసి అడుగుతుంది శ్యామల. "అమ్మా.. ఇప్పుడేగా వచ్చావు. కొంచెం నెమ్మదించు." అంటూ పక్కనే బల్ల మీద ఉన్న నీళ్ళ గ్లాసు చేతికి అందించాడు. ఆబగా మంచినీళ్ళు అందుకుని తాగడంతో  కొంత ఉపశమనం కలుగుతుంది శ్యామలకి.

    ఉరుకుల పరుగులతో హడావుడిగా, హఠాత్తుగా రావడానికి గల కారణం. మళ్ళీ ఇల్లు అమ్ముతున్నారని విన్నాను. “ఎందుకు నాన్నా? ఇప్పుడేం అంత కష్టం వచ్చింది? ఉన్న ఈ గూడు కూడా లేకపోతే ఎలా?” చెప్పుకుంటూ పోతుంది శ్యామల. ఆ ప్రశ్నల పరంపరకు జవాబు చెప్పలేక మాటలకందని బాధను లోపలకు దిగమింగుకుంటూ మౌనంగానే ఉండిపోయాడు శేషయ్య.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Ia2wiu3hM6E

    9 min
  • కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయా | Kodukulandu Utthama Kodukulu Veraya | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయా

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    సుందరయ్య , కుక్కుటేశ్వరరావు చిరకాలమిత్రులు. గుడిలో దైవదర్శనం చేసుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

    '' అందుచేత నే చెప్పేదేమిటంటే సుందరయ్యా...   పురాణాల్లో ఎవరో కుర్రోడు తల్లిదండ్రులను కావడిలో పెట్టి మోసాడని ఇప్పుడూ అలాంటి వాళ్ళు ఉంటారు అని నువ్వు కలగనడం , ఆశ పడటం నీ అమాయకత్వం అవుతుంది. మరో విషయం చెప్పనా?  ఆ మధ్య తల్లిని గంపలో పెట్టి, కావడి  మోస్తూ తీర్థయాత్రలు తిప్పుతున్న యువకుడి ఫోటో చూశాం పేపర్లలో... ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో అలాంటి వారు ఒక్కరే ఉంటారయ్యా బాబు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/mv19OxRmVIY

    14 min
  • ఎవరు బాధ్యులు | Evaru Badhyulu | Telugu Short story | A annapurna | manatelugukathalu.com

    ఎవరు బాధ్యులు?

    రచన: ఏ. అన్నపూర్ణ

    మూడేళ్ళుగా ఎవరూ బంధువులను కలవలేదు.

    'మా ఇంటికి మీరు రావద్దు. మీఇంటికి మేము రాము.' అని నిర్మొహమాటంగా చెప్పేసేరు. బంధుత్వాలు కట్ . ఫ్రెండ్షిప్ ఫట్.

    తీరిక వుంటే గుర్తువస్తే ఫోనులో పలకరించడం, లేకుంటే లేదు. అసలు ఫోనుకాల్ వస్తే, 'ఏ చెడు వార్త వినాలో' అని భయపడిన రోజులుగా గడిచాయి. ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చి కలుసుకోవడం మొదలు పెట్టారు జనం.

    చాలాకాలంగా అమెరికాలో ఉంటున్న సూర్యచంద్ర తాతగారి ఆస్తిని అమ్మి డబ్బు చేసుకుని పోదామని ఇండియా వచ్చాడు. అదే సమయానికి రాజమండ్రిలో తమ్ముడి కొడుకు పెళ్లి వుంది. ఆ చుట్టుపక్కల వున్న స్నేహితులను కల్సు కోవాలని, కలిసి వచ్చేలా టాక్సీ మాటాడుకుని వెళ్ళాడు.

    హరికృష్ణకు ఫోనుచేసి "వూళ్ళో ఉన్నావా? మీ ఇంటికి రావచ్చా.." అని అడిగాడు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/LKQOcHem0uo


    7 min
  • బతికుంటే | Bathikunte | Telugu Short story | Madduri Biindumadhavi | manatelugukathalu.com
    బతికుంటే

    రచన: ఎం బిందుమాధవి

    పింకీ కి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. డాక్టర్ రావటం ఆలస్యం అయిందని మృదుల కంగారు పడుతున్నది.

    మరొక కేసులో ఉన్నారని, వచ్చేస్తారని మృదులకి నచ్చచెబుతున్నది నర్స్.

    డాక్టర్ శాంత వచ్చి పింకీని వెంటనే లేబర్ రూంకి తరలించి, డెలివరీ చెయ్యటానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది.

    పింకీ తను ఉద్యోగం చేసే చోట బెంగళూరులో రెగ్యులర్ గా చూపించుకునే డాక్టర్ ప్రియంవద తన ఫ్రెండ్ శాంత హైదరాబాద్లో ఉంటుందని, కంగారు పడక్కరలేదని, అక్కడికి వెళ్ళమని చెప్పింది. ఆవిడ హస్తవాసి చాలా మంచిదని కూడా చెప్పింది.

    అందుకే తమ ఇంటికి కొంచెం దూరమైనా ఇక్కడికే వచ్చారు మృదుల, పింకీ.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/leZK9F9og1A

    12 min
  • ప్రగతి | Pragathi | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

    ప్రగతి

    రచన: సీత మండలీక

    "ఒరేయ్ రాములూ ఎంత సేపు తొంగుంటావురా. చాయి తాగి, సెత్తేరడానికి

    పోరా. ఇయ్యేల నేను పోలేను. చిన్నోడికి రేత్రినించి చాలా జోరంగున్నాది" అన్న తల్లితో “బాగా

    నిద్దరగా  ఉందే!  తొంగో నియ్యవే" అని జవాబిచ్చేడు రాములు.

    " ఒరేయ్.. అలా అనకురా! ఇయ్యాల మరో రెండీదుల నించి కూడా సెత్తేరుకుని రారా.

    ఇంట్లో తిండానికేమీ లేవు. నువ్వు డబ్బులు తెస్తే పప్పూ సారూ సేస్తాను.

    "అమ్మా! నువ్వు రోజూ అలాగే  అంటావు కానీ గంజన్నమే ఎడతావు” అని మెల్లిగా

    లేచేడు రాములు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/j8tf-ZZ9wmo

    11 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world