Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • వెంటాడే నీడ ఎపిసోడ్ 4 | Ventade Nida Episode 4 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ - ఎపిసోడ్ 4

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో ....

    తన  మీదకు దూకిన వింత ఆకారాన్ని గునపంతో పొడుస్తాడు సుమంత్. సహాయం కోసం తన స్నేహితుడు విశాల్ కు కాల్ చేస్తాడు. ఆ ఫోన్ ఆశ్చర్యంగా కింద పడివున్న ఆ ఆకారం దగ్గర నుండి రింగ్ అవుతుంది.. దగ్గరకు వెళ్లిన అతని మీదకు ఆ ఆకారం దూకుతుంది.

    అతను కళ్ళు తెరిచేటప్పటికి పక్కన విశాల్ ఉంటాడు. జరిగినదంతా కల అని చెబుతాడు.ఇద్దరూ బైక్ లో బయలుదేరుతారు.ముందుకు పడుతున్న నీడలో తన వెనక వున్నది ఆ వికృతాకారమని గమనిస్తాడు సుమంత్. అదుపు తప్పి క్రింద పడిపోతాడు.

    ఇక చదవండి...

    మధ్యాహ్నం భోజనం చేస్తూ "అమ్మాయి శ్రేయ  డెలివరీ డేట్ చెప్పారన్నావు. వచ్చేవారమే కదూ!" భార్య సావిత్రితో అన్నాడు డాక్టర్ శ్యామలరావు.

    "అవునండీ! మొదటి డెలివరీ ఇక్కడే విజయవాడలోనే, మన హాస్పిటల్ లోనే చేసాము. హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఈసారి తమ దగ్గరే హైదరాబాద్ లో చేస్తామన్నారు వియ్యంకులు. అన్నారని మరీ దూరపు చుట్టాల్లా డెలివరీ రోజుకు వెళితే బాగుండదు. అలాగని ముందుగా వెళదామంటే మనకు  హాస్పిటల్లో తీరిక దొరకదు. " అంది సావిత్రి. ఆమె కూడా ఒక డాక్టర్.

    "ఒక పని చేద్దాం. నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్ళు. మన హాస్పిటల్ సంగతి  నేను చూసుకుంటాను. డెలివరీ డేట్ కు  అక్కడికి వస్తాను. " అన్నాడు శ్యామలరావు.

    సరేనంది సావిత్రి.

    "సిటీ లో మంచి పేరున్న గైనకాలజిస్ట్ వి నువ్వు. మన హాస్పిటల్ కి వచ్చే పేషేంట్ లలో తొంభై శాతం నీకోసమే వస్తారు. కాబట్టి నేను వెళ్లడమే కరెక్ట్. కానీ నువ్వు వెళితే అక్కడ కాస్త సాయంగా ఉంటుంది.  నేనువెళ్లీ పెద్ద ఉపయోగం ఉండదు, పని పెంచడం తప్ప " మళ్ళీ తనే అన్నాడు శ్యామలరావు.

    పూర్తి కథ manatelugukathalu.com ( ఎప్పటికీ పూర్తిగా ఉచితం) లో చదవండి.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/my-fHDO4NW4


    16 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 3 | Ventade Nida Episode 3 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    వెంటాడే నీడ ఎపిసోడ్ 3

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    (రెండవ  ఎపిసోడ్ లో  సుమంత్ పై దాడి చేసిన ఆకారం అతను కొట్టిన రాతి దెబ్బకు కింద పడిపోతుంది. అతను ఆ వికృత ఆకారాన్ని గుంట తవ్వి పూడ్చి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఒక్కడే ఆ పని చేయలేక పోయాడు. సహాయం కోసం తన ఫ్రెండ్ విశాల్ కు కాల్ చేశాడు.

    విశాల్  ఫోన్, వింత ఆకారం దగ్గరే  మ్రోగుతుండటంతో ఆశ్చర్యపోయాడు.

    ఇక మూడవ భాగం చదవండి.)

    ఏం జరిగిందో అర్థం కాలేదు సుమంత్ కి.

    విశాల్ ఫోన్ ఈ ఆకారం దగ్గర ఉండటం ఏమిటి?

    అంటే...

    అంటే అతనికేమైనా హాని జరిగిందా ?

    అతన్ని చంపేసి ఈ ఆకారం తననూ చంపటానికి వచ్చిందా?

    ఆ ఊహే భరించలేకపోయాడు సుమంత్.

    ఆవేశంతో గునపం తీసుకొని ఆ ఆకారాన్ని మళ్ళీ పొడవటానికి వెళ్ళాడు.

    ఆ ఆకారం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది.

    తనను సమీపిస్తున్న సుమంత్ ను కాలితో బలంగా తన్నింది.

    వెల్లకిలా పడ్డ సుమంత్ పైకి దూకి అతని గుండెల మీద కూర్చుంది.

    తన రెండు చేతులూ అతని మెడ చుట్టూ బిగిస్తోంది.

    ఊపిరి ఆడటం లేదు సుమంత్ కి.

    భయంతో, బాధతో గింజుకుంటున్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి.

    "సుమంత్! ఏమైంది నీకు?" అన్న మాటలు వినిపించి కళ్ళు తెరిచాడు.

    ఎదురుగా విశాల్!

    నమ్మలేకపోయాడు సుమంత్.

    ఒకసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసాడు.

    సందేహం లేదు. విశాల్ తన పక్కనే ఉన్నాడు.

    " ఏమైంది సుమంత్? ఎందుకు నా చేతులతో నీ మెడని బిగించుకోవాలని ప్రయతిస్తున్నావు ?

    బిగ్గరగా కేకలు పెడుతున్నావు... ఒళ్ళంతా రక్కుకుంటున్నావు.. ఏం జరిగింది? నేను నీ పక్కనే ఉన్నాను" సుమంత్ ను గట్టిగా కుదుపుతూ అడిగాడు విశాల్.

    నెమ్మదిగా లేచి కూర్చున్నాడు సుమంత్.

    ఒకసారి చుట్టూ చూసాడు.

    ఇంకా చీకటి పడలేదసలు.

    మరి తనకు వచ్చిందంతా కలా?

    అతని అవస్థ చూసిన విశాల్ ప్రేమగా తల మీద  నిమిరాడు.

    విశాల్ ను గట్టిగా కౌగలించుకొని భోరున ఏడ్చేశాడు సుమంత్.

    "విశాల్! ఇది కలంటే నమ్మలేక పోతున్నాను...


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/CPz1dzd9xTg


    13 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 2 | Ventade Nida Episode 2 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 2

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    (ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక వింత ఆకారం సుమంత్ మీద దాడి చేస్తుంది. చేతికి దొరికిన రాయితో దాన్ని గాయపరుస్తాడతను. ఆ ఆకారం అతన్ని గట్టిగా నెట్టేస్తుంది. ఆ విసురుకు దూరంగా పడిపోతాడు సుమంత్....ఇక చదవండి)

    ఎముకలన్నీ విరిగినట్లైంది సుమంత్ కి.

    ఐనా శక్తిని కూడదీసుకుని పైకి లేచాడు.

    ఆ ఆకారం తిరిగి అతని మీదకు దూకాలని ప్రయత్నించింది.

    కానీ సుమంత్ ఇందాక రాయితో కొట్టిన  దెబ్బకు దాని తలనుండి రక్తం ధారగా కారుతుండడంతో నేలమీద కూలబడి పోయింది.

    ఇదే సరైన అదను.

    చుట్టూ చూసాడు సుమంత్.

    తోట పని కోసం వాడే గునపం  కనిపించింది.వేగంగా దాన్ని అందుకొని ఆ ఆకారం గుండెల్లో బలంగా పొడిచాడు.

    ఆ ఆకారం కాస్సేపు గిలగిలా తన్నుకొని తల వాల్చేసింది.

    ఒళ్ళంతా చెమటలు పట్టాయి సుమంత్ కి.

    అసలు ఆ ఆకారం ఏమిటి?

    విచిత్రమైన జంతువా? లేక మనిషా?

    ఇదేమి ఆఫ్రికన్  ఫారెస్ట్ కాదు విచిత్రమైన జంతువులు ఉండటానికి.

    హై వే పక్కనున్న మామిడి తోట.

    బహుశా ఎవరైనా మతిస్థిమితం లేని మనిషి అయి ఉంటాడు.

    ఒకవేళ ఆ ఆకారం ఒక దయ్యమా?...

    దయ్యమైతే తను కొట్టిన రాతి దెబ్బకి చనిపోతుందా?

    దయ్యం అంత తేలిగ్గా చనిపోయేట్లయితే ఎవరూ దయ్యాలకు భయపడరు కదా!

    అసలు చనిపోయాకే కదా దయ్యమయేది!

    మళ్ళీ ఎలా చనిపోతుంది?

    ఇంతకీ ఆ ఆకారం చనిపోయిందా లేక స్పృహ తప్పిందా?

    అతని మదిలో ఎన్నో ఆలోచనలు!


    Read full story in www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/VKXbYshG5dQ

    5 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 1 | Ventade Nida Episode 1 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 1

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    ఫ్రెండ్స్ తో కలిసి వూరి చివర ఉన్న మామిడి తోటలో పార్టీ చేసుకున్నాడు సుమంత్.

    సాయంత్రం నాలుగయింది.

    "ఇక బయలుదేరుదాం" అన్నాడు విశాల్ పైకి లేస్తూ.

    అతడు సుమంత్ కి బెస్ట్ ఫ్రెండ్.

    మిగతా స్నేహితులు కూడా బయలుదేరడానికి పైకి లేచారు.

    సుమంత్ కూడా పైకి లేచి వెంటనే తూలి పడబోయాడు.

    విశాల్ అతన్ని పడకుండా పట్టుకుని, "ఈ పరిస్థితుల్లో బైక్ డ్రైవ్ చెయ్యలేవు. నా బైక్ లో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీ  బైక్ ఎలాగోలా రేపు మీ ఇంటికి చేరుస్తాను." అన్నాడు.

    “మా వూరు ముప్పై కిలోమీటర్లు ఉంది. అంత దూరం వచ్చి నన్ను డ్రాప్ చేసి , తిరిగి మీ ఇంటికి వెళ్లేసరికి చాలా ఆలస్యం అవుతుంది. పైగా ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా అంత ప్రయాణం చెయ్యడం మంచిది కాదు.నేను ఓ గంట ఇక్కడే పడుకొని, తరువాత బయలుదేరుతాను. పార్టీ విషయం ఇంట్లో తెలిసిందే అయినా మరీ తూలుతూ ఉంటే బాగుండదు కదా !" అన్నాడు సుమంత్.

    "అలా అయితే నేను కూడా నువ్వు బయలుదేరే వరకు ఇక్కడే వుంటాను. ఒక్కడివే ఉండడం ఎందుకు?" అంటూ సుమంత్ పక్కనే కూర్చున్నాడు విశాల్.

    వీళ్లిద్దరికీ బై చెప్పి మిగిలిన స్నేహితులు వెళ్లిపోయారు.

    విశాల్ వంక అభిమానంతో చూస్తూ " నిజమైన స్నేహితుడివి నువ్వేరా! నన్ను ఎప్పడూ వదిలి పెట్టావుగా " మత్తులో కళ్ళు మూతలు పడుతుండగా అన్నాడు సుమంత్.

    స్నేహితుడి సమాధానం వినేలోగా అతని కళ్ళు మూతలు పడ్డాయి.

    ***

    మరి కాసేపటికి

    గుండెల మీద ఎవరో బలంగా నొక్కుతున్నట్లు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సుమంత్.

    చుట్టూ కటిక చీకటి.

    అతని గుండెలమీద ఒక బలమైన ఆకారం కూర్చొని ఉంది.

    చీకట్లో ఆ ఆకారం కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి.

    ఆ ఆకారాన్ని పక్కకు తోసి పైకి లేవాలని ప్రయత్నించాడు సుమంత్.

    కానీ సాధ్యం కాలేదు.

    ఆ ఆకారం చాలా ధృడంగా ఉంది. దాన్ని కాస్త కూడా కదల్చలేక పోయాడు.

    "విశాల్ ! నన్ను కాపాడు"అంటూ గట్టిగా అరిచాడు.

    కానీ అక్కడ ఎవరూ లేరు.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/esE-n5Ovyq8




    4 min
  • నీలాకాశంలో తారక Neelakasamlo Tharaka | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    నీలాకాశంలో తారక

    రచన: యశోద పులుగుర్త

    నీల  కనకమ్మా రాజయ్యల గారాల బిడ్డ..

    కనకమ్మ కి  తల్లితండ్రులు  పదహారు సంవత్సరాలప్పుడు రాజయ్యతో వివాహం జరిపించారు..  పెళ్లైన సంవత్సరానికే  నీల కడుపున పడింది..  రాజయ్య ఆ ఊళ్లో  ఒక హాస్పటల్ లో నైట్ వాచ్ మేన్ గా పనిచేస్తున్నాడు..  పెద్ద సంసారం, తల్లీ తండ్రీ  పెళ్లైపోయిన అక్కలు,  ఆటో డ్రైవర్ గా ఆటో నడుపుతున్న పెళ్లికాని తమ్ముడు..  కనకమ్మ  ఆ ఊరిలోని  నలుగురిళ్లల్లో  పాచిపనులు చేస్తూ  భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది..

    కూతురు పుట్టినప్పుడు నీలాకాశంలో ఒక తారక తళుక్కుమని మెరిసిందంటూ  నీల  అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు..  నీల ఆ తారకలా తమ జీవితాల్లో మెరుపులు కురిపించాలని,  పుట్టిన బిడ్డ  తమలా కష్టపడకుండా  బాగా చదివించి ప్రయోజకురాలిని చేయాలని,  ఒక బిడ్డ చాలనుకుంటూ నీలతో సరిపెట్టు కున్నారు..  రాజయ్య తల్లీ తండ్రీ  గొడవచేసినా  రాజయ్య వినలేదు..


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/d0f3BxaeVjw



    12 min
  • పోగొట్టుకున్నా కానీ | Pogottukunna Kani | Telugu Short Story | A Annapurna | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పోగొట్టుకున్నా కానీ

    రచన: ఏ. అన్నపూర్ణ

    ఆకాశం మేఘావృతమై వర్షం జల్లుగా పడుతోంది ....అప్పుడప్పుడు వస్తూ పోతూ .

    నక్షత్ర తన గది బాల్కానీ లో నిలబడి ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ  మీద పడిన అల్లరి చినుకులను తుడుచుకుంటూ  ఆనంద పడుతోంది.

    పొగమంచుతో  దూరాన వుండే ఇళ్ళు,  చెట్లు.. ఏవీ కనబడటం లేదు.

    అప్పుడే ఫోను రింగు అయినది.  ఆ రింగ్ టోన్  ఆకాష్ ఫోనుది.

    ''ఏం చేస్తున్నావ్ డియర్ ...!” అన్నాడు ప్రేమగా .

    ''చల్లని చిరుగాలి వీస్తూంటే  వర్షం వచ్చేలా ఉందని  గంట నుంచి ఎదురుచూస్తూ వున్నాను.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/RF559481s5s

    7 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 3 | Kakathi Rudrama Episode 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (ఈ ఎపిసోడ్ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 3

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో…

    శ్రీగణపతి రుద్రదేవ చక్రవర్తి అవసాన దశలో ఉన్నాడు.

    రాజ్యంలో తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు శివదేవయ్య, మహారాజుకు తెలియజేస్తాడు. చాళుక్య వీరభద్రుల వారు, రుద్రమ దేవి కలుసుకునే ఏర్పాటు చేసినట్లు ప్రసాదాదిత్యులు తెలియజేస్తారు.

    ఇక చదవండి...

    ఓరుగల్లుకు ముప్పది మైళ్ళ దూరంలో గోదావరి తీరారణ్యాలున్నవి. గోదావరి తీరానివి

    గంభీరమైన అడవులు. కృష్ణా తీరానివి అందమైన అడవులు, హిమాలయ పర్వతా

    రణ్యాలు దివ్యమైనవి. మలయ ద్వీపారణ్యాలు భయంకరమైనవి.

    ఈ అరణ్యాలలో వెలుగెరుగని నేలలున్నాయి. నల్ల, ఎర్ర, రాలి మొదలైన ఏ విధమైన

    నేలకనబడని గడ్డిజాతులు, ముళ్ళజాతులు, లక్షల కొలది తీగెలజాతులు,

    ఓషదులజాతులునేలమట్టం మొక్కలు , చిన్న జొంపాలు, నిలువుణర ఎత్తు ముసుర్లు ఆకాశం ఎత్తు చెట్లు..


     ఈ ఎపిసోడ్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ ఎపిసోడ్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/KDLDXrn4Yu0



    11 min
  • సందేశ తరంగిణి | Sandesa Tharangini | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com

    (కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి)

    సందేశ తరంగిణి

    రచన: N. సాయి ప్రశాంతి

    దేశభక్తిని నరనరాల్లో ప్రసరించేలా చేసింది

    త్యాగబుద్ధిని ఉద్బోధించి ఆత్మశక్తిని పెంచింది

    నిద్రిస్తున్న భారతదేశం ఒక్కసారిగా మేల్కొంది

    జాతి పునర్వైభవానికై జాగృతమొందింది

    ఈ సందేశం అందిచినది స్వామీజీ దివ్యవాణి

    భారతదేశపు భాగ్య విధాతే సందేశ తరంగిణి...


    ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కవితను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/QlGxjixGewk

    2 min
  • సు ధీర ఎపిసోడ్ 3 | Su Dheera Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సు..ధీర ఎపిసోడ్ 3

    రచన :  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    షూటింగ్ ముగిసి బయటకు వస్తున్న సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ధీర. అతనితో మాట్లాడుతున్న సమయంలో అనుదీప్ అక్కడకు వచ్చి, 'ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా' అని అడుగుతాడు. ఏమీ లేదని చెప్పి, అతన్ని వెళ్ళమంటుంది సు.

    తరువాత ధీరతో తనే కాల్ చేస్తానని చెప్పి పంపించేస్తుంది.

    ఇక చదవండి...

    పేచ్ షూట్స్ కై బయలు దేరిన సు.. దార్లో.. బ్యాంక్ కి వెళ్లింది.

    నిన్నటి చెక్ ని.. నింపిన కొన్ని ఫార్మ్స్ తో పాటు కౌంటర్ లో ఇచ్చేసి.. బ్యాంక్ మేనేజర్ ని కలిసింది.

    "గుడ్ మోర్నింగ్ మేడమ్" పలకరించాడు మేనేజర్.

    "నమస్కారమండీ." మేనేజర్ చూపించగా.. ఆయన ఎదురు కుర్చీలో కూర్చుంది సు.

    "మళ్లీ మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది. మీకు ఏ విధంగా సాయ పడాలి" అడిగాడు మేనేజర్ నవ్వుతూ.

    "చెక్ ఇచ్చాను. ఈ 'ఇయంఐ' తో నా కారు లోన్ క్లియర్ ఐపోతుంది" చెప్పింది సు.

    "గుడ్. కంగ్రాట్స్.. మీది మాకు ఘనమైన ఖాతా." చెప్పాడు మేనేజర్ గొప్పగా.

    "హౌస్ లోన్ కూడా త్వరలోనే ముగించేయబోతున్నాను" చెప్పింది సు.

    "వెల్ కం.. బట్.. మేడమ్.. టేక్ యువర్ ఓన్ టైం.. మా నుండి మీకు ఎట్టి ఒత్తిడి ఉండదు" చెప్పాడు మేనేజర్ కాస్తా కుర్చీలో కదులుతూ.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/MhdBXAxxGyo


    15 min
  • వాట్సప్ | Whatsapp | Telugu Short Story | Dasu radhika | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వాట్సప్

    రచన: దాసు రాధిక

    "తులసీ, వంట అయిందా తల్లి? ఏం చేశావు ఇవాళ?" ఫోను లో దుర్గత్త గొంతు వినగానే గొంతు మార్చి హరి  లాగా పెట్టి - " తులసి బాత్ రూమ్ లో ఉంది" అని టక్కున ఫోను పెట్టేసింది.

    తన కొడుకు చిన్నప్పుడు గొంతు లు మార్చి అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు...  తులసి కి ఎందుకో గుర్తొచ్చింది... ధైర్యం చేసి తాను అదే పని చేసింది....

    ఈవిడ కెందుకు నేను ఏం చేస్తే, ఏదో వంక తో ఫోను చేసి ప్రతీ నిమిషం ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అనే కుతూహలం తో మరీ రోజు రోజుకు తన ఎంక్వయిరీ తో చంపేస్తోంది... అని తులసి తన చికాకును  సోఫా లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న మొగుడు హరి తో రోజూ లాగే పంచుకొందామని చూసినా అతను తల ఎత్తి పట్టించుకోలేదు ...  తులసి గొణుగుతూ ఉంది... కాని వినే వాడెవరు???..


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/pCMxTRg2upU


    22 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world