Harshaneeyam

నా శాసనోల్లంఘనల పర్వం!


Listen Later

వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని నేనూ ఉల్లంఘించాను పలుమార్లు.

ఆయన ఇంటికి వచ్చేసరికి పిల్లలం పుస్తకాలు పట్టుకొని ఉంటే చాలు మహా సంతోష పడిపోయే వారాయన. చదువు లేక ఆయన పడే కష్టాలు, మేము పడకూడదని ఆయన బలమైన కోరిక, అదే విషయం మాకు పదే పదే చెప్పేవారు. మా ఇల్లు వీధికి ఎదురుగా ఉండటంతో ఆయన వీధి మొదలులో ఉండగానే ఆయన రాక మాకు కనపడిపోయేది, ఇక చూడాలి మా హడావుడి, ఎక్కడి ఆటలు అక్కడ బంద్, ఎక్కడి నవలాపఠనం అక్కడ బంద్, పుస్తకాలు పట్టుకొని మహా నటించేవాళ్ళము. నేనైతే అక్క, ఈ లెక్కతో గంట నుండి కుస్తీ పడుతున్న, రావటంలా, కాస్త చెప్పవా అనే అతి నటన కూడా. అలాగే ఏ పరీక్ష అయిన తర్వాత, ఎలా రాశావురా అని అడిగితే తొంబై వస్తాయని చెప్పేవాడిని, మా అక్కైతే ఓ అరవై వస్తాయని చెప్పేది, ఫలితాలు వచ్చాక మార్కులు తయారు మారయ్యేవి. అప్పుడాయన చెప్పేవారు, తక్కువ చెప్పి ఎక్కువ తెచ్చుకోరా అని. ఈ నియమాన్ని నేను ఇప్పటికీ ఉల్లంఘిస్తూనే వున్నా.

మా వూర్లో వేరుశెనగ ఎక్కువగా వేసే వాళ్ళము. విత్తనాలకు కాయలు వొలవటం పెద్దపని మాకు. అలా పిల్లలం అందరం కలిసి ఎవరి ఇళ్లల్లో అయితే విత్తనాలు వొలవాలో అక్కడ చేరే వాళ్ళం. ఒక లోటా విత్తనాలు, చచ్చు పప్పులు మినహాయించుకుని, వోలిస్తే పదిపైసలు. ఒకసారి మా స్నేహితులమందరం మా ఇంట్లోనే వొలుస్తున్నాం, నా లోటా పప్పులు అప్పుడే జమచేసి పదిపైసలు తెచ్చుకున్న, నేను కూర్చున్న ప్రదేశానికి రాగానే, నా స్నేహితుడొకడు ఒక లోటాడు ఒలిచి, ఈ లోపల ఉత్సపోసుకొద్దామని బయటకెళ్లినట్టున్నాడు, ఆ పప్పులు నా లోటాలో పోసుకొని మళ్ళీ జమచేద్దామని వెళ్లాను. అక్కడ చిత్రగుప్తుని లా పట్టుకున్నారు మా నాన్న, ఇప్పుడే జమ చేసేవు కదా అంతలోపు ఇంకో లోటాడు ఎలా వలిచావు అని. ఏవో కథలు చెప్పా, నమ్మలా, అంతలో మా వాడు రానే వచ్చాడు, నా పప్పులెవరో మాయం చేసేసారు అని ఏడుస్తూ. మా నాన్న నా జమ వాడికి బదలాయించి, అంతటి తో ఊరుకోకుండా ఎదో మునిగిపోయినట్టూ అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ నా ఘనకార్యం గురుంచి చాటింపు వేయించి, నా చేత బహిరంగ క్షమాపణ చెప్పించాడు. ఆయనకేమో పెద్ద పేరు, అబ్బా! సుందరయ్య చూడు కొడుకుని కూడా క్షమించడు అని. ఆయనకప్పటికీ మన మెగాస్టార్ ఇంకా చెప్పలేదేమో, తప్పులుంటే చెవిలో చెప్పు, మంచి ఉంటే మైక్ లో చెప్పు అని. ఇలా మా నాన్న చెప్పిన మాట, తప్పు చేస్తే వెంటనే ఒప్పుకొని క్షమాపణ అడుగు మరియు ఇతరులది లాక్కోకు అని. ఆ తర్వాత ఇతరుల కష్టాన్ని లాక్కోలేదు కానీ, ఈ తప్పు చేస్తే వెంటనే క్షమాపణ అడుగు అనే నియమాన్ని నేను ఉల్లంఘిస్తూనే వున్నా. సుప్రియా కూడా అంటుంది నాతో వాదించి వాదించి ఇక లాభం లేదనుకొని, "కిందపడ్డా, మూతిపళ్ళు రాలినా, నువ్వే గెలిచానంటావబ్బా!" అని.

సుప్రియా వాళ్ళ ఉరు కూడా నెల్లూరు అవటంతో, మేము నెల్లూరు వచ్చినప్పుడల్లా, మా ఇంట్లో కానీ లేక వాళ్ళింట్లో కానీ వరుసగా ఎక్కవ రోజులుండకుండా అక్కడికీ, ఇక్కడికీ గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళం. మా నాన్న ఒక నియమం పెట్టారు, వచ్చాక ఎక్కడైనా తిరగండి, కానీ మీరు నెల్లూరుకొస్తే మాత్రం మొదట మన ఇంటికే రావాలి, ఆ తర్వాతే సుప్రియా వాళ్ళ ఇంటికెళ్ళాలి అని. వాళ్ళింటికెళ్ళటం ఒకరోజు తర్వాత కావొచ్చు లేక తిధులు వారాలు బాగా లేక పోతే కొన్నిరోజులు కూడా పట్టవచ్చు. నాకు ఈ నియమం కాస్త అమానుషమనిపించేది. ఎందుకంటే సంవత్సరం తర్వాతో లేక రెండేళ్ల తర్వాతో నెల్లూరుకు వచ్చినప్పుడు, తనకి కూడా తనవాళ్ళని, ముఖ్యంగా తన చుట్టుపక్కల వారిని, తాను పెరిగిన పరిసరాలను ఎప్పుడెప్పుడు చూద్దామన్న కోరిక ఉంటుంది కదా. అయినా ఈ నియమం మా పెళ్లయిన నాలుగైదు ఏళ్ళు పాటించాము. ఈ లోపు నాకు ఇద్దరు కూతుర్లు పుట్టారు, నాకూ కొమ్ములు మొలిచాయి. ఓ రోజు మా నాన్న దగ్గరకెళ్ళి, తలెత్తి సూటిగా కళ్ళల్లోకి చూసి, మీకు తెలుసా నేను కూడా ఇప్పుడు మీ లాగే నాన్న నయ్యా, ఇక మీదట నెల్లూరులో దిగినప్పుడు మనింటికి రావాలనిపిస్తే మన ఇంటికి వస్తాము, లేక పోతే వాళ్ళింటికెళ్తాము. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు అన్న లెక్కన చెప్పి అక్కడ నుండి పారిపోయా.

అలాగే నేను బయట దేశాలు పట్టుకొని తిరిగే రోజుల్లో, మా అమ్మా వాళ్ళు నెల్లూరులో మా అన్న వాళ్ళ దగ్గర వుండేవాళ్ళు. మా అన్న కొడుకు నాలుగేళ్ల పసికుంక. వాడినప్పు

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
Kathavahini - Telugu Stories Podcast by TeluguOne

Kathavahini - Telugu Stories Podcast

12 Listeners

Beyond The Zero by Dick's Pizza Media

Beyond The Zero

35 Listeners