Episode 72 ( రాముడు మాటకు బందీ: ) భద్రంగా ఉంచాలనే ఆలోచనతో ఆ ముని ఖడ్గాన్ని వెంటబెట్టుకుని తిరిగేవాడు. దర్భలూ, ఫల మూలాలూ వెదికేటప్పుడు కూడా ఖడ్గాన్ని వదలి వెళ్ళేవాడు కాదు. క్రమంగా ఆ ఖడ్గంతోనే వాటిని కోయసాగాడు. కొంత కాలానికి ఆ ఖడ్గాన్ని చూపించి, మృగాల్ని బెదిరించడమే కాదు, వాటిని చంపడం ప్రారంభించాడు. మృగయావినోదంలో పడి, నిత్యకర్మానుష్ఠానాలు మానుకున్నాడు. దుర్మార్గుడైపోయాడు.