కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మానవ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో చూస్తుంటాం. అలా అనీ అందరికీ ఒకే రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అనుకుంటే పొరపాటు. కొంత మంది నలుగురిలో చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలుగుతారు.. కానీ కొంతమందికి చాలా బెరుకుగా ఉంటుంది. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో నలుగురిలో మాట్లాడేదే కాదు.. ఒకరి తో మరొకరు ఆప్యాయంగా మాట్లాడుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ రోజుల్లో ఒకరితో ఒకరు కాసేరు సరదాగా కూర్చొని మాట్లాడుకోవడమే కష్టమైపోయింది. ఏదో ఫోన్ ల ద్వారా. ఛాటింగ్ ల ద్వారా మాట్లాడుకుంటున్నారు. అలా కాకుండా కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎవరితో మాట్లాడాలి.. ఎంతవరకూ మాట్లాడాలి.. మనలో కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి లాంటి ఎన్నో విషయాలు భారతి గారు ఈ పోడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు.
Communication skills are essential in daily life. While some excel in public speaking, others find it daunting. Effective communication entails more than fluency; it requires understanding and engagement. In today's fast-paced world, traditional conversations are often replaced by phone calls or chats. Regardless, communication remains crucial. Bharathi's O Manchi Mata podcast delves into various aspects, from whom to converse with, how to do so, to strategies for building confidence.