
Sign up to save your podcasts
Or


దేవుడు కేవలం మీ రక్షకునిగా, స్వస్థపరచువానిగా లేదా సమకూర్చువానిగా మాత్రమే ఉండాలని కోరడం లేదు; ఆయన మీ స్నేహితునిగా ఉండాలని కోరుతున్నాడు.
ఈ సందేశములో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు దేవునితో స్నేహాన్ని కలిగియుండే మనకున్న అద్భుతమైన ఆధిక్యతను మనకు పరిచయం చేస్తున్నారు. కేవలం దేవుని గురించి తెలుసుకోవడం నుండి ముందుకు సాగి, ఆయనతో నిజంగా ఎలా నడవాలో మనమిక్కడ నేర్చుకుంటాము.
అబ్రాహాము, మోషే, మరియు యోహాను జీవితాల ద్వారా, దేవుని స్నేహితులుగా మారిన వారికి దేవుడు ఎలా స్పందిస్తాడో, అలాగే మీరు కూడా దేవునితో మరింత లోతైన సంబంధంలోనికి ఎలా ఎదగవచ్చో ఈ వర్తమానంలో తెలుసుకుంటారు.
దేవుని స్నేహితునిగా/స్నేహితురాలిగా పిలవబడటం ఎంత గొప్ప ఘనత! మీరు కూడా అలాగే పేరుపొందుదురు గాక.
నీవెవరితో అయితే కలిసి నడుస్తావనేది, నీవు చేరుకునే గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
సహవాసాలపై మనకు జ్ఞానోదయాన్ని కలిగించే ఈ ప్రసంగంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, విశ్వాసి జీవితంలో దైవిక సహవాసాల ప్రాముఖ్యత మరియు ప్రభావం గురించి బోధిస్తున్నారు. సరైన సంబంధాలు నీ విశ్వాసాన్ని ఎలా బలోపేతం చేయగలవో, నీ స్వభావాన్ని ఎలా పదును పెట్టగలవో మరియు నీకై దేవునికున్న ఉద్దేశ్యంలో ఎదుగుటకు నిన్ను సరైన స్థితిలో ఎలా నిలపగలవో, వారు వివరిస్తున్నారు.
ఈ సందేశం నీ సహవాసాలను అంచనా వేయుటకు, దైవిక సంబంధాలకు విలువనిచ్చుటకు మరియు దేవుని చిత్త ప్రకారంగా నీ జీవితములో ఉండాల్సిన వారితో ఉద్దేశపూర్వకంగా సహవాసము కలిగిండుటకు నిన్ను సవాలు చేస్తుంది.
ఈ వాక్యాన్ని విని, దైవిక సహవాసములో ఉన్న ఆశీర్వాదాన్ని స్వీకరించండి.
నేడు విశ్వాసిగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుట అంటే ఏమిటి?
న్యూ సిటీ సంఘ 9వ వార్షికోత్సవాన, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధించిన జీవితాలను మార్చే ఈ సందేశములో, ‘వాగ్దాన దేశము’ అనేది ఒక భౌతిక స్థలం కంటే మించినదని, అది క్రీస్తులో దేవుని వాగ్దానాల పరిపూర్ణతను సూచిస్తుందని వారు మనకు వెల్లడిస్తున్నారు. విశ్వాసులు వాగ్దానాలను కేవలము తెలుసుకొనుట నుండి విశ్వాసముతో వాటిలో చురుకుగా నడచుటకు ఎలా చేరగలరో పాస్టర్ గారు వివరిస్తున్నారు.
ఈ వర్తమానము మీ విశ్వాసాన్ని పురికొల్పి, భయాన్ని, పరిమితులను సవాలు చేసి, దేవుడు మీకిది వరకే సిద్ధపరచిన వాటన్నిటిలోనికి ధైర్యంగా అడుగు పెట్టుటకు మిమ్ములను ప్రోత్సహిస్తుంది.
ఈ వాక్యాన్ని విని, క్రీస్తులో ఇది వరకే మీవైయున్న వాటిని స్వాధీనపరచుకొనుట ఇక మొదలుపెట్టండి.
ఆందోళన, నిరాశ, గుర్తింపు సంక్షోభం, ఆత్మన్యూనతాభావం, రెండు వ్యతిరేక వ్యక్తిత్వాలు కలిగియుండే రుగ్మత, ఆత్మహత్య ధోరణులు, విషాద ఘటనానంతరం కలిగే మానసిక ఒత్తిడి, ధ్యాన లోపము మరియు అతి చురుకుదనము అనే రుగ్మత - శతృవును గుర్తించి, దానిపై గురి పెట్టండి. దేవుడు తన సైనికులైన క్రైస్తవులు మంచి మనస్సు మరియు ఆధిపత్యమున్న స్థానం కలిగియుండాలని కోరుకుంటున్నాడు.
'మానసిక దాడులను జయించుట' అనే ఈ వర్తమానములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రైస్తవులకొక యుద్ధ ప్రణాళికను వెల్లడిస్తున్నారు: మానసిక సమస్యలు దయ్యముల యొక్క దాడులు, అవి ఒక రకమైన బంధకాలు; క్రైస్తవులుగా, క్రీస్తు మనస్సు అనే భారీ యుద్ధ సామాగ్రిని రంగంలోకి దింపాల్సిన సమయం ఆసన్నమైంది. మానసిక యుద్ధంలో ముఖ్యమైన రెండు కీలక అంశాలను తెలుసుకొని గెలుచుటకు సిద్ధ పడండి.
మీ ఆయుధాన్ని పక్కన పెట్టకండి! మీ చింతను దేవునిపై వేసి, ముందుకు సాగి శతృవుపై ఎదురుదాడి చేయండి! దేవుని వాక్యంపై మీ దృష్టిని నిలిపి, శతృవు పట్టు నుండి విముక్తులుకండి! సైనికులారా, మీరు జయించినవారు!
వేచి ఉండటం భారంగా అనిపిస్తున్నదా? జవాబు ఆలస్యమైందని నిరుత్సాహంగా ఉన్నారా? ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తుంది.
‘ప్రార్థనకు జవాబు రానప్పుడు’ అనే ఈ సందేశంలో పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, వేచిచూస్తున్న సమయంలో కూడా దేవుడు మనలోను మన చుట్టూను పనిచేస్తున్నాడని తెలియజేస్తారు.
యోసేపు, ఎలిజబెత్ మరియు ఇతరుల జీవితాల ద్వారా ఓర్పు మరియు విశ్వాసాన్ని నేర్పుతారు.
“ఎంతకాలం ప్రభువా?” అన్నది “వందనాలు ప్రభువా!”గా మారినప్పుడు సాక్షం లో నడువగలుగుతాం.
తరతరాలుగా వచ్చే శాపాలు నిజమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులు ఇప్పటికీ తమ పూర్వీకుల పాపాల ప్రభావానికి గురవుతున్నారా?
మనలను దీర్ఘంగా ఆలోచింపజేసే ‘శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము’ అనే ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తరతరాలుగా వస్తున్న శాపాలు మరియు క్రీస్తులో విశ్వాసుల తాము కలిగియున్న స్థానం గురించి మనకు తఱౘుగా కలిగే ప్రశ్నలు మరియు సందేహాలను ప్రస్తావిస్తున్నారు. నూతన నిబంధన యొక్క కోణము నుంచి ఒక విశ్వాసి నిజంగా శాపము క్రింద ఉండగలడా అనే విషయము గురించి, క్రీస్తు సమాప్తి చేసిన కార్యము ఏమి నెరవేర్చిందనే విషయము గురించి పాస్టర్ గారు వాక్యానుసారమైన స్పష్టతను తీసుకు వస్తున్నారు.
ఈ వర్తమానము మీ సాంప్రదాయ ఆలోచనను సవాలు చేస్తుంది, మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు క్రీస్తు మీకిచ్చిన స్వాతంత్ర్యములో నడచుటకు మీకు సహాయపడుతుంది.
ఈ వాక్యాన్ని విని, సత్యములో స్థాపింపబడండి.
మీ జీవితాన్ని పూర్తిగా మార్చవేయగల ఆ ఒక్క పుస్తకమేమిటి?
‘దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి?' అనే ఈ అత్యంత ముఖ్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనల్ని కొన్ని ప్రాథమిక విషయాల గుండా తీసుకువెళ్లి, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకమైన బైబిల్‌ను అధ్యయనం చేయవలసిన గొప్ప ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తున్నారు.
ఈ వర్తమానములో, మీరు బైబిల్లోని విషయాలు, దానిని అధ్యయనం చేయడానికి గల కారణాలు, ప్రయోజనాలు మరియు ఆచరణాత్మకంగా దానిని పాటించుటకు గల మార్గాల గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా ఒక ఉపయోగకరమైన బైబిల్ అధ్యయన పద్ధతిని కూడా మీరిక్కడ నేర్చుకుంటారు.
దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సమయం కేటాయించి, వాక్యము మిమ్మల్ని ఆదర్శప్రాయమైన పౌరులుగా, నాయకులుగా, మరియు ప్రపంచాన్నే ప్రభావితం చేసే ప్రభావశీలురుగా మార్చనివ్వండి. మీలో ఎంత వాక్యమైతే పనిచేస్తుందో అంత వేగంతో ముందుకు సాగండి!
నూతన పరచబడిన మనస్సుతో నూతన నిబంధన కింద జీవించుట అంటే ఏమిటి?
‘నూతన పరచబడిన మనస్సు యొక్క ప్రభావము’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు అంతరంగములో నుంచి వచ్చేదే నిజమైన మార్పు అని, ఈ మార్పు బాహ్య పరిస్థితులు, ఒత్తిడుల వలన కాక అంతరంగములో మనమేమైయున్నామో, దానిని బట్టి, మన ఆలోచనలు, ఎంపికలు, జీవనశైలి మారుట ద్వారా కలుగుతుందని వివరిస్తున్నారు.
ఈ సందేశములో పాస్టర్ గారు మనస్సును నూతన పరచుకునే విధానము గూర్చిన ముఖ్య విషయాలను పంచుకుంటూ, క్రీస్తులో తమకున్న నూతన గుర్తింపునకు అనుగుణంగా విశ్వాసులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకొని, ఆత్మ నడిపింపుతో నిర్ణయాలు తీసుకోవాలని ప్రేరేపిస్తున్నారు.
ఈ వాక్యాన్ని విని, మీ మనస్సును నూతన పరచుకొని, క్రీస్తులో మీరిదివరకే ఏమైయున్నారో, ఆ శక్తిలో నడవండి!
ఈ నూతన సంవత్సర వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుని వాక్యాన్ని వినుటకు చెవులున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి అభివృద్ధికి మరియు వారికి నిర్దేశించబడిన దాన్నంతా స్వాధీనపరచుకొనుటకు దేవుని వాక్యం పోషించే కీలక పాత్రను పునరుద్ఘాటిస్తున్నారు.
వారు నూతన నిబంధనలో దేవుడు మనల్ని రాజులుగాను, యాజకులనుగాను చేసినందున అన్ని నిర్ణయాలు తీసుకొనుటకు మరియు దేవుని రాజ్యాన్ని ముందుకు నడిపించుటకు మనం సంపూర్ణంగా సిద్ధపడియున్న అధికారపు స్థాయిలో ఉన్నామని గుర్తు చేస్తున్నారు.
ఈ సంవత్సరం, దేవుని వాక్యంపై నమ్మకంతో ముందుకు కదులుతూ, పరలోకమంతా మీకు అండగా ఉందనే నిశ్చయతతో, ముందుకు సాగుటకు ఉద్దేశపూర్వకమైన నిర్ణయాన్ని తీసుకోండి. 2026లో దేవుడు మీకై ఉంచిన ప్రతిదాన్నీ మీరు స్వాధీనపరచుకొని ముందుకు సాగుతుందురు గాక.
ఈ వాచ్ నైట్ ఆరాధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, గత సంవత్సరములో దేవుని విశ్వాస్యతను తలపోసుకుంటూ, దేవుని సహాయముతో ఈ నూతన సంవత్సరములో విశ్వాసులమైన మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రోత్సహించి, మరియు 2026వ సంవత్సరానికైన దేవుని వాక్యాన్ని విడుదల చేశారు.
మన జీవితాల్లోనికి మనమనుమతించే స్వరాలను గురించి మనకు మనమే కొన్ని కీలకమైన ప్రశ్నలను వేసుకుంటూ, ఉద్దేశ్యపూర్వకంగా దేవుని స్వరాన్ని వినుట యొక్క ప్రాముఖ్యతను వారు నొక్కి చెబుతున్నారు. ఈ సంవత్సరంలో మనం తీసుకోవలసిన రెండు ముఖ్యమైన నిర్ణయాలను, ఈ నూతన సంవత్సరం తీసుకువచ్చే అవకాశాలను, మరియు చివరగా, ఈ నూతన కాలాన్ని వీలైనంత చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని మార్గాలను కూడా వారు వివరిస్తున్నారు.
ఈ సంవత్సరం, మీ జీవితం దేవుని వాక్యానుగుణంగా సాగుతూ, మీ జీవితంలో సమయమిక ఏ మాత్రము వృథా కాకుండును గాక. గొప్ప బలమైన కార్యాలు మీ వంతు అవును గాక. యేసు నామములో, ఆమేన్!
From the publisher's feed