
Sign up to save your podcasts
Or


నిజమైన సమృద్ధికి దారితీసేది ఏమిటి?
తన పిల్లల కొరకు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, దేవుని చిత్తం ఏమిటో ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. వారు మొదట మన మనస్సు వర్థిల్లుట పునాదిగా అవసరమని బోధిస్తూ, దేవునికి మరియు ఆయన మన జీవితాల్లో ఉంచిన నాయకులకు మనలను మనము పూర్తిగా సమర్పించుకొనుట ద్వారా, అలాగే ఇచ్చుట విషయంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టుట ద్వారా, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన సమృద్ధియైన జీవితాన్ని అనుభవించగలమని తెలుపుతున్నారు.
మీరు మీ ఉదారతకై ప్రసిద్ధి చెంది, మీ ఆదాయం వల్ల మీరు పరిమితపరచబడకుండా, మీ త్యాగపూర్వకమైన ఇచ్చుట ద్వారా అనేకులు దేవుని రాజ్యంలోనికి వచ్చుదురు గాక. ఆమేన్!
మీ జీవితములో అడ్డంకులను దాటి, దేవుని వంటి ఫలితాలను చూడటానికి, సహాయపడే ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి?
మీ సందిగ్ధాన్నంతా తీర్చే ఈ వర్తమానంలో, విశ్వాసులు దేవుని వాక్యంతో తమ జీవితాలను ఎలా నిర్మించుకొని, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలు లేదా జీవితంలోని ఏ ఇతర రంగంలోనైనా గొప్ప విడుదలను ఎలా పొందుకోవచ్చో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశములో బోధిస్తున్నారు. విశ్వాసులు పరిమితులను దాటి, దేవుని వాగ్దానాలతో ఏకీభవించి, వాటిని నిజంగా అనుభవించడానికి తమను తాము ఎలా సరైన స్థానంలో ఉంచుకోవాలో వారు వెల్లడిస్తున్నారు.
ఇది మీరు పొందుకొనే దినం. ఈ రోజే మీరు మీకు కావలసిన దానిని పొందుకునే రోజు. యేసు నామములో ఆకస్మిక మరియు శక్తివంతమైన విజయాలు మీవై ఉండును గాక. ఆమేన్!
దైవికముగా పిల్లలను పెంచుటకు మీకు జ్ఞానము ఉన్నదా?
మీ కుటుంబ నేపథ్యమేదైనా, ప్రతి తల్లి, తండ్రి, సంరక్షకులు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన 7 వాక్యాధారిత సూత్రాలతో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ఈ సందేశములో మనలను సిద్ధపరుస్తున్నారు. పిల్లల పెంపకానికి ప్రధానాంశాలను, ఒక బిడ్డను శిక్షణ చేయుటలో పలు విధానాలను వారు మనతో పంచుకుంటూ, మనము ఆలోచించి ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ప్రశ్నలతో చివరిగా ముగిస్తారు.
మీరు తల్లిదండ్రులైనా, లేదా తల్లి, తండ్రి కాబోయే వారైనా దేవుని మహిమ కొరకు లోకంపై ప్రభావం చూపే పిల్లలను పెంచడానికి ఒక మార్గదర్శిగా ఈ వర్తమానాన్ని పరిగణించండి. దైవిక పెంపకంతో, మీ పిల్లలు జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోండి.
యేసు రక్తం ఎందుకు ఎంతో అమూల్యమైనది? అది మన స్వాస్థ్యమునకు ఎందుకు మూలం?
ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతి విశ్వాసి జీవితంలో దాని ముఖ్య పాత్రను వివరిసున్నారు. యేసు రక్తం ఎందుకు అమూల్యమైనదో ఏడు శక్తివంతమైన కారణాలను పాస్టర్ గారు పంచుకుంటూ ఆ రక్తం మన కొరకు ఏమి సాధించింది, నూతన నిబంధనలో మన కొరకు ఏమి సంపాదించిందో వెల్లడిసున్నారు.
ఈ సందేశం ద్వారా యేసు రక్తం ద్వారా మీరు పొందిన గొప్ప స్వాస్థ్యములో ధైర్యంగా నడచుటకు, మరియు మీరు కుమారునిగా, వారసునిగా, జయించిన వారిగా జీవించుటకు సహాయపడుతుంది!
దేవుని నుంచి మీకొక స్వాస్థ్యము ఉందని మీకు తెలుసా?
విశ్వాసులందరికీ కనువిప్పు కలిగించే ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులో, ప్రతి దేవుని బిడ్డకున్న స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నారు. మన కళ్ళు తెరువబడే అవసరతను గురించి, శతృవు చేత కొందరు అంధులుగానే ఎలా మిగిలిపోతున్నారో మరియు ఇప్పటికే మనదైయున్న ఈ గొప్ప, మహిమకర స్వాస్థ్యములో మనమెలా నడవాలో పాస్టర్ గారు వివరిస్తున్నారు.
మీరు బానిస మనస్తత్వాన్ని తిరస్కరించి, దేవుని బిడ్డగా మరియు నమ్మకమైన వారసులుగా మీకున్న గుర్తింపును మీరు పూర్తిగా స్వీకరించుటకు ఈ సందేశము మీలో ఒక అగ్ని రగిలించును గాక.
మీరు క్షమించబడినవారైతే, మీరు స్వస్థత పొందినవారు కూడా.
ఈ శుభ శుక్రవార స్వస్థతారాధన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్షమాపణ మరియు స్వస్థత మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. యేసు ప్రభువు మీ కొరకు శాపముగా ఎందుకు మారాడో, మీకు బదులుగా సిలువపై ఆయన ఏమి భరించాడో మీరిక్కడ తెలుసుకుంటారు.
మహా వైద్యుడైన యేసునకు అసాధ్యం అనేది ఏమీ లేదు. మీ సమస్యపై కాకుండా, ఆయనపై మీ దృష్టిని నిలపండి. అక్కడే మీరు స్వస్థతను మరియు సంపూర్ణతను పొందుతారు. యేసు నామములో, ఆమేన్.
యేసు ఎవరు? ఆయన విజయం ఏమి సాధించింది?
ఈ మట్టలాదివార సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, యేసు క్రీస్తు ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా నిర్వర్తించిన మూడు రకములైన పరిచర్యలను గురించి, ఆయన పూర్తి చేసిన కార్యము యొక్క సంపూర్ణతను గురించి మనకు వెల్లడిస్తున్నారు. మన కొరకు క్రీస్తు ఎలా నిత్య జీవాన్ని అందించుటకు మరియు పాప మరణాల మీద విజయాన్ని మనకై సంపాదించిపెట్టుటకు వచ్చాడో పాస్టర్ గారు వివరిస్తున్నారు.
తన మరణం ద్వారా, యేసు క్రీస్తు పాపాన్ని తొలగించి, దాని పూర్తి వెలను చెల్లించి, మనలను దేవునితో సమాధానపరచి, ప్రతి శాపము నుండి మనలను విముక్తులను చేసి, అంధకార శక్తులపై విజయాన్ని సాధించాడు.
ఈ వర్తమానము మీ విశ్వాసాన్ని బలపరచి, క్రీస్తులో మీరిప్పటికే కలిగియున్న విజయములో మిమ్మల్ని స్థిరపరుస్తుంది.
ఈ వాక్యాన్ని విని, విజేయుడైన యేసు రాజు మన కొరకు సాధించిన విజయములో జీవించండి.
మీరు యేసు క్రీస్తునకు శిష్యులా? అయితే మీరు ప్రేమకు శిష్యులైయుండాలి.
సంబంధాలు అనే అంశాన్ని కొనసాగిస్తూ, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనము క్రీస్తు శిష్యులుగా ఎలా గుర్తింపబడతామో, ప్రేమలో నడవడం ఎందుకు ముఖ్యమో, మరియు కుటుంబంలో, సంఘంలో, జీవితంలోని ప్రతి రంగములో ప్రేమలో నడచుటకు మనం ఉద్దేశపూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనే విషయాలను ఈ సందేశములో మనతో పంచుకుంటున్నారు.
ఈ రోజు నుంచి, మీ జీవితంలోని ప్రతి రంగములో మీరు ప్రేమ, క్షమా గుణము, కనికరము, దయ, యేసు క్రీస్తు మరియు జోయే జీవితమును ఎంచుకొని మీ ద్వారా అనేకులు దేవుని ప్రేమ వైపు ఆకర్షితులవుదురు గాక.
దేవుని ఙ్ఞానానుసారముగా సంబంధాలను కట్టుకోవడమంటే ఏమిటి?
ఈ సందేశము మీరు సంబంధాలను స్పష్టముగా చూడడంలో, మీ హృదయాన్ని కాపాడుకోవడంలో, మరియు దేవుని నుంచి వచ్చే జ్ఞానంలో మీరు నడుచుకొనులాగున మీకు సహాయపడుతుంది.
ఈ వాక్యాన్ని విని, సంబంధాల విషయంలో దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని కనుగొనండి.
From the publisher's feed