
Sign up to save your podcasts
Or


దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు.
ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు.
మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!
దేవుని ప్రణాళిక - శ్రేష్ఠమైన ప్రణాళిక
ప్రతి ఒక్కరి జీవితాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మన ప్రేమగల సృష్టికర్తచే రూపింపబడ్డాయని, ఆ ప్రణాళికను మనము కనుగొని దానిలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడనే ప్రోత్సాహపూర్వక సత్యాన్ని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశంలో బోధిస్తున్నారు.
దేవుని ప్రణాళికను మనము గుర్తించకపోవుటకు గల కారణాలను పాస్టర్ గారు వివరిస్తుండగా, మీరింత వరకు గడిపిన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించండి. తరువాత మీ పట్ల దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళికను మీకు తెలుపమని దేవునిని అడగండి.
దేవుని మహిమార్థమై, మీరు సరైన దిశలో నడుస్తూ, సరైన గమ్యాన్ని చేరుకొందురు గాక. యేసు నామములో, ఆమేన్!
ఇది ఎదుగుటకు సమయం!
ఈ పాడ్కాస్ట్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఒక విశ్వాసి జీవితంలో ఎదుగుదల ఒక్కొక్కటిగా ఎలా దశలలో జరుగుతుందో వివరిస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమ కోసం మీ విశ్వాస జీవితములో ఎవ్వరూ వివరించలేని ఎదుగుదలను చూడటానికి ఆయన సత్య వాక్యము ద్వారా దేవునితో కలిసి మీరు పని చేయడానికి నిర్ణయించుకోవాలని మా ప్రార్థన!
మీ నాలుక: మీ విడుదలకు మూలము
ఎంతో దైవిక జ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తిని మనము ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తున్నారు. మీ జీవితాన్ని మరియు ఇతరులను ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ జీవమునే పలుకుతూ ఉండుటకు ఇప్పుడే నిర్ణయించుకోండి.
మీ మాటలు దేవుని వాక్యానికనుగుణంగా ఉంటూ, మీ జీవితములో మీకు సమృద్ధియైన పంటను ఇచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!
విత్తుట మరియు కోయుటలోని శక్తి!
ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వెదకాలము, కోతకాలములు అను బైబిల్ సూత్రాన్ని వివరిస్తుండగా మీ జీవితంలో శాశ్వతమైన మార్పునకు సూత్రాన్ని కనుగొనండి.
మీరు చేస్తున్న పనులనొకసారి పరీక్షించుకొని, వాటిని దేవుని వాక్యానికనుగుణంగా మార్చుకొనడం ద్వారా మీ జీవితము ఎలా సంపూర్ణంగా మారిపోగలదో తెలుసుకోండి.
శిక్షావిధి - ఒక భయంకరమైన వేదన
నీకు నేనంత మంచివాడను/మంచిదానను కాదు అనిపిస్తుంటుందా? ఏవైనా అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నించి ప్రతి సారి ఓటమి పాలయ్యావా? సానుకూల ఒప్పుకోలు చేస్తూ, నిపుణతగల మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ వాటితో ఏం ప్రయోజనం లేక చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా?
లేఖనాధారంగా ఉన్న ఈ విడుదలనిచ్చే సందేశంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు ఒక తుది పరిష్కారాన్నిస్తునారు: క్రీస్తుని అంగీకరించి, ఆయన రక్షణలో విశ్రమించుట. తగిన ఉదాహారణలనిస్తూ శిక్షావిధి నుంచి విడుదలై స్వేచ్ఛగా జీవించుట అనేది కేవలం సాధ్యమే గాక అది నిజమైన స్వాతంత్ర్యానికి మూలం అని ఆయన చెపుతున్నారు.
ఈ సందేశాన్ని విని, ఎటువంటి అపరాధ భావన, అవమాన భారము లేని ధైర్యము, శక్తితో కూడిన స్వేచ్చా జీవితాన్ని జీవించుటకు శక్తిని పొందండి. ఆమేన్!
మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను మర్మము
ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు సిలువ తర్వాత జీవించుచున్న వారికి ప్రత్యేకంగా ఉన్న గొప్ప ఆధిక్యతను వెల్లడిస్తున్నారు: అది, క్రీస్తు మనలో నివసించుట, మనం ఆయనలో నివసించుట అనే మర్మము.
మీరు వ్యాపారస్తులైనా, తల్లిదండ్రులైనా, వైద్య నిపుణులైనా, విద్యావేత్తలైనా, లేదా దేవుని సేవకులైనా, క్రీస్తును మరియు ఆయన సిలువ మరణాన్ని తెలుసుకొనుటపై మీ దృష్టిని కేంద్రీకరించి, దైవిక ఫలితాలను అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాము.
మీరు క్రీస్తులో ఇది వరకే ఏమైయున్నారో, అలా అవుటకు ప్రయత్నించడం మానివేసి, దేవుని సంపూర్ణతలో నడుస్తూ, ఆయన శక్తిని ఇతరులకు చూపించుదురు గాక. యేసు నామంలో, ఆమేన్.
నమ్ముటయే విశ్రమించుట!
పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారి ఈ సందేశము ఒక క్రైస్తవునికి ‘విశ్రాంతి’ యొక్క నిజ అర్థం ఏమిటో అనే సత్యానికి మన కళ్ళు తెరుస్తుంది. శత్రువు తీసుకు వచ్చే అబద్ధాలను గురించి ఆయన చర్చిస్తూ, క్రీస్తుతో సహవారసులమైన మనతో దేవుని వాక్యమే మాట్లాడుతుందనే సత్యాన్ని నొక్కి చెపుతున్నారు.
ఇదే మీ విశ్రాంతి దినము. మీరీ వర్తమానాన్ని వింటూండగా, దేవుని వాగ్దానాలను నమ్మి, వాటిలో నడుచుట ద్వారా ఇప్పుడే మీ విశ్రాంతిని మీరు పొందుకోవాలని మా ప్రార్థన.
మీరు మీ స్వంత క్రియల మీద ఆధారపడుట మాని, దేవుని కృప మీదనే సంపూర్ణముగా ఆధారపడి, మీ రక్షణ అనే విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించుదురు గాక. యేసు నామములో, ఆమేన్!
ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు బైబిల్‌లోని గత మరియు ప్రస్తుత సత్యాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని అర్థం చేసుకోవడంలో సందర్భం మరియు సమయాన్ని వివేచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుడు మనకిచ్చిన సమృద్ధి జీవితాన్ని దోచుకునే సంప్రదాయాలను తిరస్కరించాలని మరియు సిలువ తర్వాత క్రీస్తు మనకిచ్చిన జీవితము మనము జీవించడము గొప్ప భాగ్యం, ఆధిక్యత అని మనము గ్రహించాలని మా ప్రార్థన.
దేవుడు ఈ కాలములో చేస్తున్న దానంతటికీ మీ కళ్ళు, చెవులు, హృదయము ఎల్లప్పుడూ తెరచి ఉండును గాక. యేసు నామములో, ఆమేన్!
From the publisher's feed