ఆంద్రప్రదేశ్, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బాలుసుపాడులోని శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం ద్వారా సద్గురు శివనందమూర్తి భసగవానుల నవీన ఆధ్యాత్మిక సందేశాన్ని ఆచరణాత్మకంగా సమాజానికి అందిస్తున్న మహనీయులు శివశ్రీ గెంటేల వెంకట రమణ గురుదేవులు. ఋభుగీతా సారము అనే గ్రంథంపై వారు చేసిన సత్సంగ ప్రవచనాలకు లేఖకుడిగా ఉండే అదృష్టం, అనుగ్రహం నాకు లభించింది. ఆ బోదామృతాన్ని శ్రీ శివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వారు ఋభుగీత పుస్తకంగా ముద్రించారు. అత్యంత క్లిష్టమైన అద్వైత బోధను అతి సరళ పదాలతో అందించిన రమణ గురుదేవుల బోధలోని మాధుర్యాన్ని ఆడియో రూపంలో అందరితో పంచుకోవాలన్న చిరు ప్రయత్నమే ఈ పాడ్ కాస్ట్ రూపకల్పన. ఋభుగీత పేరుతో చిన్న చిన్న భాగాలుగా ఆ పుస్తకంలోని బోదామృతాన్ని మీతో పంచుకుంటాను. - ఇట్లు మీ బాణాల రవికిరణ్, పాత్రికేయుడు మరియూ ఆధ్యాపకుడు, జగ్గయ్యపేట