
Sign up to save your podcasts
Or


మైండ్ తనని తాను ఉచ్చులో, పంజరంలో, బోనులో బిగించి బంధించి, తరవాత దానిలో నుంచి రావడానికి వీర పోరాటం చేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పెద్ద పార్ట్ అయినా జాగ్రత్తగా వినండి.
ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ప్రేమ మనం చూపించవచ్చు. ఎక్కువ మంది జీవితాలలొ మంచి మార్పు కి మనం కారణం కావచ్చు.కరెక్టే కాని మన ప్రేమ డబ్బుతో కొలిచే బహుమానానికి పర్యాయం కాదు కదా?
ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ప్రేమ గుర్తింపు వస్తుందనే భ్రమలో ఇప్పుడు ఉన్న వారి ప్రేమ అభిమానాన్ని మనం గుర్తించకుండా, డబ్బుతో వచ్చే బూటకపు ప్రేమల కోసం పరిగెత్తడం మూర్ఖత్వం కదూ?
ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ స్వాతంత్ర్యం వస్తుందనే భ్రమలో ఇప్పుడు ఉన్న డబ్బు ఇచ్చే స్వాత్రంత్ర్యం ని కూడా అనుభూతి చెందకుండా ఎప్పుడో అనుభవిస్తామనే భ్రమలో జీవిస్తాము.
మనం ఏ స్థాయి సంపాదన,డబ్బు కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు బాగా సంపాదించి అవతలి వారికి మనమేంటో నిరూపించుకునే ప్రయత్నంలో మనల్ని మనం హింసించుకుంటూ ఉంటాము.
మనం ఏ స్థాయి సంపాదన,డబ్బు కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు ఉంటే శక్తివంతులమవుతామనే భ్రమలో డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము.
మనం ఏ స్థాయి సంపాదన కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు ఎందుకు కావాలని కోరుకుంటున్నామో అది మనకు అందుబాటులో లేని విషయంగానూ, అది అందుకునే ప్రయత్నం పోరాటం గానూ కనిపిస్తుంది.
మనం ఏ స్థాయి సంపాదన కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, ఉన్న స్థాయిలో డబ్బు నిర్వహణ సరిగా చేయగలిగినపుడే మనం మరింత డబ్బు సంపాదన పొందగలుగుతాము.
మనం స్వీకరించేటపుడు మన బాధాకరమయిన భావాలు, ఇచ్చేవారు ఇచ్చేటపుడు వారి బాధవల్ల కలిగే భావాల సమాహారమే unhappyమనీ
మనం స్వీకరించేటపుడు మన సంతోషమైన భావాలు, ఇచ్చేవారు ఇచ్చేటపుడు సంతోషం కలిగే భావాల సమాహారమే Happy మనీ
From the publisher's feed