
Sign up to save your podcasts
Or


ప్రయత్నించి ఓడిపోతే నేను ఓడిపోయినవాడిని కనుక నన్ను ఎవరూ గౌరవించరు లేదా ప్రేమించరు.
ఉన్న స్థితిలోనే ఏమీ చేయలేకపోతున్నాము, ఇంకా మార్పు ని ఆహ్వానించి అక్కడ ఏ విధమయిన పరిస్థితి ఉంటుందో తెలియకుండా బాధలు పడే కన్నా అసలు మార్పునే రిజెక్ట్ చేస్తే సరిపోతుంది కదా! . పైకి బింకంగా నన్నెవ్వరూ మార్చలేరు అని ఛాలెంజ్ చేస్తే సరి.
తమ స్వంత లక్ష్యాల పై ఫోకస్ చేస్తే, సాధించలేమేమో అనే అనుమానంతో ఇతరుల బాధ్యత అవసరం లేకపోయినా నెత్తిన వేసుకుని, అందులో బిజీగా ఉన్నామనే కలరింగ్ ఇస్తూ, దాని వలననే తమ స్వంత లక్ష్యాలను కూడా పక్కన పెట్టవలసి వచ్చిందని ఇతరులను నమ్మిస్తూ, తాము కూడా నమ్ముతూ ఉంటారు.
మనకంటూ ఏ గోల్ లేకుండా ఎవరితో పడితే వారితో పోటీ పడి, వారిని గెలిచి కాలర్ ఎగరేసే ప్రయత్నంలో, మనకు కావలసినది పొందామా లేదా అనేది కూడా మరిచిపోతాము.
ఉండవలసినవన్నీ ఉండవలసిన చోట పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే విజయం సాధించలేము అనే భ్రమలో ఉండటం. పుస్తకాలన్నీ నీట్ గా సర్దుకోవడం,అట్టలు వేసి పెట్టడం పరీక్షలు మంచి మార్కులతో పాసవడానికి చాలా ముఖ్యం అన్నట్లు గా ఉంటుంది.
తను సాధించగలిగింది నేను కూడా సాధించగలను అన్న నమ్మకం మన మీద మనకు ఉంటే అప్పుడు తన విజయాన్ని మనం కూడా ఎంజాయ్ చేస్తాము.మనం సాధించగలం అన్న నమ్మకం లేనప్పుడు మాత్రమే కలిగేది ఈ ఈర్ష, అసూయ.
ఇతరులను డీల్ చేయడం నాకు రాదు కాబట్టి, ఆ ప్రయత్నంలో నవ్వులపాలవుతామేమో అనే భయంతో అసలు ఇతరులతో కలవనే కలవకుండా ఉంటూ పైపెచ్చు అది గొప్ప లక్షణంలా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండటమే ఈ ట్రాప్ లక్షణం.
ఓడిపోతే నన్ను ఎవరూ గౌరవించరు, ప్రేమించరు, ఇష్టపడరు అని భావిస్తూ గెలవడానికి మోసం చేసైనా గెలవడంలో తప్పు లేదు అని తనని తాను సమర్ధించుకుంటూ ఉంటారు. కారణం నిజాయితీగా పోటీ పడితే తన సమర్ధత లోపం వల్ల ఓడిపోతాననే భయం. అదే ఈ ట్రాప్
ఓడిపోతే నన్ను ఎవరూ గౌరవించరు, ప్రేమించరు, ఇష్టపడరు అని భావిస్తూ ప్రయత్నంలో ఓడిపోవడం కన్నా, ప్రయత్నించకుండా ఉండటానికి కృషి చేస్తాము. నేను దిగలేదు కానీ, దిగితేనా అని కబుర్లు చెప్పి పబ్బం గడుపుకుంటాము.
ఇది అన్నిటి కన్నా ముందుగా వచ్చి అన్నిటి కన్నా చివరిగా వెళుతుంది. చివరి వరకూ గెలవడానికే పోరాటం చేస్తుంది. గెలిచిన తరవాత కూడా మనం నిజంగానే గెలిచామా అన్న డౌట్ వచ్చేలా చేసి మళ్ళీ తిష్ట వేస్తుంది. అన్నిటి కన్నా మహా డేంజరస్ ట్రాప్.
From the publisher's feed