మానవ జన్మలో మనిషికి పంచేంద్రియాలు , అవి ఘ్రాణ, రస, చక్షు, శ్రోత్ర, త్వగింద్రియాదులు అస్తిత్వానికి , వేరు వేరు క్రియలకు ఉపయోగ పడినట్టే మనస్సు కూడా అతి కీలకంగా మస్తిష్కపు ప్రేరణతో బాహ్యంగా వచ్చే స్పందనలకు ఇచ్ఛా పూర్వకంగా ప్రతిస్పందించే ఒకే ఒక ఇంద్రియం. మనసు లేనిదే మనిషి లేడు. ఏదేని విషయం పై తన మస్తిష్కం లో కలిగే ఆలోచనలను, అభిప్రాయాన్నీ క్రోడీకరించి భావం గా ఆవిష్కరించేదే మానసం.