రచ్చ బండ, ఈ కాలంలో ఈ మాట చాలా మందికి అనుభవపూర్వకంగా తెలియకపోయినా విరివిగానే వాడుతుంటారు. పూర్వం ఏ పల్లెటూరు అయినా సరే ఊరి మధ్యలో రచ్చబండ ఉడేది. వీలయినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు అందరు అక్కడకు చేరి ముచ్చట్లు పెట్టుకునేవారు. పెద్ద చెట్టుకింద ఎత్తుగా చేయబడ్డ అరుగు లాంటి గచ్చు. చల్లని నీడలో హాయిగా గాలి వీస్తుండగా కబుర్లు ఆడుతూ కాలక్షేపం చేసేవారు. సమాచారమైన, కాలక్షేపమైన రచ్చబండ దగ్గరే. చిన్న చిన్న విషయాల దగ్గరనుండి ఊరి పంచాయతీల వరకు రచ్చబండ దగ్గరే. ఎన్నో తీర్పులు, నిట్టూర్పులు, ఆశావాదం, నిరాశావాదం, వినోదం, తమాషా అన్ని రచ్చ బండ దగ్గరే. రచ్చబండ ఓ రకంగా ఆ ఊరికే ఒక ప్రజా సమాచార కేంద్రం , ఒక సమావేశ మందిరం. అలవాటు పడిన వాళ్లకు రోజుకు కనీసం ఒకసారన్నా రచ్చబండ దగ్గరకు వెళ్లకుంటే ఏమి తోచదు.