న్యూస్ లెటర్ లో చెప్పని కాకినాడ తెలుగు సదస్సు సంగతులు
Big Boss House Tv లో చూసాము కాని. సాహితీ సదస్సుతో కూడిన Big boss house ని కాకినాడలోనే చూసాము అండి. ఎందుకు ఇలా అన్నాను అంటే మేము వెళ్ళాక ఉదయం నుంచి సాయంత్రం వరకూ రక, రకాల అంశాలపై స్పీచులు, పద్యాలు, పాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా 10 నిమిషాలకి, 20 నిమిషాలకి వక్త మారుతూ ఉన్నప్పుడు నాకు Big Boss లో వెనక నుంచి ఒక వాయిస్ ఓవర్ వస్తుంది కదా సమయం మధ్యాహ్నాం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అన్నట్లు అలా వినిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. వక్తలని అవమానించే ఉద్దేశం అసలు కాదు కానీయండి, సభలో అలా చాలా సేపు కూర్చోవడం వలన నిద్రావస్థకి గురి అయ్యాము. అలాంటి సమయాల్లో
నేడు తెలుగు భాష అంశంపై - ఆచార్య వెలమల సిమ్మన్న గారు, దక్షిణాది నుడికారం అంశంపై - డా. ఉప్పలధడియం వేంకటేశ్వర గారు, పద్య నాటక సాహిత్యం అంశంపై - బులుసు అపర్ణ గారు, మన తెలుగు గురించి మనమేం చేయాలి అంశంపై - జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ప్రబోధ చంద్రోదయం అంశంపై - ఆచార్య పాలేపు వారిజా రాణి గారు...
ఇలా ఇంకా ఎందరో చేసిన ప్రసంగాలు మమ్మల్ని చైతన్య పరిచి, తర్వాతి ప్రసంగాల కోసం మరింత Energy తో కూర్చుండేలా చేశాయి. Heads Up ఏంటి అంటే మేము కొందరు వ్యక్తలతో పరిచయం పెంచుకుని వారిని మన ప్రసంగాలకి ఆహ్వానించాము కూడా ! త్వరలో ఆ ప్రసంగాల గురించి చెప్తాము. మీరు ఖచ్చితంగా ఆ ప్రసంగానికి హాజరు కావాలసిందే, వారి పాండిత్యం చూసి అబ్బుర పోవాల్సిందే. అంత బాగుంటుంది ఆ ప్రసంగం.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు
మన కూటమిలోనే ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిత్యా మారెళ్లపూడిని (ఇతనికి సాహిత్యం, సిరివెన్నెల రెండు కళ్ళు, ఎంతో ఆసక్తితో @varadhi.telugu అనే instagram page ను నడుపుతున్నాడు) కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది.
అలానే మన కూటమి సభ్యులు రాజశేఖర్ తటవర్తి గారు కూడా కొంత కాలం తర్వాత భారత దేశానికి వచ్చి కేవలం, రెండు రోజులు ఉందామని కాకినాడ వచ్చి, మేం ఇక్కడ ఉన్నామని తెలిసి సంబర పడి తర్వాతి రోజునే మమ్మల్ని కలవడానికి తెలుగు సాహితి సదస్సుకి వచ్చారు. వారిని కలుసుకోవడం చాలా ఆనందం కలిగించింది.
Celebrity Entry
జగదీష్ కొచ్చర్లకోట గారి గురించి మన కూటమిలో చాలా మందికి తెలుసు. హాస్య చతురతతో ఉండే వారి ఫేస్బుక్ పోస్ట్ లు ఎంత ఫేమస్ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారితో సంభాషణలు, పొట్ట చెక్కలు అయ్యేలా వారు వేసిన జోకులతో మా కాకినాడ ప్రయాణం ఒక memorable trip గా మిగిలి పోతుంది.
ఈ వారం న్యూస్ లెటర్ ఇక్కడ బ్లాగ్ పోస్ట్ రూపంలో చదవచ్చు, పాడ్కాస్ట్ రూపంలో వినవచ్చు. వినేయండి మరి.
Blog : https://www.dasubhashitam.com/blog/telugu-veera-levaraa
Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3