Kathalu. Kaburlu. (Dasubhashitam)

Kathalu. Kaburlu. (Dasubhashitam)

By DasubhashitamSociety & Culture
Download on the App Store

Kathalu. Kaburlu. (Dasubhashitam) episodes

  • 3. Kaashiki Poyadu Rama Hari

    Kathalu Kaburlu S03E03


    కాశీ, పూరీ, షిర్డి ఒకొక్కరికి ఒక్కో ఆధ్యాత్మిక అనుభవాలను ఇస్తాయి. మరి

    ఉత్తర పడమర తూర్పు భారత దేశాలలో రామ్ దర్శించిన క్షేత్రాల యాత్రానుభవాలు గురించి వినండి. ఇదే పాడ్కాస్ట్ మీరు యాప్ లో కూడా వినవచ్చు. బ్లాగ్ లో కూడా చదవచ్చు. ఇవే లింకులు.

    Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3


    Blog: https://www.dasubhashitam.com/blog/kaashiki-poyadu-rama-hari


    యాత్రనుభవాలు 2 శ్రవణ సంచిక : https://www.dasubhashitam.com/ab-title/pc-yatranubhavalu-2

    9 min
  • 2. Saluri Variki Kopamosthe

    Kathalu Kaburlu S03E02


    'ఫిదా' సినిమాలో 'హేయ్ పిల్లగాడా' పాట మొదటిసారి విన్నప్పుడు భలే తమాషాగా అనిపించింది నాకు. ఆ పాటలో వచ్చే Interlude 'మల్లీశ్వరి' సినిమాలోని 'పరుగులు తీయాలి' పాటలోనిదే. అసలే మల్లీశ్వరి సినిమా పాటల పిచ్చిదాన్ని నేను. ఇక ఈ పాట కూడా నా faviourates లోకి చేరిపోయింది. ఆ పాటను అలా ఉపయోగించుకోవడం శేఖర్ కమ్ముల సాలూరి వారికి ఇచ్చిన tributeలాగా అనిపించింది. అంతకుముందు 'ఆనంద్' సినిమాలో కూడా 'మనసున మల్లెల మాలలూగెనే' పాట చూపిస్తారు శేఖర్. ఈ రెండిటిని బట్టీ ఆయనది కూడా నాలాగే గొప్ప taste అని certify చేసేశా.పరుగులు తీయాలి పాటలో వేరే ఊరి నుంచి ఎడ్లబండిపై తమ ఊరు వెళ్తుంటారు హీరో, హీరోయిన్లు. మబ్బులతో పందెం వేస్తూ, ఎవరు ముందు చేరతారో అన్నట్టుగా పోటీ పడుతున్నట్టు వెళ్తుంటారు. ఆ ఎడ్ల గిట్టల చప్పుడు, మెళ్ళో ఉండే గంటల శబ్ధం పాటంతా సాగుతూ అద్భుతమైన సహజ సంగీతం సమకూరినట్టుగా పాటని నిర్మించారు సాలూరి వారు. అదే సినిమాలో మరో పాట 'కోతీ బావకు పెళ్ళంటా, కోవెల తోట విడిదంట' పాటలో కూడా ఇలాంటిదే మరో సరదా పనిచేశారు.నాగరాజు ఉలితో శిల్పాలు చెక్కుకుంటూ ఉంటే, 'నువ్వే కోతివి' అంటూ అన్యాపదేశంగా పాట పాడుతూ ఉంటుంది మల్లీశ్వరి. ఈ చిలిపి పాటలో ఆద్యంతం నాగరాజు ఉలి శబ్ధాలు సహజంగా అమరిన సంగీతంలా ఉంచారు. సన్నివేశానికి, పాటని ముడివేయడంలో అక్కడ లేని వాద్యాల కంటే, ఇలాంటి చిన్న వస్తువులతో సంగీతం రప్పించడం, వాళ్ళు ఈ శబ్ధాలను సంగీతంగా చేసుకుని నిజంగానే పాట పాడుకుంటున్నారు అని మనకి అనిపించేలా చేయడం ఎంత తెలివైన, సృజనాత్మకమైన పని.సాలూరి వారి శిష్యులంతటివారు ఎంతో చెప్పిన తరువాత, సంగీతంలో ఓనమాలు రాని నాబోటి అమ్మాయి చెప్పేది ఏముంటుంది. ప్రసంగం విన్నవాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో, నేను ప్రత్యక్షంగా చూశాను. చూడనివారి కోసం యూట్యూబ్ లో ఈవారంలోనే పెట్టేస్తాం. చూసేయండి. ఈలోపు ఈ వారపు న్యూస్ లెటర్ చదివి, కథలు-కబుర్లు వినేయండి. ఇవిగో లింకులు.

    Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3

    Blog: https://www.dasubhashitam.com/blog/saluri-variki-kopamosthe

    5 min
  • 1. Cinema Pata Yela Record Chestharante

    Kathalu Kaburlu S03E01


    అలనాటి సంగీత విశేషాలు తెలుసుకోడానికి, ఆనాడు సినిమా సంగీతానికి ఎలా దర్శకత్వం వహించారో ఈ కథలు కబుర్లలో వినండి.


    ఈ కథలు కబుర్లని ఇక్కడ బ్లాగ్ పోస్ట్ : https://www.dasubhashitam.com/blog/cinima-pata-yela-record-chestharante


    ఈ కథలు కబుర్లని ఇక్కడ వినండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3

    8 min
  • 50. Ramudu Ichhina Chanuvu

    Kathalu Kaburlu S02E50పంతులమ్మ సినిమాలో 'మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ' అనే పాటకు తనదైన శైలిలో మూడో చరణం రాసి శ్రీరాముడికి సమర్పించుకున్నారు కిరణ్ గారు. ఈ వారం విడుదలైన న్యూస్ లెటర్ లో ఆ పాటకి తన విశ్లేషణతో పాటు, తాను రాసుకున్న 3వ చరణం ఉన్నాయి. కిరణ్ గారి మిత్రులు శ్రీ రవిశంకర్ గారు పాడిన ఆడియో లింకు ఇస్తున్నాం. విని, ఆనందించండి.కిరణ్ గారి స్నేహితులు రవిశంకర్ గారు పాడిన పాట లింక్‍https://youtu.be/fhaZ4plzeVI ---

    Blog post : https://www.dasubhashitam.com/blog/ramudu-ichhina-chanauvuఈ కథలు కబుర్లు యాప్ లో ఇక్కడ వినండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2

    8 min
  • 49. Missamma Re-release

    Kathalu Kaburlu S02E49


    తెలుగు సినీ చరిత్ర ప్రారంభం అయిన కొత్తలో విడుదల అయిన సినిమాలు ఆ కాలాన్ని స్వర్ణ యుగం చేశాయి. ఆ సినిమాలపైన అలోక్ నంద ప్రసాద్ గారు రాసిన ప్రత్యేక వ్యాసాల కథలూ కబుర్లు పై వీడియోలో వినండి.


    ఇక్కడ చదవండి.

    https://www.dasubhashitam.com/blog/missamma-re-release

    ---


    శ్రవణ పుస్తకం లింక్ : https://www.dasubhashitam.com/ab-title/pc-vande-cine-mataram-1

    8 min
  • 48. Vallu Sivudi Gudiki Velthe Snanam Chestaaru..!?

    Kathalu Kaburlu S02E48

    ఈ నెల జరిగిన ప్రసంగంలో చంద్రమోహన్ గారు తరుప్పావై గురించి అద్వైతం, విశిష్టాద్వైతం, శ్రీ వైష్ణవం పుట్టుక గురించి, భక్తి ఉద్యమం గురించి ఏం చెప్పారో ఈ కథలు కబుర్లలో వినండి.
    చంద్ర మోహన్ గారి పూర్తి ప్రసంగం ఈ యూట్యూబ్ వీడియోలో చూడండి.
    https://www.youtube.com/watch?v=a0TZTdua-Nc
    ---
    https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
    https://www.dasubhashitam.com/blog/hari-avatharamule-akhila-devathalu

    ---


    Image source : https://pin.it/6x4Ab7xKn

    7 min
  • 47. Hari Avatharamule Akhila Devathalu

    Kathalu Kaburlu S02E47


    భక్తి - శక్తి


    నోలాన్ తీసిన Batman Begins సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.


    If you make yourself more than just a man, if you devote yourself to an ideal, you become something else entirely. Which is "A Legend mr Wayne"


    చరిత్ర చూసుకుంటే ధ్రువుడి, ప్రహ్లాదుడు, గోదా దేవి, ఆళ్వార్లు, నాథముని, రామానుజులు, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు ఇలా చెప్పుకుంటూ వెళితే లిస్ట్ చాలా ఉంటుంది. వీరంతా ఉత్కృష్టమైన భక్తితో వారిని వారు పూర్తిగా ఒక ideal (or Idol) కి సమర్పించుకుని తన్మయత్వంలో మునిగిపోయి ఎన్నో శ్లోకాలను, గీతాలను, పాశురాలను, పద్యాలను, కీర్తనలను సృష్టించారు వాటి నుంచి ఎంతో సాహిత్యం వచ్చింది, వాటిని ఆధారంగా చేసుకుని ఇంకా ఎంతో సాహిత్యాన్ని నేటికీ సృష్టిస్తున్నారు.


    వీరే కాదు చాలా మంది వారు అనుకున్న పని చేయడం కోసం ఆ పనిలో పూర్తి భక్తితో లీనమైపోయి జాతులను, మతాలను, ideology లను, సాహిత్యాన్ని సృష్టించి వాటిని ఎంతో మంది జనం వారి అభిమతంగా చేసుకుని అభిమానులుగా ఫాలో అయ్యేలా చేసారు.


    ఇలాంటి బలమైన Will వివిధ రూపాలలో మనలో కూడా ఉంది. ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ని పెట్టి చాలా మందికి సహాయపడటం, ఒక సత్రాన్ని కట్టి ఎంతో మందికి నీడను, కూడుని ఇవ్వడం, ఒక ఆసుపత్రిని కట్టి మెరుగైన వైద్యాన్ని అందించడం, మధ్య యుగంలో రామానుజులు, మధ్వాచార్యుల వారిలా ఒక భక్తి ఉద్యమంని మొదలు పెట్టి ఎంతో మందికి ఒక పర్పస్ ని కలిగించి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లడం, ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టి తను నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా ఉచితంగా ధారబోయడం ఇలా ఒక్కో మనిషికి ఒక్కో Ideology, ఒక్కో devotion.


    అలాంటి ఒక devotion గురించి , Ideology గురించి ఒక జాతి మొత్తాన్ని కదిలించిన శ్రీ వైష్ణవం Movement గురించి, ఒక మతస్థాపన నుండి, వ్యాప్తి వరకూ జరిగిన చరిత్ర, అందు నుండి పుట్టిన సాహిత్య సృష్టి గురించి వచ్చే శనివారం జరగబోయే ప్రసంగంలో చంద్ర మోహన్ గారి ద్వారా తెలుసుకోడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.


    https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2


    https://www.dasubhashitam.com/blog/hari-avatharamule-akhila-devathalu

    4 min
  • 46. Kotta Dasubhashitam App Vidudala

    Kathalu Kaburlu S02E46


    మాది కంచుమర్రు అని అత్తిలి మండలంలో ఉన్న ఒక గ్రామం. ఎనిమిదేళ్ళ వయసు వరకూ నా బాల్యం అంతా ఆ ఊరిలోనే గడిచింది. పెంకుటిల్లు, వీధి అరుగులు, ఇంటి ఎదురుగా కాలువ, కాలువ గట్టు అంతా చెట్లు, ఇంటి ముందు కూడా రకరకాల మొక్కలు.. ఇలా కథల్లో వర్ణించే పల్లెటూరు వాతావరణంలో పెరిగాను నేను. అందుకే కథల్లో వచ్చే ఇలాంటి వర్ణనలను త్వరగా పట్టుకోగలను. ఆ ప్రదేశాలకు క్షణంలో చేరుకోగలను.


    నా ఈ చిన్ని జీవితంలో అతిపెద్ద మలుపు మా నాన్నగారి బదిలీ. తాడేపల్లిగూడెం అనే పట్టణం వెళ్ళబోతున్నాం అని తెలిసినప్పుడు, నా ఊహ ఎంత గారడీ చేసిందో చెప్పలేను. అప్పటికి పట్టణం అంటే అత్తిలి, భీమవరమే తెలుసు నాకు. అది కూడా కొన్ని వీధులే. అందుకే నేను క్రమం తప్పకుండా చదివే కథల పుస్తకాన్ని ఆసరగా తీసుకున్నాను. అందులో జాతీయ, అంతర్జాతీయ కథలలో వర్ణించే పట్టణాలను ఊహించుకున్నాను.


    విశాలమైన వీధికి అటు పక్క, ఇటు పక్క డాబాలు. వీధి చివర్లో రెండు అంతస్థుల మేడ. వారికి ఒక బొచ్చు కుక్క. వీధి మొగల్లో ఒక వైపు departmental store, మరో వైపు రోజాలు, డాలియాలు వంటి గొప్ప పువ్వులు అమ్మే boquet shop. రహదారికి రెండు వైపులా చెట్లు ఇలా ఉండేది నా ఊహ.


    తీరా వెళ్ళాకా ఆ ఊహ కొంత మాత్రమే నిజం. అన్నీ పెంకుటిళ్ళే, రెండు వీధుల అవతల మా ఊళ్ళో ఉన్నదాని కన్నా కొంచెం పెద్ద కిరాణా కొట్టు ఉంది తప్ప, departmental stores గట్రా ఏమీ లేదు. ఇక boquet shop గురించి నేను చెప్పనవసరం లేదేమో. ఒక రెండు అంతస్థుల మేడ, చెట్లు మాత్రం ఉన్నాయి. చిన్న ఊరు నుండి, పెద్ద ఊరికి వచ్చినట్టు అనిపించింది మా వీధి చూసి.


    ఈ విషయం గుర్తు చేసుకున్నప్పుడల్లా ఊహ అనేది చిన్నారి మనసులుకు, వారి ఎదుగుదలకు ఎంత ముఖ్యమా అనిపిస్తుంటుంది నాకు. నాకు నేనే ఒక అందమైన వీధిని సృష్టించుకుని, దాదాపు రెండు నెలలు ఆ వీధిలో మానసికంగా తిరగగలగాడినికి నా పఠనమే కదా కారణం. అందుకే మండువ రాధ గారు తన 'పిల్లలు - బొమ్మలు' పుస్తకానికి permission ఇచ్చినప్పుడు నా ద్వారా దాసుభాషితం చిన్నారి శ్రోతలకు ఈ పుస్తకం అందితే బాగుంటుంది అనిపించింది(పూర్తిగా నా స్వార్ధమే).


    అందుకే, పాపం మీ శ్రవణ, మానసిక ఆరోగ్యాలను అస్సలు దృష్టిలో ఉంచుకోకుండా నా అద్భుతమైన గాత్రంలో రికార్డ్ చేసేహేసేశాను. ప్రభ గారు, మన content moniter చేసే రమా సుందరి గారు చాలా బాగా చదివారు అని మెచ్చుకున్నారు(privateగా లెండి) అంటే మీ ఆరోగ్యం safe అనే కదా. కాబట్టీ, నిరభ్యంతరంగా, నిర్భయంగా వినండి. మీకు బుజ్జాయిలు ఉంటే వారికీ వినిపించండి. పిల్లలు involve అయ్యారు కాబట్టీ శాపాలు గట్రా పెట్టను లెండి.


    ఈ వారం newsletterలో ఈ release గురించే కాక, దాసుభాషితం app release గురించి కూడా update ఉంది. కాబట్టీ, కథలు-కబుర్లు వినక తప్పదు, blog post చదవకా తప్పదు.


    https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2


    https://www.dasubhashitam.com/blog/kotta-dasubhashitam-app-vidudala

    6 min
  • 45. Mee Illante Meeku Ishtamena ?

    Kathalu Kaburlu S02E45

    మొగుడు వదిలేసిన ఆడది నోముకి ముత్తైదువగా ఎలా పనికొస్తుంది? ఇలాగే పెంకిగా ఉండి ఉంటుంది, అందుకే మొగుడొదిలేశాడు. దానికి తప్ప పిల్లలు మరెవరికీ లేరు మరి, రెక్కల కింద కోడిపిల్లల్ని దాచుకునే కోడిపెట్టలాగా ఎలా పెంచుతోందో చూడు. హవ్వ, ఇద్దరు పిల్లలుండగా మళ్ళీ పెళ్ళేమిటో. మొగ దిక్కు లేని సంసారం ఇలాగే ఏడుస్తుంది. ఎంత పెళ్ళి చేస్తే మాత్రం, మొగుడొదిలేశాడని ఇలా పుట్టింటి మీద పడి తినడమే? ఇలా ఉంటాయి సగటు సమాజం మాటలు. అందమైన సంసారం అంటే ఏమిటో తెలియని ఆడవాళ్ళ కష్టంలో వీసమెత్తు అయినా ఎరుగని ప్రతీవాళ్ళూ judgment లు పాస్ చేసేసేవాళ్ళే.
    ఆ కష్టం నేను పడనప్పుడు దాని మీద మాట్లాడే హక్కు నాకు ఉందా? అని ఒక్క క్షణమైనా ఆలోచించరు. friends sitcomలో rachel అంటుంది ‘No uterus, No opinion’ అని. నీకు లేనిదాని గురించి, తెలియనిదాని గురించి మాట్లాడడం తప్పు. ఇక judge చేయడం హీనం. సమాజం single parents గురించి ఇంకా sensitive కావాల్సిన అవసరం చాలా ఉంది. ఇంద్రగంటి జానకీబాల గారి లాంటి రచయితల కథలు వింటే, ఎందరో స్త్రీలు, వారి కుటుంబసభ్యులు తప్పక relate అవుతారు.
    అందరమూ ప్రేక్షకులమే శ్రవణ పుస్తకం : https://www.dasubhashitam.com/ab-title/ab-andaram-prekshakulame
    వారి కథల విడుదల సందర్భంగా నేను రాసిన న్యూస్ లెటర్, కథలు కబుర్లు ఇవిగో.
    Blog post : https://www.dasubhashitam.com/blog/mee-illante-meeku-istamena
    Podcast:- https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2

    6 min
  • 44. Paga? Karuna? Deniki Votu ?

    Kathalu Kaburlu S02E44


    ఈ వారం విడుదలైన విశ్లేషణ ‘ది ఇన్ స్పెక్టర్’ అనే నవల గురించి. యూదుల ఊచకోత నాకు తెలిసినప్పటి నుంచి చాలా సెన్సిటివ్ విషయం.ఒక జాతిని, అంత దారుణంగా హింసించడం నాకు అర్ధం కాలేదు. అసలు అందులో లాజిక్ ఏంటి? వాళ్ళకన్నా నీ జాతి గొప్పది అని నువ్వు భావించినంత మాత్రాన అది అయిపోతుంది? ఒక వేళ నీది గొప్ప జాతి అయితే, చిన్న జాతిని నువ్వు కాలరాయచ్చు అని ఏ దేవుడైనా పర్మిషన్ ఇచ్చాడా? ఇలా పోతుంటాయి నా భావాలు.ఇలాంటి దారుణమైన హింసాకాండ నేపద్యంలో ఒక 21 ఏళ్ల యువతి గురించి సాగుతుంది ఈ నవల.


    వినండి ది ఇన్ స్పెక్టర్’ : https://www.dasubhashitam.com/ab-title/pc-the-inspector


    ---


    Blog post : https://www.dasubhashitam.com/blog/paga-karuna-deniki-otu


    Podcast:- https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2


    5 min

About Kathalu. Kaburlu. (Dasubhashitam)

From the publisher's feed

దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యే కొత్త పుస్తకాల వివరాలు, సంభాషణలు, మా ఆలోచనలే ఈ పాడ్‌కాస్ట్.