'Tholagina Nili Nidalu episode 4' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సమస్తం కోల్పోయాక స్పృహలోకి వస్తే.. ?..
సబ్ కుచ్ లుటాకే గయా ఆయే, భీతో క్యా కియా.. దిన్ మే అగర్
చరాగ్ జలాయే తో క్యా కియా //సబ్ కుచ్//
( సమస్తమూ కోల్పోయాక స్పృహలోకి వచ్చి మాత్రము ఇప్పుడు చేయగలిగింది
ఏముంది? తెల్లారిపోయాక దీపాలు వెలిగించి మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏముంది?)
హమ్ బద్నసీబ్ ప్యార్ కీ రుస్వాయి బన్ గయే,
.. ఖుద్ హీ లగాకే ఆగ్ తమాషాయీ బన్ గయే
.. తమాషాయి బన్గయే.. చమన్ సే అబ్ యే
షోలే బుఝాయే తో క్యాకియా.. దిన్ మే అగర్
చరాగ్ జలాయే తో క్యా కియా //సబ్ కుచ్//
( ప్రేమలో అప్రతిష్టపాలైన దురదృష్టవంతుణ్ణి నేను, నాకు నేనే నిప్పంటించుకుని ఒక తమాషాగా మారిపోయాను.. తమాషాగా మారిపోయాను. ఉద్యానంలోని ఈ
జ్వాలలని చల్లార్చి మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏముంది? తెల్లారిపోయాక దీపాలు వెలిగించ్ మాత్రం ఇప్పుడు చేయగలిగంది ఏముంది?)
లే- లే కే హార్ పూలోంకే ఆయీ థీ బహార్, ..
.. నజర్ ఉఠాకే హమ్నే హీ దేఖా న ఏక్ బార్,
దేఖానా ఏక్ బార్.. ఆంఖే సే అబ్ యే
పర్దే హటాయే తో క్యా కియా.. దిన్ మే అగర్
చరాగ్ జలాయేతో క్యా కియా//సబ్ కుచ్//
( వసంతం పలుమార్లు పూలమాలలని వెంటేసుకుని రానైతే వచ్చింది. నేనే..
ఒక్కసారైనా చూడనేలేదు. కళ్ళ ముందరి పరదాలను తొలగించి మాత్రం ఇప్పుడు
చేయగలిగింది ఏముంది? తెల్లారిపోయాక దీపాలు వెలిగించి మాత్రం ఇప్పుడు చేయగలిగింది ఏముంది?)
( తన ప్రేమను తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. ప్రేమించిన ప్రియుడి దగ్గరా వ్యక్తపరచలేదు. )
--------------------------
"కన్యమే వృష్టతో భూయా స్తద్వానాన్మోక్ష మాప్నయాం.. "
ప్రతిజ్ఞ మంత్రోక్తంగా వధువు గళసీమన వరుడు తాళిగట్టే పవిత్రమైన కార్యం.
స్త్రీ పురుషులు.. ఏకమై.. ఐక్యమై.. ఆలుమగలు.. " అనే ఏకపదంగా రూపాంతరం చెందే శుభలక్షణం!
వైవాహిక బంధమంటే.. నూలుపోగు దారాన తాళిబొట్టు, పసుపు కొమ్ము కట్టి మూడు ముడులు వేయుట కాదు.
వివాహబంధమంటే.. స్త్రీ జీవితమనే నూలుపోగు దారాన ' భర్త' నే పసుపుకొమ్ము గా కట్టుకుని ఎల్లప్పుడూ గుండెల్లో భద్రంగా దాచుకోవడం!
చేయి కలిపి కాలు తొక్కించటంలోని పరమార్థం.. పాణి పట్టి పాణిగ్రహణం ఒనర్చిన ప్రాణనాధుని ప్రథమస్పర్శ పదిమందికి ఆమోదయోగ్యమైనదే అని చాటి చెప్పడం..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.