'Premante Idena Part 6' - New Telugu Web Series Written By Penumaka Vasantha
'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 6' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
నాకు ఒక వైపు ఆనందం మరో వైపు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఆనంద్ నన్ను ఇష్ట పడుతున్నాడా!? మేఘాల్లో తేలిపోతునట్లుగా ఉంది. ఇన్నాళ్లు, నన్ను, ఇష్ట పడటం లేదనీ ఆనంద్ మీద పీకల దాకా కోపం ఉంది. ఇపుడేమో ఇష్టపడుతుంటే.. అయోమయం గా ఉంది. ఇందుకేనా! ఆడవారి మాటలకు, ఆర్ధాలే వేరులే అనేది.
అంటే, నేను ఆనంద్ ను ఇష్ట పడుతున్నానా!? ఇదేనా ప్రేమంటే? ఆనంద్, ఫోన్ చేస్తే, ఏమి మాట్లాడాలి.. కాని నేను నా సుఖం చూసుకొని వెళ్లిపోతే నాన్న అప్పులు ఎవరు తీరుస్తారు. పిచ్చి నాన్న.. అందరూ నీలాగా వుండరు. నువ్వు అమ్మమ్మ వాళ్లకు ఎంత హెల్ప్ చేసావో! మాకు తెలుసు. తాతయ్య పోతే పిన్నికి పెళ్లి చేసావు. మామయ్యను చదివించావు. అదే అక్కను ఇచ్చిన బావ మనకు అంత హెల్ప్ గా లేడు. పండగకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదంటూ! ఒకటే నస.
అందుకని, ఇపుడు బాగున్నా ఆనంద్ తర్వాత మీ అమ్మ వాళ్ళు ఏమి ఇవ్వలేదంటే ఏమి చేయాలి. !? ఒకవేళ ఆనంద్ కు లేకపోయినా వాళ్ల అమ్మానాన్న కుంటే కాదనలేడు కదా! ఇవన్నీ క్లియర్ చేసుకుంటేనే నేను ఆనంద్ తో పెళ్లికి ఒప్పుకోవాలనుకున్నా.
ఆ ఈవెనింగ్ ఆఫీస్ నుండి వచ్చి కాఫీ తాగుతుంటే కాల్ చేసాడు ఆనంద్. "హలో” అన్నాను.
"నేను ఆనంద్ నండి” అన్నాడు. నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. "ఆ.. చెప్పండి."
"థాంక్స్, ఓకే చెప్పినందు”కన్నాడు.
"కానీ!" అని నేనసుగుతుంటే..
"అర్థమైంది!.. మీరు ఏమి మాట్లాడతారో! రేపు సండే మీకు వీలైతే ఒకసారి కలిసి మాట్లాడుకుంటే, ఇవన్నీ, క్లియర్ అవుతాయి కదా!" అన్నాడు ఆనంద్.
"అవునండీ! ఇంటికి రండన్నాను. "
"ఓకే! కొంచం రేపు అయినా.. కాస్త మనసు విప్పి మాట్లాడుతారుగా!" అన్న ఆనంద్ తో నవ్వుతూ.
"ట్రై చేస్తా లెండ”ని ‘బై’ చెప్పి పెట్టేసాను.
రేపు ఆనంద్ వస్తాడనగా ఇల్లంతా సర్ది ఉంచాను. ఉన్న వాటిల్లో వైట్ ఆర్గంజ్ శారి తీసి కట్టుకుని ముత్యాల దండ వేసుకుని రెడీ అయి ఫస్ట్ టైం చాలా ఇంటరెస్టింగ్ గా తయారయ్యాను. తయారవుతూ.. 'ఎందుకు ఇలా రెడీ!? అవ్వటం ఆనంద్ ను ఇంప్రెస్స్ చేయటానికా! ఇదేనా ప్రేమ అంటే.. నో అదేమీ! కాదు. ఆత్మ సౌందర్యం తో పాటు బాహ్య సౌందర్యం కూడా ఉండాలంటూ' ఇలా రెఢీ అవ్వటం తప్పు కాదంటూ!' మనసును సమాధానపెట్టాను.
కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించటం తో వెళ్లి డోర్ తీస్తే ఎదురుగా ఆనంద్! ఏదో తెలియని సిగ్గు ఆవరించగా "లోపలికి రండి" అని సోఫా చూపించాను.
"మంచి నీళ్ళు కావాలా?” అని అడిగాను.
ఓ.. ! మీకు మాటలు కూడా వచ్చా?" చిరునవ్వుతో ఆనంద్ అడిగేసరికి "నేను చాల వాగుడు కాయను. కాకపోతే బాగా పరిచయం అయితే కాని మాట్లాడను" అన్నాను.
"ఇప్పుడు నేను పరిచితుడినా, అపరిచితుడునా!" అని ఆనంద్ అడిగేసరికి నవ్వు వచ్చింది.
"మీరు ప్రస్తుతానికి అపరిచితుడు. ఇపుడు మాట్లాడితే కాస్త పరిచితుడవుతారు. "
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/FgfretZbiIc