'Raghupathi Raghava Rajaram Episode 1- New Telugu Web Series Written By Parupalli Ajay Kumar
'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రఘుపతి స్పెషల్ క్లాస్ తీసుకోవాలని ఉదయం ఎనిమిది గంటలకల్లా హీరో స్ప్లెండర్ ప్లస్ మీద కాలేజీకి వచ్చాడు.
బైక్ స్టాండ్ వేస్తుంటే గర్ల్స్ టాయిలెట్స్ దగ్గర పిల్లలు, పెద్దలు గుమిగూడి ఉండటం చూసాడు.
ఏమైందోనని ఆదుర్దాగా అటు నడిచాడు. సుమారు ఇరవై ఏళ్ళ యువతి నేలమీద బోర్లా పడివున్నది.
వంటి మీద బట్టలన్నీ చిరిగిపోయి అస్తవ్యస్తంగా చెదిరిపోయివున్నాయి.
దాదాపుగా అర్ధ నగ్నంగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ప్రక్కనున్న పెద్దమనిషి తలకు చుట్టుకొనివున్న తువ్వాలుని అడిగి తీసుకొని ఆమెపై కప్పాడు.
గుంపును చెదరగొట్టి ఆ యువతి దగ్గరకు వెళ్ళారు.
ఒక కానిస్టేబుల్ ఆమె ముక్కు దగ్గర వేలు ఉంచి చూసాడు.
" సార్, ఈమె బ్రతికే వుంది. "
SI వెంటనే 108 కు ఫోన్ చేసాడు.
పోలీసుల వెంట వచ్చిన కెమెరామెన్ ఆమెను ఫోటోలు తీస్తున్నాడు.
ఆ యువతిని ఎక్కడో చూసినట్లు అనిపించింది రఘుపతికి.
జ్ఞాపకం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ SI దగ్గిరకు వెళ్ళి విష్ చేసాడు.
"SI గారూ ఈమెను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు గుర్తు" అని అన్నాడు.
"ఎక్కడ చూసారు?" SI అడిగాడు.
రఘుపతి రెండు నిమిషాలు ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు.
" ఆ గుర్తొచ్చింది. మా వూరి రైతు సీతయ్య బావమరిదితో కనిపించింది రెండుసార్లు. పెట్రోలు బంక్ దగ్గర ఒకసారి కనిపించింది. నేను పెట్రోల్ పోయించుకోవటానికి వెళ్ళినప్పుడు సీతయ్య బావమరిది శేషగిరి పెట్రోల్ బంక్ వాడితో గొడవపడుతున్నాడు.
అప్పుడు ఈమె శేషగిరి బండిపైన కూర్చొని కనిపించింది. మాములుగా అయితే అంత గుర్తుండేది కాదు. కానీ శేషగిరి గొడవకు అటు చూసిన నాకు ఈమె కనిపించింది.
శేషగిరి భార్య నాకు తెలుసు. ఈమెను చూసి ఎవరో బంధువులో, తెలిసిన వారో అనుకున్నాను. శేషగిరి నన్ను గమనించలేదు. రెండు మూడు నిమిషాలపాటు పెద్దగా అరచి అక్కడినుండి బండి తీసుకుని వెళ్ళిపోయాడు ఈమెతో పాటుగా.
రెండవసారి సినిమా హాల్లో కనిపించారు. మా ముందు వరుసలో కూర్చున్నారు వీరిద్దరూ. ఊళ్ళో సీతయ్యకు, మాకు పొలం సరిహద్దుల గురించి కొద్దిగా గొడవలున్నాయ్. అందుకే శేషగిరిని చూసినా పలకరించలేదు" చెప్పాడు రఘుపతి.
"శేషగిరిది ఏ వూరు?" అడిగాడు SI.
"గువ్వల పాలెం. ఎక్కువుగా అక్కగారింట్లో అంటే మావూరిలోనే ఉంటాడు. పిల్లలు లేరు. భార్య ఆ వూరిలో, ఇతను మావూరిలో.. జల్సా రాయుడని అందరూ అనుకుంటుంటే విన్నాను. అతనితో నాకు ఎక్కువ పరిచయం లేదు."
SI ప్రభాకర్ పోలీస్ స్టేషనుకు ఫోన్ చేసి వెంకటాయపాలెం, గువ్వలపాలెం లకు కానిస్టేబుల్స్ ను పంపించాడు.
శేషగిరి ఎక్కడున్నా పోలీస్ స్టేషనుకు తీసుకు రమ్మని.
ఆ యువతిని పట్టుకొని లేపుతుంటే దగ్గరగా వెళ్ళి చూసాడు SI ప్రభాకర్. గొంతు నులిమినట్లుగా కంఠంపై కమిలిపోయిన గుర్తులున్నాయి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/4z6lYvMkAXs