
Sign up to save your podcasts
Or


పచ్చని ప్రేమ
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అదొక అందమైన పల్లెటూరు. సీతయ్య, గౌరమ్మలు ఆదర్శ దంపతులు.
తమ ఊరిని, పిల్లలనే కాకుండా తాము పెంచుకొనే మూగ జీవాలను కూడా అభిమానిస్తారు.
అనుకోని పరిస్థితులలో ఇద్దరూ మరణిస్తారు.
వాళ్ళ అబ్బాయి రాము అనాధ అయ్యాడు.
కానీ బంధువులతో పట్నం వెళ్లకుండా అక్కడే ప్రకృతి మధ్య ఉండిపోయాడు.
ప్రకృతి ప్రేమికులకు నచ్చేలా ఈ కథను రాశారు రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
బరువెంత..?!
రచన: గొర్తి వాణిశ్రీనివాస్
అనుకోకుండా కష్టాలు వచ్చాయి గురునాథానికి.
అప్పట్నుంచి అతని ప్రవర్తన వింతగా మారింది.
పిచ్చిగాని పట్టలేదుగదా అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు .
కానీ తన వింత ప్రవర్తనకు కారణం వివరించాడు గురునాథం.
ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ ఈ కథను రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
వచ్చెను కనవే ఆమని
రచన: యశోద పులుగుర్త
పెళ్ళై ఏడేళ్లయినా ఆమనికి పిల్లలు లేరు.
మానసికంగా బాగా క్రుంగి పోయింది.
తన బంధువైన హరిప్రియ ఆమెకు ధైర్యాన్ని చెప్పింది.
ఆమని జీవితం లోకి ఆమని వచ్చిందా లేదా యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.
ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
చెక్క కంచం
రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు
కార్పెంటర్ రాఘవయ్య కు డెబ్బై ఐదేళ్లు. చెయ్యి తిరిగిన వడ్రంగి..
కొడుకు నాగరాజు కూడా మంచి పనిమంతుడే.
కానీ పక్కా తాగుబోతు.
మద్యం మత్తులో తండ్రిని చులకనగా చూస్తాడు.
రాఘవయ్య మనవడు వేణు, తాత పరిస్థితికి కరిగి పోతాడు.
తన తండ్రికి బుద్ధి చెబుతాడు.
ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఎడారి ఓరన తడి
రచన: పాండ్రంకి సుబ్రమణి
పైడిరాజు మంచి మనసున్న వ్యక్తి.
ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసే స్వభావం అతనిది.
అనుకోకుండా అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది.
ఆ పరిచయం అతన్ని ఏ తీరానికి చేరుస్తుంది?
ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
బ్రహ్మ రాతలో ఒక పేజీ | Brahma Raathalo Oka Page is a Telugu short story, originally published in manatelugukathalu.com
అనుచరులు చెప్పారనో, భార్య లేదా బంధువులు చెప్పారనో ధర్మాన్ని తప్పడం మనుషులకు అలవాటు.
కానీ భగవంతుడు రాగద్వేషాలకు అతీతుడని తెలియ చెప్పేకథ ' బ్రహ్మ రాతలో ఒక పేజీ' .
ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
అనుకుంటే అంతా మనవాళ్లే
Anukunte antha Manavalle is a Telugu short story , originally published in manatelugukathalu.com
ఈ కథ పేరు " అనుకుంటే అంతా మనవాళ్లే ".
అందరూ ఉన్నా వెటకారం వెంకట్రావు స్వార్ధంగా అలోచించి తనకెవ్వరూ లేరనీ, అంతా తన ఆస్తికోసం ఎదురు చూస్తున్నారనీ అనుకుంటాడు.
ఎవరూ లేని సంజీవరావు అందరూ తన వాళ్ళుగా భావిస్తాడు. అలాగే అందరూ అతన్ని తమవాడుగా అనుకుంటారు.
వెంకట్రావు పిల్లలు తండ్రికి కనువిప్పు కలిగించి, ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవని రుజువు చేస్తారు.
ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన ఈ కథ
మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
మిస్సవుతారు
రచన: బివిడి ప్రసాదరావు
బస్సు స్టాప్ లో కలుసుకున్నాడామెను.
తొలి చూపులోనే ప్రేమించేసాడు ఆమెని.
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
తన గురించి కొన్ని నిజాలు చెప్పిందామె.
అయినా అతను వెనక్కి తగ్గలేదు.
ఈ సరదాగా సాగే కథను ప్రముఖ రచయిత, బ్లాగర్ ప్రసాద రావు గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
నాతో పెట్టుకోకు
రచన: భాగ్యలక్ష్మి అప్పికొండ
బిచ్చగాడికి చిల్లర వెయ్యక పోగా క్లాస్ పీకాడు అతను.
మరి ఆ బిచ్చగాడు వూరుకున్నాడా?
'నాతో పెట్టుకోకు' అనే రేంజ్ లో రివెంజ్ తీసుకొన్నాడు.
భాగ్యలక్ష్మి అప్పికొండ గారు రాసిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ధనరాజు ఆస్తి ఇరవై కోట్లకు పైమాటే.
అనుకోకుండా పాత స్నేహితుడు పండుస్వామిని కలిసాడు.
తనకు కూడా ఓ నాలుగు కోట్లు ఉన్నాయని చెప్పాడు పండుస్వామి.
చెప్పడమే కాదు.
పూర్తి వివరాలు కూడా స్నేహితుడికి తెలిపాడు.
ఆసక్తికరమైన ఈ కథను ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
From the publisher's feed