
Sign up to save your podcasts
Or


ఆడపిల్ల జీవితం ఇంతేనా
రచన: రమ్య నముడూరి
అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడాలన్నా అత్తింటి వారి వైపు ఆంక్షలు.
చావు బ్రతుకుల్లో ఉన్న కన్న తండ్రిని పట్టించుకోలేదని పుట్టింటివారి విమర్శలు...
పుట్టినింటికి, అత్తింటికి మధ్య నలిగి పోయిన ఒక ఆడ పిల్ల కథను చాలా చక్కగా వివరించారు రచయిత్రి రమ్య నముడూరి గారు.ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఎవరికెవరు ఈలోకంలో
రచన: యశోద పులుగుర్త
నీలాచలం, రాజేశ్వరీదేవి దంపతులు కోటీశ్వరులు.
ఎవరితోనూ విభేదాలు,విరోధాలు లేవు.
ఐదుగురు పిల్లలు ఉన్నారు.
కానీ పిల్లల వల్లే వారు బాధలు పడ్డారు.
భర్త మరణానంతరం ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది.
కంట తడి తెప్పించే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
రచన : యశోద పులుగుర్త
పెద్దవాళ్లకు పనులు చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు అనుకోవడం పొరబాటు.
'తమకు గుర్తింపు ఇచ్చి, బాధ్యతలు అప్పగించినట్లు భావించి, సంతోషిస్తారు' అనే సున్నితమైన విషయాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన విజయదశమి 2021 కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
డాక్టరుగారి భార్య
రచన : పతి మురళీధర శర్మ
సుధాకర్ ఒక మనసున్న వ్యక్తి. మెడిసన్ పూర్తి చేసాడు.
అతని చేత ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టించాలని అతని తండ్రి భావించాడు.
కానీ అతను ఒక గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
అంకిత భావంతో పని చేసే అతనికి భార్యతో విభేదాలు వచ్చాయి.
తండ్రి జోక్యంతో తన అభిప్రాయం మార్చుకుందామె.
ప్రముఖ రచయిత పతి మురళీధర శర్మ గారు ఈ కథను రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
సరాగాల సంసారం
రచన…. నీరజ హరి ప్రభల.
దీప కోసం అన్న రమేష్ ఒక మంచి సంబంధం తెచ్చాడు. వదిన సరోజ మరో సంబంధం చూసింది. రెండూ కాదని, తాను ఎంచుకున్న ధీరజ్ ను చేసుకుంది దీప.
మరి వారి జీవితం ఎలా సాగిందో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించిన ఈ కథ వింటే తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
జంతు ప్రేమికుడు జగ్గన్న
రచన: పాండ్రంకి సుబ్రమణి
జంతువులంటే చెప్పలేనంత ప్రేమ జగ్గన్నకి.
మనుషులకంటే వాటినే ఎక్కువగా ఇష్టపడతాడు.
ఈ జంతు ప్రేమికుడి కథను చక్కగా మలిచారు ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
కబాడీ కల్యాణి
రచన: MRV సత్యనారాయణ మూర్తి
కబాడీ ఆడేవాళ్ళంటే హీరోలు అనుకుంటుంది కళ్యాణి.
ఆమెను ప్రేమించిన కృష్ణారెడ్డి పెద్దల ద్వారా సంప్రదిస్తాడు.
కబాడీ ప్లేయర్ నే చేసుకుంటానంటుంది కల్యాణి.
ఆమె కోసం కబాడీ నేర్చుకుంటాడు కృష్ణారెడ్డి.
MRV సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
సాధన
రచన: శిరిప్రసాద్
భానుమూర్తి మంచి దైవ భక్తుడు.
ప్రవచనాలు కూడా చెబుతుంటాడు.
కాన్సర్ బారిన పడి స్థిత ప్రజ్ఞత కోల్పోతాడు.
సమయానికి స్నేహితుడు రంగనాథ్ హితబోధ చేస్తాడు.
ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
తీరిన కోరిక
రచన : సీత మండలీక
కెరీర్ లో పైకి ఎదగాలనే తపన రమేష్ కి.అతనికి అన్ని విధాలా సహకరిస్తుంది భార్య రమ్య.పెళ్ళై నాలుగేళ్లు గడుస్తుంది.అతనితో పిల్లలు కావాలన్న తన కోరిక చెబుతుంది.మరి అతను ఏమంటాడో ప్రముఖ రచయిత్రి సీత మండలిక గారు రచించిన తీరిన కోరిక చదివితే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఋణానుబంధం
రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
యజమాని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు రంగడు.
కానీ ఆ విషయాన్నీ బయట పెట్టకుండా ఆయన పరువును కాపాడింది రంగడి భార్య వరాలు.
నిజం తెలుసుకున్న యజమాని భార్య శాంతమ్మ, వరాలుకు నమస్కరించింది.
ఈ కథను ప్రముఖ రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
From the publisher's feed