
Sign up to save your podcasts
Or


(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Bedisikottina Upayam' - New Telugu Story Written By D V D Prasad
'బెడిసికొట్టిన ఉపాయం' తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ఏమండోయ్! సూపర్బజార్కెళ్ళి ఈ సామాన్లు తెండి!" అంటూ చేంతాడంత లిస్ట్ తన చేతికందించిన తాయారు వైపు గుర్రుగా చూసాడు గుర్నాధం.
"నీకెన్ని సార్లు చెప్పాలి తాయారూ, నేను కథలు రాసేటప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని! సాయంకాలం తెస్తానులే!" విసుగ్గా అన్నాడు గుర్నాధం.
"అదేం కుదరదు. ఇప్పుడే కావాలి! అయినా మీరు కథలు రాసి ఇక్కడ ఉద్ధరించేదెవరిని? ఇవాళారేపు కథలు చదివేదెవరు? వెళ్ళిన ప్రతీ కథా గోడకి కొట్టిన బంతిలా తిరిగి రావడమే కదా! కాగితాలు, పోస్టేజి కోసం బోలెడంత డబ్బులు దండుగ!" అంది తాయారు ఈసడింపుగా.
"ఇప్పుడు అవేవీ లేవే! కథ మెయిల్ చేస్తే చాలు. అయినా నా కథల జోలికి రావద్దని నీకెన్ని సార్లు చెప్పాను? అసలు నీ దిష్టి తగిలే నా కథలన్నీ తిరిగి వస్తున్నాయని నా అనుమానం. ఇప్పుడు మంచి మూడ్ వచ్చి రాస్తూంటే చెడగొడ్తున్నావు నువ్వు." అన్నాడు గుర్నాధం భార్యవైపు కోపంగా చూసి.
"కావాలంటే బజారునుండి ఈ సామన్లు తెచ్చిన తర్వాత తీరుబడిగా రాసుకోండి, మీ జోలికి రానేరాను, సరేనా! సాయంకాలం మా తమ్ముడు, మరదలు వస్తున్నారు! వాడికి నేను చేసే స్వీట్స్, కారంపూస, పకోడీలు అంటే చాలా ఇష్టం. వెంటనే బయలుదేరండి!" ఆర్డర్ పాస్ చేసిందామె.
'ఓ…తిండిపోతు రామన్న, బకాసుర బామ్మర్ది వస్తున్నాడనమాట!' అని మనసులో అనుకొని, పైకి అంటే భార్య తన భరతం పడుతుందని, తను మరేం చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదని ఆ లిస్ట్ చేతబుచ్చుకొని కాళ్ళీడ్చుకుంటూ వీధిలోకి బయలుదేరాడు గుర్నాధం.
గుర్నాధం ఈ మధ్యే కొత్తగా కథలు రాయడం ప్రారంభించాడు. ఎప్పుడు కథ రాద్దామని కూర్చున్నా ఆమె ఏదో రాద్ధాంతం చేసి గుర్నాధాన్ని కుదురుగా కూర్చోనివ్వదు. రాసిన కథలు డబుల్ సెంచూరీ దాటినా, ప్రచురించబడిన కథలు ఒక్క బౌండరీ కూడా (అంటే నాలుగు) దాటలేదు.
అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పెన్ను పట్టుకొని కాగితంపైన దున్నుతూనే ఉన్నాడు గుర్నాధం. అందుకే ఆమెకి మరీ లోకువైపోతున్నాడు ఈ మధ్య. భర్త కథలు రాయడం ఆమెకి కిట్టదో, లేక మరే కారణమో కాని, గుర్నాధం కథలు రాయడానికి కూర్చోగానే అకారణంగా ఏదో ఒక పని అప్పచెప్తుంది. అమెతో వేగలేక పాపం సతమత మవుతున్నాడు గుర్నాధం.
ఎలా ఈ పనులనుండి తప్పించుకోవడమా అని ఆలోచిస్తూనే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నసూపర్బజార్కెళ్ళాడు. అసలే శనివారం, సెలవు రోజే కాకుండా నెలలో మొదటి వారం కూడా అవడంవల్ల సూపర్ బజార్ కిటకిటలాడుతోంది. తాయారు రాసిచ్చిన లిస్ట్ పట్టుకొని సామానంతా తీసుకునేసరికి అరగంట పట్టింది. తీరా డబ్బులు చెల్లించడానికి బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ చాంతాడంత క్యూ ఉంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/rYtLz_TsXyI
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Amma Leni Puttillu' - New Telugu Story Written By Penumaka Vasantha
'అమ్మ లేని పుట్టిల్లు' తెలుగు కథ
రచన: పెనుమాక వసంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"అమ్మ కు బాలేదక్కా! సీరియస్ గా ఉంది." రమ్మని తమ్ముడు కాల్ చేశాడు.
"అదేంటి.. రా నిన్న కూడా మాట్లాడాను, .. ఏమైంది? ముందు నిజం చెప్పు ఎలా ఉంది? అమ్మకు" అని అడిగాను.
"రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరు అక్కా!” అని సెల్ పెట్టేశాడు శరత్.
వెంటనే జర్మనీ నుండి ఇండియా కు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గానీ అమ్మ ఆలోచనలే మది నిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకుని ఏనాడూ సుఖ పడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎపుడూ ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకుని శ్రమ పడేది.
నాకు అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్ళిచేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మ కు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీ తో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
నా పెళ్ళికి అన్నయ్య సాయం చేయక పోయినా తమ్ముడు నా పెళ్ళికి అమ్మ తో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లి లో గొడవ చేయకుండా ఉంటే.. చాలని అమ్మ కోరుకుంది.
ఇలా నా పెళ్లి చేసి కొంచం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకూ తమ్ముడు కి మాత్రమే తెలుసు! అమ్మ తన పుస్తెలు కుదువ పెట్టీ మా పొలాలకి ఎరువులు, పురుగుమందులు తేవటం.
నాన్న తన తాగుడు కి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు, నేను ఆయన్ని బయటకు పంపే వాళ్ళం.
ఆయన అంత చేసినా ‘నాన్న అన్నానికి ఆగలే’డంటూ అన్నం కలిపి ఆయన నోట్లోపెట్టేది. మనుషుల్ని ప్రేమించటం, అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను.
ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు.. ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకుని హైదరబాద్ లో స్థిరపడ్డాడు. పండగకి చుట్టంచూపుగా రావటం చేసేవాడు.
‘పెద్దొడా!’ అని అమ్మ ప్రేమగా పిలిస్తే.. ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు మీద పడతాయనీ ‘ఆ.. ఏంటీ?’ అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు.
మా తమ్ముడు ‘అన్నయ్యను డబ్బులు అడుగుదాం’ అంటే అమ్మ ఊరుకునేది కాదు..
"చిన్నోడా! వాడు భార్య పిల్లలతో సిటీ లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో!? వద్దు నాన్నా! వాడిని అడగవద్దు" అనేది.
నా పెళ్లి మా బావతో అవ్వటం వల్ల కొంచం కుదట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది.
పెళ్లి ఖర్చులకి అమ్మ కి కొంత మనీ ఇచ్చింది. అపుడు అమ్మ వదిన్ని "నువ్వు నాకు కూతురువి! కోడలివి కాదు" అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకొంది.
‘మనందరం ఒకట! అత్తయ్య! దిగులు పడకండ’ని పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/QMzMcwDa0V4
రచన : మల్లవరపు సీతారాం కుమార్
భర్త అంటే చెప్పలేనంత ప్రేమ కల్యాణికి.
భార్య అంటే మరింత ప్రేమ శ్రీనివాస్ కి.
ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఎంతలా ఆలోచిస్తారో ఈ కథలో చక్కగా వివరించారు రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి
ముందుగా భార్య కల్యాణి రాసిన ఉత్తరంతో కథ ప్రారంభిద్దాం.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Q3ghiy62e5w
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నాకో గది కావాలి
రచన: శ్రీపతి లలిత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“అమ్మా, నువ్వు, నాన్న పొద్దున్న 10 గంటలకి రెడీ గా ఉండండి. మీకు ఓ సర్ప్రైజ్." అని ప్రదీప్ ఉదయం చెప్పినప్పటి నుంచి వైదేహి, జానకిరామ్ లకి ఒకటే ఆత్రం, ఏమిటి ఆ సర్ప్రైజ్ అని.
" అమ్మా! వంట పని పెట్టుకోకు. బయట తినేద్దాము." ప్రదీప్ చెప్పాడని త్వరగా తయారు అయ్యారు.
" అత్తయ్యా, మామయ్యా రెడీయేనా? ఆద్య ఏది? మనం ఇంకో అరగంటలో బయటికి వెళదాము. భోజనం బయటే." హుషారు గా చెప్పింది స్వాతి.
" ఏమిటమ్మా హడావిడి. ఏమిట్రా ఆ సర్ప్రైజ్" ఉండబట్టలేక అడిగాడు జానకిరామ్.
" అదేమరి. ముందే చెప్పేస్తారు." నవ్వేసాడు ప్రదీప్.
జానకిరామ్, వైదేహి ల కొడుకు ప్రదీప్, కూతురు ప్రభ. పెళ్లయి పిల్లలు ఉన్నారు. ప్రభ వాళ్ళకి స్వంత ఫ్లాట్, 3 బెడ్ రూంలది ఉంది. ప్రభ ఆమె భర్త ఇద్దరు ఉద్యోగస్తులు.
అత్తగారు, మామగారు వీళ్లతోనే ఉంటారు.
జానకిరామ్ ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేసి రిటైర్ అయ్యాడు.
వైదేహి గృహిణి. డిగ్రీ చేసినా కొన్ని కారణాల వల్ల ఉద్యోగం చెయలేదు. ప్రదీప్, స్వాతి, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు. వాళ్ళ పాప ఆద్యకి 2 ఏళ్ళు.
జానకి రామ్ రిటైర్ అయ్యాక, కొడుకు దగ్గరికి వచ్చేసారు.
జానకి రామ్ కి ఎక్కడా స్వంత ఇల్లు లేదు. ‘ఎక్కడ ఉంటే ఏమిటి.. పెన్షన్ వస్తుంది. ఎలానో ప్రదీప్ కి, స్వాతి కి, ఆద్య కోసం సాయం కావాలి’ అని వీళ్లతోనే ఉంటున్నారు.
ప్రదీప్ 2 బెడ్ రూంల ఫ్లాట్ లో అద్దెకి ఉంటున్నాడు,
ఒక బెడ్ రూమ్ వైదేహి వాళ్ళకి. ఇంకో బెడ్ రూమ్ ప్రదీప్ వాళ్లకి.
ఆద్య ఇంకా చిన్నది అమ్మ నాన్న తోనో, తాతా, బామ్మా తోనో పడుకుంటుంది. చిన్న హాల్, చిన్న వంటిల్లు, హాల్లోనే సోఫాలు, టీవీ, డైనింగ్ టేబుల్, పూజ రూమ్ లేదు.
అంతా అందులోనే ఇరుకుగ ఉన్నా అలానే సర్దుకు పోతున్నారు. ఒకటి రెండు సార్లు జానకిరామ్ అన్నాడు" లోన్ తీసుకోని ఫ్లాట్ తీసుకోవచ్చు కదా ప్రదీప్" అని.
" నాకు ఫ్లాట్ ఇష్టం లేదు నాన్న! చిన్నదైనా ఇల్లు ఆయితే బావుంటుంది." అన్నాడు ప్రదీప్.
ఈమధ్య ఇల్లు బాగా ఇరుకు అవుతోంది. ఎవరు వచ్చినా కూచోడం, పడుకోవడం ఇబ్బంది గా ఉంది.
‘ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటున్నారేమో’ అనుకుంటూ బయలుదేరారు. ఒక గంటా, గంటన్నర ప్రయాణం అయ్యాక ఊరికి కొంచెం దూరంగా ఒక చోట ఆపాడు కార్.
ఒక పెద్ద కాంపౌండ్ వాల్, పెద్ద గేట్, గేట్ తెరిస్తే లోపల అటు ఇటుగా ఒక వంద ఇళ్ల దాకా ఉంటాయి. అన్ని ఇళ్లు ఒకే రకంగా కింద, పైన ఉన్నాయి. ఇంకా పూర్తిగా అవలేదు. దానితో ప్రతి ఇంటి దగ్గర ఇటుకలు, సిమెంట్, సగం కట్టిన గోడలు కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి ప్రహరీ గోడ సగం కట్టి ఉంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/qlw8tpzskqA
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సెంటిమెంట్
రచన: కాలనోస్
“ఇదే రా ఇల్లు” అని అభి అన్నాడు నాతో.
“ఎప్పటినుంచి తాళం వేసి ఉంది?” అని అడిగాను.
“ఆరు గంటల నుంచి చూస్తున్నాను. తాళం వేసే ఉంది. పక్కింటి వాళ్లని అడిగాను. మధ్యాహ్నం నుండి ఇంట్లో లేరంట. ఎటెళ్లారో వారికి కూడా తెలియదట” అని వివరించాడు.
“ఇప్పుడేం చేద్దాం?”
“చేసేదేముంది? ఇంట్లో దూరి, రెండు నిమిషాల్లో పని కానివ్వాలి” అన్నాడు అభి.
నేను వెంటనే ఫోన్ తీసి యూట్యూబ్ కి వెళ్లాను. అక్కడ తాళాలు ఎలా తెరవాలో వెతకడం మొదలుపెట్టాను.
యూట్యూబ్ లో ఇలాంటివి కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా - అక్కడ దొరకనివి లేవు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/4bVsjfywWQ0
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
గోదావరి నవ్వింది
రచన : M R V సత్యనారాయణ మూర్తి
బెంగుళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగి తమ్ముడి పిల్లలు, మిధున్, వరుణ్ లకు బై చెప్పి లోపలకు వచ్చాడు కృష్ణ. చెకింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి పావుగంట పట్టింది. బోర్డింగ్ పాస్ లో ఉన్న ప్రకారం గేట్ నెంబర్ ఎనిమిది దగ్గరకు వెళ్లాడు. అప్పటికే రాజమండ్రి వెళ్ళే ప్రయాణీకులు క్యూ లో ఉన్నారు.
మరలా చెకింగ్ అవుతుండగా, ముందున్న నాలుగో వ్యక్తి ని బాగా చూసిన జ్ఞాపకం వచ్చింది కృష్ణకు. ఆవిడ, చెకింగ్ పూర్తి అవ్వగానే నాలుగు అడుగులువేసి, విమానం దగ్గరకు తీసుకువెళ్ళే బస్సు ఎక్కింది. తన చెకింగ్ పూర్తి అయ్యి అతను ముందుకు వచ్చేసరికి, ఆవిడ ఎక్కిన బస్సు వెళ్ళిపోయింది. ఆ తర్వాత బస్సు ఎక్కి కూర్చున్నాడు కృష్ణ . మిగతా పాసెంజర్లు వచ్చి ఎక్కిన తర్వాత, ఐదు నిముషాలకు గానీ బస్సు బయల్దేరలేదు. అతని మనసు చాలా ఆందోళనగా ఉంది. ఆమెని తప్పకుండా కలుసుకోవాలి. ఎన్నో విషయాలు మాట్లాడాలి.
బస్సు విమానం దగ్గర ఆగగానే గబ గబా దిగి, నిచ్చెన ఎక్కి విమానంలోకి వచ్చాడు. ఎయిర్ హోస్టెస్, పాస్ చూసి చిరునవ్వుతో సీట్ చూపించింది. తనూ చిన్నగా నవ్వి సీట్ దగ్గరకు వచ్చి బాగ్ పైన పెట్టి, ముందుకి చూసాడు, ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. ఇంతలో అతని పక్క సీట్ వ్యక్తి రావడంతో, కొంచెం జరిగి అతనికి దారి ఇచ్చాడు . అతనిది విండో సీట్. ముందుకు వెళ్లి ఆమెకోసం వెదుకుదామా? అనుకుని, సభ్యత కాదని ఊరుకున్నాడు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/3eAU2ZBNd-g
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పొద్దు వాలిపోతోంది
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సంధ్యాసమయం! సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు... పడమటి ఆకాశం ఎర్రగా కనిపిస్తూ సూర్యుడికి వీడ్కోలు పలుకుతోంది.
నేను వీధి వాకిట్లో నులక మంచం మీద పడుకున్నాను... పైన ఆకాశంలో అప్పుడే కనిపిస్తున్న చుక్కలు మెరుస్తున్నాయి. వీధిలో పశువులు ఇళ్ళకు వెళ్తూ ధూళిని రేపుతునాయి... అవును... ఇప్పుడు గోధూళి వేళ అయింది. ఈ పదానికి చిన్నప్పుడు నాకర్థం తెలిసేది కాదు. తెలిసే సరికి నేను వృద్ధుడనైపోయాను...
మా రైతు రాములు నా మంచం కింద దుడ్డు కర్ర, మంచి నీళ్ళ సీసా, విసన కర్ర పెట్టి వెళ్ళిపోయాడు... రెండు సంవత్సరాల నుంచీ నా దినచర్య ఇదే. నా భార్య శ్యామల నన్ను వదలి వెళ్ళిపోయిన దగ్గర్నుంచి వంటరిగానే ఇంట్లో గడుపుతునాను. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటునారు. శ్యామల చనిపోయినపుడు వాళ్ళిద్దరూ వచ్చారు. అప్పుడు నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మనమనీ చెబితే నేను వెళ్ళనన్నాను. దాంతో వాళ్ళు కోప్పడి మారైతు రాములు కప్పచెప్పి వెళ్ళిపోయారు. నేను పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుణ్ణి కాబట్టి ఫించను 50,000 వస్తోంది. పదెకరాల పొలం వుంది. డబ్బుకి ఏ ఇబ్బందీ లేదు. కాకపోతే తోడు లేదు. వంటరి జీవితం... ఇలా ఎన్నాళ్ళు గడపాలనీ నా బాధ.
ఆలోచనల్లోంచి తేరుకున్నాను... పడమర దిక్కు వైపు మళ్ళీ చూసాను... నా జీవితం కూడా పడమర దిక్కుకి చేరుకుంది ... అంటే సంధ్యా సమయం అన్నమాట... అస్తమించడానికి ఎదురు చూసే సమయం... నేనెక్కడో చదివాను... ” పొద్దు వాలిపోతోంది”... అని.... నాది కూడా అదే స్థితి...
ఆలోచనలు మళ్ళీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వంటరితనాన్ని వెంట బెడుతుంటాయట ఆలోచనలు.
రాను రాను ఆకాశం నల్లబడుతోంది... చీకట్లు కమ్ము కొంటున్నాయి... ఊరు సద్దుమణుగుతోంది... ఒకప్పుడు మా ఊరు ఎంత బాగుండేది. యవ్వనంలో సాయంత్రం ఏటి ఒడ్డున వాలీబాల్ ఆడుకొని ఇంటి కొచ్చేసరికి అమ్మ కమ్మటి భోజనాన్ని పెట్టేది. యవ్వనం కాబట్టి ఆకలి విపరితంగా వేసేది... అందుకే ఆ భోజనాన్ని ఆవురావురు మంటూ తినేసి వీధిలోకి బాతాఖానీ కోసం వెళ్ళిపోయేవాడిని. ఊళ్ళో మా కామేశం మాస్టారి గారింట్లో మళ్ళీ మా బేచంతా గుమిగూడేది... యన్టీ ఆర్ గొప్పంటే ఏయన్నర్ గొప్పనీ, కృష్ణ డేరింగ్ హీరో అనీ చాలా సేపు సినిమా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇంతలో మా మరో స్నేహితుడొచ్చి పక్క ఊరి టూరింగ్ టాకీసులో బొమ్మ మారిందని చెప్పడంతో ఆ సినిమాకి డబ్బులెలా సంపాదించాలోననీ ఆలోచనల్లో పడేవాళ్ళం.
ఆలోచనల్లోంచి మళ్ళీ బయట పడ్డాను..... తలగడ్డ సర్దుకొని ఆకాశం వైపు చూస్తూ పడుకున్నాను...
కానీ కళ్ళు మూతలు పడటం లేదు. నక్షత్రాలు మెరుస్తూ జీవితం క్షణ భంగురం అనీ గుర్తు చేస్తున్నాయి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/mb69uFoLw6I
'సుధ - ఎపిసోడ్ 4' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కధ:
రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింది సుధ. క్లాస్మేట్ విజయ్ తో పరిచయాన్ని, అతని గతాన్ని గుర్తుచేసుకుంది సుధ. విజయ్ తండ్రి రాఘవరావుకు రేవతి వలన దీప పుట్టింది. విజయ్, దీపలు చక్కగా పెరిగి చక్కగా చదువుకుంటున్నారు. సుధ తన తండ్రిని తలుచుకుంటూ మంచి మార్కులతో డిగ్రీ పాసై ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని మనసులో అనుకుంది. దీప స్నేహితురాలు మాధవి చెల్లెలు సుమ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే దీప, మాధవిలు కాలేజీ నుంచి అక్కడికి వెళ్తారు. సమయానికి హాస్టల్ వాళ్లు హాస్పిటల్ లో చేర్చగా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దీప ద్వారా విషయం తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి ఆమెను ఓదార్చి వాళ్ల ముగ్గురిని తనింటికి తీసుకువచ్చాడు.
ఈ వారం కధ చదవండి..
దీప గురించి కంగారు పడుతున్న రాఘవరావు దంపతులకు ఇంట్లోకి వస్తున్న విజయ్, దీపలను చూసి మనసు కాస్త ఊరట చెందింది. లోపలికి వచ్చిన విజయ్, దీపలతో కూడా ఉన్న అమ్మాయిలను చూసి ఎవరన్నట్లు కళ్లతోనే ప్రశ్నార్థకంగా చూశారు రాఘవరావు దంపతులు.
"అమ్మా! నేను, నా స్నేహితురాలు మాధవి హాస్టల్ లో ఉండి నాతోపాటుగా చదువుకుంటోందని నీకు లోగడ చెప్పాను. గుర్తుందా? ఈమే మాధవి. ఈమె తన చెల్లెలు సుమ" అని వాళ్లిద్దరినీ తల్లికి పరిచయం చేసింది దీప.
గుర్తుందని తలూపి నవ్వుతూ వాళ్లని పలకరించి కూర్చోమని సోఫా చూపించి లోపలికి వెళ్లింది రేవతి. ఆవిడ వెనకాలే విజయ్ వెళ్లాడు.
"అమ్మా! ఇందాక నేను దీపవద్దకు వెళ్లాను ఎందుకో తెలుసా! సుమ తనకు పరీక్షలలో రాంకు రాలేదని నిద్ర మాత్రలను మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే సమయానికి హాస్టలు వాళ్లు ఆమెని హాస్పిటల్లో చేర్చారుట. అతికష్టం మీద డాక్టర్లు బ్రతికించారుట. నేను హాస్పిటల్ కు వెళ్లే సమయానికి దీప, మాధవిలు సుమతోనే ఉన్నారు. ఆమెకు స్పృహ రాగానే ఆమెకు ధైర్యం చెప్పి డిశ్చార్జి చేసి వాళ్లని మనింటికి తీసుకొచ్చాను. తల్లీతండ్రి లేని వాళ్లను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనింట్లో రెండు రోజులు వాళ్లని ఉంచుకుని కాస్త నయమయ్యాక వాళ్లని హాస్టల్ కు పంపుదామమ్మా " అన్నాడు విజయ్.
విజయ్ చెప్పింది విన్న రేవతి చాలా బాధపడుతూ "అయ్యో! ఎంత గండం గడిచింది? ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుమ క్షణికావేశంలో ఈపని చేసుంటుంది. ఈ కాలం పిల్లలందరూ అంతే! ఆవేశం ఎక్కువ - ఆలోచన తక్కువ. అన్నింటికీ తొందరపాటే. రెండు రోజులు ఏంటిరా? నాకు మన దీప ఎంతో వాళ్లు అంతే! నయమయ్యేదాకా ఉండమను. నాలుగు రోజుల పాటు ఇక్కడి నుంచే వాళ్లు దీపతో కాలేజీకి వెళ్తారు. వాళ్లకు నేను చెప్తాలే! నీవు ఈ మంచినీళ్లు తీసుకెళ్లి వాళ్లకివ్వు. అందరికీ నేను టిఫిన్ చేసుకుని తీసుకుని వస్తాను. పాపం ఎప్పుడు తిన్నారో ? ఏమిటో? " అంది రేవతి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/2_u9bcUxfqM
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పంతులమ్మల హోటేళ్ళు
రచన : M R V సత్యనారాయణ మూర్తి
మా పెనుగొండలో కాఫీ హోటళ్లకు లోటులేదు. అడుగు అడుగుకి ఓ హోటల్ ఉంది.
అయితే కొంచెం పేరున్న హోటళ్ళు కొన్నే. గోంగూర తూము సెంటర్లో ఉన్న నారాయణరావు హోటల్, మినర్వా టాకీసు దగ్గర ఉన్న ఆనందరావు హోటల్, గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్న ఉడిపి అయ్యార్ హోటల్, జవ్వాదివారి మిల్లుకి వెళ్ళే దారిలో ఉన్న పాబోలు వారి హోటల్, లింగాలవీది చివర ఉన్న రామచంద్రం హోటల్, వంతెన దగ్గర ఉన్న జల్లూరి వారి హోటల్.
వీటి అన్నింటినీ ’డీకొనే‘ హోటళ్ళు రెండు ఉన్నాయి. అవే ‘పంతులమ్మల హోటళ్లు’.
ఒకటి మినర్వా టాకీసు రోడ్డు లో ఉన్న పంతులమ్మ హోటల్. టిఫిన్లు చాలా రుచిగా ఉంటాయి. పొద్దున్నే ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా ఉంటాయి. ఇడ్లీ లోకి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి ఉంటాయి.స్పెషల్ ఇడ్లీ అంటే, వీటితోపాటు నెయ్యీ, కారప్పొడి ఉంటాయి. రేటు కొంచెం ఎక్కువ.
బజారులోని వర్తకులు పంతులమ్మ గారి హోటల్ కి వచ్చి స్పెషల్ ఇడ్లీ ఖచ్చితంగా తిని వెళ్తారు. పంతులమ్మగారు సన్నగా, పొడవుగా ఉంటారు. అందరూ ’మామ్మగారూ’ అని పిలుస్తారు.
ప్రతివారినీ ఆప్యాయంగా పలకరిస్తారు.
“ఏరా, వెంకట్రాముడూ, అమ్మాయి పెళ్లి చేసావుట, ఏ ఊరు ఇచ్చావు?అబ్బాయి ఏం చేస్తాడు?”
ఇడ్లీ లోకి మరోసారి అల్లం పచ్చడి వేస్తూ నవ్వుతూ అడిగిన మామ్మగారిని చూడగానే, సిగ్గుపడ్డాడు వెంకట్రాముడు, మామ్మగారిని పెళ్ళికి పిలవలేదన్న విషయం గుర్తుకు వచ్చి.
తర్వాత తేరుకుని “ఇరగవరం ఇచ్చానండి, గంగాధరం నాయుడు గారి అబ్బాయికి. ఒక్కడే కొడుకండి. పదెకరాల పొలం, ఎకరం కొబ్బరి తోటా ఉన్నాయండి. అంతా హడావిడి అయిపోయిందండి” అన్నాడు తనూ చిన్నగా నవ్వుతూ.
అందుకే మిమ్మల్ని పిలవలేక పోయానన్న భావం వ్యక్తం చేసాడు వెంకట్రాముడు.
“చాలా బాగుందిరా అబ్బాయి. చాలా దగ్గరే ఇచ్చావన్న మాట. పిల్లని ఎప్పుడు చూడాలంటే అప్పడు పావుగంటలో సైకిల్ మీద వెళ్లి చూసి రావచ్చు. ఈసారి అమ్మాయి దగ్గరకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు.
రెండు కొబ్బరికాయలు ఇస్తాను. ఇరగవరం పాలేశ్వర స్వామి గుడిలో కొట్టి వద్దువుగాని” అన్నారు మామ్మగారు.
“అలాగేనండి. వెళ్ళేటప్పుడు మీకు కనిపించి వెళ్తాను” అన్నాడు వెంకట్రాముడు.
“ఏరా సూరిపండూ, మీ రెండో అమ్మాయికి పురుడు వచ్చిందటగా, మనవడా? మనవరాలా?”
పెసరట్టు, ఉప్మా టేబుల్ మీద పెట్టి అడిగారు మామ్మగారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/7yUq8jlD2Kg
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'అశ్వ మేధం - ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు మళ్లీ మొదలైంది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు ఒక సీల్డ్ కవర్ కోర్టుకి సమర్పిస్తూ "డిఫెన్స్ వారు ఆరోపించడం వల్ల పోలీసుశాఖ చక్రపాణి పై ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. దాన్ని ఏఎస్పీ స్థాయి అధికారికి అప్పచెప్పింది; ఈ సీల్డ్ కవర్ లో వున్నది అతనిచ్చిన రిపోర్ట్; ఆ రిపోర్టు ప్రకారం ఇద్దరు నేరస్తులను బీహార్ నుంచి ఒక కేసు విషయమై ఇక్కడకు తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళు హత్య జరిగిన సమయంలో లాకప్పులో ఉండటం వల్ల వాళ్ళు హత్య చేసే అవకాశం లేదు. కాకపోతే సాక్షి దీప తాను ప్రత్యక్షంగా చూసాను అని కేసులో చెప్పడంవల్ల వాళ్లను ముద్దాయిలుగా పేర్కొనటం జరిగింది. ఆ మర్నాడు వాళ్ళని వదలి పెట్టడం జరిగింది. మా పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి వారిని బీహార్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది.
కానీ దురదృష్టవశాత్తు అక్కడ పోలీసులు వాళ్ళని విడిచిపెట్టడంతో వారిని పట్టుకోవడానికి సమయం పడుతోంది. అయినా సరే వారం రోజుల్లో వారిని పట్టుకొని కోర్టువారి ముందు హాజరు పరుస్తాం” అని చెప్పాడు;
వెంటనే చరణ్ లేచి " యువరానర్... ప్రభుత్వ ప్లీడర్ గారు హత్య జరిగిన సమయంలో విక్రమసింగ్, రాంసింగ్ లిద్దరూ లాకప్పు రూమ్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సాక్షి దీపగారు మాత్రం వాళ్ళను తాను చూసానని చెబుతున్నారు. ఒక వేళ నిజంగా వాళ్ళు లాకప్పులోనే ఉంటే దీప వాళ్ళ చిత్రాలను ఎలా చిత్రించింది? ఆమె వాళ్ళనెప్పుడు చూడలేదు;పోలీసులు చెబుతున్నట్లు వాళ్ళు హత్య చెయ్యకపోతే వాళ్ళని ముద్దాయిలుగా ఎందుకు చెబుతున్నారు? అప్పుడు వాళ్ళని పట్టుకొని హాజరుపర్చడం వల్ల ఉపయోగ ఏంటి? అంటే ఈకేసులో ప్రభుత్వం సరిగ్గా విచారించలేదని తెలుస్తోంది.
ఒకవేళ ప్రభుత్వ వాదన ప్రకారం వాళ్ళిద్దరూ ముద్దాయిలు కాకపోతే మరి హంతకులెవ్వరు? కేసు పురోగతి, స్టేషన్ రిపోర్ట్ ఎందుకివ్వలేదు? ఏదైన ఈ కేసులో చక్రపాణిని విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని నాభావన. కాబట్టి కోర్టు వారు చక్రపాణి సి.ఐ. గారిని ఇంటరాగేషన్ చెయ్యడానికి అనుమతివ్వమని కోరుతున్నాను.” అన్నాడు చరణ్ కూర్చుంటూ..
“పెర్మిషన్ గ్రాంటెడ్” అన్నారు జడ్జి.
పది నిముషాల తరువాత చక్రపాణి ని బోనులో ప్రవేశపెట్టారు;
అప్పుడు చరణ్ అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు;
"మీ పేరు”
“ చక్రపాణి"
మీరు ఆపోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు?
* సుమారు 3 సంవత్సరాల నుంచి ”
“ మీకిది వరకు విక్రమ్ సింగ్ , రామ్ సింగ్ లు తెలుసా?”
“ప్లీజ్.. డోంట్ బీ సిల్లీ.. వాళ్ళు నాకు తెలియడం ఏమిటి?”
" మరి వాళ్ళని అప్ప చెప్పమని బీహార్ ప్రభుత్వానికి ఎందుకు ఉత్తరం రాసారు?”
" రెండు సంవత్సరాల క్రితం వాళ్ల గేంగ్ వచ్చి మన రాష్ట్రంలో ఎన్నో దొంగతనాలు చేసింది. వాళ్లని చెడ్డీ గ్యాంగ్ లని అంటారు. వీళ్లు చాలా తెగింపు కలిగిన ముఠా; అవసరం అయితే ప్రాణాలు కూడా తీస్తారు. సుమారు రెండు నెలలు క్రితం ఈఊళ్లో ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఆఇంటి యజమానిని రాడ్ తో కొట్టి చంపారు. ఆ దొంగతనం కేసులో వీళ్ళు అనుమానితులు; అందుకే వాళ్ళని పిలిపించాము.”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/0A3ca66RhUY
From the publisher's feed