Sign up to save your podcasts
Or

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/11/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కి చంద్రంని తీసుకు వచ్చి రెండురోజులయ్యింది. వచ్చిన రోజు మధ్యాహ్నం యాదిరెడ్డి అతడిని విచారించాడు. ఇంచుమించు రవళి చెప్పిన
విషయాలే అతడు చెప్పాడు కొన్ని మినహా.
పార్టీ మధ్యలో మనోరమ వెళ్ళి పోయిందన్నాడు. కానీ ఊర్మిళ వచ్చి పార్టీ మధ్యలో వెళ్ళిపోయింది. దిలీప్ రాలేదని చెప్పాడు. రెండూ తప్పులే. కానీ గెస్ట్హౌస్ వాచ్మెన్
చెప్పాడు. ఆ పార్టీకి దిలీప్ వచ్చాడు. మనోరమ చచ్చిపోయిందని యాదిరెడ్డి చెప్పడంతో చంద్రం మొహం భయంతో వణికిపోయింది. అసలీ విషయం దిలీప్ తనకు
ఎందుకు చెప్పలేదు? లోలోపల తిట్టుకున్నాడు.
ఈ లోగా సెల్లో ఉన్న యాదయ్యను తీసుకురమ్మనాడు యాదిరెడ్డి. యాదయ్య వచ్చి భయం భయం గా నిలుచున్నాడు. మాసిపోయిన బట్టలు, పీక్కుపోయిన
మొహం, గెడ్డం పెరిగిపోయి చింపిరి జుట్టుతో బాగా నీరసం తో ఉన్నాడు.
"పార్టీకి దిలీప్ వచ్చాడా ? మనోరమ చచ్చిపోయిందా" అనడిగాడు, యాదయ్యకేసి చూస్తూ యాదిరెడ్డి. ఎదురుగా ఉన్న చంద్రంని, ప్రక్కనే లాఠీతో ఉన్న కానిస్టేబుల్ ని, తన కేసి తీవ్రంగా చూస్తున్న యాదిరెడ్డి ని చూశాడు యాదయ్య. అవునన్నట్లుగా తలూపాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
'Kotha Keratam Episode 16' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 04/11/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 16' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“తాతయ్యా మీరూ ఒక సెల్ కొనుక్కోండి ఎంచక్కా మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చును” అన్నాడోరోజు.
సెల్ ఫోన్ పొడే కిట్టదు రామయ్యకి. కొడుకు ఎన్నో సార్లు ఫోన్ కొనిస్తానన్నా ససేమిరా వద్దన్నారు. అలాంటిది మనవడు చెప్తే కొనడమా!
నిర్ద్వందంగా తృణీకరించడమే కాదు ఇక సెల్ఫోన్ మాటే తన ముందు ఎత్తవద్దని ఖరాఖండిగా చెప్పేసరికి మనవడు ముఖం చిన్న బుచ్చుకున్నా తాత మనసు కరగలేదు.
ఒకరోజు స్కూలునుంచి వచ్చి, తాతగారు ఏ విషయంగానో ఆందోళనగా ఉండడం గమనించి ఉండబట్టలేక “ఏమైంది తాతయ్యా అంత కంగారు పడుతున్నారు?” ప్రక్కనే కూర్చుని అడిగాడు.
“పెద్ద సమస్యే వచ్చిందిరా మనవడా” నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ బదులిచ్చారు.
“ఏంటో చెప్పండి?”
“నేనిక్కడికి వచ్చేముందే, తల్లికి ఆరోగ్యం బాగా లేదని మన పాలేరు స్వగ్రామం వెళ్లాడు. వెళ్ళేముందే ఆమె వైద్యానికి డబ్బు అవసరమైతే ఫోన్ చేస్తాననీ పంపించమనీ చెప్పే వెళ్ళాడు.
ఇవాళ ఉదయం ఫోన్ చేసి కొంత డబ్బు తన అకౌంట్ లో జమ చేయమని అభ్యర్థించాడు. బ్యాంకుకి వెళితే వరుస సెలవలని తెలిసింది. ఇప్పటికిప్పుడు అంత పైకం ఎలా పంపాలో తెలియట్లేదురా? సమయానికి మీ నాన్నా ఇక్కడ లేడు” దిగులుగా అన్నారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/d9CS0Ym2Khk
'Manushulu' Marali Episode 2' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 01/11/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆరోజు సాయంత్రం సుప్రజ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆడపడుచు సరళ, ఆమె ఇద్దరు పిల్లలు వచ్చి ఉన్నారు. సరళ ఎందుకో సీరియస్ గా ముఖం గంటు పెట్టుకుని కూర్చుని ఉంది. అత్తగారి ముఖం కూడా సీరియస్ గా ఉంది. సుప్రజ భర్త మోహన్ కృష్ణ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. సుప్రజ మౌనంగా బాత్ రూమ్ లోకి వెళ్లి రిఫ్రెష్ అయి కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్లింది. కాఫీ కప్పులు తీసుకుని అత్తగారి గదిలోకి వెళ్లబోతుంటే అత్తగారి మాటలు ఆమెను గది గుమ్మందగ్గరే నిలబెట్టేసాయి. సంస్కారం కాకపోయినా అత్తగారు సరళను కోపంగా మాట్లనడం సుప్రజ చెవిని పడ్డాయి.
“ఏమైనా నీవు తొందరపడకుండా ఉండ వలసిందే సరూ, మీ అత్తగారితో పోట్లాట పెట్టుకుని వచ్చేయడం సబబుగా లేదు. నీదంతా తొందరపాటు స్వభావమే. మీ ఆయనకు నెమ్మదిగా నచ్చ చెప్పు కోవాలేగానీ, ఇలా వచ్చేయడం ఏమంత బాగుందే. నీ తమ్ముడు మోహన్, సుప్రజ ఏమనుకుంటారు? ముఖ్యంగా సుప్రజ దృష్టిలో ఎంత లోకువైపోతావో ఆలోచించావా? అల్లుడికి అసలే పంతం ఎక్కువ. నిన్ను బ్రతిమాలడానికి వస్తాడనుకుంటున్నావా?”
సుప్రజకు పరిస్తితి చూచాయగా అర్ధం అయింది. ముందస్తుగా లేని దగ్గును తెచ్చుకుంటూ వేడి వేడి కాఫీ వాళ్లకు అందించింది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/_tWNu16CJy8
'Prema Entha Madhuram Episode 10' - New Telugu Web Series Written By
Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 01/11/2023
'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“నాకు తెలుసునండి.... మీ గురించి... మీరు... నాకు సంజాయిషీ చెప్పనవసరం లేదు”.
"సుశీల! నేను అంటే ఇష్టమేనా"?
"మళ్లీ మొదలెట్టారు!.... శ్రీవారు.. మీరంటే నాకు చాలా... చాలా ఇష్టం.... ఇదంతా చేసింది... మీ దిగులు పోగట్టడానికి... మీ మీద అనుమానము తో కాదు శ్రీవారు... "
“పద... ఇంటికి పద…”
అందరూ వెళ్ళిపోయారు...
కార్ స్టార్ట్ చేసి సతీష్ చల్లటి వెన్నెల లో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ చల్లటి గాలిలో... పక్కన తనని ఎంతగానో ప్రేమించే సుశీ... తల బుజం మీద వాల్చి నిద్రపోతుంటే, తనకోసం ఇంత చేసిన తన సూసీ ని చుస్తువేంటే.... ఎంతో ఆనందంతో.. తన మనసులో దిగులంతా... మర్చిపోయాడు సతీష్.
మర్నాడు... మార్నింగ్ సతీష్ కు ఫోన్ వచ్చింది...
"హలో"
"హలో! నేను కళ్యాణి"
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/5HSdBwx61ps
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 31/10/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చంద్రం పనిచేసే చోట మఫ్టీలో కానిస్టేబుల్ను పంపించి అతడి ఇంటి చిరునామా, వగైరా వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ప్రస్తుతం అతడు వైజాగ్ కాంపులో ఉన్నా,డని ఆఫీసు పని పూర్తి చేసి అక్కడ నుంచే అతడు వారం రోజులు సెలవు పెట్టాడని, ఆఫీసు వాళ్ళు చెప్పారు.
వైజాగ్ లో అతడు ఆఫీసు పని మీద ఎక్కడెక్కడ తిరిగాడో, సాధారణంగా అక్కడ ఏ లాడ్జిలో దిగుతాడో, ఎక్కడ దిగాడో వివరాలు సేకరించాడు యాదిరెడ్డి. ఆ వెంటనే విశాఖ పోలీసులకు పోన్లో వర్తమానం పంపించాడు. తక్షణం అదుపులోకి తీసుకోమని.
చంద్రానికి ప్రొద్దునే దిలీప్ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపో. వాచ్మెన్ పోలీసుల దగ్గర అంతా కక్కేసాట్ట అని. అతడికి రెండు సిమ్లున్నాయి.
ఒకటి అందరికీ తెలిసిన నంబరు. రెండోది సీక్రెట్. ' రవళి కి చెప్పాలనుకొన్నాడు కానీ అది ముందే పోలీసులకు అంతా చెప్పేసింది. కొన్నిరోజులు కనబడకుండా తిరిగితే ఈ
లోగా దిలీప్ ఏదో విధంగా మానేజ్ చేస్తాడు. యాదిరెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించడమే.. ఇంకేదైనా సరే చేయించగలడు.
దిలీప్ గురించి బాగా ఎంక్వయిరీ చేయించాడు. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. ఫోన్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సిమ్ మార్చేశాడని ఎప్పుడో ఊహించాడు. ఎందుకంటే ఎన్నో రకాల బెదిరింపులు వచ్చాయి. కొన్ని వందల క్రిమినల్ కేసులను చూశాడు. అదీ కాక రాజకీయ వత్తిళ్ళు ఎదురుకొన్నాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/9T3MDNj20cs
'Kotha Keratam Episode 15' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 30/10/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 15' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
స్నేహితుడి దుఃఖం చూడలేక బాధపడుతున్న మనవడిని ఓదారుస్తూ “అయితే ఆయనకి మంచి వైద్యం చేయిస్తే తగ్గే అవకాశం ఉందని చెప్పారా!” సాలోచనగా అన్నారు.
“అవును తాతయ్యా”
“నువ్వో పని చెయ్యి. ఆయన మెడికల్ రిపోర్టులు తదితర వివరాలన్నీ మీ ఫ్రెండ్ ని అడిగి నాకు తెచ్చియ్యి. నాకు తెలిసిన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారు. అతడిని సంప్రదించి మీ ఫ్రెండ్ కుటుంబ పరిస్థితులు వివరించి వీలైతే వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గించమని అడుగుతాను.”
“నిజంగానా. మీదెంత మంచి మనసు తాతయ్యా” భార్గవ ముఖంలో చాలారోజుల తర్వాత నవ్వు చూసి రామయ్య మనసు తేలికైంది.
“ఇంకో విషయం, నువ్వు నీ స్నేహితులూ కూడా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నామన్నావు కదా! మన కాంప్లెక్స్ లోనే సుమారు 300 ఇళ్ళదాకా ఉన్నాయి. ఫ్లాట్స్ అసోసియేషన్ సెక్రటరీకి విషయం వివరించి ఫండ్ రైజింగ్ కాంపైన్ చేద్దాము. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. మీ స్నేహితులనీ అలాంటిదేదో చేసి డబ్బులు సమకూర్చమని చెప్పు. అలా జమ అయిన మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందచేద్దాము. అలా వాళ్ళ అవసరానికి మనవంతు సహాయం చేసినట్లు అవుతుంది. ఏమంటావు?”
“చక్కటి ఆలోచన. ఊరికే దిగులు పడ్డాను తప్ప ఇలా చేయవచ్చని ఆలోచనే తట్టలేదు ఎందుకని తాతయ్యా ఛ ఛ” నుదురు కొట్టుకున్నాడు.
“అందులో నీ తప్పేమీ లేదురా. ఇటువంటి వార్తలు విన్నప్పుడు బాధతో సహజమైన ఆలోచనా శక్తిని కూడా కోల్పోతాము. పైగా మనవాళ్ళెవరికైనా ఇలా జరిగితేనో అనే భయం కూడా కమ్మేసి బుర్ర ప్రత్యామ్నాయాల గురించి అలోచించదు.”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/EbiTVGH4eJc
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 26/10/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“సార్, మన గెస్ట్ హౌస్ వాచ్మెన్ పోలీసులకి అన్ని విషయాలు చెప్పేశాట్ట! స్టేషన్ నుంచి ఇప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పాడు.. ఏసీపీ బాడీని బయటకు తీయించడానికి బయలుదేరాడట” మినిష్టర్ గోవిందరావు కి, పి. ఏ మణి ఫోన్లో చెప్పాడు.. హడావుడిగా.
తనకి పి. ఏ గా పనిచేస్తున్నా అతడికి నమ్మకస్తుడు మణి. గోవిందరావు ఎమ్మెల్యే గా పనిచేస్తున్నప్పటి నుంచి.. అంటే దాదాపు పది ఏళ్ళ నుంచి తన జెండా పట్టుకుని ఎజెండా వలె తిరిగాడు. ఎన్నికల ప్రచారంలో తన ఆఫీసులో డబ్బు దస్కం అంతా అతడి చేతుల మీదుగా జరిగింది. నిజానికి మణి అతడి ఇంట్లో మనిషిలా ఉంటాడు. పిఏ. చెప్పిన మాటలకు గోవిందరావు ముఖం చిట్లించాడు.
"వాచ్మెన్ గాడికి ఏమైంది? " అడిగాడు గోవిందరావు.
"పోలీస్స్టేషన్ లో లాఠీతో నాలుగు పీకేసరికి నిజం కక్కేశాట్ట. సార్, భార్యాభర్తలిద్దరినీ ఉతికారుట”.
"అసలు మనగెస్ట్హౌస్ లో పార్టీ జరిగినట్లు పోలీసులకి ఎవరు చెప్పారుట?” కోపంగా గోవిందరావు అడిగాడు.
"ఆ అమ్మాయి, అదే చనిపోయిన అమ్మాయి మనోరమ కనబడటం లేదని కంప్లయింట్ ఇచ్చారట సార్. దాంతో డొంకంతా కదిలింది”.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/tRz0kjFnS0A
'Prema Entha Madhuram Episode 9' - New Telugu Web Series Written By
Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 26/10/2023
'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుశీల, సతీష్ కార్ లో హోటల్ కు చేరుకున్నారు..
అక్కడ ఏర్పాట్లు చూస్తోంది కమల.. లంచ్ కు అన్ని వెరైటీస్ ఆర్డర్ చేసారు..
కేక్ కటింగ్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు.. సతీష్ హోటల్ లోకి ఎంటర్ అవగానే, చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు..
అప్పుడే ఎంటర్ అయ్యింది రాణి..
"హాయ్ సతీష్!"
"ఎవరు?"
"రాణి అండి.. మీ పదవ తరగతి ఫ్రెండ్.. "
"నేను ఎప్పుడు చూడలేదు.. హాయ్ రాణి.. ఎలా ఉన్నారు?"
"సతీష్ ఎలా ఉన్నావ్?"
"నేను ఊహించినట్టుగానే ఉన్నావు.. చాలా హ్యాపీ.. "
"ఇదేంటి సుశీల.. నా పార్టీ కి రాణి రావడం ఏమిటి?"
"ఇంకా చూడండి.. వెయిట్ చెయ్యండి"
"సతీష్! చాలా రోజులైంది నిన్ను చూసి.. నేను రాణి.. అప్పట్లో నువ్వు బాయ్స్ లో స్కూల్ ఫస్ట్ కదా.. నేను గర్ల్స్ లో స్కూల్ ఫస్ట్.. నిన్ను ఎప్పుడు కలవలేదు.. మీ ఫ్రెండ్స్ నీ గురించి చెప్పేవారు.. నా గురించి నీకు తెలియదు.. "
"రాణి పేరు నాకు తెలుసు.. నువ్వు ఫస్ట్ కదా!.. కానీ నువ్వు అన్నట్టు నేను నిన్ను ఎప్పుడు చూడలేదు.. చాలా థాంక్స్ నా పార్టీ కి వచ్చినందుకు.. "
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/0FLp7zh-oSU
'Manushulu Marali Episode 1' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 20/10/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది మధ్యాహ్నం లంచ్ సమయం. ఆఫీస్ లంచ్ రూమ్ లో ఒకే టేబిల్ మీద కూర్చుని కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు సుప్రజ, మాధవి, నీరజ. లంచ్ టైమ్ అరగంటలో వాళ్ల మాటలు ఎక్కువగా తమ కుటుంబాలకి సంబంధించినవై ఉంటాయి. ముగ్గురివీ ఆఫీస్ లో వేర్వేరు విభాగాలైనా లంచ్ సమయంలో కలుసుకుంటూ విధిగా ఒకే టేబుల్ పై కూర్చుని భోజనం చేయడం దాదాపు పది సంవత్సరాల నుండి జరుగుతోంది.
“ఈ ఆదివారం మా ఆడపడుచు సరళ వస్తానని ఫోన్ చేసిందే” అంటూ సంభాషణ ప్రారంభించిన సుప్రజ వైపు చూసారు మాధవి, నీరజ.
“మీ ఆడపడుచు రావడంలో వింతేముందే సుప్రజా. ఒకే ఉర్లో ఉంటున్న మూలాన మీ ఆడపడుచు ప్రతీ ఆదివారం వచ్చి మీ అత్తగారి యోగక్షేమాలను శ్రధ్దగా విచారించి నీ నెత్తిమీద నాలుగు అక్షింతలు జల్లి వెళ్లడం పరిపాటేకదా. పాపం ఆవిడ ప్రాణాలన్నీ మీ అత్తగారిమీదే పెట్టుకుని జీవిస్తోందాయ్. ఈ సుప్రజ అనే రాక్షసి తన తల్లిని ఎంత హింసపెడ్తోందోనన్న ఆరాటమే కదా ఆమెకు ఎప్పుడూనూ”.
“అవునే, వచ్చిన ప్రతీసారీ మా అమ్మ ఇది తినదు, అది తినదు, ఈ చప్పిడ తిళ్లు ఎలా తింటుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరుస్తుంది. మా అత్తగారికి బి. పి, సుగర్ ఉందని నేను జాగ్రత్తపడుతూ వంటలు చేస్తూంటే ఇలా ప్రతీదానికి వంకలు పెడ్తూ నేను మా అత్తగారికి తిండి పెట్టకుండా మాడ్చివేస్తున్నానని ఆవిడ ఉద్దేశ్యం.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/g0TxwrOqdFs
'Kotha Keratam Episode 14' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 25/10/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 14' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అవును అందుకు ఆరంభంగా మీరు గ్రామస్తులని ఒక చోట సమావేశపరిచి ఒక తెర ఏర్పాటు చేస్తే, తన కంప్యూటర్ ద్వారా ఒక ఫిల్మ్ చూపించి ఇంకుడు గుంటలు ఎలా ఏర్పాటు చేసుకోవాలీ, ఆ పద్ధతి విశదీకరిస్తానని అంటున్నాడు మా మనవడు. అదే మీతో సంప్రదించుదామని ఇలా వచ్చాను”
“దానికేం మహాభాగ్యం. మంచి పనికి అలస్యమెందుకు? ఇప్పుడే గ్రామంలో దండోరా వేయిస్తాను. ఆలోగా మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి”
మునసబు వద్ద సెలవు తీసుకుని వచ్చేసారు తాతా మనవడూ.
ఆ తరువాత ఏర్పాట్లన్నీ చక చకా జరిగిపోయాయి. మునసబు ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో పెద్ద తెర ఏర్పాటు చేయబడింది. రామయ్య పట్నంనుంచి ఒక ప్రొజెక్టర్ తెప్పించారు.
తాను పవర్ పాయింట్ లో తయారుచేసిన సమాచారాన్ని ఫిల్మ్ లాగ ప్రదర్శించి గ్రామస్తులకి ఇంకుడు గుంటల గురించి వివరంగా చెప్పాడు భార్గవ...
“ఇంకుడు గుంటల వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఇవి ఇళ్ళల్లో, పొలాల్లో, రోడ్లప్రక్కనా... ఇలా ఎక్కడైనా నిర్మించవచ్చు... ” అంటూ ఆరంభించి “ఈ ఇంకుడు గుంటల పరిమాణాన్ని నేల స్వభావం, పరిసరాలు, నీటిలభ్యత... వీటన్నిటినీబట్టి నిర్ణయించుకోవాలి. బహిరంగప్రదేశాల్లోను, పొలాల్లోనూ నిర్మించే, చాలా పెద్ద ఇంకుడు గుంటలకు పైన కప్పు అవసరముండదు. వీటి నిర్మాణానికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ... ” అంటూ గ్రామస్తులకి అర్థమయ్యేలా సరళమైన పదాలలో భార్గవ వివరించిన విధానం గ్రామస్తులని ఆకట్టుకుంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/o-1E0EofsHg
From the publisher's feed