
Sign up to save your podcasts
Or


రమణి రమణల కళ్యాణము | Ramani Ramanala Kalyanamu is a Telugu short story, originally published in manatelugukathalu.com
రమణి రమణల కళ్యాణము, Short Story by : దాసు రాధిక
కథ క్లుప్తంగా :
విధి ఎవర్ని కలుపుతుందో , ఎవర్ని విడదీస్తుందో ఎవరికీ తెలియదు.
ఒక్కోసారి కథలోని పాత్రలను పోలిన వ్యక్తులు నిజ జీవితంలో తారస పడతారు.
సహజ రచయిత్రి దాసు రాధికగారు అలవోకగా, అద్భుతంగా రాసిన కథ 'రమణి రమణల కళ్యాణము' మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
లోకం తీరు.. పాపా ?? బాబా?? | Lokam Teeru….Paapaa??Baabaa?? is a Telugu short story, originally published in manatelugukathalu.com
లోకం తీరు.. పాపా ?? బాబా??, Short Story by: N. ధనలక్ష్మి
కథ క్లుప్తంగా :
అభినయ, సంజయ్ ల పెళ్లయి ఏడాదే అయింది. అప్పుడే ఇంకా పిల్లలు పుట్టలేదేమని అమ్మలక్కల ఆరాలు.
ప్రెగ్నెంట్ అయ్యాక పాపా...బాబా అనే ప్రశ్నలు...లోకులు... పలుగాకులు అని ఊరికే అనలేదు.
'ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడకుండా ధైర్యంగా ఉండాలి.' అని చెప్పే కథ 'లోకం తీరు.. పాపా ?? బాబా??'
ఈ కథను ఈ తరం రచయిత్రి N. ధనలక్ష్మి గారు రచించారు.
వినాయక రావు వివాహం |Vinayakarao Vivaham is a Telugu short story, originally published in manatelugukathalu.com
వినాయక రావు వివాహం
రచన : సీత మండలీక
తన ఆకారం మీద తనకే నమ్మకం లేదు గణేష్ అనబడే వినాయక రావుకు.
కానీ తెలివైన అమ్మాయిలు, అబ్బాయిల ఆకారానికంటే వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇస్తారని అందాల అరవింద అతన్ని కోరి చేసుకున్నాక అతనికి తెలిసింది.
మండలీక సీత గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
'Kotha Keratam Episode 18' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 14/11/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 18' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు భార్గవ. డాక్టర్ చదువుకోసం లండన్ వెళ్ళబోయే ముందర తన పద్ధెనిమిదవ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి, ఇంట్లోనే ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు భార్గవ.
పార్టీ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి.
ఇంకో రెండ్రోజుల్లో పుట్టినరోజు. ఉదయం ఫలహారాలయ్యాక అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండగా ఉదయం సుమారు పది గంటలకి ఫోన్ మ్రోగింది.
హాల్లోనే కూర్చున్న భార్గవ ఫోన్ ఎత్తి “హలో నమస్తే. ఎవరు కావాలండీ?” అన్నాడు.
“రాజేంద్రగారితో మాట్లాడాలి. పిలుస్తారా?”
“ఇప్పుడే బయటకి వెళ్ళారండీ. రాగానే చెప్తాను. ఇంతకీ మీరెవరూ?”
“నువ్వు భార్గవ కదూ”
“అవునండీ నా పేరు మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోయాడు.
“నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు బాబూ. నా పేరు సూరజ్ ”
“ఓ అలాగా! ఇదిగో నాన్న వచ్చారు ఇస్తానుండండి” అని “ఎవరో సూరజ్ గారట” చెప్పాడు రిసీవర్ అందిస్తూ.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/qbhBPNgjWrE
విజ్ఞత |Vijnatha is a Telugu short story, originally published in manatelugukathalu.com
విజ్ఞత
రచన : ఏ.అన్నపూర్ణ.
వయసు ప్రభావంతో తప్పు దారిలో నడవబోయింది రజని.
కానీ ఆమె తల్లి రేవతి కూతుర్ని సరైన దారిలో నడిపించింది.
ప్రఖ్యాత రచయిత్రి ఏ. అన్నపూర్ణ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
స్తుంది.
చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు… | Cheppalanukunnadi Cheppalenappudu is a Telugu short story, originally published in manatelugukathalu.com
బాల సుబ్రహ్మణ్యానికి సౌమ్య అంటే ఎంతో ఇష్టం. కానీ బయటికి చెప్పలేక పోయాడు. ఆమెకు దూరం అయ్యాడు.
తిరిగి కాలం ఆ ఇద్దర్నీ ఎలా కలిపిందో ప్రముఖ సీనియర్ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారి 'చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు…' కథ వింటే తెలుస్తుంది.
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/enGXa_xfxSY
'Tholagina Neeli Needalu Episode 16' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/11/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
తనను చూడడానికి వచ్చిన వెన్నెలను చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇలా ఆమె వస్తుందని అతను కలలో కూడా ఊహింలేదు. పైగా ఈ పరిస్థితులలో ఆమె పోలీస్ స్టేషన్ రావడం అతడు నమ్మలేక పోయాడు.
ఆమె కేసి నేరుగా చూడలేకపోయాడు. చూసే ధైర్యం అతడికి లేకపోయింది. ఇద్దరూ ఎదురెగురుగా నిలుచున్నారు. వాళ్ళకి కాస్త ఎడంగా యమున నిలుచుంది.
ముందు ఎవరు మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి ? ఇద్దరి లోనూ సంధిగ్ధత.. కాసేపు.. వెన్నెలకి సంజ్ఞ చేసింది యమున. మాట్లాడమని. అప్పటికే వెన్నెల కళ్ళు
బాగా చెమర్చాయి. భర్తని అలా చూసే సరికి. బాగా గడ్డం పెరిగింది. మనిషి బాగా కృంగి, కృషించిపోయినట్లున్నాడు. ముఖంలో కళ తప్పింది.
" సారీ. ".. అంది వెన్నెల.
చంద్రం తలూపాడు. ఎందుకు ఊపాడో అతడికి తెలీదు. ఆమె అన్న మాటకి చంద్రం తలూపాడు. అసలు తల ఎందుకు ఊపాడో అతనికి తెలీదు. వెన్నెల అన్న
మాటకి ప్రతిస్పందనగా తల ఊపాడు అంతే.
ఎప్పుడో జమానా లో భానుమతి పాడిన పాట " ఆలుమగలు విడిపోయినంతనే, అనురాగాలే మారునా, అనురాగాలే మారునా----- అన్నట్లుగా ఉంది వాళ్ళ పరి
స్థితి. సందర్భానికి తగ్గట్లుగా ఉంది కదా!
“సారీ నువ్వు కాదు తెప్పాల్సింది.. నేను.. నేను.. చెప్పాలి” అన్నాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/0oGphDOd5eI
'Kotha Keratam Episode 17' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 09/11/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 17' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“భార్గవని చిన్నప్పటినుంచీ చూస్తున్నారు కదా! వాడు ఏకసంథాగ్రాహి. మీరన్నట్లు మార్కులు కొలబద్దలే అయినా కచ్చితమైన ప్రామాణికాలు మాత్రం కాదు. మార్కులతో పాటు విషయ పరిజ్ఞానమూ ముఖ్యమే. అది భార్గవకి కావల్సినంత ఉంది. కాస్త అర్థం చేసుకుని వాడి మానాన వాడ్ని వదిలేస్తే చక్కగా చదువుకుంటాడు. అందుకు మనం సంపూర్ణ సహకారం అందిస్తే చాలు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది”
“సారీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము” ఇరువురూ ముక్తకంఠంతో పలికారు.
“మనలో మనకి మన్నింపులేమిటర్రా. మనకి కావల్సింది భార్గవ అభివృద్ది. అందుకు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్దాము. అదిగో మాటల్లోనే భార్గవ వచ్చేసాడు. ఆకలేస్తోంది భోజనానికి ఏర్పాట్లు చెయ్యమ్మా” కోడలికి చెప్పి లేచారు.
“ఇదిగో అయిదు నిమిషాల్లో వడ్డించేస్తాను మామయ్యా” వంటింట్లోకి వెళ్ళింది కళ్యాణి.
“హాయ్ భార్గవా స్పెషల్ క్లాస్ ఎలా జరిగిందిరా?” చేతిలో స్కూల్ బ్యాగ్ అందుకుంటూ ఆప్యాయంగా అడిగిన తండ్రిని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు భార్గవ.
తమ మధ్యన ఈ ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా ఆశీర్వదించమని మనసులోనే దైవాన్ని వేడుకున్నారు రామయ్య.
&&&
దగ్గరుండి మనవడిచేత పదవతరగతి పరీక్షలు దిగ్విజయంగా వ్రాయించి స్వగ్రామంలో పనులు చక్కబెట్టుకుందుకు అచ్యుతాపురం బయలుదేరారు.
వెళ్ళేముందు మనవడిని తనతో రమ్మని అడిగారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
'Manushulu' Marali Episode 3' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 07/11/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ పరిస్తితిలో ఉన్న ఏ మగాడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోగడు? కన్న తల్లిని ఎక్కడకు పంపేయగలడు? ఉన్న ఒక్క చెల్లెలు భర్తతో సింగ్ పూర్ లో ఉంది. అక్కకు ఆర్ధికపరంగా ఏలోటూ లేదు. బావగారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సొంత ఇల్లు. బాధ్యతలు లేవు. డభై అయిదేళ్లు దాటిన అత్తగారితో తగువులు పెట్టుకుంటుంది.
భర్త ఏదో ఆలోచిస్తూ మౌనంగా బట్టలు మార్చుకుంటుంటే ఏమిటీ రోజులా లేరు, అదోలా ఉన్నారేంటంటూ సుప్రజ ప్రశ్నించింది.
“మా అక్క గురించే సుప్రజా. సాయంత్రం బావగారిని కలిసాను. అక్క పోట్లాట పెట్టుకుని ఇక్కడకు వచ్చేసిందని చాలా బాధపడుతున్నాడు. మీ అమ్మగాని నేను గాని ఎవరో ఒకరే ఉండాలి మీతో. ఆలోచించుకోండంటూ వచ్చేసిందిట.
ప్రతీసారీ బ్రతిమాలి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్లడంతో నన్ను లెక్క చేయడంలేదు మీ అక్క. ఈసారి ఏదో నిర్ణయం తీసుకున్న తరువాతే మీ అక్కను కలుస్తానన్నాడు బావ”.
“అవునండీ పాపం అన్నయ్యగారి తప్పేమీ లేదు”.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/HyBMjYhVgQg
From the publisher's feed