సంయమనం లేని మానవుడి ప్రయాణం రకరకాల పరిధులలో సాగుతుంది.చుట్టూ జరిగే తన అనుభవాలతోనే పరిధిని గీస్తాడు. విచక్షణా తలుపులు బిగించేసుకుని , ఊహల కిటికీలోంచే చూసి,కనిపించేదే నిజమని భ్రమసి,ఆనందపడీ, కొన్నాళ్ళకి ఛీ ఇదంతా అబద్దం అని ఆ పరిధిని చెరిపేసి ,మళ్ళీ వేరే పరిధిని గీసే ప్రయత్నం లో నిమగ్నమౌతాడు.నిరంతరమూ ఇదే జరుగుతూ ఉంటుంది. గీసుకోటం,...చెరుపుకోటం,...మళ్లీ గీయటం