'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 17/11/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 17' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఒక కాబినెట్ మినిష్టర్ కొడుకుని ఆ విధంగా అదుపులోకి తీసుకుని రావడం ఏం బాగాలేదు, యాదిరెడ్డీ!.. రేపు సి. యం. ముందు, హోంమంత్రి ముందు నేను ఏం
సమాధానం చెప్పాలి? ఈ సంగతి ప్రతిపక్షాలకు తెలిస్తే మంత్రిని రాజీనామా చెయ్యమని ఆందోళన చేస్తారు. ఇది పెద్ద సంచలనం అవుతుంది. ఆ మాత్రము నీకు తెలి
యదా? అసలు ఒక అనామక కేసు విషయం లో నువ్వు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం ఏమిటీ? ఆమె చనిపోవడం వల్ల ఒక కుటుంబం కానీ, ఎవరి కైనా నష్టం కలిగిందా ?
ఇది మంచి పద్దతి కాదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రేపు మీడియా ముందు దిలీప్ ను తీసుకు రాకు. మనం మంత్రి గారిని గౌరవించాలి. అక్కర లేని కేసులో ఉత్సాహం ప్రదర్శించవా, ప్రమోషన్ ఉండదు.. నీ కెరీర్ కు కూడా.... దిలీప్ ను వదిలెయ్”.
నిజానికి ఇటువంటి బోధనలు వినవలసి వస్తుందని ముందే ఊహించుకున్నాడు. దిలీప్ ను పట్టుకున్న తరువాతనే ఐజీ లో కదలిక వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి..
దిలీప్ ను వదిలివెయ్యడమా ! లేక ఐజీ మాటను లెక్కచెయ్యక పోవడమా?
ఐజీ మాట లెక్క చేయలేదని ట్రాన్స్‌పర్ చేస్తారా.. అది అసాధ్యం.. కేసు ఫైనల్ స్టేజిలో ఉంది. ఎలా చేస్తారు. చేస్తే ఐజీని కూడా కోర్టుకు లాగాలనుకున్నాడు. తలచుకుంటే లాయర్ రవిప్రకాశ్ ఇప్పటి కే కేసును బలంగా తయారు చేసుకున్నాడు. మొత్తం కూపీలన్నీ లాగాడు. మనోరమ బాడీకి పోస్ట్‌మార్టమ్ చేయించాడు. ఒంటి మీదున్న
వేలిముద్రలతో సరి చూపించాడు. చంద్రం, యాదయ్య, మల్లమ్మ చెప్పిన సాక్ష్యాలు, మనోరమ శవంని పూడ్చిన జాగా యొక్క ఫోటోలు మొత్తం కోర్టులో సాక్ష్యాలుగా చూప
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
https://youtu.be/X_OaOJ2iW4E