Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 | Love Challenge Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    గురుమూర్తితో ఫోన్ లో మాట్లాడుతుంది నిత్యా మేడం.

    ఆద్య ఇంట్లో లవ్ ఛాలెంజ్ కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటారు రిత్విక్, జీవన్, ఆద్యలు.

    క్రికెట్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై ఒత్తిడి  తెస్తున్నారని చెబుతాడు పూర్నేష్.

    ఇక చదవండి…

    జీవన్ ఇబ్బందిగా ముఖం పెట్టి "నీకు తెలీదు రిత్విక్. వాడు నాకు చాలా చికాకు తెపిస్తున్నాడు" అన్నాడు.

    రిత్విక్ మాట్లాడుతూ "నాకు తెలుసు జీవన్! పూర్నేష్ క్రికెట్ ప్లేయర్స్ ని కలుసుకున్న ఆ హోటల్, మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళది. ఆ హోటల్ మేనేజర్ పూర్నేష్ ని గమనిస్తూ ఉన్నాడు. వాళ్లు అక్కడ చాలా సేపు ఎవరి కోసమో  ఎదురు చూడ్డం నాకు తెలిపాడు. నువ్వు రాకపోవడంతో మన కాలేజీ లో తనకు తెలిసిన వాళ్ళను పూర్నేష్ ఎంక్వయిరీ చేసాడు. ‘జీవన్ ఎందుకు మారిపోయాడు?’ అని అడిగాడట.

    దాన్ని బట్టి  మ్యాచ్ ఫిక్సింగ్ కి నువ్వు ఒప్పుకోలేదని నాకు అర్థం అయింది. వాళ్లు ఇప్పుడు నీ గురించి మీడియాతో చెబుతామని బెదిరిస్తూ ఉండవచ్చు. ఒకవేళ టీవీలో నిజంగా అలాంటి వార్తలే వస్తే, తర్వాత మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్ లో గెలిచినా  మనం అనుకున్నంత మంచి పేరు మన కాలేజీకి రాదు” అన్నాడు.

    క్షణాల్లో విషయం అర్థం చేసుకున్న ఆద్య, "ఈ విషయంలోనే జీవన్ లో మార్పు వచ్చిన విషయం మనకు అర్థం అవుతోంది. అందుకు అతన్ని అభినందిద్దాం. ఇక జీవన్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నించినప్పుడు చెప్పకుండా, వద్దని  చెప్పాకే ఈ విషయాన్ని రిత్విక్ బయట పెట్టాడు. థాంక్ యూ రిత్విక్! మనం ముగ్గురం ఒక టీం గా ఇప్పుడే ఏర్పడ్డాం. మన మొదటి టాస్క్ ఇదే. టివికి ఎక్కకుండా వాళ్ళని ఆపాలి" అంది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/iMa50g_i3Ds



    12 min
  • ఉగ్రనేత్రం | Ugranethram | Telugu Short Story | Pandriki Subramanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఉగ్రనేత్రం

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    సీక్రెట్ సర్వీసు సీనియర్ ఇన్స్పెక్టర్ వీర విశ్వేశ్వర్ ని దేశ సరిహద్దు ప్రాంతమైన భుదియాన్ లో వేసారు. తల్లి సత్య సుధమ్మ భార్య గీత విశ్వేశ్వర్ పోస్టింగు గురించి విని కలత చెందారు. రెండు మూడురోజల వరకూ మాటా మంతీ లేకుండా మౌన ముద్ర ధరించారు. ఎంతటి స్పెషల్ మిషన్ ఐతే మాత్రం కుటుంబీకుణ్ణి అంత దూరమా యేక దళ వృక్షాన్ని విసిరేసినట్టు వేస్తారూ!

    కూతురు శశికళకు కూడా రాను రాను చొరబాటు దారుల అక్రమ ప్రవేశం వల్ల ఉద్రిక్తంగా మారుతూన్న సరిహద్దు ప్రాంతానికి తండ్రిని వేయడం దిగులు పుట్టించింది. ఎందుకంటే అదేమీ షార్ట్ టార్మ్ మిషన్ కాదు. యాంటీ టెర్రరిస్టు స్వాడ్ కి చెందిన వ్యవహారం. తండ్రికి మరల ఇటు వేపు వచ్చేయడానికి ఎన్నాళ్లు పడ్తుందో! తను మళ్ళీ తనతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన కాలేజీ మేట్సునీ స్కూలుమేట్సునీ యెప్పుడు చూడగలదో!

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/QYjLPbJTIJY


    16 min
  • కాకతి రుద్రమ ఎపిసోడ్ 8 | Kakathi Rudrama Episode 8 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    కాకతి రుద్రమ ఎపిసోడ్ 8

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    గత ఎపిసోడ్ లో…

    జాయప సేనానికి శిష్యురాలు మధుసాని. ఆమె నాట్య సభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆమె నాట్య కౌశలాన్ని అందరూ అభినందిస్తారు.

    ఇక చదవండి...

    ఆమె నాట్యమాడినది కుమారసంభవ యక్షగానము.

    నవ యౌవనవతి యై

    పార్వతి  చెలితో  అంటున్నది.

    " నాతీ! ఏల నా మనసూ నన్ను విడిచి పోయే

    నా కలలు తోచేనే నాట్యమాడేడు  ఒకడూ!

    జటలే   తాల్చినవాడు , జాహ్నవి ముడిలో ఆడు,

    చంద్రశేఖరుడమ్మా సుందరీ  విను, కొమ్మా!

    అప్పుడు చెలి ఏమన్నది?

    "నగరాజూ నీ తండ్రి నగుబాటు పాలౌ

    తగదమ్మా ఈ వలపు తలవంపులౌనౌ,

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/fCTCrSUQ2yU


    6 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 | Love Challenge Episode 19 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని ఆద్యను నిర్బంధించడం సరి కాదని చెబుతాడు రిత్విక్.

    ఆద్య నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతాడు జీవన్.

    లవ్ ఛాలెంజ్ కోసం ఆద్య ఇంట్లో సమావేశమవుతారు రిత్విక్, జీవన్ లు.

    ఇక చదవండి…

    గురుమూర్తి నిత్యా మేడమ్ తో మాట్లాడుతూ "చెల్లెమ్మా! ఎలాగైనా రిత్విక్, జీవన్ లు ఛాలెంజ్ చేసుకునేలా చూడు. ఈ ఛాలెంజ్ సిటీ అంతా పాపులర్ అయ్యేలా నేను చూస్తాను. ఇక ఈ పోటీలో మా జీవన్ గెలవడానికి మీ సహకారం ఎలాగూ ఉంటుంది" అన్నాడు.

    నిత్యా మేడమ్ మాట్లాడుతూ "తప్పకుండా అన్నయ్య గారూ!" అంది.

    "మరొక విషయం చెల్లెమ్మా! జీవన్ లో ఈ మధ్య కాస్త మార్పు వస్తోంది. అది నాకు సంతోషమే. కానీ ఈ చాలెంజ్ లో గెలవాలంటే మనం కొన్ని తెర వెనుక ప్రయత్నాలు చెయ్యాలి. జీవన్ అలాంటివి ఒప్పుకోడేమో..

    కాబట్టి  మనం మాట్లాడుకున్న విషయం అతనికి తెలియనివ్వకండి" అన్నాడు.

    కొంత సేపు ఆలోచించింది నిత్యా మేడమ్.

    'జీవన్ ను పెళ్లి చేసుకొని ఆద్య కష్టాలు పడాలని తను కోరుకుంటోంది. కానీ అతను మారి  మంచివాడైతే తనకు ఏమిటి లాభం?' అని మనసులో అనుకుంది.

    పైకి మాత్రం "అలాగే అన్నయ్య గారూ!" అంది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/1Rq-DbXVRPY




    13 min
  • సు ధీర ఎపిసోడ్ 8 | Su Dheera Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సు...ధీర ఎపిసోడ్ 8

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    షూటింగ్ లో ఒక సెలెబ్రిటీ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో కోపం తెచ్చుకుంటుంది సు. షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సు తనని ధీర ఫాలో చేస్తూ ఉండటం గమనిస్తుంది.

    ఇక చదవండి...

    ఎ ఛానల్ నుండి శ్రీధర్.. సు అనుమతించగా.. షూటింగ్ స్పాట్ కి వచ్చాడు.

    అప్పటికి షూటింగ్ పేకప్ కాగా.. సు తన కారులో ఉంది.

    శ్రీధర్ ని చూసి.. కారు దిగింది సు.

    ఆమె కోరిక మేరకు ఇద్దరూ అక్కడి మర్రి చెట్టు కింద నీడలో.. రాతి దిమ్మల మీద కూర్చున్నారు.

    "చెప్పండి" అంది సు.

    "మిస్ సు.. ఉగాది స్పెషల్ ప్రొగ్రాం బాగా రేటింగ్ చూపింది. అందుకు మీ కంట్రిబ్యూషనే కారణం. సో.. మీతో మేము ఒక 'వీక్ ఎండ్స్ ప్రొగ్రాం' ప్లాన్ చేశాం. మీ డేట్స్ కావాలి. అందుకు మీ వీలు.. మీ పేమెంట్స్ చెప్పండి." అడిగాడు సరళంగా  శ్రీధర్.

    "సంతోషం. కానీ.. నాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఇలాంటి అప్పుడు ఆఫర్ ఇస్తున్నారు. ఎలా చెయ్యాలో.. ఏం చెప్పాలో తోచకుంది." చెప్పింది సు.

    "ప్లీజ్. దీపం ఉండగానే సర్దు కోవాలి. మీకు తెలియనది కాదు. ఎడ్జెస్ట్ చేసుకోండి." చెప్పాడు శ్రీధర్.

    "నిజమే.. మీరన్నది కరెక్టు. వదులుకోలేను.. అలాని.. ఒప్పుకోలేను." తంటాలు పడుతుంది సు.

    శ్రీధర్ ఏమీ అనలేదు. ఆమెనే చూస్తున్నాడు.

    "వీక్ ఎండ్స్ అంటే.. వారం కి రెండు ఎపిసోడ్లా." అడిగింది సు.

    "అవును. ప్రతి శనివారం.. ఆదివారం ల్లో.. ప్రైమ్ టైం స్లాట్స్ లో.. ప్రసారం చేస్తాం. ఈచ్ ఎపిసోడ్ ఒన్ ఆవర్." చెప్పాడు శ్రీధర్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/OS3roVGNVx4

    15 min
  • మట్టిలో మాణిక్యం | Mattilo Manikyam | Telugu Short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    మట్టిలో మాణిక్యం

    రచన : డా: షహనాజ్ బతుల్

    నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, హాల్లో గోడ వద్ద క్రింద కూర్చొని, ఏకాగ్రతతో సీతాలు ఏదో పుస్తకం చదవటం గమనించాను.

    తను నన్ను గమనించలేదు. మెల్లిగా వెళ్లి, తనకు దగ్గరగా నిల్చొని చూసాను. చందమామ చదువుతుండింది.

    ఆశ్చర్యం, సంతోషము కలిగాయి. కథలు చదివేంతగా చదువు వచ్చేసిందా?

    సీతాలు మా ఇంటిలో పని మనిషి. కానీ ఎప్పుడూ నేను పనిమనిషిలా చూడలేదు. అభిమానంగా, ఆప్యాయతతో చూసేదాన్ని.

    తాను అందరి పనిమనిషుల్లాంటిది కాదు. ఏదీ అడగదు. ఎక్కువ పని చేసాను కాబట్టి ఎక్కువ డబ్బు లివ్వండి అని అడుగదు. పండుగ మామూళ్లు అడుగదు. పాత చీరలు అడుగదు. కానీ నేనే ఇచ్చేదాన్ని.

    అడగడం నాకిష్టము ఉండదు. నేనిచ్చింది సంతోషముగా స్వీకరించాలన్నది నా అభిమతం.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/s98chd16e94



    15 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 | Love Challenge Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    ఆద్య గురించి చులకనగా మాట్లాడిందని నిత్యా మేడం తో గొడవ పడతాడు జీవన్.

    ఆద్య కు కాలేజీలో అందరి ముందు 'ఐ లవ్ యు' చెబుతాడు.

    రిత్విక్ తో 'లవ్ ఛాలెంజ్' చేస్తాడు జీవన్.

    ఇక చదవండి…

    ఇంతలో అక్కడ ఉన్న వాళ్లను నెట్టుకుంటూ ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చారు.

    వాళ్లు సరాసరి జీవన్ దగ్గరకు వెళ్లి, "మా ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నావో  చెప్పు"  అన్నారు.

    జీవన్ కి ఏమీ అర్థం కాలేదు.

    "అసలు ఎవరు మీరు? నేను మీలో ఒకరిని ఎందుకు ప్రేమించాలి? నేను ఆద్యను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఇప్పుడే అందరి ముందూ చెప్పాను. ముందు మీరెవరో చెప్పండి"  అని అడిగాడు.

    తరువాత తన వంక నవ్వుతూ చూస్తున్న రిత్విక్ ని గమనించి, "ఓహో! ఇది నీ ప్లాన్ అనుకుంటాను" అన్నాడు.

    "ప్లాన్ కాదు. జస్ట్  సిచువేషన్ నీకు అర్థం కావాలని ఇలా చేశాను. ఆ ఇద్దరు అమ్మాయిల లో ఒకర్ని లవ్ చేస్తున్నట్లు నువ్వు చెప్పగలవా? కచ్చితంగా చెప్పలేవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది ఆ ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కాదు. అలాగే ఆద్య విషయంలో కూడా! మన ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవాలన్న నిబంధన ఆద్యకు ఎందుకు? మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్  లో కూడా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా   'ఏదీ కాదు' అనే అప్షన్  కూడా ఉంటుంది. మరి ఆద్య కు రెండు ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకోమనడం న్యాయమా?” అన్నాడు రిత్విక్..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/otAvbuYnBBQ


    13 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 14 | Ventade Nida Episode 14 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 14

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    దీక్ష ఆపదలో ఉందనీ, కాపాడమనీ చెబుతాడు సుమంత్.

    ఏ సీ పీ ప్రతాప్, హాస్పిటల్ లో ఉన్న వికాస్ ని కలుస్తాడు.

    వికాస్ రైడ్ చేసి పట్టుకున్న డెబ్బై కోట్లు, గోవర్ధన రావు అనే మాజీ మినిష్టర్ ది అని చెబుతాడు ప్రతాప్.

    ఇక చదవండి…

    గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్.

    మామయ్య శ్యామలరావుకి కాల్ చేసి, మామిడి తోట దగ్గర విశాల్ కోసం విచారించమంటాడు తను. మామయ్య తిరిగి కాల్ చేసి, అక్కడెవరూ లేరనీ, గోవర్ధన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడనీ, విశాల్ వాళ్ళందరూ వెళ్లిపోయారని చెప్పాడని అన్నాడు.

    ఆ మామిడి తోట దగ్గరే తన తమ్ముడి స్నేహితుడు సుమంత్ కనబడకుండా పోయాడు.

    సుమంత్ తనమీద  ఒక వికృతాకారం దాడి చేసిందని విశాల్ తో చెప్పాడు.

    తోట దగ్గర విశాల్  ఫోన్ మిస్ అయింది.

    ఇక హాస్పిటల్ లో తనకు డాష్ ఇచ్చిన వ్యక్తి, తన పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పాడు.

    అతనే శ్రేయ మీద మర్డర్ అటెంప్ట్ చేసాడు..

    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/alhFn8GdXZc

    12 min
  • లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 | Love Challenge Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా జీవన్ కి కాల్ చేస్తాడు పూర్ణేష్.

    తను రీథింకింగ్ లో ఉన్నట్లు చెబుతాడు జీవన్.

    ఆద్య కాల్ చెయ్యడంతో తన ప్రోగ్రాం మార్చుకొని గ్రౌండ్ కి వస్తాడు.

    ఇక చదవండి…

    జీవన్ ని, 'అల్లుడుగారూ'  అంటూ నిత్య మేడం పలకరించడంతో స్టూడెంట్స్ అందరూ నిర్ఘాంత పోయారు.

    'ఆమె జీవన్ గారూ అని పిలిచిందేమో.. తనకు అల్లుడు గారూ  అంటూ వినిపించి ఉండవచ్చు' అనుకున్నాడు జీవన్.

    కానీ మిగతా అందరూ దిగ్భ్రాంతి చెందినట్లు ఉండడంతో అతనికేమీ అర్థం కాలేదు.

    ఆద్య మాత్రం తన సవతి తల్లి నిత్య వంక కోపంగా చూసి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది.

    "చూశావా జీవన్ దాని పొగరు! దీనికి కళ్ళు నెత్తి కెక్కాయి అంది" నిత్య.

    Read the full story on www.manatelugukathalu.com


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/8VGXUeXpTb0


    12 min
  • పెంచిన ప్రేమ | Penchina Prema | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    పెంచిన ప్రేమ

    రచన: యశోద పులుగుర్త

    "అమ్మా, చూడమ్మా, అత్త నన్ను ఇక్కడే ఉండిపొమ్మంటోంది" ! లోపలి గదిలోనుండి పరుగున వస్తూ తన నడుమును చుట్టేసుకుంటూ ఏడుస్తున్న ప్రణవిని ఎత్తుకుంది కౌసల్య..

    "నాకు చాలా టాయస్ కొనిపెడ్తుందిట. నా దగ్గరా ఉన్నాయి, మా నాన్న ఇంకా బోలెడు తెస్తారని చెప్పాను.. నేను ఇక్కడ ఉండనమ్మా, అత్తకు చెప్పం"టూ ఏడుస్తూ మాట్లాడుతున్న ప్రణవిని ముందుకు లాక్కుని బుగ్గలమీద ముద్దు పెట్టుకుంటు "అలాగే చెపుతానులే ప్రణూ, ముందా ఏడ్పు ఆపం"టూ కూతురిని సముదాయించ సాగింది..

    " మరేం, నీవూ, నాన్న నన్ను అత్త దగ్గర ఉంచేసి వెళ్లిపోతారుట కదా, నేనిక్కడే ఉండాలిట కదా చక్రాల్లాంటి దాని కళ్లనిండా భయమే.. ప్రణవిని ఆ స్థితిలో చూసిన కౌసల్య మనసు ద్రవించిపోయింది.. ప్రణవిని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది..


    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/a8Qcvd6ElEY




    22 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world