Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • ఓ ఇంటి కథ | O Inti katha | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    ఓ ఇంటి కథ

    రచన: లక్ష్మి మదన్

    ఇంద్రజ ఉదయాన్నే స్నానం చేసి, మడి కట్టుకొని, వంట చేద్దామని పొయ్యి దగ్గర కట్టెలు సిద్ధం చేసుకుని, వంటపాత్రలను దగ్గర తెచ్చి పెట్టుకొని, తర్వాత బియ్యం పప్పులు తెచ్చుకోవాలని చాట పట్టుకొని, దొంతులర్రల్లోకి వెళ్ళింది.

    అప్పట్లో అన్నీ కుండల్లో పోసుకునేవాళ్లు. అలా  బియ్యం గోళంలో చేయి పెట్టి చూసింది బియ్యం నిండు గానే ఉన్నాయి.. పప్పు చారెడు మాత్రమే ఉంది.

    సరే అని పెసరపప్పు డబ్బాలో చేయి పెట్టి చూసింది. పరవాలేదు పప్పు బాగానే ఉంది. వెంటనే కాస్త కందిపప్పు, కాస్త పెసరపప్పు చాటల్లో పోసుకొని తెచ్చుకుంది. దానిలో దోసకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి చేస్తే బాగుంటుందని అనుకుంది. రాత్రి నార తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు తెచ్చిపెట్టుకుంది. కాస్త చింతపండు, చారు కోసం నానబెట్టుకుని పొయ్యి వెలిగించింది.

    ఆరోజు సెలవు దినం కావడం వల్ల వరండాలో కూర్చున్న భర్త నారాయణ తాపీగా పేపర్ చదువుతూ కూర్చున్నాడు. లేవగానే ఒకసారి టీ తెచ్చి పెట్టింది ఇంద్రజ. పేపర్ చదవడం పూర్తయిందేమో మళ్లీ ఒకసారి తాగాలనుకుని..

    "ఇంద్రజా! చాయ్ తాగాలనిపిస్తుంది మరో కప్పు ఇస్తావా?" అని అడిగాడు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/DiQbH0YJCcY


    14 min
  • వెంటాడే నీడ ఎపిసోడ్ 15 | Ventade Nida Episode 15 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    వెంటాడే నీడ ఎపిసోడ్ 15

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్.

    అతని మామగారు, అత్తగారు క్షేమంగానే ఉన్నట్లు చెబుతాడు ఏ సీ పీ ప్రతాప్.

    మామిడి తోట దగ్గర ఒక అపరిచితుడు గుడిసె తలుపు తడతాడు.

    వికాస్ నంబర్ కి కాల్ చేసిన సి ఐ కిషోర్, బయట ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ రింగ్ కావడం గమనిస్తాడు.

    సుమంత్ ని బలవంతంగా బయటకు తీసుకొని వెళతాడు గోవిందు.

    ఇక చదవండి…

    తన రివాల్వర్ని పొజిషన్ లో ఉంచుకొని, డోర్ తెరవ మన్నాడు సీఐ కిషోర్.

    ఒక కానిస్టేబుల్ డోర్ తెరుస్తూ ఉండగానే, బయట బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. కిషోర్ వేగంగా బయటకు వచ్చాడు. అప్పటికే ఆ ఆగంతకుడు గేట్ దాటుకొని, అంత పెద్ద వానను కూడా లెక్కచేయకుండా విజయవాడ రూట్ లో వెళ్తున్నాడు.

    ఒక కానిస్టేబుల్ ని అక్కడే ఉండమని చెప్పి, మిగతా ఇద్దరి తో తన వెహికల్ లోకి ఎక్కి అతన్ని చేజ్ చేస్తాడు కిషోర్.

    పెద్ద వాన కాబట్టి దూరంగా వెళ్లే వాహనాలు అతనికి కనపడడం లేదు. అలా వెళుతూనే ఏ సి పి ప్రతాప్ కి కాల్ చేశాడు.

    ప్రతాప్ మాట్లాడుతూ “అతను వెనక్కి తిరిగి వచ్చి, వికాస్ అత్తమామలకు హాని చేయవచ్చు. నువ్వు వెంటనే వెనక్కి  వచ్చేయ్. వాళ్లకు ప్రొటెక్షన్ గా ఉండు.

    దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గర బైక్ లో సింగిల్ గా వస్తున్న వ్యక్తుల్ని ఆపి విచారించాలని లోకల్ పోలీసులకు నేను ఫోన్ చేస్తాను” అన్నాడు.

    వెంటనే తన వెహికిల్ ని వెనక్కి తిప్పమన్నాడు కిషోర్.

    ఒక బైక్ మామిడి తోట దగ్గర గేట్ నుండి లోపలికి వెళ్లడం చూశాడు.

    వీళ్ళ వెహికల్ అక్కడికి చేరేసరికి, అతను గుడిసె తలుపును కాలితో బలంగా తన్నుతూ కేకలు పెడుతున్నాడు.

    గేట్ బయట జీప్ ఆగిన శబ్దం వినగానే అతను తోటలోకి పరుగుతీశాడు.

    అతని వెనకే పరుగెత్తాడు కిషోర్.

    వెనకనుంచి అతని కాళ్ళకు గురిచూసి షూట్ చేశాడు కిషోర్.

    కానీ అతనికి బుల్లెట్ తగ్గలేదు.

    చెట్ల మధ్య పరుగెత్తుకుంటూ వెళ్లి, కిషోర్ కి కనపడకుండా పోయాడు.

    తన కానిస్టేబుల్స్ ని చెరో వైపు వెదకమని, తను నేరుగా వెళ్ళాడు కిషోర్.

    ఇంతలో అతనికి ప్రతాప్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయబోతుండగా ఆ ఆగంతకుడు వెనకనుండి ఒక చెట్టు కొమ్మ తో అతని తలమీద బలంగా మోదాడు.

    ఫోన్ జారవిడిచి, నేలమీద పడిపోయాడు కిషోర్.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/-EEy1j28qJo




    13 min
  • సు ధీర ఎపిసోడ్ 10 | Su Dheera Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    సు...ధీర ఎపిసోడ్ 10

    రచన:  బివిడి ప్రసాదరావు

    గత ఎపిసోడ్ లో…

    సు ఇంటికి వెళతాడు ధీర.

    ఆమెను ఆరాధిస్తూ ఉండిపోతానని చెబుతాడు.

    తన గతం ధీరకు చెప్పడం ప్రారంభిస్తుంది సు.

    ఇక చదవండి...

    నిద్ర లేచిన సు.. తన దిన చర్యని చేపట్టింది.

    తను జిమ్ లో ఉండగా..

    ధీర ఫోన్ చేశాడు.

    "హలో." అంది సు.

    "ఎలా ఉంది." అడిగాడు ధీర.

    "అంతా నార్మల్." చెప్పింది సు నవ్వుతూ.

    "ఐనా.. ఈ రోజూ రెస్టులో ఉండు." చెప్పాడు ధీర.

    "లేదు.. షూటింగ్ కి వెళ్తాను. ప్రస్తుతం జిమ్ లో ఉన్నా." చెప్పింది సు చక్కగా.

    "అవునా.. టేక్ కేర్." అన్నాడు ధీర.

    "ఓకే. థాంక్యూ." అంది సు.

    కాల్ కట్ చేసి.. తిరిగి ఎక్సర్ సైజ్ లు కొనసాగిస్తుంది.

    ఏడు కాగా.. సు ఇంటికి తిరిగి బయలుదేరింది తన కారుతో.

    గేట్ వద్ద.. వాచ్ మాన్ నుండి తన ఇంటి తాళం కీ తీసుకొని.. ఇంట్లోకి వచ్చి.. సీరియల్ షూటింగ్ కి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయాన..

    తన ఫోన్ రింగివ్వగా.. ఆ కాల్ కి కనెక్ట్ ఐంది సు.

    "తెలిసింది.. ఎలా ఉన్నారు.. జ్వరం తగ్గిందా." అడిగాడు సీరియల్ ప్రొడ్యూసర్.

    "నిన్నటికి కాస్తా ఇబ్బందయ్యింది. ఇప్పుడు బాగున్నాను. మీ షూటింగ్ కే బయలుదేరుతున్నాను." చెప్పింది సు.

    "అవునా.. సరేనమ్మా." అనేశాడు ప్రొడ్యూసర్..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/FUOmT5sjjE8



    15 min
  • Love Challenge Episode 30 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 30 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 30

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    ఫైనల్ మ్యాచ్ లో రిత్విక్ అండ్ టీం ఘన విజయం సాధిస్తారు. జీవన్ డబుల్ సెంచరీ చేస్తాడు. హాస్పిటల్ లో చేరిన చలపతి మరణించాడు. 'లవ్ ఛాలెంజ్ విషయంగా మాట్లాడుకోవాలి' అని అనుకుంటారు రిత్విక్, జీవన్ లు.

    ఇక చివరి ఎపిసోడ్ చదవండి…

    మర్నాడు ఉదయం ఎప్పటిలాగా కాలేజీలో కలుసుకున్నారు అందరూ.

    జీవన్, రిత్విక్ తో "ఈవెనింగ్, ఆద్య వాళ్ళ ఇంట్లో మీట్ అవుదాం" అన్నాడు.

    రిత్విక్ "ముందుగా మన ముగ్గురం మాట్లాడుకుందాం. తర్వాత మిగతా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు" అన్నాడు.

    అలాగే నన్నాడు జీవన్.

    సాయంత్రం ముగ్గురూ కాలేజీ నుండి నేరుగా ఆద్యా వాళ్ళ ఇంటికి వెళ్లారు.

    నిత్యా మేడమ్, రాఘవేంద్ర వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

    "ఫ్రెండ్స్ అందరూ రావడానికి మరో గంట పడుతుందట. ఈలోగా మేము ముగ్గురం నిన్నటి మ్యాచ్ నిర్వహణ ఖర్చుల గురించి మాట్లాడుకుంటాం" అంది ఆద్య.

    వాళ్ల ఉద్దేశం అర్థమై అలాగే నన్నారు రాఘవేంద్ర, నిత్యా మేడమ్.

    రిత్విక్, జీవన్, ఆద్య..  ముగ్గురూ ఒక గదిలోకి వెళ్లారు.

    ముందుగా రిత్విక్ ప్రారంభిస్తూ “దీప్య విషయంలో నువ్వు ఏదో దాస్తున్నావు. ఏమిటది?" అని జీవన్ ని అడిగాడు.

    జీవన్ మాట్లాడుతూ "మొదట్లో ఆద్య తో పరిచయం పెంచుకోవడానికి దీప్యను  వాడుకోవాలని అనుకున్నాను. అందుకోసం చందూ బర్త్ డే అంటూ ఒక ప్రోగ్రామ్  అరేంజ్  చేశాను. చందూకి దీప్య మీద చెడు ఆలోచనలు కలగడానికి అదే కారణం.

    దీప్యకు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత నాదే. ఇక చలపతిని చందూ సహాయం కోరడంతో, అతని దృష్టి దీప్య మీద పడింది. కాబట్టి అతను చేసిన పొరపాటుకు  కూడా నేనే  బాధ్యుడిని. అందుచేత ఈ లవ్ ఛాలెంజ్ నుంచి మానసికంగా విరమించుకుంటున్నాను" అన్నాడు.

    "ఆ రోజు ఏమీ  జరగలేదని నాకు తెలిసింది. కాబట్టి నువ్వు గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు" అన్నాడు రిత్విక్..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/8nYhYHhQDhA


    14 min
  • Love Challenge Episode 29 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 29 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 29

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    చలపతి తో కలిసి, దీప్య ఉన్న హాస్టల్ గదికి వెళతాడు చందూ.

    దీప్య, శాన్వీ లకు మత్తుమందు వాసన చూపి, స్పృహ తప్పిస్తారు.

    పిక్నిక్ కి వెళ్ళినప్పుడు దీప్యను అటాక్ చేయబోతాడు చలపతి.

    కానీ చందూ విసిరిన రాతి దెబ్బకు నీళ్లలో  పడిపోతాడు.

    రిత్విక్ అతన్ని పైకి తీసి, ఫస్ట్ ఎయిడ్ చేసి, హాస్పిటల్ కు  తీసుకుని వెళతాడు.

    ఇక చదవండి…

    తన భుజం పైకి వాలిపోయిన దీప్య ని  నెమ్మదిగా నడిపించుకుంటూ, పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద పడుకోబెట్టింది శాన్వీ. ఆద్య తన వాటర్ బాటిల్ లోని నీళ్లను దీప్య పైన చిలకరించింది. కాసేపటికి నీరసంగా కళ్ళు తెరిచి కూర్చో బోయిన దీప్య, తిరిగి పక్కకు ఒరిగి  పోయింది.

    "దీప్యను హాస్పిటల్ లో చేర్చడం మంచిది" అంది లెక్చరర్ సామ్రాజ్యం.

    స్టూడెంట్స్ అందరూ చేరి దీప్యను కార్లో చేర్చారు.

    రాఘవేంద్ర, నిత్యా మేడం కి ఫోన్ చేసి "ఇంతటితో పిక్నిక్ ముగించి అందరూ సిటీకి వచ్చెయ్యండి. మిగిలిన రోజులు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోమందాం.

    చలపతిని హాస్పిటల్ లో చేర్చారు. ఇంకా ప్రాణాపాయం ఉందన్నారు డాక్టర్ లు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/t3tF4iHlvJg



    13 min
  • తప్పులు చేసి తప్పుడు కూడు Thappulu Chesi Thappudu Kudu | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    తప్పులు చేసి తప్పుడు కూడు

    రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా

    గొప్ప నీతి వాక్యమిదే  వినరా పామరుడా ।। అప్పు।।

    చాలా మంది అప్పులు చేస్తుంటారు. కొంత మంది తీరుస్తూ ఉంటారు.

    కొంత మంది చేబదులుగా అప్పు తీసుకుంటారు నలుగురైదుగురి దగ్గర.

    అవి తీర్చడం కోసం పెద్దమొత్తంలో ఇంకొకరి దగ్గర అప్పులు చేస్తారు.

    ఆ అప్పులు తీర్చడం కోసం చిట్‌లు కట్టి వాటికి హామీదార్లను వెతుక్కుని ,

    ఆ పిదప కొన్ని వాయిదాలు కట్టి మిగిలినవి కట్టలేక ఉడాయించేస్తూంటారు.

    అప్పుడు హామీదార్ల మీద ఆ ఋణభారం  పడుతుందట.

    దానికి సంబంధించి నీతి కథ లాంటి నాటకం.

    భూషణం: ......రామం......రామం...

    రామం.. ఆ..మీరా...రండి లోపలికి:

    భూషణం.. అబ్బ... ఏమి ఎండలు: ఏమి ఎండలు.

    రామం. ....కూర్చోండి మావయ్యా...కూలర్‌ వేస్తాను.

    భూషణం: .. ముందు కాసిన్ని మంచినీళ్ళు నాయనా.

    రామం. లలితా... మంచి నీళ్ళు తీసుకు రా.

    భూషణం. ఊళ్ళో ఉన్నావో లేవో, ఉంటే ఇంట్లో ఉన్నావో లేవో నని అనుకుంటూవచ్చాను. మంచినీళ్ళు తెచ్చావమ్మా, ..ఇటివ్వు .( త్రాగి) అమ్మయ్య.....ఇప్పటికి ప్రాణం కుదుటపడింది..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ZfUtWuf0in4




    11 min
  • భారతీయం | Bharathiyam | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    'భారతీ'యం

    రచన: భాగవతుల భారతి

    ఆంధ్రా యూనివర్శిటీ ముందు ఆటో దిగి, నిదానంగా లోపలికి నడిచారు శంకరశర్మ గారు, భార్య, తన మనుమల సహాయంతో.

    దర్వాజా పక్కనున్న సరస్వతీ మాత నిలువెత్తు ఫొటో వంక వణుకుతున్న చేతులతో నమస్కరిస్తూ, గతంలోకి జారిపోయారు .

    ////////////

    "నాకు తెలుగు లెక్చరర్ గా పదోన్నతి వచ్చిందండీ. అంతా మీ ఆశీర్వాదమే మాష్టారూ! " అంటూ పాదాలకు నమస్కారించిన ప్రకాష్ ని ఆశీర్వదించి, "ఇంత మంది నా దగ్గర తెలుగు యమ్. ఎ  చదివి చక్కటి ఉపాధ్యాయులయ్యారు. మీలో ఒకరైనా

    ఓ పద్యం గానీ, చక్కని వచన కవిత గానీ వ్రాస్తే చూడాలనీ విందామనీ, ఎంత ఆశో నాకు. ఎబ్బే.. ఏంటి లాభం...  జీవనోపాధి కి ఉపయోగపడింది చదువు.

    పోనీలే ...యశస్వీ భవ " అంటూ గోడకి వేలాడుతున్న సరస్వతీ మాత ఫోటో ను రెండు క్షణాలు తదేకంగా చూసారు.

    ప్రకాష్ కి తెలుసు,మాష్టారి మదిలో మెదిలే అసంతృప్తికి కారణం. అలాంటప్పుడే ఆయన ఆ ఫొటో వంక చూస్తారనీనూ.

    మౌనంగానే మాష్టారి ఙ్ఞాపకాలలో మమేకమౌతాడు ప్రకాష్ అప్పుడప్పుడూ.

    శంకర శర్మగారు ,ఉభయభాషా ప్రవీణ.

    తెలుగులో మాష్టర్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తెలుగులో ఆయన పాండిత్యం అపారం. భాషమీద మక్కువా ఎక్కువే. కాదంబరి వర్ణనలన్నీ ఆశువుగా చెప్పేసేవారు . ప్రబంధాలూ, కావ్యాలన్నీ కరతలా మలకమే. శతకాలు రాసి గుళ్ళో రామలింగేశ్వర స్వామికి అంకితమిచ్చారు.

    ఆయనకి ఇద్దరూ ఆడపిల్లలే. ఆయన సంబరపడిపోతూ భారతి, వాణి అని సరస్వతీ దేవి పేర్లు పెట్టి, పిల్లల మీద శార్దూలపద్యం రాసుకుని అందరికీ వినిపించి మురిసిపోతుండేవారు. ఇలా..

    శార్దూలం..

    నీ పేరే యిడుకుంటి పిల్లలకు వాణీభారతీరా

    రే ప్రేయోరస మూర్తులార యనుచున్ ప్రేపుల్ నివేదించు త

    ల్లీ పారాయణమాయె కల్పసుమవల్లీ నీదు నామంబె రా

    వే పైతామహ వాక్చతస్ర రసనావిర్భూత హల్లీసకా!

    పిల్లలను తెలుగు సాహిత్యంలో, తనంత వారిని చేయాలనుకున్నారు.

    కానీ నిరాశే ఎదురైంది.

    తల్లీ పిల్లలూ ఇంగ్లీష్ భాషవైపే మెుగ్గుచూపారు. ఇంజనీర్లు అయ్యారు.

    వారి చదువుల్లో వారు ప్రవీణులే..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Jk999EGQwv8



    12 min
  • Love Challenge Episode 28 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    గురుమూర్తి తో చెప్పి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చలపతి తో చెబుతాడు చందూ. దీప్య మీద చందూకి ఉన్న కోరిక తీర్చడానికి సహకరిస్తానని చెబుతాడు చలపతి. సమాజం మీద  కులాల  ప్రభావం గురించి చక్కటి ప్రదర్శన ఇస్తాడు జీవన్.

    ఇక చదవండి…

    చలపతి చెప్పినట్లు హాస్టల్ బయటికి వస్తాడు చందూ. ముందు రోజులాగే అతన్ని బైక్ మీద ఎక్కించుకుని గుడిసె దగ్గరకు తీసుకొని వెడతాడు చలపతి. వాళ్లు గుడిసె లోపలికి వెళ్ళేసరికి, గ్లాసుల్లో మందు పోసి సిద్ధంగా ఉంచింది ఆ యువతి.

    "ఇంత తొందరగా అరేంజ్ చేస్తావనుకోలేదు" అన్నాడు చందూ.

    "ఇలాంటి వాటిలో ముహూర్తాలు చూసుకో కూడదు. అయినా నేను చేసేదేముంది? అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు.  నువ్వుండే చోటే అమ్మాయి ఉంది.

    నీ కోసం మందు, ఆ అమ్మాయి కోసం మత్తుమందు రెడీ చేశాను. అంతే  నేను చేసింది" అన్నాడు చలపతి.

    ఆ యువతి మద్యం నింపిన గ్లాసును చందూకి అందించింది.

    గ్లాస్ అందించేటపుడు తన చూపుడు వేలితో అతని అర చేతిలో సుతారంగా రాసింది.

    అతడు అదేమీ గమనించలేదు. చందూ మనసంతా దీప్య మీదే ఉంది.

    అది గమనించిన ఆ యువతి "ఈ రోజుకు వదిలేస్తున్నాను. రేపు నాతోనే ఉండాలి" అంది, చలపతికి వినిపించకుండా.

    కాస్త మైకం తలకెక్కాక  చందూలో విచక్షణ నశించింది.

    "ఇక పోదాం పద" పైకి లేస్తూ చలపతి తో అన్నాడు.

    ఇద్దరూ చలపతి బైక్ లో బయలుదేరారు..

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/7bLNe10fFbI



    13 min
  • Love Challenge Episode 27 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    జనాలు అందరూ చేరి చలపతిని  చితకబాది, బయటకు నెట్టి వేశారు. నిత్యా మేడం ఎవరూ లేని సమయం చూసి గురుమూర్తి కి కాల్ చేసి విషయం చెబుతుంది. అతను నిత్యా మేడంతో, స్టూడెంట్స్ కి ఒకరోజు రెస్ట్ ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ల మన్నాడు. అక్కడ తన ప్లాన్ అమలు చేస్తానని చెప్పాడు. చందూ, చలపతి వెంట ఒక గుడిసె దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక అందమైన యువతి ని చూస్తాడు.

    ఇక చదవండి…

    చలపతి ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి చందూకి. ఏం చేయాలో అర్థం కాలేదతనికి.

    చలపతి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ చందూ వైపు వస్తున్నాడు.

    ఆ యువతి వైపు చూశాడు చందూ.

    ఆమె చలపతితో "ఏమిటి మామా! దెబ్బలు బాగా తగిలాయా.. ఈ కుర్రాడితో మసాజ్ చేయించుకోవాలని వస్తున్నావ్? కోడె గిత్త కదా.. మంచి పట్లే పడతాడులే" అంది ఒళ్ళు విరుచుకుంటూ.

    చలపతి, చందూ వంక చూస్తూ "ఇదేం నా పెళ్ళాం కాదులే. భయపడకు. అయినా మీ కాలేజీ అమ్మాయిలు ఒప్పుకోలేదా.. దీని వంక చూస్తున్నావ్?" అన్నాడు నవ్వుతూ.

    కాస్త ధైర్యం వచ్చింది చందూకి.

    "ఒక అమ్మాయి అంటే మోజు వుంది. కానీ ధైర్యం చాలటం లేదు. నువ్వు సహాయం చేస్తావా?' సందేహిస్తూనే అడిగాడు.

    "మత్తు మందిచ్చి మోజు తీర్చుకోవడమే. నేను సహాయం చేస్తాను కానీ ఖర్చవుతుంది' అన్నాడు చలపతి.

    "నేను ఇవ్వలేను గానీ గురుమూర్తి దగ్గర ఇప్పిస్తాను. అన్నట్టు ఆయన నీకు ఎంత ఇస్తానని చెప్పాడు? ప్రశ్నించాడు చందూ.

    "ప్రస్తుతానికైతే ఐదు లక్షలు ఇస్తానన్నాడు. ఎలక్షన్ పూర్తయి, ఆయన కొడుకు గెలిస్తే మరో ఐదు లక్షలు ఇస్తారట" చెప్పాడు చలపతి.

    వెంటనే గురుమూర్తి కి కాల్ చేశాడు చందూ.

    "పెద్ద మొత్తం తీసుకున్నారు కాబట్టే పూర్నేష్, విక్కీ మీ పేరు బయట పెట్టలేదు. చలపతిని గట్టిగా నాలుగు తగిలిస్తే మీ పేరు చెప్పేస్తాడు. అతను నోరు తెరవనంత అమౌంట్ యిస్తే మంచిది" చెప్పాడు చందూ.

    "ఎంత ఇమ్మంటావ్?" అడిగాడు గురుమూర్తి.

    "కనీసం పాతిక లక్షలు ఇస్తే మన పేరు బయటకు రాకుండా పని అవుతుంది" సందేహిస్తూనే అడిగాడు చందూ.

    వెంటనే "సరే. కానీ మన పేర్లు బయటకు రాకూడదు. నిత్యా మేడం ఏదైనా ప్లేస్ కి స్టూడెంట్స్ అందరితో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ రిత్విక్ చూస్తూ ఉండగా ఏదైనా అల్లరి చేయమని చలపతికి చెప్పు" " అన్నాడు  గురుమూర్తి.

    "అలాగే సర్! అన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు చందూ.

    కాల్ కట్ చేసి "పాతిక లక్షలు.. ఎవరి పేర్లూ బయటకు రాకూడదు" అన్నాడు చలపతితో.

    "పాతిక లక్షలా! జీవితాంతం నీకు ఊడిగం చేస్తాను" ఆనందంతో అన్నాడు చలపతి.

    ఆ యువతి చలపతి ఎదురుగానే చందూని గట్టిగా హత్తుకుంది.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/2tEfuuXbLzg





    13 min
  • Love Challenge Episode 26 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    రిత్విక్ తో కావాలనే గొడవ పడతాడు చలపతి అనే వ్యక్తి.

    గ్రామ పెద్దలు అతన్ని వారిస్తారు.

    అతను మద్యం సేవించి మళ్ళీ వస్తాడు.

    మహిళలు కూర్చున్న వైపు పూల చెండు విసురుతాడు చలపతి.

    ఇక చదవండి…

    జరుగుతున్నది గమనిస్తూనే ఉంది నిత్యా మేడం. జీవన్ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి, అతను వచ్చేలోగా  చలపతిని రిత్విక్ అటాక్ చేస్తాడు అనుకుంది.

    కానీ అనూహ్యంగా ఇంతకు ముందు చలపతితో వాదించిన  70 ఏళ్ల వృద్ధుడు తన చేతి కర్రను  బలంగా విసిరాడు. అది  చలపతి కి తగలలేదు కానీ, అతను కోపంగా ఆ వృద్ధుడిని బూతులు తిట్టడం ప్రారంభించాడు.

    దాంతో అక్కడ ఉన్న ఆ గ్రామస్థులు  మహిళలతో సహా  ఒక్కసారిగా చలపతి మీదికి దూకారు. అతనితో పాటు అతని అనుచరులు ఇద్దరినీ  చితకబాది, బయటకు నెట్టేశారు.

    గ్రామ సర్పంచ్  స్టేజ్ మీదకు వచ్చి "ఇతను ఎవరో ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నట్టు నాకనిపిస్తోంది. ఈరోజు ప్రోగ్రాం ఇంతటితో ముగిద్దాం. రేపు ఉదయం  చలపతిని పంచాయితీలో విచారిస్తాం. రేపు రాత్రికి మీరు యధాప్రకారం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు" అన్నాడు.

    దాంతో  జీవన్ అండ్ టీం స్టేజ్ మీద నుండి కిందికి వచ్చేశారు.

    Read the full story on www.manatelugukathalu.com

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    14 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world